Home Blog Page 61

Nicolas Maduro Moros : వెనిజులా అధ్యక్షుడు మదురో గురించి సమాచారం అందిస్తే రూ.125 కోట్ల రివార్డు

  • మూడోసారి వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికైన మదురో
  • మదురోపై తీవ్రస్థాయిలో అవినీతి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు
  • కళ్లు చెదిరే రివార్డుతో ప్రకటన విడుదల చేసిన అమెరికా ప్రభుత్వ శాఖ

Nicolas Maduro Moros వెనిజులా అధ్యక్షుడిగా నికొలాస్ మదురో మొరోస్ మూడోసారి ఎన్నికయ్యారు. అదే సమయంలో అమెరికా ప్రభుత్వం మదురో గురించి సమాచారం అందించిన వారికి కళ్లు చెదిరే రివార్డు ఇస్తామని ప్రకటించింది.

Nicolas Maduro Moros

మదురోను అరెస్ట్ చేసేందుకు, లేదా అతడిని దోషిగా నిరూపించేందుకు అవసరమైన కీలక సమాచారం అందించిన వారికి రూ.125 కోట్లు నజరానా అందిస్తామని అమెరికా అంతర్జాతీయ నార్కోటిక్స్ అండ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఐఎన్ఎల్) ప్రకటించింది. ఫోన్, లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాలని ఆ మేరకు వివరాలతో కూడిన ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా, ఈ ప్రకటనను వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నిజం అంటూ మస్క్ ఆ పోస్టుపై వ్యాఖ్యానించారు.

2013 నుంచి వెనిజులా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మదురోపై తీవ్రస్థాయిలో అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. మదురో తాజాగా ఎన్నికల్లో గెలవగానే, రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపారు.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Scholarship in Lakhs విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి 1.5 లక్షల స్కాలర్‌షిప్!

Scholarship in Lakhs విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి 1.5 లక్షల స్కాలర్‌షిప్! సరస్వతీ దేవీ కటాక్షం ఉన్నా లక్ష్మీ దేవీ కటాక్షం లేక ఎంతో మంది చదువుకు దూరమవుతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోవాలనే తమ కోరికను చంపుకుంటున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా ఎంతో మంది విద్యార్థులు చదువుకు నోచుకోలేకపోతున్నారు. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వాలు స్కాలర్ షిప్స్ ప్రకటిస్తుంటాయి. ప్రభుత్వాలే కాకుండా పలు కార్పోరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తుంటాయి. ఈ క్రమంలో కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఏడాదికి ఏకంగా రూ. 1.5 లక్షల స్కాలర్ షిప్ అందించనుంది. ఇంతకీ అర్హులు ఎవరంటే?

Scholarship in Lakhs

ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు అవసరం పడుతుంది. చదువుకు అయ్యే ఖర్చును భరించలేక కొంత మంది విద్యార్థులు చదువును ఆపేస్తుంటారు. ఇలాంటి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కొటక్ కన్యా స్కాలర్ షిప్ 2024-25 పేరిట ప్రతిభావంతులైన బాలికలకు ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్ అందిస్తోంది. విద్యార్థినులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహిచి వారి ఉన్నతికి తోడ్పడేందుకు ఈ స్కాలర్ షిప్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇంటర్ పూర్తి చేసిన వారికి ఈ స్కాలర్ షిప్ అందించనున్నది.

ఇంటర్లో 75శాతం మార్కులు ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ, బీఫార్మసీ, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. ఇన్ కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.1.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ (5 సంవత్సరాలు), బీఫార్మసీ, బీఎస్సీ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించే విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.





Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Mahanadi Viral News : కాళ్లు కట్టేసి ఉన్న మహిళ.. నదిలో 30 కిమీ మేర కొట్టుకుపోయి!

0

Mahanadi Viral News భువనేశ్వర్‌: ఒడిశాలో ఓ అనూహ్య ఘటన వెలుగు చూసింది. కాళ్లు కట్టేసి ఉన్న ఓ మహిళ నదిలో కొట్టుకువచ్చింది. ఆమె కేకలు విన్న మత్స్యకారులు.. సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. దాదాపు 30 కి.మీ మేర నదిలో కొట్టుకువచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళగా స్థానిక పోలీసులు గుర్తించారు.

Mahanadi Viral News

ఒడిశాలోని ఝార్సుగూడకు సమీపంలో ఉన్న పల్సాడ ప్రాంతంలో కొందరు మత్స్యకారులు చేపలు పడుతున్నారు. అదే సమయంలో నదిలో కేకలు వినిపించాయి. వెంటనే ఆమెను రక్షించి.. నీరు, ఆహారం అందించారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. విచారించగా.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌కు చెందిన సరోజిని చౌహాన్‌ (33)గా గుర్తించారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

భర్త నుంచి విడిపోయిన ఆమె.. సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటోందని విచారణలో తెలిసింది. అయితే, ఆమె మానసిక స్థితి బాగాలేకపోవడంతో కాళ్లను సంకెళ్లతో కట్టేసినట్లు ఆమె సోదరుడు పోలీసులకు వెల్లడించాడు. నదిలో ఎలా పడిందనే విషయం తెలియదన్నాడు. వైద్య పరీక్షల అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Solar Car for Taxi Drivers ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ సోలార్‌ కారు.. తక్కువ ధరకే 330 కి.మీ. రేంజ్

Solar Car for Taxi Drivers వేవ్ మొబిలిటీ కంపెనీ రెండు రకాల సోలార్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. 3 సీటర్ ఇవా సోలార్ ఎలక్ట్రిక్ కారుని, అలానే 5 సీటర్ సీటీ5 సోలార్ కారుని తీసుకొస్తుంది. ఇవా సోలార్ ఎలక్ట్రిక్ కారు గురించి ఇది వరకే చెప్పి ఉన్నాం. పూణేకి చెందిన వేవ్ మొబిలిటీ కంపెనీ సీటీ5 సోలార్ ఎలక్ట్రిక్ సిటీ ట్యాక్సీని తయారు చేస్తుంది. ఇది సోలార్ ఎనర్జీతో నడుస్తుంది. ట్యాక్సీ డ్రైవర్స్ కోసం ప్రత్యేకంగా ఈ కమర్షియల్ వాహనాన్ని తయారు చేసింది. భారత్ లో తొలిసారిగా ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేయబడిన సోలార్ ఎలక్ట్రిక్ కారు ఇదే. ఇది సోలార్ మీద, కరెంట్ మీద రెండిటి మీద నడుస్తుంది. కారు పైన సోలార్ ప్యానెల్ ఇచ్చారు. దీని వల్ల ఛార్జింగ్ అవుతుంది. ఇది ఫుల్ ఛార్జ్ తో 330 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇది 5 మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. బూట్ స్పేస్ 400 లీటర్లు ఇచ్చారు. సీసీఎస్2 ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది.

Solar Car for Taxi Drivers

ఈ కారు బ్యాటరీ మీద మూడేళ్లు లేదా లక్ష 50 వేల కిలోమీటర్లు వారంటీ ఇస్తుంది కంపెనీ. రోబస్ట్ స్టీల్ రోల్ కేజ్ మెటీరియల్ తో తయారు చేశారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. కారులో ఉన్న ఐదు సీట్లకు ఐదు సీటు బెల్ట్స్ ఇచ్చారు. స్పీడ్ లిమిట్ వచ్చేసి 70 కి.మీ.గా ఉంది. రిమోట్ ఫ్లీట్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు కారు హెల్త్ ని చూసుకోవచ్చు. ఏడాదికి 4 వేల కిలోమీటర్లు సోలార్ పవర్ తో ఉచితంగా జర్నీ చేయవచ్చు. ఈ కారుకున్న ప్రత్యేకత ఏంటంటే.. ఈ కారు వెనుక భాగం మీద డిజిటల్ ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. అది కూడా లొకేషన్ బట్టి మారేలా దీన్ని డిజైన్ చేశారు. అంటే ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఎక్కడ ఏ యాడ్ ప్లే అవ్వాలనేది డిసైడ్ చేసుకునేలా ఇందులో ఒక ఫీచర్ ఇచ్చారు. దీని వల్ల ఇలా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. వేల్యూ యాడెడ్ ఫీచర్స్ కారణంగా ఈ కారు మీద పెట్టిన పెట్టుబడి వెంటనే వచ్చేస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, ఏసీ, రేర్ ఏసీ వెంట్, ఎల్ఈడీ క్యాబిన్ లైట్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎల్ఈడీ బ్రేక్ లైట్ వంటివి ఇచ్చారు. సీట్లను ఈజీగా క్లీన్ చేసుకునేలా వీటిని అపోస్టరీ మెటీరియల్ తో డిజైన్ చేశారు.   

Solar Car for Taxi Drivers ఇది లైట్, ఎస్టీడీ, ప్లస్ మూడు వేరియంట్లలో వస్తుంది. లైట్ వేరియంట్ 215 కి.మీ. రేంజ్ ఇవ్వగా, ఎస్టీడీ వేరియంట్ రూ. 260 కి.మీ., ప్లస్ వేరియంట్ లో రూ. 330 కి.మీ. రేంజ్ ఇస్తుంది. లైట్ వేరియంట్ లో 17 కిలో వాట్ బ్యాటరీ ఇవ్వగా.. ఎస్టీడీ వేరియంట్ లో 21 కిలో గేట్ బ్యాటరీ ఇచ్చారు. ప్లస్ వేరియంట్ లో 26 కిలో వాట్ బ్యాటరీ ఇచ్చారు. ఏసీ ఛార్జింగ్ విషయానికొస్తే.. లైట్ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 5 గంటలు, ఎస్టీడీ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 6.5 గంటలు, ప్లస్ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 8 గంటల సమయం పడుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికొస్తే.. ఎస్టీడీ వేరియంట్ 35 నిమిషాల్లో, ప్లస్ వేరియంట్ 45 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఇక ఈ కమర్షియల్ వెహికల్ ని 2025లో లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు ఇవా సోలార్ కారుని కూడా 2025లోనే తీసుకొస్తుంది. ఈ కారుని టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు. ఇక ధర విషయానికొస్తే.. వేరియంట్ ని బట్టి 6 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. ఈ బడ్జెట్ లో ట్యాక్సీ డ్రైవర్లకు ఈ కమర్షియల్ కారు అందుబాటులోకి తీసుకొస్తే నిజంగా వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Horoscope Today : వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Horoscope Today దిన ఫలాలు (ఆగస్టు 2, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు వ్యాపార లావాదేవీల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. మిథున రాశి వారికి తల్లితండ్రుల నుంచి ఊహించని ధన సహాయం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో ఇంట్లో సందడిగా గడుపుతారు. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ప్రతి ప్రయత్నంలోనూ కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార లావాదేవీల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనుల్ని వాయిదా వేయకుండా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు అప్పగించిన ప్రత్యేక బాధ్యతల కారణంగా పనిభారం తప్పకపోవచ్చు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నిటినీ కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇష్టమైన స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. తల్లితండ్రుల నుంచి ఊహించని ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులన్నిటిలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆదా యం బాగా పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

Horoscope Today ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది. అనుకోకుండా వాహన యోగం పడుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందు తాయి. ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన వారు ఇబ్బంది పెట్టడం గానీ, వాయిదా వేయ డం గానీ జరుగుతుంది. ఉద్యోగంలో చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలుంటాయి. చేపట్టిన పనుల్ని నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయ వలసి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన మంచి ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు, స్థాన చలనాలకు అవకాశం ఉంది. ఇతరులకు స్తోమతను మించి సహాయం చేస్తారు. కొందరు బంధువు లతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. అనుకోని ప్రయాణాలకు ఆస్కారముంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబ సభ్యుల కారణంగా ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రుల కలయికతో ఆనందం పొందు తారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం పడుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో చిక్కులు, చికాకులు తొలగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. సంపాదన నిల కడగా సాగిపోతుంది. రాదనుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇష్టమైన బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. ఆస్తి లాభం పొందుతారు. ఆర్థికంగా పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. తలపెట్టిన పనుల్లో అనుకూ లతలకు లోటుండదు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

Horoscope Today ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనుల్లో అడ్డంకులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో కొన్ని ఒడిదుడుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు బంధువుల విమర్శలు ఇబ్బంది పెడతారు. ప్రయాణాల్లో నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొద్దిగా జాప్యం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిచ్చినప్పటికీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరాశ కలిగిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఇష్టమైనవారితో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలన్నీ సజావుగా సాగిపోతాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా, ఆశాజన కంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

Horoscope Today స్థిరాస్తి వ్యవహారాలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులన్నీ ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో చిన్నపాటి పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Kalki 2898 AD Team Announces Ticket Prise : ఇంకా కల్కి చూడని వారికి గుడ్ న్యూస్

Kalki 2898 AD Team Announces Ticket Prise : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి 2898 ఏడీ” సినిమా ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా తదుపరి మైల్ స్టోన్ దిశగా పరుగులు పెడుతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే దాదాపు 5 వారాల వరకు పూర్తవుతుంది.

Kalki 2898 AD Team Announces Ticket Prise

అయినా సరే చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ ఫుల్స్ నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి టికెట్ ప్రైజ్ గురించి సినిమా యూనిట్ ఒక అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ గ ఘన విజయం అందించిన “కల్కి 2898 ఏడీ”ని కేవలం రూ.100కే ఆస్వాదించండి. భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో 100/-, ఆగస్ట్ 2 నుండి ఒక వారం పాటు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కాబట్టి ఈ సినిమాని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లలోనే చూడాల్సిందిగా సినిమా యూనిట్ చెబుతోంది. సుమారు 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి నిర్మించారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Samantha Latest Photos : స‌మంత లేటెస్ట్ ఫోటోలు..

kalki 2898 ad team announces ticket prise
kalki 2898 ad team announces ticket prise
kalki 2898 ad team announces ticket prise
kalki 2898 ad team announces ticket prise
kalki 2898 ad team announces ticket prise
kalki 2898 ad team announces ticket prise

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Soya Chunks Benefits : శాఖాహారుల్లో ప్రొటీన్‌ లోపం నివారణకు చక్కని మార్గం.. ఆహారంలో వీటిని తీసుకుంటే సరి!

0

Soya Chunks Benefits బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుందా? కొలెస్ట్రాల్, మధుమేహం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా? కీళ్ల-కండరాల నొప్పిని వేధిస్తుందా? ఈ సమస్యలన్నీ ప్రోటీన్, విటమిన్ లోపం వల్ల రావచ్చు. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చాలామంది జంతు ప్రోటీన్లు అంటే చేపలు, మాంసం, గుడ్లు తినేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారు శాఖాహారం మాత్రమే తింటుంటారు. వీరి శరీరంలో ప్రోటీన్, విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. కానీ శాఖాహారం తినడం ద్వారా కూడా ఈ లోపాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.

Soya Chunks Benefits

జంతు ప్రోటీన్‌కు సోయాబీన్ ఉత్తమ ప్రత్యామ్నాయం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, వివిధ ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందుకే సోయాబీన్స్‌ను సూపర్‌ఫుడ్‌ అని అంటారు. శాకాహారంలో సోయాబీన్స్‌ను చేర్చుకోవడం వల్ల అనేక శారీరక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం.. సోయాబీన్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

సోయాబీన్స్‌లో ప్రోటీన్, విటమిన్ బి, సి, కెతో పాటు కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్ అధికంగా ఉంటాయి. సోయాబీన్స్‌లో ఫోలిక్ యాసిడ్ తగినంత మొత్తంలో ఉంటుంది. అందుకే రోజువారీ ఆహారంలో సోయాబీన్స్ తప్పనిసరిగా చేర్చుకోవాలి. విటమిన్-కె ప్రతి ఒక్కరి శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల గాయాలైతే రక్తస్రావం ఆగదు. అంటే రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కె అవసరం. కాబట్టి మీకు ఈ విటమిన్ లోపం ఉంటే, మీ రోజువారీ ఆహారంలో సోయాబీన్స్ చేర్చుకోవాలి.

Soya Chunks Benefits విటమిన్-సి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. విటమిన్-సి గాయాలను వేగంగా నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

సోయాబీన్స్‌లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బలహీనత నుంచి కండరాల-కీళ్ల నొప్పులను నయం చేయడం వరకు ఎన్నో సమస్యలను నివారిస్తుంది. శాఖాహారం తీసుకునే వారు తప్పనిసరిగా సోయాబీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Citadel Honey Bunny : వరుణ్‌ ధావన్‌-సమంత ‘సిటాడెల్‌’ స్ట్రీమింగ్‌డేట్‌ ఫిక్స్‌

Citadel Honey Bunny రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ స్ట్రీమింగ్‌ తేదీ ఖరారైంది.

Citadel Honey Bunnykalki 2898 ad team announces ticket prise

Citadel Honey Bunny (ఇంటర్నెట్‌డెస్క్‌) వరుణ్‌ధావన్‌ (Varun Dhawan), సమంత (Samantha) జంటగా నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ (Citadel Honey Bunny). రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ తేదీని రాజ్‌ అండ్‌ డీకే ప్రకటించారు. నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. హిందీతో పాటు, భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్‌ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

Citadel Honey Bunny రాజ్‌, డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో కేకే మేనన్‌, సిమ్రన్‌, సోహమ్‌ మజుందార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌2’లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత ‘సిటాడెల్‌’ కోసం ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా వరుణ్‌, సామ్‌ కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయని టాక్‌. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తోంది. ఎలాంటి డూప్‌ లేకుండా ఆమె స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందుతోంది. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించారు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


North Korea Floods : ఉత్తర కొరియాను ముంచెత్తిన భారీ వరదలు.. స్వయంగా రంగంలోకి దిగిన కిమ్

0

North Korea Floods ఉత్తర కొరియాను భారీ వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించారు. ఇక కిమ్.. స్వయంగా విపత్తు సహాయక చర్యల్లో భాగస్వామి అయ్యారు. రెస్క్యూ సిబ్బందితో పాటు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రచారం కావడంతో వైరల్‌గా మారాయి.

north korea floods

North Korea Floods

ఇదిలా ఉంటే దాయాది దేశం దక్షిణ కొరియా.. విపత్కర పరిస్థితుల్లో.. ఉత్తర కొరియాకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. భీకర వరదలతో అతలాకుతలమైన ఉత్తరకొరియాకు మానవతా సాయం అందిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని వెల్లడించింది. ఎలా సరఫరా చేయాలన్న దానిపై చర్చించేందుకు తక్షణమే స్పందించాలని ఉత్తరకొరియా రెడ్‌ క్రాస్ సంస్థను కోరింది. అయితే దీనిపై కిమ్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఇక భారీ వర్షాల కారణంగా బుధవారం 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రాణ నష్టంపై కిమ్‌ సర్కారు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విపత్తు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.