Thursday, June 19, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
AstrologyHoroscope Today : వారికి వ్యక్తిగత సమస్యల...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

Horoscope Today : వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Horoscope Today దిన ఫలాలు (ఆగస్టు 2, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు వ్యాపార లావాదేవీల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. మిథున రాశి వారికి తల్లితండ్రుల నుంచి ఊహించని ధన సహాయం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో ఇంట్లో సందడిగా గడుపుతారు. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ప్రతి ప్రయత్నంలోనూ కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార లావాదేవీల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనుల్ని వాయిదా వేయకుండా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు అప్పగించిన ప్రత్యేక బాధ్యతల కారణంగా పనిభారం తప్పకపోవచ్చు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నిటినీ కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇష్టమైన స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. తల్లితండ్రుల నుంచి ఊహించని ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులన్నిటిలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆదా యం బాగా పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

Horoscope Today ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది. అనుకోకుండా వాహన యోగం పడుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందు తాయి. ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం నిలకడగా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన వారు ఇబ్బంది పెట్టడం గానీ, వాయిదా వేయ డం గానీ జరుగుతుంది. ఉద్యోగంలో చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలుంటాయి. చేపట్టిన పనుల్ని నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయ వలసి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన మంచి ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు, స్థాన చలనాలకు అవకాశం ఉంది. ఇతరులకు స్తోమతను మించి సహాయం చేస్తారు. కొందరు బంధువు లతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. అనుకోని ప్రయాణాలకు ఆస్కారముంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబ సభ్యుల కారణంగా ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రుల కలయికతో ఆనందం పొందు తారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం పడుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో చిక్కులు, చికాకులు తొలగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. సంపాదన నిల కడగా సాగిపోతుంది. రాదనుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇష్టమైన బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. ఆస్తి లాభం పొందుతారు. ఆర్థికంగా పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. తలపెట్టిన పనుల్లో అనుకూ లతలకు లోటుండదు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

Horoscope Today ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనుల్లో అడ్డంకులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో కొన్ని ఒడిదుడుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు బంధువుల విమర్శలు ఇబ్బంది పెడతారు. ప్రయాణాల్లో నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉంటుంది. చేపట్టిన పనుల్లో కొద్దిగా జాప్యం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిచ్చినప్పటికీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా నిరాశ కలిగిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఇష్టమైనవారితో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలన్నీ సజావుగా సాగిపోతాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా, ఆశాజన కంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

Horoscope Today స్థిరాస్తి వ్యవహారాలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులన్నీ ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో చిన్నపాటి పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this