Home Blog Page 62

Labourer finds diamond ఉన్నట్టుండి లక్షాధికారి అయిపోయిన దినసరి కూలీ.. ఎలాగంటే?

Labourer finds diamond : రెక్కాడితే గానీ డొక్కాడదు.. కూలీగా పనిచేస్తూ రోజుకి రూ.300 సంపాదిస్తుంటాడు అతడు. అటువంటి వ్యక్తి జీవితమే మారిపోయింది ఇప్పుడు. రూ.80 లక్షల విలువజేసే వజ్రం అతడికి దొరికింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ అదృష్టవంతుడు రాజు గోండు (40) మీడియాకు వివరించి చెప్పాడు.

Labourer finds diamond

మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ పన్నా గనులలో ఓ వజ్రాన్ని వెలికితీశానని రాజు గోండు అన్నాడు. గత వారం గనుల వద్ద తనకు 19.22 క్యారెట్ల వజ్రం దొరికిందని తెలిపాడు. అది ప్రభుత్వ వేలంలో దాదాపు రూ.80 లక్షలు పలుకుతుంది.

మధ్యప్రదేశ్‌లోని రైతుల పొలాల్లో ట్రాక్టర్లు నడిపే పని చేసుకుంటూ జీవిస్తుంటాడు రాజు గోండు. అలాగే, ఇతర కూలీ పనులు చేస్తుండేవాడు. వారం క్రితం తన సోదరుడితో కలిసి 690 చదరపు అడుగుల ప్రభుత్వ భూమిలో బంగారం తవ్వే పనికి వెళ్లారు. అక్కడే రాజుకు మెరుస్తూ ఓ వస్తువు కనపడింది. అది వజ్రమేనని తాను భావించానని, దాన్ని తీసుకున్నానని చెప్పాడు.

తన సోదరుడు రాకేశ్ గోండుతో కలిసి రాజు గోండు వెంటనే స్థానిక పన్నా డైమండ్ ఆఫీసుకి తీసుకెళ్లాడు. ఆ వజ్రం 19.22 క్యారట్లదని, రూ.80 లక్షల విలువ ఉంటుందని అనుపమ్ సింగ్ అనే అధికారి తెలిపారు. 1961లో ఒకరికి 54.55 క్యారెట్ల వజ్రం దొరికిందని, ఆ తర్వాత 2018లో మరొకరికి 42 క్యారెట్ల వజ్రం దొరికిందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ రాజు గోండుకి వజ్రం దొరికిందని అన్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Gautam Adani Donation : వయనాడ్ విపత్తు బాధితులకు రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన అదానీ

0

  • వయనాడ్ లో విరిగిపడిన కొండచరియలు
  • 200కి చేరిన మృతుల సంఖ్య
  • ఈ విపత్తు తనను తీవ్రంగా కలచివేసిందన్న గౌతమ్ అదానీ

Gautam Adani Donation వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.

Gautam Adani Donation

వయనాడ్ లో సంభవించిన విపత్తు అనేకమంది ప్రాణాలను బలిగొనడం తన హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. ఈ కష్ట సమయంలో అదానీ గ్రూప్ కేరళకు సంఘీభావం ప్రకటిస్తోందని పేర్కొన్నారు. అందుకే కేరళ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు మద్దతుగా రూ.5 కోట్ల విరాళం అందిస్తున్నామని గౌతమ్ అదానీ తెలిపారు.

కాగా, వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 200కి చేరింది. దాదాపు 7 వేల మంది ప్రజలు 50 రిలీఫ్ క్యాంపుల్లో బిక్కుబిక్కుమంటున్నారు.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


King Cobra on Tree : చెట్టు మీద నక్కిన భారీ కింగ్ కోబ్రా… ఎలా బుసలు కొడుతుందో చూస్తే గుండె గుభేల్ మానాల్సిందే!

0

King Cobra on Tree సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని వీడియో ఫుటేజీలు మనలో భయాన్ని కలిగించేవిగా ఉంటే, మరికొన్ని కడుపుబ్బ నవ్వించేవిగా ఉంటాయి. అలాంటి వాటిల్లో పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. నెటిజన్లు కూడా వీటినిచూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక భారీ కింగ్ కోబ్రా వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోలో12 అడుగుల పొడవైన రాటిల్‌స్నేక్‌ను చూసి వీక్షకులు షాక్ అవుతున్నారు. ఈ భారీ కింగ్‌కోబ్రాను అతికష్టం మీద పట్టుకున్న స్నేక్‌క్యాచర్‌ ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

King Cobra on Tree

కర్ణాటకలోని అగుంబే అడవికి సమీపంలోని ఓ గ్రామంలో  12 అడుగుల భారీ కింగ్‌ కోబ్రా కలకలం రేపింది. భారీ కింగ్ కోబ్రా ఎలాగో అడవినుంచి బైటకు వచ్చింది. రోడ్డుకు పక్కనే ఉన్న ఓ ఇంటి సమీపంలోకి వచ్చిన భారీ సర్పం ఆ ఇంటికి ఆనుకుని ఉన్న చెట్టుమీద ఎక్కి కూర్చుంది. అది గమనించిన స్థానికులు భయంతో వణికిపోయారు. చూసేందుకు అతి భయంకరంగా కనిపిస్తూ.. అది చెట్టు మీద ఎక్కి కూర్చుని, బుసలు కొడుతుంది. వెంటనే స్థానికులు ఆ ఇంటి వారిని అప్రమత్తం చేశారు. మరోవైపు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించి పిలిపించారు. అటవీశాఖ అధికారులు, ఏఆర్‌ఆర్‌ఎస్‌ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకుని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు.

King Cobra on Tree వారం రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు భారీ పామును చూసి షాక్ అయ్యారు. పామును రక్షించిన బృందం చేసిన పనిని ప్రశంసించారు. గంటల తరబడి కష్టపడి కింగ్ కోబ్రాను చెట్టు మీద నుంచి కిందకు దించారు. మెల్లగా దాన్ని ఒక సంచీలోకి వెళ్లేలా చేశారు. అనంతరం నివాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటన అంతటిని వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్‌రే..ఎంత పెద్ద కింగ్ కోబ్రా.. అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని చూస్తేనే భయంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Scam in Bank బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కు… ఏకంగా రూ.40కోట్లు..!

0

Scam in Bank ప్రస్తుతం కాలంలో చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించాలనే భావనలో ఉంటున్నారు. ఈ క్రమంలో దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్నారు. ఇక కొందరు అయితే ఎంతో అమాయకంగా కనిపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. తమ అమాయకపు ఫేస్ ను పెట్టుబడిగా పెట్టి.. జనాలను నిండ ముంచేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా అలానే బ్యాంకు ఉద్యోగితో కుమ్మక్కై.. ఏకంగా రూ.40 కోట్లను కొల్లగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Scam in Bank

హైదరాబాద్ లోని శంషాబాద్ ప్రాంతంలో ఇండస్ ఇండ్ అనే బ్యాంకులో రామస్వామి అనే వ్యక్తి మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే డెలివరీ మేనేజర్ రాజేశ్ తో కలిసి బ్యాంకుకు రూ.40 కోట్లు నష్టం చేశారని ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రాంతీయ అధికారి మణికందన్ రామనాధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామస్వామి, రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి

Scam in Bank ఆర్థిక మోసాల్లో బాగా ఆరితేరిన బషీద్ డబ్బు కోసం రామస్వామితో కలిసి ప్లాన్ వేశాడు. డబ్బు బదిలీ చేస్తే ప్రతిఫలం ఇస్తానని ఆశ చూపాడు. రామస్వామి, రాజేశ్‌ లు ఆదిత్య బిర్లా సంస్థ అకౌంట్ లోని 40 కోట్లను ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి ఖాతాలకో బదిలీ చేశారు. ఆ తర్వాత బషీద్‌ ఆ నగదు ఇతర అకౌంట్లకు  బదిలీ చేశాడు. ఈ క్రమంలో అలా వచ్చిన డబ్బులతో నిందితుడు బషీద్‌ రెండు కార్లు కొనుగోలు చేశాడు. తాను చేసిన మోసానికి సాయం చేసిన బ్యాంకు మేనేజర్ రామస్వామికి కారును  గిఫ్ట్ గా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈకేసులో ఏ3గా ఉన్న బషీద్‌ను సైబరాబాద్‌ పోలీసులు దిల్లీలో అరెస్టు చేసి..నగరానికి తీసుకొచ్చారు.

ఆదిత్యా బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థకు ముంబై నారీమన్‌పాయింట్‌ ప్రాంతంలోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు శాఖలో అకౌంట్ ఉంది. ఆ సంస్థ పర్మిషన్ లేకుండానే అకౌంట్ నుంచి జులై 12వ తేదీ నుంచి 40 కోట్లు విత్‌ డ్రా అయ్యాయి. ఈ క్రమంలోనే అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన  బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శంషాబాద్‌ బ్రాంచి మేనేజర్‌ రామస్వామి, బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌ డబ్బులను పక్కదారి పట్టించినట్లు తేలింది. జులై 15వ తేదీ నుంచి బ్యాంకు మేనేజర్‌ రామస్వామి విధులకు రావడం లేదు. అనుమానమొచ్చిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితులు రామస్వామి, రాజేశ్‌ను గతనెల 24వ తేదీన అరెస్టు చేశారు. వారిని విచారించగా బషీద్‌ హస్తం బయటపడింది.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


OnePlus Life Time Screen Offer : వన్‌ప్లస్‌ యూజర్లకు లైఫ్‌టైమ్‌ ఫ్రీ స్క్రీన్‌ అప్‌గ్రేడ్‌ ఆఫర్‌

OnePlus Life Time Screen Offer ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ తమ యూజర్లకు ‘జీవితకాల ఉచిత స్క్రీన్‌ అప్‌గ్రేడ్‌’ (OnePlus Offering Lifetime Free Screen Upgrade) ఆఫర్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్‌ 8 ప్రో, వన్‌ప్లస్‌ 8టీ, వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9ఆర్‌ వినియోగిస్తున్నవారికి ఇది వర్తిస్తుంది. వన్‌ప్లస్‌ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి ఉచితంగా స్క్రీన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. అలాగే క్లీనింగ్‌, మెయింటెనెన్స్‌ వంటి సేవలు కూడా పొందొచ్చు.

OnePlus Life Time Screen Offer

అప్‌డేట్ చేసిన తర్వాత కొన్ని వన్‌ప్లస్‌ ఫోన్లలో గ్రీన్‌ లైన్‌, బ్లూ లైన్‌ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించడానికి గత ఏడాది నుంచి వన్‌ప్లస్‌ 10ఆర్‌ మొబైళ్లపై కంపెనీ వోచర్‌ను అందిస్తోంది. ఇప్పుడు కంపెనీ లైఫ్‌టైమ్‌ ఫ్రీ స్క్రీన్‌ అప్‌గ్రేడ్‌ ఆప్షన్‌ను ఇస్తోంది. ఇది చాలా మంది యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌ ద్వారా ఈ ఆఫర్‌ను పొందొచ్చు. యాప్‌లో రెడ్‌ కేబుల్‌ క్లబ్‌ మెంబర్‌షిప్‌ సెక్షన్‌కు వెళ్లాలి. బెనిఫిట్స్‌ కింద లైఫ్‌టైమ్‌ ఫ్రీ స్క్రీన్‌ అప్‌గ్రేడ్‌ను (OnePlus Offering Lifetime Free Screen Upgrade) సెర్చ్‌ చేసి ఆఫర్‌ను క్లెయిం చేసుకోవాలి. అయితే, ఫోన్‌ కొన్న ఒరిజినల్‌ బిల్లు ఉండాలి. అది లేకపోతే ఆఫర్‌ పొందడం కుదరదు. క్లెయిం చేసుకున్న తర్వాత దగ్గర్లోని వన్‌ప్లస్‌ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లి స్క్రీన్‌ అప్‌గ్రేడ్‌ చేయించుకోవచ్చు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Korean Series OTT లో కొరియన్ సిరీస్ ఫెస్టివల్.. ఎప్పుడు- ఎక్కడ చూడాలంటే?

Korean Series OTT డ్రామాస్ ఏ మాయ చేస్తున్నాయో తెలియదు కానీ.. ఆ కథలకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ఇప్ప్పుడు కొరియన్ సిరీస్ కు పెరుగుతున్న క్రేజ్ అంత ఇంత కాదు. ముఖ్యంగా అమ్మాయిలు కొరియన్ సిరీస్ అంటే ప్రాణం పెట్టేస్తున్నారు. అంతలా యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తున్నాయి ఈ కొరియన్ సిరీస్. దీనితో అసలు వాటిలో ఏముందా ఎలా ఉంటాయా అని తెలుసుకోవాలనే ఆసక్తి కొంతమందికి కలుగుతుంది. ఇక కొరియన్ మూవీ లవర్స్ అయితే ఎప్పుడెప్పుడు ఏ మూవీ రిలీజ్ అవుతుందా అనే ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్న కొరియన్ డ్రామాస్ ఏంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో అనే విషయాలు చూసేద్దాం.

Korean Series OTT

ఇన్ ది హౌజ్, నో గెయిన్ నో లవ్:

కొరియన్ సినిమాలలో కేవలం ప్రేమ కథలు మాత్రమే కాదు.. ఇంకా చాలా రకాల ఇంట్రెస్టింగ్ సిరీస్ లు కూడా ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ మంచి రొ*మాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను చూడాలని అనుకుంటే మాత్రం ఈ సిరీస్ బెస్ట్ ఛాయస్. ఇక ఈ సిరీస్ ఆగష్టు 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ సిరీస్ “నో గెయిన్ నో లవ్”.. ఆగష్టు 26 నుంచి.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి కొరియన్ సిరీస్ లంటే ఇష్టం ఉంటే మాత్రం ఈ సిరీస్ ను మిస్ చేయకుండా చూడండి.

ది ఫ్రాగ్ , నో వే ఔట్:

Korean Series OTT సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు చూస్తున్నంత సేపు.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. దీనితో ఈ కాన్సెప్ట్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఇంకా ఇంకా చూడాలని అనుకుంటూ ఉంటారు. అందులోను కొరియన్ మేకర్స్ ఇలాంటి కథలను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన వెబ్ సిరీస్ ఏ “ది ఫ్రాగ్”. ఈ సిరీస్ ఆగష్టు 23 నుంచి… ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక దానితో పాటు.. మరొక ఇంట్రెస్టింగ్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్.. “నో వే అవుట్” సిరీస్ జూలై 31 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

లవ్లీ రన్నర్, టెర్రర్ ట్యూస్‌డే ఎక్స్‌ట్రీమ్:

Korean Series OTT కొరియన్ సినిమాలు, సిరీస్ లు ప్రేమ కథలకు, హర్రర్ కథలకు పెట్టింది పేరు. వీటిలో ఏం మ్యాజిక్ ఉంటుందో తెలియదు కానీ.. కొరియన్ డ్రామాస్ చూడని వారు కూడా వీటిని చూసిన తర్వాత.. కె డ్రామాస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో లవ్లీ రన్నర్ అనే ఓ లవ్ డ్రామా వెబ్ సిరీస్ జూలై 31 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే టెర్రర్ ట్యూస్‌డే ఎక్స్‌ట్రీమ్ అనే హర్రర్ వెబ్ సిరీస్ ఆగష్టు 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ సిరీస్ లను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Income Tax Returns : ఐటీ రిటర్న్‌లో అల్‌టైమ్ రికార్డు.. ఇప్పటివరకు 7 కోట్ల దాటిన దరఖాస్తులు!

0

Income Tax Returns ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, ఇది నేటితో ముగిసింది. అంతకుముందు, బుధవారం రాత్రి 7 గంటల వరకు 7 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. వీటిలో జూలై 31న ఒక్కరోజే 50 లక్షలకు పైగా రిటర్నులు దాఖలయ్యాయి. ప్రజలందరూ వీలైనంత త్వరగా రిటర్నులు దాఖలు చేయాలని ఆ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే భారీ రిటర్న్‌లు దాఖలైనట్లు ఐటీ అధికారులు తెలిపారు. అలాగే ఈ మైలురాయిని సాధించినందుకు పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు తెలిపారు.

Income Tax Returns

మరోవైపు ఇవాళ 24 గంటలూ ప్రజలకు సహాయం చేసేందుకు డిపార్ట్‌మెంట్ సిద్ధంగా ఉంది. అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. మీరు పెనాల్టీని తప్పించుకోవాలనుకుంటే, వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయండి అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా ఆదాయపు పన్ను శాఖ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ పోర్టల్ మందగమనంపై ప్రజలు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ప్రజలకు 24×7 సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఏదైనా సమస్య ఉంటే, ఫోన్ కాల్, లైవ్ చాట్, వెబ్ సెషన్ మరియు X ద్వారా మా హెల్ప్‌డెస్క్ నుండి సహాయం తీసుకోవచ్చు.

ఐటీఆర్‌ ఫైలింగ్‌లో సరికొత్త రికార్డు

Income Tax Returns ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టించినట్లు ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. గతేడాది జూలై 31 వరకు 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. ఈ ఏడాది ఈ సంఖ్య 7 కోట్లు దాటింది. జూలై 31, 2024 వరకు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి ఎటువంటి రుసుము లేదు. దీని తర్వాత, పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. కానీ, అందుకు రూ.1000 నుంచి రూ.5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Best Saving Scheme for Women మహిళల కోసం కేంద్రం బెస్ట్ స్కీమ్! ఇలా చేస్తే ఏకంగా రూ.32 వేలు లాభం!

0

Best Saving Scheme for Women కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలు అర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఎప్పటికప్పుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటుంది. ముఖ్యంగా ఈ పథకాల్లో పేద ప్రజల దగ్గర నుంచి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగస్తులు, రైతులు ఇలా అన్ని వర్గాలకు చెందినవారి కోసం ప్రత్యేకంగా ఎన్నో స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలోని ఆడ పిల్లలు , మహిళలు ఆర్థిక భద్రత మేరకు మరో కొత్త పథకంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపోతే ఈ పథకం పోస్టాఫీసులతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అర్హత కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులలో అమలు చేస్తుంది. ఇంతకీ ఆ పథకం వివరాలేంటో తెలుసుకుందాం.

Best Saving Scheme for Women

దేశంలోని ఆడ పిల్లలు, మహిళల ఆర్థిక భద్రత కొరకు కేంద్ర ప్రభుత్వం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‘ అనే పథకంను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ పథకం పై  కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జూన్ 27, 2023న ఈ-గెజిట్ జారీ చేసింది.  ఇక ఈ పథకాన్ని పోస్టాఫీసుతో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, అర్హత కలిగిన ప్రైవేట్ రంగ బ్యాంకులలో అమలు చేస్తుంది. అలాగే ఈ పథకం పోస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులో ఉంది. కాగా, ఇది మార్చి 31, 2025 వరకు రెండేళ్ల కాలానికి సేవింగ్స్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది.

Best Saving Scheme for Women అయితే బాలికలు, మహిళలకు  సురక్షితమైన పెట్టుబడి పథకంగా ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది. ఇకపోతే ఈ పథకం మార్చి 31, 2025న లేదా అంతకంటే రెండు సంవత్సరాల పరిమితితో ఖాతాను తెరవచ్చు. కాగా, ఈ పథకంలో పెట్టుబడికి సంవత్సరానికి 7.5 శాతం చొప్పున వడ్డీ వస్తుంది.  అలాగే ప్రతి త్రైమాసికానికి కాంపాండ్ వడ్డీ లెక్కగడతారు. ఇందులో కనిష్టంగా రూ.1,000, గరిష్టంగా రూ.2,00,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన నగదు మెచ్యూరిటీ ప్రారంభించిన తేదీ నుంచి రెండేళ్లు ఉంటుంది. అయితే అత్యవసర సమయంలో పాక్షికంగా నగదు విత్ డ్రాకు అవకాశం కల్పిస్తారు. ఇక స్కీమ్ ఖాతాలో అర్హతను బట్టి బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రెండేళ్ల తర్వాత రూ.32044 వడ్డీ అందుకోవచ్చు.

ఎమ్ఎస్ఎస్ఎస్ స్కీమ్ అర్హతలు

  • ఈ స్కీమ్ దరఖాస్తుదారులు కచ్చితంగా భారతీయులై ఉండాలి.
  • ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులు.
  • అలాగే వ్యక్తిగత మహిళ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇక మైనర్ ఖాతాను తండ్రి, సంరక్షుడు ద్వార తెరవవ్చు.
  • ఇక ఇందులో గరిష్ట వయోపరిమితి లేదు, అన్ని వయసుల మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ(ఆఫ్‌లైన్)

  • ముందుగా దరఖాస్తుదారులు  సమీపంలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్, షెడ్యూల్ బ్యాంకులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇక దరఖాస్తుదారులు ఈ ఫామ్ ను అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి, అవసరమైన అన్ని పత్రాలను జత చేయాలి.
  • ఇక డిక్లరేషన్, నామినేషణ్ అనే వివరాలను కూడా అందించి ఎంత డిపాజిట చేస్తున్నారో ధరఖాస్తులో తెలియజేయాలి.
  • చివరిగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ పథకంలో మీరు పెట్టుబడి పెట్టినట్లు రుజువుగా సర్టిఫికేట్‌ను పొందాలి.

ఈ స్కీమ్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • బర్త్ సర్టిఫికేట్
  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  •  డిపాజిట్ మొత్తం, చెక్‌తో పాటు పే-ఇన్-స్లిప్
  •  గుర్తింపు, చిరునామా రుజువు పత్రాలు : పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ, ప్రభుత్వ అధికారి సంతకంతో NREGA జాబ్ కార్డ్ కూడా ఉండాలి

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Cyber Crime వృద్ధులే టార్గెట్, అందమైన అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్.. రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు

0

Cyber Crime : సైబర్ నేరగాళ్లు తమ రూట్ మార్చారు. కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఈసారి సైబర్ క్రిమినల్స్ కన్ను వృద్ధులపై పడింది. అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయిస్తారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. బాధితుల నుంచి లక్షలు దండుకుంటున్నారు. కొత్త తరహా సైబర్ మోసాల గురించి కృష్ణా జిల్లా పెనమలూరు సీఐ రామారావు వివరాలు వెల్లడించారు.

Cyber Crime

రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్ చేసుకుని లక్షలు దండుకుంటున్నారని ఆయన తెలిపారు. తొలుత వాట్సప్ వీడియో కాల్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ కాల్ ఎత్తిన వెంటనే అమ్మాయిలు కనిపిస్తారు. వారు నగ్నంగా ఉంటారు. వారి ఒంటి మీద నూలుపోగు కూడా ఉండదు. అమ్మాయిలు మూడు, నాలుగు నిమిషాలు వృద్ధులతో చాటింగ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే వాట్సాప్ కు ఆ వీడియోని పంపిస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

Cyber Crime మేము పోలీసులం అంటూ వృద్ధులకు ఫోన్ కాల్స్ వస్తాయి. వీడియో చూపి బ్లాక్ మెయిల్ చేస్తారు. 10 లక్షలు నుండి 20 లక్షల వరకు డిమాండ్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. వారి మాటలకు భయపడి బాధితులు అడిగినంత డబ్బు ఇచ్చుకుంటున్నారు. కాగా, రిటైర్ అయిన ఉద్యోగులని సైబర్ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం గురించి బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో డబ్బు పోగొట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా ఘటనలు వెలుగు చూసినట్లు పోలీసులు వెల్లడించారు. మాకు వచ్చి చెబుతున్నారు కాని ఫిర్యాదు మాత్రం చేయడం లేదని పోలీసులు తెలిపారు. బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ సీఐ రామరావు పేర్కొన్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Amazon Order Fails : రూ. 55,000 మొబైల్ ఫోన్ ఆర్డర్.. పార్సిల్ తెరిచి చూస్తే షాక్..

Amazon Order Fails ఆన్‌లైన్‌లో బ్రాండ్ న్యూ మొబైల్ ఆర్డర్ చేస్తే, అరడజన్ టీ కప్పుల్ని డెలివరీ చేశారంటూ ఆరోపిస్తూ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) అండర్‌టేకింగ్‌లో డిప్యూటీ ఇంజనీర్ అయిన అమర్ చవాన్, అమెజాన్‌లో రూ. 54,999 విలువైన టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ మొబైల్ ఫోన్‌ని ఆర్డర్ చేసినట్లు పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం జూలై 13న ఆన్‌లైన్‌లో డబ్బులు పూర్తిగా చెల్లించినట్లు పేర్కొన్నాడు.

Amazon Order Fails

రెండు రోజుల తర్వాత పార్సిల్ వచ్చిందని, దాన్ని ఓపెన్ చేసి చూడగా ఆరు టీ కప్పులు కనిపించడంతో షాక్‌కి గురైనట్లు ఫిర్యాదులో తెలిపాడు. ఈ విషయంపై తాను అమెజాన్‌ని సంప్రదించానని, అయితే వారి నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని వెల్లడించారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అమెజాన్‌ అధికారులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని మాహిమ్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటపై ఇప్పటి వరకు అమెజాన్ నుంచి ఎలాంటి వ్యాఖ్యల రాలేదు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.