Home Blog Page 60

OTT Action Thriller Movie లో దీనిని మించిన యానిమేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ లేదు.. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్

OTT Action Thriller Movie కార్టూన్ , యానిమేటెడ్ ఫిల్మ్స్ ను కేవలం చిన్న పిల్లలు మాత్రమే చూస్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి యానిమేటెడ్ చిత్రాలకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే రీసెంట్ కల్కి సినిమా నుంచి వచ్చిన యానిమేటెడ్ సిరీస్ బుజ్జి&భైరవ నే ఉదాహరణ. యాక్షన్ డ్రామాస్ , హీరో విలన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ రెగ్యులర్ స్క్రీన్ ప్లే తో చూసి చూసి బోర్ కొట్టేసి.. డిఫరెంట్ గా వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం యానిమేటెడ్ ఫిల్మ్స్ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Action Thriller Movie

ఈ సినిమా కథ విషయానికొస్తే.. వెయ్యి సంవత్సరాల క్రితం భూమి , స్వర్గం కలిసి మంచి చెడులను కలిపే ఓ పవర్ ఫుల్ బాల్ ను క్రియేట్ చేస్తాయి. ఆ బాల్ కు ప్రాణం రాగానే తన చుట్టూ ఉండే ఎనర్జీని లాగేసుకుని.. ఇంకా పవర్ ఫుల్ గా మారుతుంది. దీని వలన భూమి అంత నాశనం అవుతుంది. అందుకే దేవుడు తన ఇద్దరు శిష్యులైన పిగ్గెట్ , సెన్ ను దానిని ఆపడానికి పంపిస్తాడు. కానీ ఆ బాల్ ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉన్న కారణంగా దానిని ఆపలేకపోతారు. దీనితో చివరికి దేవుడే ఓ పవర్ ఫుల్ ఛాంబర్ ను క్రియేట్ చేసి ఆ బాల్ నుంచి మంచి చెడులను సెపరేట్ చేస్తాడు. చెడు బాల్ ను నాశనం చేయడానికి.. మూడు సంవత్సరాల తర్వాత ఈ చెడు బాల్ పైన ఆకాశం నుంచి వచ్చే ఒక లైట్ పవర్ పడి.. ఆ పవర్ తట్టుకోలేక అది పూర్తిగా నాశనం అయిపోతుందనే శాపం పెడతాడు. ఈ క్రమంలో ఆ రెండు బాల్స్ ను మూడు సంవత్సరాల పాటు కలవనివ్వకుండా చూసుకోమని తన శిష్యులలో ఒకడైన పిగ్గెట్ కు ఇస్తాడు.

OTT Action Thriller Movie దీనితో సెన్ కు కోపం వస్తుంది.. దీనితో సెన్ ప్రపంచాన్ని పాలించాలని అందరి కంటే తానే ఎక్కువ శక్తివంతుడుగా ఉండాలని డిసైడ్ అవుతాడు. అందుకోసం పిగ్గెట్ నుంచి మంచి బాల్ ను దొంగలించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో చెడు బాల్ అయినా డీమన్ బాల్ కూడా బయటపడుతుంది. ఆ డీమన్ బాల్ వెళ్లి.. ఓ రాజ్యంలోని రాణి గర్భాన పుడతాడు. దీనితో అతను ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాడనే భయంతో వెంటనే పిగ్గెట్.. డీమన్ ను చంపడానికి వెళ్తాడు. అక్కడ తన తల్లి వచ్చి అతనిని కాపాడుతుంది. ఆ రాజు రాణి తమ కొడుకుని వారితోనే ఉంచుకోవాలని అనుకుంటారు. కానీ మిగిలిన వాళ్లేమో ఆ పిల్లాడిని చంపేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. దీనితో రాజు వెళ్లి దేవుడిని కలుస్తారు. సేన్ దగ్గర ఉన్న మరొక మంచి బాల్ నుంచి డ్రాగన్ కడుపునా.. మంచి అబ్బాయిల పుడతాడు. ఆ డీమన్ కుర్రాడి పేరు నిజా.. అతను పెరిగే కొద్దీ రాక్షసుడిలా బెహేవ్ చేస్తూ ఉంటాడు. మరో వైపు డ్రాగన్ కు పుట్టిన పిల్లాడు అలెక్స్. మరి వీరిద్దరి మధ్య గెలిచేది ఎవరు ? దేవుడు పెట్టిన శాపం వలన నిజా మూడేళ్ళ తర్వాత చనిపోతాడా లేదా ? అలెక్స్, లీసా ఫ్రెండ్స్ అవుతారా? తర్వాత ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే “నిజా” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

OTT Action Thriller Movie అయితే ఈ సినిమా రెండు పార్ట్శ్ గా అందుబాటులో ఉంది.. నిజా అనేది మొదటి పార్ట్ అయితే.. “నిజా రీబోర్న్” అనేది రెండవ పార్ట్. యానిమేటెడ్ మూవీస్ ఇష్టపడే వారు ఈ రెండు సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ప్రస్తుతం నిజా అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. “నిజా రీబోర్న్” మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు సినిమాలను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Horoscope Today : ఆరోగ్యం విషయంలో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today దిన ఫలాలు (ఆగస్టు 3, 2024): మేష రాశి వారికి ఈ రోజు అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారు కుటుంబ పెద్దల నుంచి అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి.

Horoscope Today

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

బాగా సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. అనుకోకుండా వాహన యోగం పట్టడానికి అవకాశం ఉంది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిబఝ పోతాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో మెప్పిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చాలావరకు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ పెద్దల నుంచి అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదో న్నతులు కలగడానికి అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నమైనా సకాలంలో, సంతృప్తికరంగా నెరవేరుతుంది. వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలున్నప్పటికీ లాభాలపరంగా దూసుకుపోతారు. నిరుద్యో గులకు ఆశించిన ఉద్యోగావకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండక పోవచ్చు. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్య తలు ఉంటాయి. సోదరుల కారణంగా స్థిరాస్తి వివాదాలు ఇబ్బందుల్లో పడతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. మంచి పరిచయా లతో పాటు, చెడు పరిచయాలకు కూడా అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగు తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఏ పని చేపట్టినా తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి దీటుగా అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

Horoscope Today చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సహకారంతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ మిత్రుల తోడ్పాటుతో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగుల మీద అదనపు పని భారం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. మిత్రులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను ఎంతో శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా సాగు తాయి. ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరు ద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు కాకుండా వేరే ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. రావలసిన డబ్బును, బాకీలను కొద్ది శ్రమతో రాబట్టుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపో తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

Horoscope Today ఇంటికి ఇష్టమైన బంధువులు రావడం జరుగుతుంది. కుటుంబ జీవితం సందడిగా సాగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్యల నుంచి కొంత వరకూ బయటపడతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్నిముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

నిరుద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి విషయంలో అంచ నాలను అందుకుంటారు. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవు తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది ముఖ్యమైన అవసరాలు గడిచిపోతాయి. ఉద్యోగ ప్రయ త్నాల్లో కొద్దిగా నిరాశపడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. కుటుంబ వ్యవహారాలు చిన్న ప్రయత్నంతో చక్కబడతాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

Horoscope Today వృత్తి, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. పోటీదార్లు, ప్రత్యర్థుల సమస్యలతో ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉండి, విశ్రాంతి తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు, నిర్ణయాలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. కొద్దిగా అనారోగ్య సమ స్యలు బాధిస్తాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Gold Price Today : బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. వరుసగా 4వ రోజు షాకిచ్చిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

0

Gold Price Today : కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే.. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.. మార్కెట్‌ విశ్లేషకుల ప్రకారం.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పుత్తడి, వెండి ధర భారీగా పెరుగుతోంది.. శనివారం (03 ఆగస్టు 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర నిన్నటితో పోల్చితే రూ. 180లు పెరిగింది. అంటే నేడు 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,700లు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ. 150లు పెరిగి, రూ. 64,660లుగా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 100లు పెరిగి రూ.87,200లుగా నమోదైంది.

Gold Price Today

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,810లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,700లుగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,810, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,700లుగా నమోదైంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,960లు కాగా, 24 క్యారెట్ల ధర రూ.70,850, ముంబైలో 22 క్యారెట్లు రూ.64,810, 24 క్యారెట్లు రూ.70,700, చెన్నైలో 22 క్యారెట్లు రూ.64,610, 24 క్యారెట్లు రూ.70,480, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.64,810, 24 క్యారెట్లు రూ.70,700లుగా నమోదైంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.86,400లు కాగా, ముంబైలో రూ.87,300, బెంగళూరులో రూ.86,100, చెన్నైలో రూ.90,900, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.90,900 లుగా నమోదైంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Street Dogs Saved Life నన్ను సజీవంగా పూడ్చిపెట్టారు.. వీధి కుక్కలు మట్టిని తొవ్వి ప్రాణాలు కాపాడాయి: ఆగ్రా యువకుడు

Street Dogs Saved Life భూ వివాదంలో నలుగురు వ్యక్తులు తనను సజీవంగా పూడ్చిపెట్టారని, అనంతరం వీధికుక్కలు మట్టిని తొవ్వడంతో తాను బతికి బయటపడ్డానని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Street Dogs Saved Life

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిశోర్ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 18న ఆగ్రాలోని అర్టోని ప్రాంతంలో అతడిపై అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ అనే నలుగురు యువకులు కత్తులతో దాడి చేశారు. రూప్ కిశోర్ మృతి చెందాడని భావించి నిందితులు ఓ పొలంలో అతడిని పాతిపెట్టి వెళ్లిపోయారు.

అదే సమయంలో అక్కడకు వచ్చిన కొన్ని వీధి కుక్కలు అక్కడ మట్టి తొవ్వాయి. రూప్ కిశోర్‌ శరీరాన్ని కొరికాయి. దీంతో రూప్ కిశోర్‌కి తిరిగి స్పృహ వచ్చింది. దీంతో అతడు నడుచుకుంటూ స్థానికుల వద్దకు వెళ్లడంలో అతడిని వారు ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై రూప్ కిశోర్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడిని నలుగురు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారని అన్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Horoscope Today : శనిపై శుక్రుడి దృష్టి.. ఆ రాశుల వారికి ధన, రాజయోగాలు పక్కా..!

Horoscope Today ఈ నెల 2వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ శుక్రుడి మీద కుంభ రాశి నుంచి శని దృష్టి పడుతుంది. ఈ రెండు మిత్ర గ్రహాల పరస్పర దృష్టి వల్ల కొన్ని రాశులకు రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఊహించని స్థాయిలో ధన యోగాలు పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకస్మిక శుభ పరిణామాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.

Horoscope Today

  1. మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడి మీద లాభస్థానంలో ఉన్న శని దృష్టి పడినందువల్ల ఉద్యో గాలపరంగా ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృష్టాలు పడతాయి. రాజయోగాలు అను భవించడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. సంతానపరంగా శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అంద డం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం, ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడి దృష్టి ఆ శుక్రుడి మీద పడడం వల్ల వీరు ఉద్యోగాలపరంగా రాజయోగాలను అనుభవించడం జరుగు తుంది. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు, ఆశించిన బదిలీలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి పూర్తిగా బయటపడడంతో పాటు, వీటికి బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు వృద్ధి చెందుతాయి.
  3. సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి మీద సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడి దృష్టి పడినందు వల్ల ఉద్యోగంలో ఈ రాశివారి ప్రాభవం, ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతాయి. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఉన్నత పద వులు లభిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. వృత్తి, వ్యాపా రాలు బాగా కలిసి వస్తాయి. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయడమే ఒక రాజయోగం కాగా, ఈ రాశికి అత్యంత శుభుడైన శని దృష్టి ఆ శుక్రుడి మీద పడడం విపరీత రాజయోగానికి దారి తీస్తుంది. దీనివల్ల సమాజంలోని అత్యంత ప్రముఖులైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు హోదాలు, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభాలు గడిస్తాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి దృష్టి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడి మీద పడడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగా ర్థులకు ప్రభుత్వ లేదా బ్యాంక్ ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వినే అవకాశముంది.
  6. కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శనీశ్వరుడి దృష్టి సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడి మీద పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు సైతం అందే సూచనలున్నాయి. ధన ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Cheating Partners ఎక్కువగా మోసం చేసేది అమ్మాయిలా? అబ్బాయిలా? స్టడీస్ ఏం చెప్తున్నాయ్?

0

Cheating Partners ప్రేమ, పెళ్లి ఈ రెండూ చాలా పవిత్రమైనవి. అయితే లవ్ పార్టనర్ ని, లైఫ్ పార్టనర్ ని మోసం చేయడం అనేది సర్వసాధారణ విషయం అయిపోయింది ప్రస్తుత రోజుల్లో. అయితే ఎక్కువగా ఎవరు మోసం చేస్తున్నారు? అబ్బాయిలా? లేక అమ్మాయిలా? ఇది చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అసలు దీని గురించి స్టడీస్ ఏం చెప్తున్నాయి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.  

Cheating Partners

ఒక స్టడీ ప్రకారం 20 శాతం మంది మగవారు, 13 శాతం మంది పెళ్ళైన మహిళలు ఇతరులతో సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు. సగటున 16 శాతం మంది మోసం చేస్తున్నట్లు ఈ స్టడీలో తేలింది. అయితే ఈ స్టడీ ప్రకారం మగవాళ్లే ఎక్కువగా మోసం చేస్తున్నట్లు తేలింది. మరొక స్టడీ ప్రకారం.. 9 శాతం మంది మహిళలు, 17 శాతం మంది మగవారు తమ భాగస్వాములకి నమ్మకద్రోహం చేశారని తేలింది. ఇందులో మరలా ఇతరులతో సంబంధం పెట్టుకున్న వారిని లిస్ట్ అవుట్ చేస్తే 15 శాతం మంది మహిళలు, 27 శాతం మంది మగవారు శారీరక సంబంధాలు పెట్టుకున్నారని తేలింది. సగటున 21 శాతం మంది మోసం చేస్తున్నారు. ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ 2010 నుంచి 2016 వరకూ వివిధ వయసు వారి మీద చేసిన జనరల్ సోషల్ సర్వే ప్రకారం.. అన్ని వయసు మగవారు తమ భాగస్వాముల్ని మోసం చేస్తున్నట్లు తేలింది. అయితే 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న అబ్బాయిలు నిజాయితీపరులని తేలింది. ఇక మహిళల్లో 60 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న వారు తమ భర్తలను మోసం చేసినట్లు తేలింది. ఇది సగటున 16 శాతంగా ఉంది. మహిళలతో పోలిస్తే భార్యలను మోసం చేసే మగవారు 26 శాతం మంది ఉన్నారు. మగవారిలో 70 నుంచి 79 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా భార్యలను మోసం చేస్తున్నారని తేలింది.

ఈ వయసు అమ్మాయిలే ఎక్కువగా మోసం చేస్తున్నారు:

18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మోసం చేసే అమ్మాయిలు 11 శాతం ఉండగా అబ్బాయిలు మాత్రం 10 శాతం మందే ఉన్నారు. దీన్ని బట్టి 18 నుంచి 29 ఏళ్ల వయసున్న అమ్మాయిలే ఎక్కువగా అబ్బాయిలను మోసం చేస్తున్నట్లు జనరల్ సోషల్ సర్వేలో తేలింది. 30 నుంచి 39 ఏళ్ల వయసున్న వారిలో 12 శాతం మంది అమ్మాయిలు మోసం చేస్తుండగా, 14 శాతం మంది మగవారు మోసం చేస్తున్నారు. 40 నుంచి 49 ఏళ్ల వయసు వారిని తీసుకుంటే 14 శాతం మంది మహిళలు , 16 శాతం మంది మగవారు మోసం చేస్తున్నారు. 50 నుంచి 59 వయసున్న వారిలో 15 శాతం మంది మహిళలు, 22 శాతం మంది మగవారు మోసం చేస్తున్నారు. 60 నుంచి 69 ఏళ్ల వయసు వారిలో 16 శాతం మంది మహిళలు, 24 శాతం మంది పురుషులు మోసం చేస్తున్నారు.

girl vs boy in cheating

Cheating Partners 70 నుంచి 79 ఏళ్ల వయసున్న వారిలో 13 శాతం మంది మహిళలు భర్తలను మోసం చేస్తుండగా.. 26 శాతం మంది పురుషులు భార్యలను మోసం చేస్తున్నారు. 80+ వయసున్న వారిలో 6 శాతం మంది మహిళలు మోసం చేస్తుండగా.. 24 శాతం మంది మగవారు భార్యలను మోసం చేసినట్లు తేలింది. ఇండియా విషయానికొస్తే.. 2023లో పలు గణాంకాల ప్రకారం.. ప్రేమించిన లేదా పెళ్లి చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండా పరాయి వారితో శారీరక సంబంధం పెట్టుకున్నవారిలో 23 శాతం మంది పురుషులు ఉండగా.. 13 శాతం మంది మహిళలు ఉన్నారు. 95 వేల మంది మీద చేసిన సర్వేలో 91 శాతం మంది మహిళలు, 77 శాతం మంది మగవారు వేరే వ్యక్తులతో భావోద్వేగ, శారీరక సంబంధం పెట్టుకున్నారని ఒక సర్వేలో తేలింది. మరొక స్టడీ ప్రకారం.. 10 మంది భారతీయ స్త్రీలలో 7 మంది విసుగు చెంది భర్తలను మోసం చేస్తున్నారని ఒక స్టడీలో తేలింది. 

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Average Student Nani : ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ రివ్యూ..

Average Student Nani Movie Review : డైరెక్టర్ పవన్ కుమార్ ఇప్పుడు హీరోగా మారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో పవన్ కుమార్ హీరోగా నటించడమే కాక తనే ఈ సినిమాని నిర్మిస్తూ డైరెక్షన్ చేసాడు. సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ హీరోయిన్స్ గా ఝాన్సీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటించగా శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు. యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా నేడు ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజయింది.

Average Student Nani

కథ విషయానికొస్తే.. నాని(యావరేజ్ స్టూడెంట్ నాని) సరిగ్గా చదవడని ఇంట్లో నాన్న(రాజీవ్ కనకాల) తిడుతూ ఉన్నా అమ్మ(ఝాన్సీ), అక్క(వివియా సంపత్) సపోర్ట్ చేస్తూ ఉంటారు. నానిపై అక్కకి ప్రేమ ఉన్నా నానికి అక్క ఇష్టం ఉండదు. బి.టెక్ ఎంట్రన్స్ లో నానికి ర్యాంక్ రాకపోవడంతో నాని అమ్మ ఏదో ఒకటి చేసి మెకానికల్ లో సీట్ సంపాదిస్తుంది. ఇక కాలేజీలో జాయిన్ అయ్యాక కాలేజీ డేస్, సీనియర్స్ ర్యాగింగ్ తో సాగుతున్న సమయంలో నాని తన సీనియర్ సారా(స్నేహ మాల్వియా)తో ప్రేమలో పడతాడు. ఈ విషయంలో సీనియర్స్ తో నానికి గొడవలు అవుతాయి.

ఓ జూనియర్ అను(సాహిబా భాసిన్) నానిని ఇష్టపడుతుంది. ఓ సమయంలో సారా వేరే వాళ్ళని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. అదే సమయంలో నాని అక్కపై దాడి జరిగి కోమాలోకి వెళ్తుంది. అక్క తన కోసం చేసిన త్యాగం నానికి తెలుస్తుంది. దీంతో నాని చనిపోవాలనుకుంటాడు. మరి నాని ఏం చేసాడు? చివరికి నాని ఎవరితో ప్రేమలో ఉన్నాడు? నాని అక్క చేసిన త్యాగం ఏంటి? నాని అక్కపై ఎవరు దాడి చేసారు? నాని లైఫ్ లో సక్సెస్ అవుతాడా తెలియాలంటే తెరపై చూడాలి.

సినిమా విశ్లేషణ.. ఓ మాములు అల్లరి చిల్లరగా తిరిగే స్టూడెంట్ లైఫ్ లో ఎలా సక్సెస్ అవుతాడు అనే కథాంశంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ యావరేజ్ స్టూడెంట్ నాని కూడా అదే కోవలోకి చెందింది. అల్లరి చిల్లరిగా తిరిగే నాని ఇంజనీరింగ్ లో ఎలా జాయిన్ అయ్యాడు? ఇద్దరి అమ్మాయిలతో ప్రేమాయణం ఎలా సాగింది అని చూపిస్తూనే అక్క, అమ్మ ఎమోషన్ ని బాగానే పండించారు. అలాగే చదువు వేరు, ట్యాలెంట్ వేరు. చదువు లేకపోయినా క్యారెక్టర్, ట్యాలెంట్ ఉంటే చాలు లైఫ్ లో సక్సెస్ అవ్వొచ్చు అనే పాయింట్ ని ఎంటర్టైనింగ్ గా చూపించారు.

ఫస్ట్ హాఫ్ అంతా నాని అల్లరి, సారాతో ప్రేమాయణం, కాలేజీ ర్యాగింగ్ గొడవలు చూపించి ఇంటర్వెల్ ముందు సారా ఇంకొకరిని ఎంగేజ్మెంట్ చేసుకోవడం, అక్క కోమాలోకి వెళ్లడం చూపించి నెక్స్ట్ హీరో ఏం చేస్తాడు అని ఆసక్తి కలిగించారు. ఇక సెకండ్ హాఫ్ లో అనుతో ప్రేమాయణం, సారా మళ్ళీ రావడం, నాని లైఫ్ లో సక్సెస్ అవ్వడం చూపిస్తారు. ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్స్ తో వచ్చే ఒక మాస్ సాంగ్ మాత్రం థియేటర్స్ లో అదరగొడుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. డైరెక్టర్ పవన్ కుమార్ హీరోగా మారి ఓకే అనిపించాడు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం మెప్పిస్తాడు. ఇద్దరు హీరోయిన్స్ సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ అందానికే పరిమితమయ్యారు. స్నేహ కొన్ని సీన్స్ లో ఎమోషనల్ గా కూడా మెప్పిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ తల్లి పాత్రలో ఝాన్సీ, తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించారు. హీరో అక్క పాత్రలో వివియా సంపత్ పర్వాలేదనిపించింది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు.

Average Student Nani సాంకేతిక అంశాలు.. పవన్ కుమార్ హీరోనే దర్శకుడు కావడంతో డైలాగ్స్ బానే ఉన్నా స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్ గా రాసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది. రొమాంటిక్ సాంగ్స్ విజువల్ గా బాగుంటాయి. మాస్ సాంగ్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక హీరోనే నిర్మాత కూడా కావడంతో తన సబ్జెక్టు మీద కావాల్సినంత ఖర్చుపెట్టుకున్నారు.

మొత్తంగా యావరేజ్ స్టూడెంట్ నాని.. అల్లరి చిల్లరగా తిరిగే ఓ స్టూడెంట్ ప్రేమ కథలేంటి, లైఫ్ లో సక్సెస్ అయ్యాడా అని ఎంటర్టైనింగ్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Viral Video : 3 నెలల క్రితం తప్పిపోయిన మహిళ గుహలో నాగినిలా ప్రత్యక్షం.. పూజలు చేస్తున్న స్థానికులు

0

Viral Video  : యూపీలోని సోన్‌భద్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌లోని తన ఇంటి నుంచి 3 నెలలుగా కనిపించకుండా పోయిన ఒక మహిళ.. యూపీలోని సోన్‌భద్రలోని గుహ లోపల నాగినిలా ప్రత్యక్షమైంది. ఆ మహిళ అచ్చం పాములాగే బుసలు కొడుతూ అసాధారణ స్థితిలో కనిపించింది. ఆ మహిళ నాగిని లాగే భూమిపై పాకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళ నాగిన అవతారంలోకి మారిపోగా.. స్థానికులు ఆమెకు పూజలు చేస్తున్నారు. గుహలో గడిపిన తర్వాత స్త్రీకి దైవిక శక్తులు ప్రసాదించబడ్డాయని స్థానిక ప్రజలు నమ్ముతున్నారు. దేవుని మహిమ వల్లే యువతి పాముగా మారిందని చెప్పుకుంటూ.. యూపీ నుంచి జార్ఖండ్ వరకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆ గుహల్లో ఉన్న మహిళకు పూజలు నిర్వహిస్తున్నారు.

Viral Video

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో.. గుహలో ఆ మహిళ నేలపై పడి ఉండగా.. స్థానికులు వెళ్లి ఆమెకు పూజలు చేస్తున్నారు. అంతలో ఆమె తన నాలుకను పదే పదే బయటకు లోపలకు అనుకుంటూ అచ్చం పాము మాదిరిగానే ప్రవర్తిస్తూ కనిపించింది. గుహలో నేలపై పాములా పాకుతూ నాలుకను బయటకు చాపుతోంది. ఆ అమ్మాయి విచిత్ర చేష్టలకు అక్కడున్న కొందరు భయాందోళనకు గురయ్యారు. కొందరు ఆమె అవతారాన్ని వీడియోను రికార్డు చేశారు. ఈ సంఘటన కోన్‌ పీఎస్ పరిధిలోని రాణిదిహ్‌ గుప్తా ధామ్ గుహలో కనిపించింది.

ఆ మహిళ జార్ఖండ్ నుండి సోనభద్రకు ఎలా చేరుకుంది?
అయితే, గ్రామస్తులు మహిళకు పూజలు చేసి పూలమాలలు వేయడం సోషల్ మీడియాలో వీడియోలు చూపించడంతో ఈ సంఘటనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, జార్ఖండ్‌లోని కరీవహదీహ్ ఖరౌండి ప్రాంతంలోని తన ఇంటి నుంచి ఆ మహిళ సోన్‌భద్రకు ఎలా, ఎప్పుడు చేరుకుంది అనేదానికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. రెండు మూడు నెలల క్రితమే ఆమె కనిపించకుండా పోయిందని, అన్ని చోట్లా వెతికామని మహిళ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎక్కడా కనిపించలేదని కుటుంబ సభ్యులు కూడా తెలిపారు.ఆ తర్వాత కుటుంబసభ్యులు మహిళ ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడానికి నాటకీయ కారణాన్ని అందించారు. ఒకరోజు ఆ మహిళ కుటుంబ సభ్యుల కలలోకి వచ్చి తన ప్రదేశాన్ని తెలియజేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. యూపీలోని సోన్‌భద్ర గుహలో ఉన్నట్టు ఆ మహిళ కలలో తెలిపిందని వెల్లడించారు.

కలలో ఉన్న మహిళ ఇచ్చిన సూచనల ప్రకారం, కుటుంబ సభ్యులు యూపీలోని సోన్‌భద్రలోని గుప్తా ధామ్ వద్ద మహిళను కనుగొనడానికి వెళ్లారు. అయితే కుటుంబసభ్యులు గుహ వద్దకు చేరుకుని చూడగా మహిళ ఆచూకీ లభించలేదు. అప్పుడు వారు గుహ ద్వారం వద్ద కీర్తన లేదా భజన చేశారు. కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లుగా, ఆ మహిళ రెండు చేతులు, కాళ్లపై పాకుతున్న గుహ నుంచి బయటపడింది. ఆమె కూడా బుసలు కొడుతూ, పామును అనుకరిస్తూ, ప్రసారం అవుతున్న వీడియో చూపిస్తుంది. ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ మహిళను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు సోన్‌భద్రకు చేరుకుంటున్నారు. ఆమెకు స్థానికులు పూజలు కూడా చేస్తున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Collector Visit to ZP High School … వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు..!

0

Collector Visit to ZP High School గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ గత కొంతకాలంగా క్షేత్రస్థాయి పర్యటలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పాఠశాలలు, వైద్యశాలల్లో తనిఖీలు చేస్తూ వాస్తవ పరిస్థితిలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన ఆమెకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

Collector Visit to ZP High School

జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తనిఖీ చేస్తున్న సమయంలో పాఠశాలలో మొత్తం నాలుగు వందల మంది విద్యార్ధులున్నట్లు ఉపాధ్యాయులు చెప్పారు. అయితే హాజరైంది మాత్రం మూడు వందల యాభై మంది మాత్రమే. ఒకే రోజు యాభై మందికి పైగా విద్యార్దులు అబ్సెంట్ అవ్వడంపై ప్రధానోపాధ్యాయుడిని కలెక్టర్ నిలదీశారు. వర్షం కారణంగా విద్యార్ధుల హాజరు శాతం తగ్గిందని చెప్పడంతో కలెక్టర్ మరింత అవాక్కయ్యారు.

విద్యార్దుల హాజరు తర్వాత ఉపాధ్యాయుల సంగతి ఏంటని ఆరా తీశారు. అయితే ముప్పై మంది టీచర్లు స్కూల్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. నాలుగు వందల మంది విద్యార్ధులకు ముప్పై మందా అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెయ్యి మంది విద్యార్ధులుంటున్న బడుల్లో కూడా ముప్పై మంది టీచర్లే ఉండటాన్ని చూస్తున్నాం. మరి మీ దగ్గర అంత తక్కువ సంఖ్యలో విద్యార్ధులుండటానికి కారణమేంటని నిలదీశారు. అంతేకాదు విద్యార్ధుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యలేంటని అడిగారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు సమాధానం చెప్పలేకపోయారు.

Collector Visit to ZP High School ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు ఉండటం లేదన్న ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. కొన్ని చోట్ల ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువుగా ఉంటే మరికొన్ని చోట్ల తక్కువుగా ఉంటున్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరిపి విద్యార్దులు ఉపాధ్యాయులు శాతం సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక అసలు వాస్తవాలపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Bags for Rainy Season వర్షంలో మీ బ్యాగులు సేఫ్.. వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ రూ. 89కే

0

Bags for Rainy Season వర్షాకాలంలో వానలు కురుస్తూనే ఉంటాయి. వర్షాలు పడుతున్నప్పటికీ ఉద్యోగులు ఆఫీసులకు వెల్లంది తప్పదు. స్కూల్ కి విద్యార్థులు పోక తప్పదు. ఆఫీసులకు వెళ్లే వారు అయితే తమ ల్యాప్ టాప్, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లడానికి బ్యాగ్ ను యూజ్ చేస్తుంటారు. స్టూడెంట్స్ బ్యాగులల్లో బుక్స్ తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మీ బ్యాగులు తడవకుండా ఉండాలంటే వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ ఉండాల్సిందే. ల్యాప్ టాప్ వంటి విలువైన వస్తువులు వర్షంలో తడిస్తే వేలల్లో నష్టపోవాల్సి వస్తుంది. అదే ఓ రెయిన్ కవర్ ఉంటే సేఫ్ గా ఉండొచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో రూ. 89కే వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ అందుబాటులో ఉంది.

Bags for Rainy Season

వర్షంలో బ్యాగు తడవకుండా ఉండాలంటే దాన్నికవర్ చేసేలా వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ ఉంటే బెస్ట్. బ్యాగులోని వస్తువులు తడవకుండా ఉంటాయి. స్టూడెంట్స్ కు, ఉద్యోగులకు, ఇతర పనులకు వెళ్లే వారికి యూజ్ ఫుల్ గా ఉంటాయి. అనుకోకుండా వర్షం కురిసినా కూడా రెయిన్ కవర్ మీ వద్ద ఉన్నట్లైతే మీ బ్యాగు అందులోని వస్తువులు సేఫ్ గా ఉంటాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్స్ పై 78 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇసిరోనా బ్యాగ్ కవర్ అసలు ధర రూ. 399గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 89కే సొంతం చేసుకోవచ్చు. వర్షం నుంచి దుమ్ము ధూళి నుంచి మీ బ్యాగును రక్షిస్తుంది. వాటర్ ప్రూఫ్ రెయిన్ కవర్ 100 శాతం వాటర్ ప్రూఫ్ మెటీరియల్ తో వస్తుంది. అడ్జస్టబుల్ బకిల్, స్టర్బీ ఎలాస్టిక్, అడ్జస్టబుల్ హుక్ తో వస్తుంది. ఈ రెయిన్ కవర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బ్యాగుల కోసం ఏఆర్ఎస్ రెయిన్ కవర్ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 499 ఉండగా 68 శాతం డిస్కౌంట్ తో రూ. 160కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

తక్కువ ధరలో బోల్డ్ ఫిట్ రెయిన్ కవర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 50 శాతం డిస్కౌంట్ తో 399 విలువ గల రెయిన్ కవర్ 199కే వచ్చేస్తోంది. దీన్ని మీరు కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.