SportsSarabh Jyoth Singh తినడానికి ఏమైనా ఇవ్వండి.....

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Sarabh Jyoth Singh తినడానికి ఏమైనా ఇవ్వండి.. ప్లీజ్‌: కాంస్య పతక విజేత సరభ్‌ జ్యోత్‌ సింగ్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Sarabh Jyoth Singh పారిస్‌ ఒలింపిక్స్‌లో (Olympic Games Paris 2024) భారత్‌ సత్తా చాటుతోంది. ఇప్పటికే మూడు పతకాలు కైవసం చేసుకున్న భారత్‌.. మరిన్ని సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే, మంగళవారం ‘ఇండియా హౌస్‌’లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్ విభాగంలో మను, (Manu Bhakar) సరభ్‌జ్యోత్‌ సింగ్‌ (sarabjot Singh) జోడీ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడి ఇండియా హౌస్‌కు వెళ్లిన ఈ జోడీకి ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ సభ్యురాలు, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ, పలువురు అభిమానులు స్వాగతం పలికారు. ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంబరాలు చేసుకున్నారు. అంతలో సౌరభ్‌  ‘దయ చేసి తినడానికి ఏమైనా ఇవ్వండి’ అని అడిగాడట. అంతే.. అక్కడున్న వారందరికీ నిమిషాల వ్యవధిలో పానీపూరీ, భేల్‌ పూరీ, దోసె సర్వ్‌ చేశారట.

Sarabh Jyoth Singh

ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు వివిధ ఆహార నియమాలు ఉంటాయి. మితాహారం తీసుకోవాలని, అది తినొద్దని, ఇది తినొద్దని కోచ్‌లు, సహాయ సిబ్బంది పదేపదే చెబుతుంటారు. దీంతో తినాలని మనసులో కోరిక ఉన్నా.. పతకం సాధించాలన్న లక్ష్యంతో వారంతా నోరు కట్టుకొని ఉంటారు. పతకం సొంతమైన తర్వాత నచ్చిన ఆహారం తినడానికి వారంతా ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తారో చెప్పేందుకు ఈ సన్నివేశమే నిదర్శనం. అలాంటి వారందరికీ ‘ఇండియా హౌస్‌’ సొంత ఇంటిలా మారింది. గేమ్‌ పూర్తయిన తర్వాత అథ్లెట్లు ఇక్కడ తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచక్కా లాగించేయొచ్చు. పారిస్‌ ఒలిపింక్స్‌లో పోటీపడుతున్న భారత్‌ అథ్లెట్ల కోసం తొలిసారిగా ‘ఇండియా హౌస్‌’ను ఏర్పాటు చేశారు. అథ్లెట్లను సత్కరించడానికి, వారి విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇదో వేదిక. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని రకాల భారతీయ వంటకాలు ఉంటాయి.

మంగళవారం జరిగిన  కంచు పోరులో మను, సరబ్‌జ్యోత్‌ సింగ్‌ జోడీ 16-10తో కొరియాకు చెందిన లీ వొనో, వో యె జిన్‌ జోడీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this