Monday, October 13, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
CrimeSexual Harassment : ఛీ.. ఛీ.. కామాంధుడా.....

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Sexual Harassment : ఛీ.. ఛీ.. కామాంధుడా.. నీ వయసేంటి.? చేసే పనేంటి..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Sexual Harassment : ఛీ.. ఛీ.. కామాంధుడా.. నీ వయసేంటి.? చేసే పనేంటి..? : ప్రస్తుత రోజుల్లో మహిళలపై ఎలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం నలుమూలల ప్రతిరోజు అనేకమంది మహిళలు అత్యాచారం బారిన పడుతూ అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు మితిమీరిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక విషయాలు మీడియా ద్వారా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బిసౌలిలో ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Sexual Harassment

ఇక ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిసోలిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. వైరల్ గా మారిన వీడియోలో నగరంలోని స్థానికంగా ఉన్న దుకాణంలో యువతి ఓ వృద్ధుడి పక్కన నిలబడి ఉంది. ఆ యువతీ ఓవైపు తన వారితో తిరిగి మాట్లాడుతుండగా.. వెనుక వైపు ఉన్న వృద్ధుడు రెచ్చిపోయాడు. అమ్మాయి ఓ వైపు తన వారితో మాట్లాడుతుండగా.. మరోవైపు వృద్ధుడు ఆ అమ్మాయి జుట్టును పలుమార్లు పట్టుకుంటూ జుట్టు వాసనను చూసేందుకు ప్రయత్నం చేశాడు.

Sexual Harassment మొదటగా వీలు కాకున్న చివరికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి జుట్టును చేత్తో పట్టుకొని వాసన చూడడం వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. అయితే., తాను చేస్తున్న పనిని ఆ వృద్ధుడు ఎవరు గమనించట్లేదని భావించాడు. కాకపోతే ఈ తతంగం మొత్తం దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. ఇంత జరిగిన ఆ అమ్మాయికి విషయం తెలియకపోవడం విడ్డురం. ఆ వీడియోని దుకాణం సంబంధించిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ఆ వృద్ధుడి వై మండిపడుతున్నారు. నీ వయసు ఏంటి..? నువ్వు చేసే పనులు ఏంటి..? అంటూ గాటుగా విమర్శిస్తున్నారు. మరికొందరైతే ఇలాంటి కామాంధులను నడిరోడ్డుపై ఉరితీయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this