Home Blog Page 59

Work Adjustment in AP Schools Updates

Work Adjustment in AP Schools Updates రాష్ట్ర విద్యా శాఖ ఆగష్టు నెలలో పని సర్దుబాటు చేయనుంది.

Facial App(TIS TILE):
ఉపాధ్యాయుల ప్రధాన వివరాలు సమర్పించుటకై Facial Attendance యాప్ నందుTeacher Information System అనే కొత్త Tile ఎనేబుల్ చేయడమైనది.

Download Updated Attendance App for TIS Tile Click Here

అసలు డిగ్రీ, పీజీ, బి.ఈడీ లేని వారు సబ్మిట్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు..డిగ్రీ, పీజీ లో నో సబ్జెక్ట్ ఆప్షన్ ఇచ్చారు. బి.ఈడీ లో అదర్ మెథడాలజీ, పీజీ లో నో సబ్జెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి (IT Cell Info)

♦️B. ED చేయని వారు మెథడాలజి కోలమ్ లో డ్రాప్ డౌన్ లో OTHER METHODOLOGY పైన క్లిక్ చేయమని ఇప్పుడే ఐటి సెల్ వారు తెలియజేసారు…

♦️PG లేనివారు పిజి ఆప్షనల్ సబ్జక్టుల ఇన్ పిజి కోలమ్ దగ్గర డ్రాప్ డౌన్ లో NO SUBJECT CLICK చేయాలి…

  1. Facial App నందు లాగిన్ కావలెను.
  2. యాప్ నందు కిందన ఉన్న Teacher Information system టైల్ ను టచ్ చేయవలెను.
  3. Date of Birth,Date of joining in present school,Date of joining in present cadre,Date of appointment లను ఇచ్చిన కేలండర్ నుండి తప్పు లు లేకుండా సెలక్షన్ చేసుకుని సబ్మిట్ చేయవలెను
  4. Degree optionals నందు మీ డిగ్రీ లోని అన్ని ఆప్షనల్ సబ్జెక్టు ల వద్ద ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకోవలెను.
  5. ఒకవేళ మీకు డిగ్రీ లేకపోతే No Subject అని సబ్మిట్ చేయవలెను.
  6. మీ డిగ్రీలోని అన్ని ఆప్షనల్ సబ్జెక్టు లను తప్పక సబ్మిట్ చేయాలి.
  7. అలాగే PG సబ్జెక్టు వివరాలు కూడా సబ్మిట్ చేయాలి.
  8. B.Edలేదా తత్సమాన అర్హతలలోని Methodology లను బాక్స్ లపై క్లిక్ చేసి ఎంచుకొని సబ్మిట్ చేయవలెను.
  9. B.Ed లేనిచో “Other subject” తీసికొని సమర్పించవలెను.
  10. Designation: మీ ప్రస్తుత designation ఇచ్చిన డ్రాప్ డౌన్ నుండి సరిగ్గా ఎంచుకొనవలెను.
  11. ఫైనల్ గ సబ్మిట్ చేసి తిరిగి Tileపై నొక్కితే మీరు‌సబ్మిట్ చేసిన వివరాలు కనిపిస్తాయి.
    ఈ విధంగా ప్రతి ఒక్కరూ సబ్మిట్ చేసిన డేటా ను మీమీ DDOలు చెక్ చేసి confirm చేయుదురు.

ఇది కేవలం ఒక నిముషం పని మాత్రమే.

Download Your TIS Report Card. Know the detailed process click here

[totalpoll id=”11113″]

ఈ రోజు WebEx మీటింగ్ మినిట్స్

కమీషనర్, పాఠశాల విద్య వారి మీటింగ్ వివరాలు Download from Here

విసిట్స్ & ఇన్స్పెక్షన్స్: ఈ నెల వచ్చే వారం నుండి కమీషనర్ మరియు సెక్రటరీ గారి విసిట్స్ అన్ని జిల్లా లలో ఉంటాయి. దీనికి సంబంధించి విసిట్స్ & ఇన్స్పెక్షన్స్ ఫార్మేట్ ముందుగానే కమీషనర్ గారు ఇస్తారు దానిలోని అంశాలను మాత్రమే కమీషనర్ మరియు సెక్రటరీ గారు వారి సందర్శనా సమయం లో పరిశీలిస్తారు. ఆకస్మిక తనికీలు ఉండవు. ముందుగా చెప్పే వస్తారు.

ప్రతికూల వార్తలు: పత్రిక లలో వచ్చే Adverse న్యూస్ కు సంబంధించి వెంటనే స్కూల్ ను సంబదిత మండల విద్యాశాకాధికారి సందర్శించి సమగ్ర నివేదికను అదే రోజు ఇవ్వాలి. ఎదైనా ఇష్యూ జరిగినపుడు ప్రెస్ కంటే ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి, కమీషనర్ లకు తెలిజేయాలి . దీనికి సంబంధించి పత్రికా ఖండన స్టాండర్డ్ ఫార్మేట్ కమీషనర్ గారు ఇస్తారు దానిని ఎడిట్ చేసి పత్రికా ఖండన ను ఇవ్వాలి

లెస్సన్ ప్లాన్ : అందరు ఉపాద్యాయుల దగ్గర తప్పని సరిగా లెస్సన్ ప్లాన్ లు ఉండాలి . దానిపై తప్పనిసరిగా ప్రదానోపాద్యాయుని సంతకం ఉండాలి వచ్చే సంవత్సరం అన్ని lesson plans సాఫ్ట్ కాపీలు ఇస్తారు.

ఉపాద్యాయుల సర్దుబాటు : వర్క్ అడ్జస్ట్మెంట్ అంతా ఆన్లైన్ లోనే చేస్తారు. మొదట అదే మండలం – అదే సబ్జెక్టు చేస్తారు తరువాత అదే మండలం – ఇతర సబ్జెక్టు చేస్తారు. అ తరువాత పక్క మండలం అదే సబ్జెక్టు చేస్తారు తరువాత పక్క మండలం ఇతర సబ్జెక్టు చేస్తారు.ఇంకా ఉపాద్యాయులు మిగిలి ఉంటె అప్పుడు డివిజన్ లెవెల్ లో చేస్తారు. బ్లైండ్ మరియు వచ్చే ఏప్రిల్ లో రిటైర్ అయ్యే వారికీ మినహాయింపు ఉంటుంది. వచ్చే వారం నుండి వర్క్ అడ్జస్ట్మెంట్ ఆన్లైన్ లో స్టార్ట్ చేస్తారు.

స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు : షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలి ఎదైనా సమస్యాత్మక అంశాలు ఉంటె వెంటనే జిల్లా కార్యాలయమునకు తెలియజేయాలి. సంబదిత SHO తో మాట్లాడాలి.

స్టేట్ అవార్డ్స్ : గతం లో ఇచినట్లు గా కాకుండా మూడు రకాల కేటగిరి లలో రాష్ట్ర ఉత్తమ ఉపాద్యాయ అవార్డులు ఇస్తారు. 1.State Awards. 2. National Foundation for Teachers Welfare Awards 3. Recommended by Fellow Teacher కేటగిరి అయిన Recommended by Fellow Teacher అవార్డు కు ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా నుండి నామి నెట్ చేస్తారు. ఈ నెల 5 వ తేదీ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ.

SSC ఎగ్జామ్స్ : పదవతరగతి పరీక్షా కేంద్రాలు అవసరం అయితే మార్పు చేయవచ్చు. సి కేటగిరి సెంటర్స్ తగ్గించాలి. బ్లూ ప్రింట్ వెబ్ సైట్ లో ఉంది దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి ప్రకారం పిల్లలలను పరీక్షలకు సిద్ధం చేయాలి నామినోల్ రోల్ ను ఇప్పటినిండా రెడీ చేసుకుంటే తప్పులు జరగ కుండా ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్స్ కు ఓల్డ్ సిలబస్ లోనే పరీక్ష ఉంటుంది

కొత్త స్కూల్స్ ఓపెనింగ్ పర్మిషన్ /renewals : MEO / DyEO / DEO స్టేజిలందు మూడురోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. రెకమండేషన్స్ క్లియర్ గా ఉండాలి

N T బుక్స్ : ఇంకా ఏదయినా requirement ఉంటె అర్జెంటు గా ఇండెంట్ పెట్టాలి

NOC వీసా : ఎవరైనా ప్రధానోపాధ్యాయులు / ఉపాధ్యాయులు లాంగ్ లీవ్ పెట్టి ఇతర దేశాలు వెళితే వారి స్తానం లో ఇంచార్జి గా ఎవరిని పెట్టారో వారి వివరాలు అప్లికేషన్ లో ఇవ్వాలి

స్కూల్ కాంప్లెక్స్ లు : స్కూల్ కాంప్లెక్స్ లు సమీక్షించాలి మండలానికి 4 లేదా 5 స్కూల్ కాంప్లెక్స్ లు ఉండాలి, అన్ని స్కూల్ కాంప్లెక్స్ లలో సుమారుగా సమాన జనాభా, సమాన స్కూల్స్ ఉండే టట్లు చూడాలి తప్పనిసరిగా ఉన్నత పాఠశాల మాత్రమే కాంప్లెక్స్ పాఠశాల గా ఉండాలి. మౌలిక వసతులు, ప్లే గ్రౌండ్ మరియు ట్రాన్స్పోర్టేషన్ కి వీలుగా ఉండాలి . MEO స్కూల్ కాంప్లెక్స్ HM స్కూల్స్ ఈ విధముగా వర్క్ ఫ్లో ఉండాలి. డెలిగేషన్ అఫ్ పవర్స్ ను స్కూల్ కాంప్లెక్స్ HM లకు ఇవ్వడానికి అధ్యయనం జరుగుతుంది.

విద్యా మిత్ర : స్టూడెంట్స్ కిట్స్ ఇప్పటికే పంపిణి చేయబడ్డాయి. షూ సైజు లు చాలక పొతే మండల మేళా జిల్లా మేళా నిర్వహించి మార్చుకోవాలి . అప్పటికి ఇంకా అవసరం ఉంటె స్టేట్ కి తెలియజేయాలి.

ఒకేషనల్ ఎడ్యుకేషన్ : కేజీబీవీ లు మరియు PMSHRI స్కూల్స్ నందు ఒకేషనల్ ఎడ్యుకేషన్ బాగా జరిగే విధంగా చూడవలెను

TaRL : 3 నుండి 5 వతరగత లకు అన్ని స్కూల్స్ లో జరిపించవలెను

లిప్ (LIP ) : అన్ని ఉన్నత పాఠశాలల లో జరగాలి

PAL : జిల్లాలో ఉన్న 5 ల్యాబ్ లలో ట్యాబు లద్వారా బోధన జరగాలి

టీచ్ టూల్ : టీచ్ టూల్ Observations ను అందరు observers చేయాలి

లైబ్రరీ బుక్స్ : అన్ని స్కూల్స్ కు లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయబడ్డాయి . వాటిని బీరువాలలో దాయకుండా పిల్లలకు చదవాడినికి ఇవ్వాలి

స్కూల్ గ్రాంట్స్ : అన్ని పాఠశాల లకు ఇస్తారు . దానికి సంబంధించి నాడు నేడు లా ఒక app ఇస్తారు దాని లో బిల్స్ అప్లోడ్ చేయాలి

OoSC : బడి బయట పిల్లల వివరాలు ఖచ్చితముగా ఉండాలి. జిల్లాకు 4 seasonal హాస్టల్ ఇచ్చారు. వాటిలో పిల్లలలను జాయిన్ చేయాలి

రవాణా చార్జీలు : 1km పరిధిలో ప్రాధమిక పాఠశాల, 3km పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల మరియు 5km పరిధి లో ఉన్నత పాఠశాల అందు బాటు లేనటువంటి పిల్లలు కు నెలకు రూ.600/- లు చొప్పున 10 నెలలకు 6000/- ఇస్తారు

IERPS : వీళ్ళు చేసిన ప్రత్యేక అవసరాల గల పిల్లల సర్వే లో ఉన్న పిల్లలు UDISE లో ఉన్న పిల్లలకు తేడా ఉంది దానిని సవరించాలి

PM పోషణ = గోరుముద్ద : మధ్యాహ్న భోజన పథకం సక్రమం గా జరగాలి. న్యూట్రిషన్ గార్డెన్ అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి. హ్యాండ్ వాష్ ను ఏర్పాటు చేయాలి హ్యాండ్ వాష్ పోస్టర్ ను పిల్లలు చేతులు కడుగు ప్రదేశం లో అతికించాలి.

De Warming డే : ఆగష్టు 7 న అన్ని పాఠశాలలో De Warming &

CBSE స్కూల్స్ : జిల్లాలో ఉన్న 40 CBSE స్కూల్స్ లో 10 ఆగష్టు నుండి Formative Assessment ట్యాబు ల సహాయం తో CBSE Pattern లో పెట్టాలి. దానికి ట్యాబు లు రెడీ చెయ్యాలి పరీక్షలు చాలా స్ట్రిక్ట్ గా నిర్వహించాలి

అకాడమిక్ క్యాలండర్: ఇప్పటికే విడుదల చేసిన అకాడమిక్ క్యాలండర్ ను తప్పని సరిగా ఫాలో అవ్వాలి . పాఠశాలల్లో మొదటి పిరియడ్ ను సంసిద్ధత కార్యక్రమాలకు మరియు చివరి పిరియడ్ ను వెనుక బడిన పిల్లలకు బ్రిడ్జి కోర్స్ ను నిర్వహించాలి

స్ట్రిక్ట్ టీచర్స్ : ప్రతి DyEO పరిధి నుండి 20 మంది ప్రిక్ట్ టీచర్స్ ను సెలెక్ట్ చేసి జిల్లా కార్యాలయం నకు ఆ జాబితా పంపించాలి

UDISE +: గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పిల్లలు చాలా తరగతు లందు తక్కువుగా వున్నారు కావున వారు ఏ స్కూల్ లో చేరారో వెరిఫై చెయ్యాలి. బౌతికంగా ఉన్న పిల్లలలు UDISE + లో ఉన్న పిల్లలలు సమానంగా ఉండాలి. చాలా ప్రైవేట్ స్కూల్స్ నందు చాలా తేడా ఉన్నది.

అటెండన్స్ : ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరు నమోదు 100 కి 100 శాతం జరగాలి. కొన్ని స్కూల్స్ రిపీటెడ్ గా హాజరు వేయటం లేదు వాటి పై చర్యలు తీసుకోవాలి

మన బడి – మన భవిష్యత్తు : తక్కువ డబ్బులతో పని పూర్తి చేయగల పాఠశాలల పై దృష్టి పెట్టి వాటిని పూర్తి చేయాలి

Work Adjustment Draft Guidelines Work Adjustment Of Subject Teachers (SAs)/SGTs

Guidelines for Drafting Surplus Teachers:

Junior Most teacher in the school shall be taken as Surplus teacher.

First preference will be given to schools with no Subject Teacher or SGT available.

Exclude any surplus teachers who are set to retire on or before April 30, 2025, from the adjustment process. Ensure that no 100% individuals with visual impairments (blindness) requiring work adjustments are assigned.

Criteria for preparation of seniority list of Surplus Teachers:

Cadre seniority of surplus teachers in inter management. If cadre seniority ties, the DOB will be considered.

Ensuring Subject Teachers Availability:

Subject teachers should be available in all High Schools after the completion of the work adjustment exercise.

work adjustment in ap schools

Work Adjustment in AP Schools Updates Of Subject Teachers (SAs)/SGTs:

Phase-I:

  • Intra Management with in Mandal
  • Same subject within Mandal
  • Inter subject within Mandal
  • SGTs qualified with in Mandal

Phase-II:

  • First preference within Management, within Division,
  • if still surplus have go for intra management.
  • Same subject with in Division
  • Inter subject with in Division
  • SGTs qualified within Division

Work Adjustment in AP Schools Important information to all the teachers

ఈ రోజు (03.08.2024) 2 pm తరువాత క్రింది అంశాలు ఫేషియల్ అటెండెన్స్ ఆప్ నందు POP UP అవుతాయి

1. Date of birth

2. Date of joining in present school

3. Date of joining in present cader

4. Date of Appointment

5. Optional subjects in Graduation

6. Optional subjects in Post graduate

7. Methodology in B.Ed

8. Present Designation

వివరాలు అన్ని ఎవరి లాగిన్ లో వారు popup అయిన వెంటనే విధిగా నింపాలి. ప్రతి టీచర్ పై వివరాలు అన్ని ఒక కాగితం పై వ్రాసుకొని తప్పులు లేకుండా నింపాలి. అందరూ టీచర్స్ ఈ రోజు సాయంత్రం లోపు ఖచిత్తం గా పూర్తి చేసి పంపాలని పాఠశాల విద్యా కమిషనర్ గారి ఆదేశాలు. ఈ వివరాలు ఆధారం గానే work adjustment జరుగుతాయి . పై వివరాలు అన్ని సిద్ధం గా ఉంచుకోగలరు.

Update Your Details in this updated app Click Here

Work Adjustment in AP Schools CSE సమాచారం

1) ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులుగా గుర్తింపబడిన వారిని అదే మండల పరిధిలో పని సర్దుబాటు చేస్తారు. ఆ మండల పరిధిలో తగినంత అవసరం లేనప్పుడు డివిజన్ పరిధిలో సర్దుబాటు చేస్తారు.

2) పురపాలక పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులుగా గుర్తింపబడిన వారిని సాధ్యమైనంతవరకు అదే పురపాలక పరిధిలో అవసరమైన చోట పని సర్దుబాటు చేస్తారు.

3) పదవ తరగతి విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాయడంపై ఒక వారం రోజుల్లో స్పష్టత ఇస్తానన్నారు.

4) పరీక్షా విధానం అమలుపై స్పష్టమైన నిర్ణయాన్ని ఒక వారం రోజుల్లో తెలియజేస్తామన్నారు.

5) ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని హేతుబద్దీకరణ ద్వారా సర్దుబాటు చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్తారు.

6) సంఘాల ప్రాతినిధ్యం మేరకు పాఠశాల విద్యలో పదోన్నతులు చేపట్టడానికి సుముఖతను వ్యక్తం చేశారు.

Webex Information

ఈరోజు గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అర్జడీలకు, డీఈఓ లకు, మరియు ఎంఈఓ లకు నిర్వహించిన వెబ్ ఎక్స్ నందలి ముఖ్య విషయాలు.

1)UDISE+
యుడైస్ నందలి గ్యాప్స్ ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి.
తరగతిలో ఉన్న విద్యార్థుల అందరి పేర్లు UDISE+ నందు ఆన్లైన్ తప్పనిసరిగా చేయాలి
వచ్చేవారం నుండి గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు మరియు మినిస్టర్ గారు పాఠశాలలను సందర్శించే అవకాశం ఉన్నది.
వారు యుడైస్ రోల్ గురించి పరిశీలించే అవకాశం కలదు.

2) Work Adjustments

Udise+ నందు గల రోల్ ఆధారం చేసుకొని పాఠశాలల యందు మిగులు ఉపాధ్యాయులను ఆన్లైన్ విధానంలో వర్క్ అడ్జస్ట్మెంట్ చేయుటకు మార్గదర్శకాలు తయారు చేయుచున్నారు.
వచ్చేవారం దీనికి సంబంధించిన విధివిధానాలు, ఆన్లైన్ మాడ్యూల్, షెడ్యూల్ మొదలగునవి విడుదల అగును.

4)SMC Elcetions

ప్రభుత్వం వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాల యందు SMC ఎన్నికలు సజావుగా నిర్వహించేటట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలెను.
SMC ఎలక్షన్ ముగిసే వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయరాదు

3) EIS (TIS)

ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చెక్ చేసుకుని అందులో ముఖ్యంగా
1)పుట్టినరోజు వివరములు
2)ప్రస్తుత పాఠశాలలో జాయిన్ అయిన తేదీ
3)ప్రస్తుత క్యాడర్లో జాయిన్ అయిన తేదీ
4)ఉద్యోగంలో అపాయింట్ అయిన తేదీ
5)గ్రాడ్యుయేషన్ లెవెల్ లో సబ్జెక్టులు
6)పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో సబ్జెక్టులు
7)బీఈడీ లో మెథడాలజీలు
8)ప్రస్తుత క్యాడర్
మొదలగు అన్ని వివరములు ఈరోజు సాయంత్రం లోపల తప్పులు లేకుండా పూర్తి చేసుకోవలెను.

ఎడిట్ ఆప్షన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేయబడును
.
5)Academic Calendar
ప్రభుత్వం వారి ద్వారా ముద్రించిన అకాడమీ క్యాలెండర్లు వచ్చేవారు ప్రతి పాఠశాలకు సరఫరా చేయబడును.

6) Teachers Lesson plans

తరగతి గది నందు బోధించు ఉపాధ్యాయుని వద్ద ఆ రోజు, ఆ పాఠ్యాంశానికి సంబంధించిన లెసన్ ప్లాన్ తప్పనిసరిగా తన వద్ద ఉంచుకొని బోధన సాగించవలెను.
ప్రతి ప్రధానోపాధ్యాయుడు తన సహోపాధ్యాయులు లెసన్ ప్లాన్స్ ను రాస్తున్నారా? లేదా? తరగతికి బోధనలో ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయంపై శ్రద్ధ వహించవలెను.

7) Below 10 enrollment

పాఠశాలల్లో పది లోపు విద్యార్థులు ఉన్న వాటిని గుర్తించి అందు విద్యార్థులను పెంచే విధంగా కృషి చేయవలెను, ఒకవేళ విద్యార్థులు పెరిగే అవకాశం లేకపోతే వాటిపై తదుపరి చర్యల కొరకు ప్రభుత్వం వారికి నివేదిక సమర్పించబడును.

8) Facial Attendance

అందరూ ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఫేషియల్ అటెండెన్స్ తప్పక క్యాప్చర్ చేయవలెను.

Work Adjustment in AP Schools Updates

Cut of Date for Work Adjustment in AP Schools Updates : 04.08.2024

Check your school roll as on 04.08.2024 with your school DISE code Click Here

work adjustment in ap schools

As per instructions received from the Hon’ble CSE sir,all the teachers are instructed to update/verify your TIS data immediately.

work adjustment in ap schools updates
october 1, 2026, 9:51 am - duniya360

Work Adjustment in AP Schools Updates – Way forward in work adjustment module

The work Adjustment module is designed based on the data available in Teacher Information System (TIS) portal.

Some data discrepancies were identified during the review of the Work Adjustment module conducted with certain field functionaries.

This will be happened due to not updating following data points in Teacher Information System (TIS) portal by Teachers.

1.Date of birth

2.Date of joining in the present school

3. Date of joining in the present cadre of post

4. Date of appointment

5. Optional subjects in graduate level

6. Optional subject in PG level

7. Methodologies in B.Ed level

8. Present designation.

DEOs should ensure that all MTS Teachers should be registered in schools which they were allocated in TIS portal.

In this regard, the District Educational Officers to ensure that all the teachers must cross check and update their individual profiles in Teacher Information System (TIS) portal.

Mean time, the above fields updation will be provided in Facial Recognition App for immediate data updation for seamless process.

The DEOs should prioritize this task and must monitor personally.

School Holidays : విద్యార్ధులకు శుభవార్త.. స్కూళ్లు, కాలేజీలకు వరుసగా 5 రోజులు సెలవులు.. ఆ ఒక్క పని చేస్తే

School Holidays సెలవు అంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. ఇప్పటికే వేసవి సెలవులు పూర్తి చేసుకుని.. పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మన దగ్గర జూన్‌ నెల నుంచే స్కూల్స్‌ మొదలు కాగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం.. వేసవి వడగాల్పులు, ఎండ తీవ్రత కారణంగా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభించారు. అయితే స్కూల్స్‌ ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు రాష్ట్రాలో విద్యాసంస్థలకు సెలవులు మంజూరు చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా విద్యార్థులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి. మరి ఇంతకు ఈ సెలవులు ఎందుకు.. ఏ రోజున హాలీడే ఉంది అంటే..

School Holidays

School Holidays ఆగస్ట్ నెల ప్రారంభం అయ్యింది. ఈ నెలలో స్కూళ్లకు, కాలేజీలకు చాలా సెలవులు రానున్నాయి. సాధారణంగా ఆగస్టు నుంచి పండగలు మొదలవుతాయి. వీటికి తోడు రెండో శనివారం, ఆదివారాలు కలిసి.. విద్యార్థులకు భారీగా హాలీడేస్‌ రానున్నాయి. ఇదిలా ఉండగా.. త్వరలోనే విద్యార్థులకు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు 4 ఆదివారం, ఆగస్ట్ 10.. రెండో శనివారం, 11 రెండో ఆదివారం. వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఆ తర్వాత వెంటనే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. ఈ రెండు రోజులు విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. అలానే ఆగస్టు 18 ఆదివారం, 19 రాఖీ పౌర్ణమి సందర్భంగా మరోసారి వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.

అయితే ఆగస్టు 15, 16, 18, 19 సెలవులు ఉన్నాయి. మధ్యలో ఆగస్టు 17 ఒక్క రోజు హాలీడే తీసుకుంటే.. వరుసగా 5 రోజులు సెలవులు కలిసి వస్తాయి. ఇకపోతే రాష్ట్రం లేదా ప్రాంతం ఆధారంగా సెలవుల్లో మార్పులు ఉండొచ్చు. అందువల్ల హాలిడేస్ గురించి సంబంధిత స్కూల్ లేదా కాలేజ్ హాలిడే షెడ్యూల్ చెక్ చేసుకోవడం ఉత్తమం.

సెలవుల జాబితా

  • ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం
  • ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం
  • ఆగస్టు 18 ఆదివారం
  • ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి

ఇక పైన పేర్కొన్న సెలవులు ఉద్యోగులకు కూడా మాగ్జిమం వర్తించే అవకాశం ఉంది. కనుక ఎక్కడికైనా లాంగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోవాలని భావించే వారు.. ఈ సెలవులను వినియోగించుకుంటే చాలా మంచిది. మరి మీరు కూడా ట్రై చేయండి.

Rats in Tirumala Rest Rooms : ‘తిరుమల వసతి గదుల్లో ఎలుకల సంచారం’: భక్తుడి ఫిర్యాదు

Rats in Tirumala Rest Rooms తిరుమలలోని వసతి గదుల్లో ఎలుకల సంచారం ఎక్కువగా ఉందని, గదిలో ఉంచిన శ్రీవారి ప్రసాదాలను అవి తింటున్నాయని చిలకలూరిపేటకు చెందిన భక్తుడు లక్ష్మణ్‌ తితిదే ఈవో జె.శ్యామలరావుకు ఫిర్యాదు చేశారు.

Rats in Tirumala Rest Rooms

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని వసతి గదుల్లో ఎలుకల సంచారం ఎక్కువగా ఉందని, గదిలో ఉంచిన శ్రీవారి ప్రసాదాలను అవి తింటున్నాయని చిలకలూరిపేటకు చెందిన భక్తుడు లక్ష్మణ్‌ తితిదే ఈవో జె.శ్యామలరావుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తుల ఫిర్యాదులకు ఈవో సమాధానాలిచ్చారు. శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకు ఉచిత బస్సు ప్రయాణ సమయాలు, తిరుమలలో ఉచిత బస్సులు ఏయే మార్గాల్లో ప్రయాణిస్తున్నాయనే విషయాన్ని డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కడపకు చెందిన భాస్కర్‌ కోరారు. తిరుత్తణిలో తితిదే స్థలం ఆక్రమణకు గురవుతోందని నగరికి చెందిన నాగరాజన్‌ ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని తెలంగాణకు చెందిన రాజేష్‌ చెప్పారు. తొమ్మిది నెలల క్రితం తితిదేలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారని ఇంతవరకు రాత పరీక్ష నిర్వహించలేదని తిరుపతికి చెందిన దేవానంద్‌ ఫిర్యాదు చేశారు. వీటన్నింటికీ ఈవో స్పందించారు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Godavari Pushkaralu : వడివడిగా గోదావరి పుష్కరాలకు.. పనుల ప్రతిపాదనకు 16 మందితో ప్రత్యేక బృందం

Godavari Pushkaralu రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. చేపట్టాల్సిన పనులపై నివేదిక రూపొందించాలని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో కలెక్టర్‌ ప్రశాంతి 16 మంది కీలక అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ తదితర శాఖల జిల్లా అధికారులతో కూడిన బృందాన్ని నియమించారు. రానున్న పుష్కరాలకు ఇప్పటి నుంచి చేపట్టాల్సిన పనులపై ఈ బృందం నివేదిక తయారు చేస్తుంది. 

Godavari Pushkaralu

బృందం ఏం చేస్తుందంటే..

పుష్కరాలు జరిగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో బృంద సభ్యులు పర్యటిస్తారు. ఘాట్ల పటిష్టత, విస్తరణ, భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ తదితర అంశాలపై అధ్యయనం చేస్తారు. గత పుష్కరాలకు ఒక్క రాజమహేంద్రవరానికే కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చారు. ఈసారి అంతకు రెండు రెట్లకు మించి వస్తారని అంచనా. ఇప్పటికే ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత నిర్వహణ, పనులపై మున్సిపల్‌ మంత్రితో కలిసి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

గంగా పుష్కరాల అధ్యయనం

గోదావరి పుష్కరాల కంటే ఏడాది ముందు గంగానది పుష్కరాలు జరుగుతాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర పురపాలిక విభాగం అమలు చేస్తున్న విధానాలపై నివేదికను అనుసరించాలని నిర్ణయించారు. నిధుల విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో స్పందించే అవకాశం ఉంది. పుష్కరాలకు పనులు సక్రమంగా జరగాలంటే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి పరిపాలన విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా ఎన్నికలు క్రతువు పూర్తి చేయాలని చూస్తున్నారు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Temple For Alien : ఏకంగా ఏలియ‌న్‌కే గుడి క‌ట్టేశాడు.. ఎందుకో తెలుసా.?

0

Temple For Alien గ్ర‌హాంత‌రవాసులు.. ఈ పేరు విన‌గానే ఏదో తెలియని ఉత్సుక‌త మ‌దిలో మెదులుతుంది. ఏలియ‌న్స్ భూమిపైకి వ‌స్తుంటాయ‌ని ఇప్ప‌టికే ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ అంశాన్ని ఆధారం చేసుకొని ఎన్నో సినిమాలు కూడా వ‌చ్చాయి. అమెరికాలో అయితే ఏకంగా ఏలియ‌న్స్‌పై ప్ర‌యోగాలు చేస్తున్నార‌ని. అక్క‌డ కొన్ని ఏలియ‌న్స్‌ను సైతం బంధించార‌ని ఇలా ఎన్నో పుకార్లు, షికార్లు చేస్తూనే ఉంటాయి.

Temple For Alien

అయితే వీటిలో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌న్న విష‌యంపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్ప‌టికీ ఏలియ‌న్స్ నిజంగా ఉన్నాయ‌ని విశ్వ‌సించే వారు చాలా మంది ఉన్నారు. శాస్త్ర‌వేత్త‌లు సైతం ఈ విష‌యాన్ని బ‌లంగా విశ్వ‌సిస్తుంటారు. అయితే ఓ వ్య‌క్తి ఏకంగా ఏలియ‌న్స్‌కి గుడి క‌ట్టించేశాడు. హీరోయిన్ల‌కు గుడులు నిర్మించి పూజించే వారిలో ముందు వ‌రుస‌లో ఉండే త‌మిళ‌నాడులోనే ఏలియ‌న్‌కి కూడా గుడి నిర్మించ‌డం విశేషం.

త‌మిళ‌నాడులోని సేలం జిల్లాలోని మల్లమూప్పన్ పట్టి సమీపంలోని రామగౌండనూర్‌కు చెందిన లోగనాథన్ అనే వ్య‌క్తి ఇటీవ‌ల శివాల‌యాన్ని నిర్మించాడు. అందులో శివ‌లిగంతోపాటు ప‌క్క‌నే ఓ మండపంలో అగస్త్య మహర్షి, మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాలను ప్రతిష్టించారు. దేవుళ్లతోపాటు గ్రహాంతరవాసి ప్రతిమకూ లోగనాథన్ పూజలు చేస్తున్నాడు. 2021లో మొద‌లు పెట్టిన ఈ గుడి నిర్మాణం తాజాగా పూర్త‌యింది. గుడిలో ఏలియ‌న్ విగ్ర‌హం ప్ర‌తిష్టించ‌డంతో ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ప్ర‌పంచంలో ఇలా ఒక ఏలియ‌న్ విగ్ర‌హానికి పూజ‌లు చేయ‌డం ఇదే తొలిసారి. అయితే తాను గ్ర‌హంతర వాసుల‌తో మాట్లాడి, వారి నుంచి అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే గుడిని నిర్మించిన‌ట్లు లోగనాథన్ తెలిపారు. ప్రపంచంలో ప్రకృతి వైపరిత్యాలు పెరిగిపోతుండటంతో వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతరవాసులకు ఉందని తాను నమ్ముతున్నాన‌ని అన్నారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Super Over Rules : టైగా ముగిసిన భారత్, శ్రీలంక తొలి వన్డే.. సూపర్ ఓవర్ ఎందుకు జరగలేదు.. అసలు కారణం ఏంటంటే?

0

Super Over Rules : శ్రీలంక వర్సెస్ టీమిండియా (SL vs IND) మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 230/8 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమంగా ఉండడంతో మ్యాచ్‌ సమమైంది. స్కోర్లు సమం అయిన తర్వాత రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్న చాలా మంది అభిమానుల మదిలో మెదులుతోంది. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం ఇప్పుడు చూద్దాం..

Super Over Rules

సూపర్ ఓవర్ అంటే ఏమిటి?

క్రికెట్ మ్యాచ్‌లో స్కోర్లు సమమైతే రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ టైగా ముగుస్తుందన్నమాట. అంటే, అప్పుడు సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తుంటారు. అయితే, ఈ నిబంధన కేవలం వన్డే, టీ20 ఫార్మాట్లలో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ నియమం ప్రకారం, రెండు జట్లూ తలో ఓవర్ ఆడుతుంటాయి. ప్రతి జట్టు నుంచి 3-3 బ్యాట్స్‌మెన్స్ మాత్రమే బ్యాటింగ్ చేయడానికి అవకాశం పొందుతారు. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ల పేర్లను ఇరు జట్లూ ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. జట్టు తన ప్రత్యర్థి కంటే ఎక్కువ పరుగులు చేసే వరకు సూపర్ ఓవర్ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

భారత్-శ్రీలంక మధ్య టై అయిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఎందుకు జరగలేదు?

వాస్తవానికి, ఐసీసీ నిబంధనల ప్రకారం, టై అయిన ప్రతి టీ20 మ్యాచ్ ఫలితాలను సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించడం తప్పనిసరి. కానీ, ODI ఫార్మాట్‌లో, ఈ నియమం ICC టోర్నమెంట్‌లలో మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్‌లో సూపర్‌ ఓవర్‌ మూడుసార్లు మాత్రమే జరిగింది. భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఈ టైడ్ వన్డే మ్యాచ్‌లో అభిమానులు సూపర్ ఓవర్ చూడకపోవడానికి అసలు కారణం ఇదే.

శ్రీలంక-భారత్‌ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ కూడా టై కావడంతో ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరగడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో గెలిచిన టీమిండియా 3-0తో శ్రీలంకను వైట్‌వాష్‌ చేసింది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Strange Car విచిత్రమైన కారు.. మీ దగ్గర కోట్లున్నా దీన్ని కొనలేరు.. ఎందుకంటే?

Strange Car కొన్ని కార్లు ఉంటాయి, కేవలం కొంతమంది మాత్రమే కొనగలరు. రోల్స్ రాయిస్ కార్ల విషయానికొస్తే.. వాటిని ప్రతిష్ట కలిగిన వారికే అమ్ముతారు. అత్యంత సంపన్నులకు, ప్రతిష్టాత్మక వ్యక్తులకు మాత్రమే అమ్ముతారు. అయితే ఈ కారుని మాత్రం మన దగ్గర కోట్లున్నా కొనలేము. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా వేరే పర్పస్ తయారు చేయబడిన కారు. అసలు ఏంటి ఈ కారు? దీనికెందుకంత ప్రత్యేకత? ఏముంది ఈ కారులో? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.  

Strange Car

గతంలో రెనాల్ట్ కంపెనీ ట్విజీ పేరుతో ఒక కారుని లాంఛ్ చేసింది. ఆ తర్వాత దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ట్విజీకి రీప్లేస్మెంట్ గా వేరే కారుని తీసుకొస్తున్నట్లు రెనాల్ట్ కంపెనీ ప్రకటించింది. మొబిలైజ్ డ్యుయో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారుని 2024లో తీసుకొస్తామని గత ఏడాది ప్రకటించింది. ఇది రెండు వెర్షన్స్ లో వస్తుంది. ఒకటి క్యాబ్ టైప్, మరొకటి ట్రాన్స్ పోర్ట్ కారు టైప్. మొదటి వెర్షన్ కారు ప్యాసింజర్ కారులా ఉంటే.. మరొక వెర్షన్ కారు 700 లీటర్ల కెపాసిటీ స్టోరేజ్ బాక్స్ తో వస్తుంది. ఇది డెలివరీ బాయ్స్ లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. 

ఈ కారుని అమ్మడానికి కాకుండా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కింద అద్దెకు ఇవ్వడానికి తయారు చేస్తున్నారు. అమ్మడానికి బదులు దీర్ఘకాలిక అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు తయారు చేస్తుంది. ఈ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజ్ లో కారు, మెయింటెనెన్స్, వారంటీ, ఇన్సూరెన్స్, ఛార్జింగ్ సొల్యూషన్స్ అన్నీ కలిపే వస్తాయి. ఎన్ని నెలలు అద్దెకు తీసుకుంటారో దాన్ని బట్టి నెలకు, రెండు నెలలకు, ఏడాదికి ఇలా అద్దె చెల్లించవచ్చు. ఆన్ లైన్ లో అడ్జస్ట్ చేసుకుని అద్దె చెల్లించి ఈ కారుని నడుపుకోవచ్చు. ఎవరికైనా సరే సబ్ స్క్రిప్షన్ ఆధారంగానే ఇస్తుంది. అయితే ఈ కార్లు యూకేలో అందుబాటులో ఉంటాయని రెనాల్ట్ గ్రూప్ కి చెందిన మొబిలైజ్ బెంటో, డ్యుయో మోడల్స్ కంపెనీలు తెలిపాయి.     

Strange Car డ్యుయో 45 మోడల్ మోటార్ టాప్ స్పీడ్ గంటకు 45 కి.మీ.గా ఉంది. అయితే ఈ కారుని యూరప్ లో14 ఏళ్ల లోపు వయసున్న మైనర్లు డ్రైవ్ చేయచ్చు. అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపచ్చు. డ్యుయో 80 మోడల్ కారు గంటకు 80 కి.మీ. టాప్ స్పీడ్ తో వస్తుంది. దీనికి లైసెన్స్ ఉండాలి. ఇక దీని రేంజ్ విషయానికొస్తే ఫుల్ ఛార్జ్ తో 140 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ట్విజీ లానే ఇందులో కూడా రెండు సీట్లు ఉంటాయి. ట్విజీతో పోలిస్తే ఈ డ్యుయో కారు కాస్త పెద్దదిగా ఉంటుంది. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే ఇది 50 శాతం వ్యర్థ పదార్థాలతో తయారు చేశారు. ఈ కారు లైఫ్ అయిపోయేనాటికి 95 శాతం రీసైకిల్ చేయవచ్చునని రెనాల్ట్ కంపెనీ వెల్లడించింది.

ఒక కారు పార్కింగ్ చేసే ప్లేస్ లో ఇవి మూడు కార్లు పడతాయి. దీనికి రెండు డోర్స్ ఉన్నాయి. అయితే అవి బయటకు కాకుండా పై దిశలో తెరవబడతాయి. దీని వల్ల ఇరుకు వీధుల్లో.. రెండు కార్ల మధ్యలో ఉన్నా గానీ కారులోంచి దిగేందుకు సమస్య ఉండదు. మొత్తానికి ఈ ఎలక్ట్రిక్ కారుని అమ్మడానికి కాకుండా అద్దె ప్రాతిపదికన ఇవ్వడం గానీ లేదా ఓలా, ఉబర్ లా క్యాబ్స్ గా తిప్పడం గానీ చేస్తుందట. ప్రస్తుతానికి యూకేలో మాత్రమే రెంటల్ పర్పస్ తిప్పేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. సక్సెస్ అయితే ఫ్యూచర్ లో భారత్ సహా ఇతర దేశాలకు నెట్ వర్క్ ని పెంచుకునే అవకాశం ఉండవచ్చునని సమాచారం.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


How Much Water Should We Drink in a Day : ఒక రోజులో ఎంత నీరు తాగాలి?.. కొద్ది మందికి మాత్రమే తెలుసు!

0

How Much Water Should We Drink in a Day : నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదని తరచుగా చెబుతారు. చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు తమ పోస్ట్‌లలో ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుందని, చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతుంటారు. అందువల్ల, ఈ విషయాల వల్ల, మనం కూడా చాలా ఎక్కువ నీరు తాగటం ప్రారంభిస్తాం. అయితే ఎక్కువ నీరు తాగటం, తక్కువ నీరు తాగినంత హానికరం అని మీకు తెలుసా. మీరు ఎంత నీరు తాగడం మంచిదో ఈ కథనం ద్వారా తెలుసుకోండి..

మన శరీర బరువులో 50-70 శాతం నీటి వల్లనే అని మీకు తెలుసా. కణాలు మన శరీరం యొక్క నిర్మాణ యూనిట్లు, సజీవంగా ఉండటానికి నీరు అవసరం. నీటి కొరత కారణంగా, కణాలలో ఉన్న ద్రవం కోల్పోవడం ప్రారంభమవుతుంది, దాని కారణంగా అవి సరిగ్గా పనిచేయలేవు. అందువల్ల, శరీరంలో సరైన మొత్తంలో నీరు ఉండటం ముఖ్యం. అలాగే, నీరు మన శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. మనం చేసే ప్రతి శారీరక శ్రమ సమయంలో నీరు ఉపయోగించబడుతుంది. ఈ కారణంగా, వృధా నీటి కొరతను భర్తీ చేయడం అవసరం.

How Much Water Should We Drink in a Day

ఒక వ్యక్తి ఎంత నీరు తాగాలి?
మేయో క్లినిక్ ప్రకారం, ఒక వ్యక్తి ఎంత నీరు త్రాగాలి అనే ప్రశ్నకు సమాధానం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీకు తెలిసినట్లుగా, అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు. ప్రతి వ్యక్తి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వైద్య పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, దీని కారణంగా నీటి అవసరం కూడా భిన్నంగా ఉంటుంది. ఏసీలో కూర్చున్న వ్యక్తి కంటే ఎక్కువసేపు ఎండలో ఉండే వ్యక్తికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందువల్ల, ప్రతి వ్యక్తి తన భౌతిక, భౌగోళిక, వైద్య పరిస్థితి ఆధారంగా నీటి పరిమాణాన్ని నిర్ణయించాలి. యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రకారం, పురుషులు రోజుకు 3.7 లీటర్ల ద్రవాలను తీసుకోవాలి. అదే సమయంలో, మహిళలకు రోజుకు 2.7 లీటర్ల ద్రవం అవసరం. అయినప్పటికీ, ద్రవం నీటి నుంచి మాత్రమే కాకుండా, ఆహారం, ఇతర పానీయాల నుంచి పొందిన నీటిని కూడా కలిగి ఉంటుందని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Buddy Movie Review : ‘బడ్డీ’ మూవీ రివ్యూ.. అమ్మాయి ప్రాణం టెడ్డీలోకి వస్తే..

Buddy Movie Review : అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్ జంటగా స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ నిర్మాణంలో సామ్ అంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘బడ్డీ’. అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, అలీ.. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. బడ్డీ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Buddy Movie Review

కథ విషయానికొస్తే.. ఆదిత్య రామ్(అల్లు శిరీష్) ఓ పైలట్. పల్లవి(గాయత్రీ భరద్వాజ్) ఓ ATC (విమానాశ్రయంలో కూర్చొని పైలట్స్ తో ఫ్లైట్ ల్యాండ్ చేయించేవాళ్ళు)గా పనిచేస్తూ ఉంటుంది. దీంతో ఆదిత్య, పల్లవి మధ్య మంచి పరిచయం ఏర్పడుతుంది. పల్లవి ఆదిత్యని చూసినా ఆదిత్య మాత్రం పల్లవిని చూడడు. వీళ్లిద్దరు కలుద్దామనుకునే సమయానికి అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల ఆదిత్య జాబ్ పోతుంది. ఆదిత్య జాబ్ తన వల్లే పోయిందని తనని కలిసి సారీ చెప్దామనుకునేలోపు పల్లవి కిడ్నాప్ అవుతుంది.

హాంగ్ కాంగ్ లో డాక్టర్ అర్జున్ ఆర్గాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఓ డ్రగ్ డాన్ కొడుకుకి కావాల్సిన హార్ట్ పల్లవిది సరిపోతుందని తెలియడంతో ఆమెని కిడ్నాప్ చేయించి హాంగ్ కాంగ్ కి తీసుకొస్తారు. అయితే ఈ క్రమంలో పల్లవి కోమాలోకి వెళ్లడంతో ఆమె ప్రాణం ఆదిత్య గిఫ్ట్ గా ఇచ్చిన ఒక టెడ్డీ బేర్ లోకి వెళ్తుంది. మరి ఆ టెడ్డీ ఆదిత్య రామ్ ని ఎలా కలిసింది? తనే ATC అమ్మాయి అని చెప్పిందా? పల్లవిని ఆదిత్య టెడ్డీ సహాయంతో ఎలా కాపాడాడు? వీరి ప్రేమ గురించి ఒకరికొకరికి తెలిసిందా? అసలు ఆదిత్య జాబ్ ఎలా పోయింది, మళ్ళీ తిరిగొచ్చిందా? మళ్ళీ టెడ్డీ నుంచి పల్లవి ప్రాణం తన బాడీలోకి వచ్చిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. బడ్డీ ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా ఇది తమిళ సినిమా టెడ్డీ లాగే ఉంది అని అంతా అనుకున్నారు. అయితే అమ్మాయి ప్రాణం టెడ్డీలోకి వస్తుంది అనే బేసిక్ పాయింట్ అదే అయినా కథ, స్క్రీన్ ప్లే మాత్రం పూర్తిగా వేరు. ఫస్ట్ హాఫ్ ఆదిత్య, పల్లవి ఒకర్నొకరు చూసుకోకుండానే వీరిద్దరి ప్రయాణం, డాక్టర్ అర్జున్ గురించి చూపించడం, పల్లవి కిడ్నాప్ అయి ప్రాణం టెడ్డీలోకి రావడం, టెడ్డీ ఆదిత్యని కలవడం చూపిస్తారు. ఆదిత్య ఎలా కాపాడతాడు అని ఆసక్తికరంగా ఇంటర్వెల్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో టెడ్డీ చేసే విన్యాసాలు, ఆదిత్య హ్యాంగ్ కాంగ్ కి ఎలా వెళ్ళాడు? అక్కడ యాక్షన్ సీక్వెన్స్ లతో ఓ పక్క కామెడీ, మరో పక్క యాక్షన్స్ తో ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది.

Buddy Movie Review సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోవడం చాలా ప్లస్ పాయింట్. ఇక టెడ్డీ చేసే కామెడీ, యాక్షన్ సీక్వెన్స్ లు పిల్లలకు బాగా నచ్చుతాయి. సినిమాలో వచ్చే తెలుగు పాటలు, జై బాలయ్య రిఫరెన్స్ లు ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా తమిళ్ టెడ్డీ సినిమా చూడకుండా వెళ్తే మాత్రం బాగా నచ్చుతుంది ఈ బడ్డీ సినిమా. తమిళ్ టెడ్డీ సినిమా చూసి బడ్డీ సినిమా చూస్తే మాత్రం అదే సినిమా గుర్తుకు వస్తుంది. బడ్డీలో ముఖ్యంగా ఆకాశంలో ఉండే అబ్బాయి – భూమి మీద ఉండే అమ్మాయి అంటూ లవ్ స్టోరీని కొత్తగా చూపించారు. క్లైమాక్స్ ఫైట్ గాల్లో ఎగురుతున్న ఫ్లైట్ లో జరగడం, విమానాశ్రయం సెటప్స్ పరంగా బాగానే చూపించినా చిన్న చిన్న లాజిక్స్ వదిలేసారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. అల్లు శిరీష్ పైలట్ పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపించి నటనతో కూడా మెప్పించాడు. గాయత్రీ భరద్వాజ్ చాలా క్యూట్ గా కనిపించి మెప్పిస్తుంది. ప్రిషా సింగ్ అందంతో పాటు బాగానే నటించింది. అలీ, ముకేశ్ రిషి ఓ పక్క అప్పుడప్పుడు నవ్విస్తూనే సీరియస్ యాక్టింగ్ చేసారు. నెగిటివ్ రోల్ లో అజ్మల్ అమీర్ బాగా నటించాడు. టెడ్డీ అయితే అదరగొట్టేసింది. మిగిలిన నటీనటులు అంతా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. ముఖ్యంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా, చాలా రిచ్ గా ఉన్నాయి. లొకేషన్స్ కూడా కథకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఎంచుకున్నారు. ఇక విమానం సెటప్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. కథ పాతదే అయినా కథనం కొత్తగా రాసుకొని దర్శకుడిగా బడ్డీ సినిమాని తెరకెక్కించడంలో డైరెక్టర్ సామ్ ఆంటోని సక్సెస్ అయ్యాడు. ఇక బడ్డీ సినిమాని తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ నిర్మించడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బాగానే ఖర్చుపెట్టి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు.

Buddy Movie Review మొత్తంగా ఓ అమ్మాయి ప్రాణం ఒక టెడ్డీ బేర్ లోకి వస్తే హీరోతో కలిసి తనని ఎలా కాపాడుకుంది అని ఫుల్ ఎంటర్టైనింగ్, ఎమోషన్ గా చూపించారు. పిల్లలతో ఈ సినిమాకు వెళ్తే థియేటర్లో కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


CM Revanth Fired on BRS MLAs ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధి వస్తుంది- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఫైర్

0

CM Revanth Fired on BRS MLAs : అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్. లాంగ్వేజ్ వేరు.. నాలెడ్జ్ వేరు, కేటీఆర్ ఇది తెలుసుకోవాలి. ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధి వస్తుంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్.

CM Revanth Fired on BRS MLA’s

”అవగాహన ఉండాలి. అవతలి వారిని అవహేళన చేస్తే సరిపోదు కేటీఆర్. దానం నాగేందర్ సభలో మాట్లాడితే తప్పేంటి? హైదరాబాద్ పై అవగాహన ఉంది కాబట్టి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. ఇస్తే తప్పేంటి? ఒక సభ్యునికి మైక్ ఇవ్వొద్దనే అధికారం బీఆర్ఎస్ సభ్యులకు ఎక్కడిది? బీఆర్ఎస్ తీరును ఓపికతో చూస్తున్నాం. కోమటిరెడ్డి, సంపత్ ను ఈ సభలో ఏం చేశారో మేము చూడలేదా? ఓ అరడజను మంది సభ్యత్వం రద్దు చేస్తే బుద్దోస్తది.

CM Revanth Fired on BRS MLAs కమిషనర్లు రోడ్డు మీద ఉండాలి. లేదంటే నేనే రోడ్డు మీదకొచ్చి ట్రాఫిక్ నియంత్రిస్తా అని చెప్పాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే హైడ్రా. మాకు మంచి కావాలి. దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. కాళేశ్వరం కడితిరి లక్ష కోట్లు మింగితిరి. మేడిగడ్డ కూల్చితిరి. మూసీ రివర్ డెవలప్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్స్ పిలిచాం. మూసీ పరివాహకంలో ఉన్న నిరుపేదలకు ఆశ్ర్రయం కల్పిస్తాం. గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని కుక్క చేయాలి. మేము అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. ఎందుకింత ఆక్రోశం? ఎల్లంపల్లి నుండి వస్తున్న గోదావరి నీళ్లకు బొక్క పెట్టి గజ్వేల్ కు తీసుకెళ్లారు. సచ్చిన పామును ఎందుకు అని నేను మాట్లాడటం లేదు.

CM Revanth Fired on BRS MLAs అరడజను మందిపై వేటు వేస్తే బుద్ధి వస్తుంది. గతంలో కోమటిరెడ్డి, సంపత్ లపై చర్యలు తీసుకోలేదా? లండన్ ఐ లాంటి.. హైదరాబాద్ ఐ టవర్ ను.. మీరాలం ట్యాంక్ లో ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ సెంటిమెంట్ కోసం ప్రజల సెంటిమెంట్ ను పణంగా పెట్టారు. కృష్ణా ఫేస్ 3, గోదావరి ఫేస్ 1 తెచ్చింది కాంగ్రెసే. కొందరు గోదావరి నీళ్లు నెత్తిన పోసుకుని మేమే నీళ్లు తెచ్చామని డబ్బా కొట్టారు. చంద్రబాబుకు, వైఎస్సార్ కు భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ అభివృద్ధికి వారిద్దరూ కృషి చేశారు. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డును మణిహారంలా వైఎస్సార్ ఇచ్చారు.

CM Revanth Fired on BRS MLAs ఔటర్ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తయారు చేసేందుకు హైడ్రాను సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్ లో రోడ్డుపై నీరు ఆగకుండా వాటర్ హార్వెస్టింగ్ లను ఏర్పాటు చేస్తాం. 141 ప్రాంతాల్లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది ఉంటారు. అఫీసులకే పరిమితమైన అధికారులతో ఫిజికల్ పోలీసింగ్ చేపిస్తున్నాం. అధికారులు రోడ్డుపైకి రాకపోతే.. నేను వస్తా అని చెప్పాను. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే.. మా ప్రభుత్వంలో క్రైమ్ రేటు తగ్గింది.

CM Revanth Fired on BRS MLAs గోషామహాల్ పోలీస్ క్వార్టర్స్ స్థలంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ బిల్డింగ్ గా ఉంచుతాం. కొత్త ఉస్మానియా బిల్డింగ్ ను 30 ఎకరాల స్థలంలో నిర్మిస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read : కవిత వల్లే ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ని వీడారా? అసలేం జరిగింది..

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ”కిషన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చినందుకు సంతోషంగా ఉంది. కిషన్ రెడ్డికి రెండు సార్లు ఫోన్ చేశాను. బండి సంజయ్ ను కూడా తీసుకొని సెక్రటేరియట్ కు రండి అని చెప్పా. అభివృద్ధిపై చర్చిద్దాం అని చెప్పా. కానీ ఎందుకో రాలేదు. ఇప్పటికైనా బీజేపీ ఎమ్మెల్యేలను కోరుతున్నా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరినీ తీసుకుని సెక్రటేరియట్ కు రండి. మా మంత్రులను కూడా పిలుస్తా. అందరం కలిసి అభివృద్ధిపై చర్చిద్దాం. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేదవాడు, ప్రజల మనిషి. ఆయనను కాపాడుకోవాలి. సిర్పూర్ కాగాజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిలు ఆర్థికంగా బాగా ఉన్నోళ్లు” అని సీఎం రేవంత్ అన్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.