Home Blog Page 56

Vitamin B12 Foods : విటమిన్లు లోపించాయా.. అయితే ఇవి తినండి..

0

Vitamin B12 Foods : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన సూక్ష్మ పోషకాలు అత్యంత అవసరం. విటమిన్స్, మినరల్స్ తో పాటు కొవ్వు పదార్థాలు శరీరానికి తగినంత తీసుకోవాలి. శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలలో ఒకటి విటమిన్ బి12. దీనిని కోబాలమైన్ అని కూడా అంటారు.

vitamin b12 foods
october 1, 2026, 6:38 am - duniya360

ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనత నుంచి మతిమరపు వరకు.. నరాల బలహీనత నుంచి డిప్రెషన్ వరకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఇవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి 12 ఉండేలా చూసుకోవాలి. విటమిన్ బి 12 గురించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మాంసాహారం: మాంసాహారంలో అధికంగా విటమిన్ బి 12 ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొవ్వు శాతం అధికంగా ఉండే మాంసాహారం ఎంచుకోవడం మంచిది. వారానికి కొన్ని సార్లు మాంసాహారం తినడం వల్ల కూడా ఎక్కువ మొత్తంలో విటమిన్ బి 12 కంటెంట్ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చేపలు: విటమిన్ బి 12 అధికంగా ఉండే మరో పోషకాహారం చేపలు. ముఖ్యంగా సాల్మన్, ట్రౌట్ వంటి చేపల్లో విటమిన్లు అధికంగా ఉంటాయి. సాల్మన్ చేపల్లో గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి శరీరానికి తగినంత పోషకాలను తీసుకోవడం అవసరం.

పాల ఉత్పత్తులు: కొందరు నాన్ వెజ్ తిననివారు కూడా ఉంటారు. అలాంటి వారికి శరీరానికి తగినంత ప్రోటీన్ లభించదు. ముఖ్యంగా వెజిటేరియన్స్ పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జున్ను, పెరుగు, పాల వంటి వాటిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పాల ఉత్పత్తులు చేర్చుకోవడం మంచిది. దీని వల్ల విటమిన్ బి 12 లోపం తలెత్తకుండా ఉంటుంది.

గుడ్లు: విటమిన్ బి 12 పుష్కలంగా ఉండే ఆహారంలో గుడ్లు కూడా ఒకటి. గుడ్లలోని పచ్చసొనలో ఇది ఎక్కువగా ఉంటుంది. గుడ్డు మొత్తాన్ని ఆహారంగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రెండు గుడ్ల నుంచి ఒకటి 1.1 మైక్రోగ్రాముల విటమిన్ అందుతుందని నిపుణులు చెబుతున్నారు.

తృణధాన్యాలు: తృణధాన్యాలు బలవర్ధకమైన పోషకాహారాలు. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తిననివారు విటమిన్ సి అధికంగా ఉండే పోషకాహారం తినాలి. ఆహారంలో భాగంగా తృణధాన్యాలు తీసుకోవాలి. తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్, తీసుకోవడం కూడా బెటర్.

సోయా పనీర్: సోయాతో చేసే పదార్థాల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. దీనిని బీన్ పెరుగు అని కూడా పిలుస్తారు. చపాతి, అన్నంలోకి ఇది రుచిగా ఉంటుంది. నూనెలో వేయించి సలాడ్ లాగా కూడా కలిపి తీసుకోవచ్చు

Monkey Pox | ఏపీలో మంకీపాక్స్ కలకలం.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం

0

Monkey Pox | ప్రపంచవాప్తంగా హడలెత్తిస్తున్న మంకీపాక్స్‌ ఏపీలోనూ కలకలం రేపింది. దుబాయ్​నుంచి విజయవాడకు వచ్చిన ఓ చిన్నారికి మంకీపాక్స్​ లక్షణాలు ఉన్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

monkey pox
october 1, 2026, 6:38 am - duniya360

ఇందుకోసం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు పడకలతో ఓ వార్డును సిద్ధం చేసింది. అందులో అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచింది.

సూపర్​స్పెషాలిటీ బ్లాక్‌లో ఈ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్​డాక్టర్​వెంకటేష్​తెలిపారు. అన్ని రకాల ఇంజక్షన్లను అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ఇప్పటికే భారత ప్రభుత్వం దీనిపై అప్రమత్తమైంది. ఇదిలావుంటే డబ్యూహెచ్‌వో​హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.

అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసి విదేశాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని గాంధీ, నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఇందుకోసం ప్రస్తుతం 20 పడకలు కేటాయించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. తాము పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

Viral news | ఆ గ్రామంలో స్త్రీలు దుస్తులు ధరించరు.. అది విదేశీ గ్రామం కాదు..!

0

Viral news | భారతదేశం లక్షలాది గ్రామాలతో సుసంపన్నంగా ఉన్న దేశం. మన దేశంలో ఒక్కో గ్రామానికి ఒక్కో ఆచార వ్యవహారం ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ ఆచారాల్లో కొన్ని చాలా వింతగా అనిపిస్తాయి. ప్రస్తుతం మన దేశంలోని ఓ గ్రామంలో ఇప్పటికీ పాటిస్తున్న ఆ వింత ఆచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

viral news
october 1, 2026, 6:38 am - duniya360

హిమాచల్‌ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలో పిని అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ వింత ఆచారం అమలులో ఉన్నది. ఆ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ధరించకుండా నగ్నంగా వీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఏడాది పొడవునా ఈ ఆచారం ఉండదు. ఏడాదికి ఒక ఐదు రోజులు ఆ గ్రామానికి చెందిన మహిళలు ఈ ఆచారాన్ని పాటిస్తారు.

శతాబ్దాల కాలం నాటి ఈ ఆచారాన్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఆచారం కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు. ఈ సందర్భంగా పురుషులు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మహిళలు ఈ వ్రతంలో ఉన్నప్పుడు వాళ్లతో వారి భర్తలు మాట్లాడకూడదు. మద్యం, మాంసం తినకూడదు. అలా చేస్తే వ్రత భంగం కలిగి కీడు జరుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం.

కాగా ఏడాదిలో ఓ ఐదు రోజులు మహిళలు దుస్తులు విప్పుకుని ఉండకపోతే ఆపద వస్తుందని వారి భయం. ఆపదకు రాక్షసులే కారణమని వారు నమ్ముతున్నారు. శతాబ్దాల క్రితం వారి గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించారట. ఆ సమయంలో అసురులు అందమైన దుస్తులు ధరించిన వివాహిత స్త్రీలను తీసుకువెళ్లారట.

మొత్తం ఐదు రోజులపాటు రాక్షసులు ఈ దారుణానికి పాల్పడ్డారట. దాంతో దేవుడు లాహువా ఘోంట్ ఆ గ్రామానికి వచ్చి ఆ రాక్షసులను నాశనం చేశాడట. అందుకే ఏడాదిలో ఆ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరిస్తే కీడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఏటా ఆ ఐదు రోజులపాటు తమ దుస్తులను వదిలేస్తారు.

Sukanya Samriddhi Yojana : ఒకేసారి చేతికి రూ.5 లక్షల 50 వేలు.. నెలకు రూ.1,000 కడితే చాలు, పిచ్చెక్కించే స్కీమ్!

Sukanya Samriddhi Yojana ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం అప్పుడే పుట్టిన పిల్లల నుండి 10 సంవత్సరాల్లోపు ఉన్న ఆడపిల్లలకు, ప్రతి నెల రూ.250 నుండి ఆపై ఎంతైనా జమ చేస్తే , దాన్నిబట్టి మనకు 15 సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని నకిరేకల్ సబ్ పోస్ట్ మాస్టర్ రమేష్ లోకల్ 18 ద్వారా తెలియజేశాడు.

sukanya samriddhi yojana
october 1, 2026, 6:38 am - duniya360

వివరాల్లోకెళ్తే… సూర్యాపేట డివిజన్ నకిరేకల్ సబ్ పోస్ట్ మాస్టర్ రమేష్.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుండి పది సంవత్సరాలు లోపు ఆడపిల్ల ఈ పథకానికి అర్హులు అయితారు.

అలాగే వారు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. దీనితో పాటు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అకౌంట్ ఫామ్ నింపి అకౌంట్ ఓపెన్ చేయాలి. వీటితోపాటు తల్లి గాని తండ్రి గాని పాన్ కార్డు ఆధార్ కార్డు కూడా జమ చేయాలి. సుకన్య సమృద్ధి యోజన ప్రతి నెల పొదుపు రూ .250 నుండి మొదలవుతుంది.

ఒక సంవత్సరం లోపు లక్షన్నర వరకు కుటుంబ శక్తి మేరకు పొదుపు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా వడ్డీ కల్పిస్తుంది ఈ పథకానికి. ఈ యొక్క పథకం అనేది దాదాపు 15 సంవత్సరాలు కట్టాలి. ఆ తర్వాత పై చదువుల కోసం ఎడ్యుకేషన్ లోను కూడా తీసుకోవచ్చు. ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు కడితే అవి రూ.1,80,000 అవుతాయి.

భారత ప్రభుత్వం వడ్డీతో కలుపుకొని రూ .5 లక్షల 50 వేలు ఇవ్వడం జరుగుతుంది. ఆడపిల్ల పుట్టడం భారమే కాదు అదృష్టం కూడా ఇప్పుడు భావించవచ్చు, ఇట్లాంటి కేంద్ర పథకాలు ఆడపిల్లలున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ వినియోగించుకోవాలని లోకల్ 18 ద్వారా తెలియజేశారు.

UPS Implementation : యుపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే!

0
  • ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ పేరుతో కొత్త పింఛన్‌ పథకం
  •  మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
  •  ఈ కేంద్ర పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర
vitamin b12 foods
october 1, 2026, 6:38 am - duniya360

UPS Implementation కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రకటించిన ఒక రోజు తర్వాత.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర ఉద్యోగుల కోసం కూడా ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కేంద్ర పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ పథకానికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అటువంటి పరిస్థితిలో.. రాష్ట్రంలో కొత్త పెన్షన్ స్కీమ్ (NPS) బదులుగా యూపీఎస్ అమలుకు మార్గం సుగమం చేయబడింది.

కాగా.. ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(యూపీఎస్‌) పేరుతో కొత్త పింఛన్‌ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్‌ పే సగటులో 50 శాతం కచ్చితంగా పింఛన్‌ రూపంలో అందుతుంది.

23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పింఛన్‌ పథకం వర్తిస్తుంది. 2004లో తీసుకువచ్చిన కొత్త పింఛన్‌ పథకాన్ని(ఎన్‌పీఎస్‌) రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్‌లో కేంద్రం టీవీ సోమనాథన్‌ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను ప్రభుత్వం రూపొందించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

We want OPS ఒపిఎస్‌ తప్ప మరే పెన్షన్‌ పథకం వద్దు

We want OPS కేంద్ర ప్రభుత్వం సిపిఎస్‌ స్థానంలో (యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం) యుపిఎస్‌ అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అదనంగా వనగూరే ప్రయోజనం ఏమీ లేదని, కావున పాత పెన్షన్‌ విధానమే అమలు చేయాలని, వేరొక దాన్ని అంగీకరించేది లేదని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

we want ops
october 1, 2026, 6:38 am - duniya360

We want OPS

ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జరిగిన యుటిఎఫ్‌ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన జిల్లా స్వర్ణోత్సవాలకు సంబంధించి తన గోడ పత్రికను ఉపాధ్యాయ సంఘాలకు నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగి ఎలాంటి కంట్రిబ్యూషన్‌ చెల్లించకుండా ఇచ్చే పాత పెన్షన్‌ను పునరుద్ధరించకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి ప్రయత్నించిన జిపిఎస్‌ లాంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్నారు.

ఈ విధానంలో కన్యుకేషన్‌ పెరిగిన పిఆర్‌సిలు, డిఎ విషయాలు లేవని తెలిపారు. 10 శాతం ఉద్యోగుల నుంచి కట్టించుకునే సొమ్ము షేర్‌ మార్కెట్లో పెట్టడం వల్ల ఉద్యోగులకు ఉపయోగం కాదని తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌.మురళీమోహనరావు, ఎస్‌.కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యారంగా సంస్కరణ వల్ల ప్రభుత్వ విద్యారంగం విచ్ఛిన్నమై విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు.

పని సర్దుబాటు అవసరం మేరకు చేస్తామని చెప్పి ఇప్పుడు గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. అలాగే అక్టోబర్‌ 20, 21 తేదీల్లో జరిగే జిల్లా స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ.భాస్కరరావు, సహాధ్యక్షులు వి.జ్యోతి, కోశాధికారి కె.మురళి, రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.మోహన్‌రావు పాల్గొన్నారు.

పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి : ఎపిటిఎఫ్‌కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం పేరుతో ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్‌ పథకం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలో ప్రకటించిన గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ వంటిదేనని, సర్వీసు వ్యవధితో సంబంధం లేకుండా అందరికీ పాత పెన్షన్‌ వర్తింపజేయడమే న్యాయ సమ్మతమని ఎపిటిఎఫ్‌ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్‌, బాలకష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీముకు మరో రూపమే తప్ప పాత పెన్షన్‌ విధానం కాదన్నారు. సిపిఎస్‌ వలే ఉద్యోగి జీతంలో నుండి 10శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్‌ 1 నుండి అమల్లోకి రానున్న కొత్త పెన్షన్స్‌ పథకాన్ని ఎపిటిఎఫ్‌ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఉద్యోగులకు ప్రతికూలమైన ఈ పథకాన్ని తిరస్కరిస్తూ పాత పెన్షన్‌ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

Anand Mahindra : అప్పట్లో ఈ టెక్నిక్ తెలిసుంటే నేనే నెం.1 అయ్యేవాడిని: ఆనంద్ మహీంద్రా

0

Anand Mahindra పేపర్ ప్లేన్ తయారీకి సంబంధించిన ఓ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకుంది. వీడియో తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చిందని ఆయన అన్నారు. వీడియోలోని టెక్నిక్ తనకు చిన్నప్పుడు తెలిసుంటే నాటి పోటీల్లో తానే నెం.1గా నిలిచేవాడినని కామెంట్ చేశారు.

anand mahindra: అప్పట్లో ఈ టెక్నిక్ తెలిసుంటే నేనే నెం.1 అయ్యేవాడిని: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra ఎవరి జీవితంలోనైనా చిన్నతనం అత్యంత ప్రత్యేకమైనది. ఎన్నేళ్లు వచ్చినా కూడా చిన్నతనం గుర్తుకు రాగానే మోముపై నవ్వులు విరబూస్తాయి. ఆ స్నేహాలు, ఆటలు, గిల్లికజ్జాలు గుర్తుకు తెచ్చుకుని మరీ మైమరిచిపోయేవారూ ఉంటారు. అయితే, తాజాగా నెట్టింట వైరల్ (Viral) అవుతున్న ఓ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. వీడియోలో చూపించిన టెక్నిక్ తనకు చిన్నప్పుడు తెలిసుంటే ప్రతిపోటీలో తానే ముందుండెవాణ్ణని ఆయన కామెంట్ చేశారు. నెటిజన్లను ప్రస్తుతం అమితంగా ఆకర్షిస్తున్న ఈ వీడియో పూర్తి వివరాల్లోకి వెళితే..

కాగితపు విమానాల వీడియోను ఆనంద్ మహీంద్రా తాజాగా పంచుకున్నారు. వీడియోలోని వ్యక్తి సరికొత్త డిజైన్‌లో కాగితపు విమానాన్ని తయారు చేశాడు. అతడి డిజైన్ కారణంగా విమానం చాలా దూరమే ఎగిరింది. అసలు అది కిందపడే అవకాశమేలేదన్నంత రేంజ్‌లో విమానం గాల్లో దూసుకుపోయింది. ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఈ కాలం పిల్లలకు కాగితపు విమానాలపై ఆసక్తి ఉందో లేదో తెలీదు కానీ నా స్కూలు రోజుల్లో మేమందరం వీటితో ఆడే ఆటల్లో ముగినితేలేవాళ్లం. ఇతరుల పేపర్ ప్లేన్ల కంటే ఎక్కువ దూరం వెళ్లేలా ప్లేన్ డిజైన్ చేసేందుకు ఉత్సాహం చూపేవాళ్లం. కానీ ఈ వీడియోలోని డిజైన్ నాకు చిన్నప్పుడే తెలిసుంటే అన్ని పోటీల్లో నేనే గెలిచుండేవాణ్ణి. ఆదివారాలు ఇలాంటి పనుల చేసేందుకు సరైన సమయం’’ అని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.

ఈ పోస్టు నెటిజన్లకు తమ చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చింది. దీంతో, వారు వందలకొద్దీ కామెంట్స్ గుప్పించారు. తామూ చిన్నతనంలో ఇలాంటి ప్లేన్లు తయారు చేసేవారమని అనేక మంది చెప్పుకొచ్చారు. చిన్నతనంలో వీటితో ఆడిన ఆటలు ఇప్పటికీ గుర్తున్నాయని మరికొందరు చెప్పుకొచ్చారు. తాను కాలేజీ రోజుల్లో కూడా ఇలాంటి ప్లేన్లు చేశానని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. నేటి తరం వీడియో గేమ్స్ కంటే ఇవే మంచి వ్యాపకంగా ఉండేవని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలోని పేపర్ ప్లేన్ తాయరీ టెక్నిక్ అనేక మందికి నచ్చిడంతో దీన్ని తెగ రీట్వీట్ చేస్తున్నారు.

Krishnastami Specials శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినాన..వెరైటీ వంటకాలు

0

Krishnastami Specials పండుగలకి ఆయా ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయ వంటకాలు చేయడం సహజం. అయితే అదే పండుగకి పక్క రాష్ట్రాల్లో చేసే సంప్రదాయ వంటకాలను కూడా ట్రై చేస్తే బాగుంటుంది.అలాంటివే ఇవి కూడా.. రేపు అంటే ఆగస్టు 26న శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినాన ఈ వెరైటీ వంటకాలు వండి రుచి చూడండి.

krishnastami specials
october 1, 2026, 6:38 am - duniya360

Krishnastami Specials

వెన్న ఉండలు

కావాల్సినవి :

బియ్యప్పిండి – ఒక కప్పు
మినప్పిండి – ఒక టేబుల్ స్పూన్
వెన్న – రెండు టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – ఒక టీస్పూన్
ఇంగువ – పావు టీస్పూన్
నీళ్లు – సరిపడా
నూనె – వేగించడానికి సరిపడా
నువ్వులు – ఒక టీస్పూన్  (ఇష్టపడితే)

తయారీ : ఒక పాన్​లో బియ్యప్పిండి వేసి రెండు నిమిషాలు వేగించి పిండిని ఒక ప్లేట్​లోకి తీయాలి. అదే పాన్​లో మినప్పిండి వేగించాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, మినప్పిండి వేసి కలపాలి. పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్​ చేసిన కొబ్బరిని పాన్​లో వేసి తేమపోయేవరకు వేగించాలి. తరువాత దాన్ని కూడా బియ్యప్పిండి మిశ్రమంలో వేసి కలపాలి. అందులో వెన్న, ఉప్పు, జీలకర్ర, ఇంగువ వేసి కలిపి ముద్ద చేసి, ఉండలు చేయాలి. ఆ ఉండల్ని పొడి బట్ట​ మీద అరగంట ఆరబెట్టాలి. పాన్​లో నూనె వేడి చేయాలి. అందులో రెడీ చేసిన ఉండల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఒక పళ్లెం​లో టిష్యూ పేపర్ వేసి, వేగించిన ఉండలు దానిమీద వేసి చల్లారబెట్టాలి. 

గోపాలక​లా 

కావాల్సినవి :

పోహా (అటుకులు) – రెండు కప్పులు
పెరుగు – అర కప్పు
పాలు – ఒక కప్పు
ఉప్పు – సరిపడా
నెయ్యి – ఒక టీస్పూన్
ఆవాలు – పావు టీస్పూన్
మినప్పప్పు – అర టీస్పూన్
జీలకర్ర – పావు టీస్పూన్
ఇంగువ – చిటికెడు
కరివేపాకు, కొత్తిమీర – కొంచెం
పచ్చిమిర్చి – ఒకటి
కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : ఒక గిన్నెలో పోహా వేసి అందులో పాలు, నీళ్లు పోయాలి. పెరుగు కూడా వేసి బాగా కలపాలి. తరువాత ఉప్పు వేసి మరోసారి కలపాలి. ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేగించాలి. ఆ తాలింపును పోహా మిశ్రమంలో వేసి కలపాలి. ఈ వంటకాన్ని చల్లారాక తింటేనే టేస్టీగా ఉంటుంది. 

పోహా స్వీట్ పొంగల్​ 

కావాల్సినవి :

పోహా (అటుకులు) – ఒక కప్పు
పెసరపప్పు – పావు కప్పు
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు
నీళ్లు – ఒకటిన్నర కప్పు
జీడిపప్పులు – మూడు టేబుల్ స్పూన్లు
జీలకర్ర, మిరియాలు –  ఒక్కో టీస్పూన్
కరివేపాకు – కొంచెం
పచ్చిమిర్చి – రెండు

తయారీ : పాన్​లో ఒక టేబుల్ స్పూన్​ నెయ్యి వేడి చేయాలి. అందులో పెసరపప్పు వేసి ఒక నిమిషం వేగించాలి. అందులో నీళ్లు పోసి తెర్లాక తీసేయాలి. మరో పాన్​లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి పోహా వేగించాలి. తర్వాత నీళ్లు పోసి ఉడికించాలి. అవి ఉడికాక, పెసరపప్పు వేసి కలపాలి. మరో పాన్​లో నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పులు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేగించాలి. వాటిని పొంగల్​ మిశ్రమం పై పోసి, బాగా కలపాలి. పొంగల్​ బాగా ఉడికాక స్టవ్​ ఆపేయాలి.

మిక్స్​డ్​ఫ్రూట్ కేసరి

కావాల్సినవి :

బొంబాయి రవ్వ, నీళ్లు, పాలు – ఒక్కో కప్పు చొప్పున
చక్కెర – ఒకటిన్నర కప్పు
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు
యాపిల్, ఆరెంజ్, అరటి పండ్ల ముక్కలు – ఒక్కోటి పావు కప్పు
దానిమ్మ గింజలు, ద్రాక్షలు – ఒక్కోటి పావు కప్పు
బాదం, జీడిపప్పులు – ఒక్కోటి పది చొప్పున
ఎండుద్రాక్ష- రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి – ఒక టీస్పూన్

తయారీ : ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి బాదం, జీడిపప్పులు, కిస్​మిస్​ వేగించి ప్లేట్​లోకి తీయాలి. అదే నెయ్యిలో యాపిల్, ఆరెంజ్, అరటి పండ్ల ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్షలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఒక పాలగిన్నెలో పాలు, నీళ్లు పోసి కాగబెట్టాలి. పాలు మరిగాక వేగించిన పండ్లన్నీ అందులో వేసి ఉడికించాలి. కావాలంటే ఫుడ్ కలర్​ కూడా వేసుకోవచ్చు. తర్వాత మరో పాన్​లో బొంబాయి రవ్వ, చక్కెర వేగించాలి. అందులో పాలు, పండ్ల మిశ్రమం వేసి కలుపుతూ ఉండాలి. మిశ్రమం గట్టి పడ్డాక యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి, బాదం, జీడిపప్పులు, ఎండుద్రాక్ష వేసి కలపాలి. 

పెసర పాయసం

కావాల్సినవి :

పెసరపప్పు – ఒక కప్పు
బెల్లం – ఒక కప్పు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి పాలు – మూడున్నర కప్పులు
జీడిపప్పు పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు
ఎండుద్రాక్ష – రెండు టేబుల్ స్పూన్లు
యాలకులు – నాలుగు 

తయారీ : పాన్​లో నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి వేగించి పక్కనపెట్టాలి. అదే పాన్​లో పెసరపప్పును రెండు నిమిషాలు వేగించాలి. అందులోనే కొబ్బరి పాలు పోసి అవి మరిగాక, యాలకులు వేసి పావుగంట పెసరపప్పును ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం వేసి ఐదు నిమిషాలు బాగా కలపాలి. అవసరం అనిపిస్తే మరికొన్ని కొబ్బరి పాలు పోసి కలపాలి. తరువాత పెసర పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసి మిగిలిన నెయ్యితోపాటు జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి కలపాలి. వేడి వేడి పెసర పాయసం రెడీ. 

Knowledge OK : మనం రోజూ వాడే OK పదానికి అర్థం ఏంటో తెలుసా ?

Knowledge OK ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, నో మెసేజ్ పంపేటప్పుడు ఓకే అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే సరే అనే పదం ఎక్కడ నుండి వచ్చింది  దాని అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

knowledge ok : మనం రోజూ వాడే ok పదానికి అర్థం ఏంటో తెలుసా ?
october 1, 2026, 6:38 am - duniya360

స్మిత్సోనియన్ మ్యాగజైన్‌లోని కథనం ప్రకారం,  OK అనే పదానికి తప్పు అని అర్థం. కానీ కాలక్రమేణా, ప్రజలు AC (ఆల్ కరెక్ట్) అనే పదానికి బదులుగా ఓకే అనే పదాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభించారు.

Knowledge OK 182 సంవత్సరాల క్రితం, అమెరికన్ జర్నలిస్ట్ చార్లెస్ గోర్డాన్ గ్రీన్ మొదటిసారి ఓకే అనే పదాన్ని ఉపయోగించారు. తరువాత 1839లో, చాలా మంది రచయితలు వివిధ ఆంగ్ల పదాల సంక్షిప్త రూపాలను ఉపయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు మనం వాడుతున్న LOL లాగా, అప్పట్లో OK వాడేవారు.

OK అంటే గ్రీకులో ‘ఆల్ ఈజ్ వెల్’ అని అర్థం. దీనినే మనం క్లుప్తంగా ఓకే అంటాం.

అయితే, HuffPost నివేదించినట్లుగా, ‘OK’ అనేది ‘Okeh’ అనే పదం నుండి వచ్చింది. ఈ పదాన్ని అమెరికాలోని చోక్టావ్ తెగ వారు ఉపయోగిస్తున్నారని చెబుతారు.

అయితే, ఓకే అనే పదం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1840లో, US అధ్యక్షుడు మార్టిన్ వాన్ బ్యూరెన్ తన ఎన్నికల ప్రచారంలో Ok అనే పదాన్ని ఉపయోగించారు. వాన్ బ్యూరెన్ యొక్క మారుపేరు ‘ఓల్డ్ కిండర్‌హుక్’. ప్రచారానికి ఓకే అనే పదాన్ని సంక్షిప్తలిపిగా వాడుకున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ‘ఓకే క్లబ్’ కూడా ప్రారంభమైంది.

Knowledge OK అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనే దానితో సంబంధం లేకుండా ఈ రోజుల్లో మనం ఎక్కువగా వాడుతున్నాం. అలాగే ఓకే అంటే ఏమిటో ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఎవరైనా దేనికైనా సరే చెబితే, మీరు కూడా అతనికి ఓకే చెప్పవచ్చు.

Rain Alert in Telugu States : మరో 2 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! 

0

Rain Alert in Telugu States తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగాల 2 రోజులలో తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. తెలంగాణలో మంచిర్యాల, నిర్మల్‌, సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్‌, వికారాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో వానలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో వనపర్తి జిల్లా రేవెల్లిలో అత్యధికంగా 9.65 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.

vitamin b12 foods
october 1, 2026, 6:38 am - duniya360

Rain Alert in Telugu States

మరోవైపు వర్షాల దాటికి రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు గరిష్టంగా ప్రబలుతున్నాయి. జూలై 1 నుంచి ఆగస్టు 18 మధ్యకాలంలో రాష్ట్రంలో మూడువేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 32 వేల కేసులు నమోదయ్యాయి. అంటే జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో కేసులు పదిశాతం మేర ఉన్నయాన్నమాట. అందులో అత్యధిక కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉండటం గమనార్హం. డెంగీతో పాటు ఇతర సీజనల్‌ వ్యాధులూ వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రోగులతో సర్కారు దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యపరీక్షల కిట్ల కొరత కారణంగా బాధితులను ప్రైవేటు కేంద్రాలకు పంపిస్తున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో కామారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాలలో డెంగీ జ్వరాల తీవ్రతకు గురై ఐదుగురు మృత్యువాత పడ్డారు.

గతంలోనూ వైరల్ జ్వరాలు వచ్చేవని.. అయితే అవి మందులు వేసుకున్నా లేకున్నా మూడు నాలుగురోజులు తర్వాత తగ్గేవని, ఇప్పుడు పది రోజులవుతున్నా జ్వరాలు తగ్గడం లేదని, శరీరంలో ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా త్వరగా పడిపోతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ఈ జ్వరాల బారిన పడి మృతి చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ విభాగాన్ని పటిష్టవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీధులపై ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త, నీటి నిల్వలతో డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను యుద్ధ ప్రాతిపదికన నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.