Home Blog Page 57

Monkeypox : కరోనాలాగే విరుచుకుపడుతున్న మంకీపాక్స్.. మరోసారి లాక్‌డౌన్ తప్పదా?

0

Monkeypox : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాల్లో చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న ఈ మంకీపాక్స్ వైరస్‌కు చికిత్స లేకపోవడంతో ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మంకీపాక్స్ వైరస్ పట్ల ప్రపంచ దేశాలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ మంకీపాక్స్ వైరస్.. ఇప్పుడు మన ఆసియా ఖండంలోకి విస్తరించింది. మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో మంకీపాక్స్ కేసులు నమోదవుతుండటంతో భారత్‌లోనూ తీవ్ర ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు అడ్వైజరీలు జారీ చేసింది. ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

monkeypox
october 1, 2026, 7:36 am - duniya360

Monkeypox

అయితే గతంలోనూ ఈ మంకీపాక్స్ వైరస్ ఉన్నా.. ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒకప్పుడు మంకీపాక్స్‌గా పిలిచిన ఈ వైరస్‌ను.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇటీవల ఎమ్‌పాక్స్‌ అని పేరు మార్చింది. ఈ ఎమ్‌పాక్స్‌ సోకి ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారని.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికా ఖండం అంతటా ఈ మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ఇది ఇతర ఖండాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

Monkeypox ఇప్పటివరకు ఆఫ్రికాలో 14 వేల కంటే ఎక్కువ కేసులు.. 524 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే మంకీపాక్స్ కేసులు, మరణాలు ఈసారి భారీగా పెరిగిపోయాయని.. డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇక ఆఫ్రికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఈ ఎమ్‌పాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ ఎమ్‌పాక్స్‌ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేయడం సహా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే మరోసారి ప్రపంచంలో లాక్‌డౌన్లు విధించే అవకాశాలు లేకపోలేదని.. నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక ఎవరైనా దద్దుర్లు ఉన్న రోగులను గుర్తిస్తే.. వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందించాలని ఆస్పత్రులను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని 3 నోడల్ ఆస్పత్రులైన సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లలో ఎమ్‌పాక్స్ కోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ Monkeypox ఎమ్‌పాక్స్ కూడా కొవిడ్ వైరస్ లక్షణాలు ఉంటాయి. ఎమ్‌పాక్స్ వైరస్ సోకిన వారికి దగ్గు, ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. కానీ కరోనాతో పోలిస్తే కొన్ని ప్రాథమికంగా లక్షణాల్లో తేడా ఉంటుంది.

SSC Public Examination 2025 Model Question Papers, Blue Prints and Weightage Tables

0
monkeypox
october 1, 2026, 7:36 am - duniya360

SSC Public Examination 2025 Model Question Papers – SSC PUBLIC EXAMINATIONS – 2025 SUBJECT WISE MODEL QUESTION PAPERS, BLUE PRINTS & WEIGHTAGE

S.NoSUBJECTSPAPER CODESDOWNLOAD
11ST LANGUAGE (TELUGU)01T & 02TCLICK HERE
21ST LANGUAGE (HINDI)01H & 02HCLICK HERE
31ST LANGUAGE (KANNADA)01K & 02KCLICK HERE
41ST LANGUAGE (ODIA)01 ‘O’ & 02’O’CLICK HERE
51ST LANGUAGE (URDU)01U & 02UCLICK HERE
61ST LANGUAGE PAPER – I (COMPOSITE TELUGU)03TCLICK HERE
71ST LANGUAGE PAPER – II (COMPOSITE SANSKRIT)04SCLICK HERE
82ND LANGUAGE ( TELUGU)09TCLICK HERE
92ND LANGUAGE ( HINDI)09HCLICK HERE
103RD LANGUAGE ( ENGLISH)13E & 14ECLICK HERE
11MATHEMATICS (ENGLISH – MEDIUM)15E & 16ECLICK HERE
12GENERAL SCIENCE – PAPER-I (ENGLISH – MEDIUM)19ECLICK HERE
13GENERAL SCIENCE – PAPER-II (ENGLISH – MEDIUM)20ECLICK HERE
14SOCIAL (ENGLISH – MEDIUM)21E & 22ECLICK HERE

For more details visit https://bse.ap.gov.in/SUBJECT_WISE_MODEL_PAPER_25.htm

SMC and WEA IMMS User Ids

0

SMC and WEA IMMS User Ids are available in below links. User 1st link for SMC User ID and 2nd link for WEA User ID

SMC Committees User IDs for IMMS APP Download with Single Click

▪️ మీ పాఠశాల డైస్ కోడ్ తో SMC Committee IMMS ఐడి కింది లింకు లో చూడవచ్చు

▪️ Link : https://app.newstone.in/school/immsid.php

IMMS WEA ID…

మీ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ యూజర్ ఐడి ని ఈ క్రింది లింక్ లో తెలుసు కొండి. జిల్లా >> మండలం సెలెక్ట్ చేయగానే ఆ మండలం లో సచివాలయాలు చూపిస్తాయి. మీకు కావల్సిన సచివాలయ కోడ్ మీద క్లిక్ చేస్తే WEA ఐడి తెలుస్తుంది.
https://app.newstone.in/ammavodi/inactive/scode.php

SMC Eelctions and Members Details – State Wise 38 Pages Proforma

0

SMC Eelctions and Members Details – State Wise 38 Pages Proforma

smc eelctions and members detailsv
october 1, 2026, 7:36 am - duniya360

SMC Eelctions and Members Details

రాష్ట్రంలోని SMC ఎన్నికలు నిర్వహించబడిన అన్ని ప్రభుత్వ,ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు SMC సభ్యుల యొక్క వివరాలను నింపవలసిన గూగుల్ ప్రొఫార్మా

https://forms.gle/AU7ARzfrgUa1GmkH8

SMC Eelctions and Members Details Required Details

Name, Gender, Caste, Child Name, Child ID (Student Info), Child Class for all members

SMC వివరాలతో 38 పేజీలున్న గూగుల్ ఫారం ను HMs నింపాలి.

Nagarjuna Sagar రెండేళ్ల తర్వాత నాగార్జుసాగర్ వద్ద అద్భుత దృశ్యం.. వీడియో వైరల్

Nagarjuna Sagar గత నెల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలతో పలు జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ కు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ వరద నీరు చేరుకోవడంతో పది గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని దిగువనున్న సాగర్ కు వదులుతున్నారు. దీంతో కేవలం వారం రోజుల్లోనే నాగార్జునసాగర్ జలాశయంలోకి భారీగా వరద నీరు పోటెత్తుతుంది.నీరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు 60 వేల క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నీరు విడుదల అవుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వివరాల్లోకి వెళితే..

Nagarjuna Sagar

ఇటీవల దేశ వ్యాప్తంగా రుతుపవనాలు జోరుగా విస్తరించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిన అనేక చోట్ల కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో దిగువకు గేట్లు ఓపెన్ చేశారు.దీంతో నాగార్జున సాగర్ కు భారీగా నీరు వచ్చి చేరింది.ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములు నిండు కుండలా మారాయి. ఈ క్రమంలోనే అదికారులు దిగువకు నీళ్లు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఆరు గేటర్లను ఓపెన్ చేశారు. రెండేళ్ల తర్వాత నాగార్జన సాగర్ గేట్లు ఎత్తడంతో సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2022 లో ఆగస్టు 11న చివరిసారిగా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆరు గెట్లు ఎత్తివేడయంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ వద్ద అందాలు మహా అద్భుతంగా కనువిందు చేస్తున్నాయి.

[the_ad id=”12222″]

అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు సార్లు సైరన్ మోగించి, డ్యామ్ కు సమీపంలోని ప్రజలను అప్రమత్తం చేశారు.మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 4.40 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నీటి నిలువ సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 582 అడుగులకు చేరినట్లు తెలుస్తుంది. రెండేళ్ల తర్వాత గేట్లు ఎత్తివేయడంతో నాగార్జున సాగర్ కి సందర్శకులు క్యూ కడుతున్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వెళ్తున్నారు. అక్కడ అందమైన అద్భుత దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.

EPF Personal Details Edit Option : ఈపీఎఫ్‌లో వ్యక్తిగత వివరాల సవరణలకు అవకాశం

0

EPF Personal Details Edit Option ఈపీఎఫ్‌ చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్‌ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్‌వో స్వల్ప మార్పులు చేసింది.

[ad_1]

EPF Personal Details Edit Option

పేరులో మూడక్షరాలు దాటితేనే పెద్ద మార్పుగా పరిగణన

లావాదేవీలు నిర్వహించని ఖాతాల క్లెయిమ్‌లపై కొత్త విధివిధానాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌ చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్‌ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్‌వో స్వల్ప మార్పులు చేసింది. ఖాతాదారు, తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి పేర్లలో తప్పులు దొర్లితే జాయింట్‌ డిక్లరేషన్ల ద్వారా సవరణలకు అవకాశం కల్పించింది. పేరులో రెండు అక్షరాలకు మించి సవరణ చేయాల్సి ఉంటే గతంలో ‘పెద్ద(మేజర్‌) మార్పు’గా పరిగణించేవారు. ఇప్పుడు ఆ పరిమితిని 3 అక్షరాలకు కుదించారు. స్పెల్లింగ్‌ పరంగా చేయాల్సిన మార్పులకు, పూర్తి పేరు నమోదు చేసుకునేందుకు అక్షరాల పరిమితిని తొలగించింది. చేయాల్సిన మార్పులు మూడక్షరాలకు తక్కువగా ఉన్నా.. వివాహం తరువాత జీవిత భాగస్వామి ఇంటి పేరు మార్చాల్సి ఉన్నా వాటిని చిన్న సవరణలుగానే పేర్కొంది.

 

లావాదేవీలు లేని ఖాతాలపై…

    • ఏళ్లుగా లావాదేవీలు లేని పీఎఫ్‌ ఖాతాల్లో నుంచి నగదు ఉపసంహరణలో ఇబ్బందులతో పాటు మోసాల నివారణకు ఈ-కేవైసీ బయోమెట్రిక్‌ ధ్రువీకరణను ఈపీఎఫ్‌వో తప్పనిసరి చేసింది. 
    • లావాదేవీలు లేని ఖాతాల్లో ఎక్కువ వాటికి యూనివర్సల్‌ అకౌంట్‌ నంబరు(యూఏఎన్‌) లేదు. ఈ తరహా కేసుల్లో ఖాతాదారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి లేదా ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ తీసుకుని బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పోర్టల్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే చాలు.. పీఎఫ్‌ సిబ్బందికి ఇంటికే వచ్చి యూఏఎన్‌ను సిద్ధం చేస్తారు.  
    • చందాదారుడి ఖాతాలో నగదు నిల్వ రూ.లక్ష కన్నా తక్కువగా ఉంటే సంబంధిత అకౌంట్స్‌ అధికారి(ఏవో), రూ.లక్ష కన్నా ఎక్కువగా ఉంటే సహాయ పీఎఫ్‌ కమిషనర్‌(ఏపీఎఫ్‌సీ) లేదా ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌(ఆర్‌పీఎఫ్‌సీ) నిర్ణయం తీసుకుంటారు. పనిచేసిన కంపెనీ మూతబడిన సందర్భాల్లో యూఏఎన్‌ లేనివారు పీఎఫ్‌ కార్యాలయాల్లో దాన్ని తీసుకోవాలి. చందాదారు చనిపోయినపుడు.. ఫారం-2లో పేర్కొన్న నామినీ పేరిట ఈ-కేవైసీ చేసి నగదు క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశమివ్వవచ్చు. నామినీ పేరును పేర్కొనకుంటే.. చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్‌ దాఖలు చేయవచ్చు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Gold Rate Today : ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! కిలో వెండిపై రూ.3200 తగ్గింది

0

Gold Rate Today : గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కేంద్ర బడ్జెట్‌ 2024 సందర్భంగా భారీగా తగ్గిన పుత్తడి రేట్స్.. వరుసగా పెరుగుతూ వచ్చాయి. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 తగ్గి.. రూ.63,900లుగా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారంపై రూ.870 తగ్గి.. రూ.69,710గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3200 తగ్గి.. బులియన్ మార్కెట్‌లోనేడు కిలో వెండి రూ.82,500గా ఉంది.

Gold Rate Today

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.63,900
విజయవాడ – రూ.63,900
ఢిల్లీ – రూ.64,050
చెన్నై – రూ.64,000
బెంగళూరు – రూ.63,900
ముంబై – రూ.63,900
కోల్‌కతా – రూ.63,900

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,710
విజయవాడ – రూ.69,710
ఢిల్లీ – రూ.69,860
చెన్నై – రూ.89,820
బెంగళూరు – రూ.69,710
ముంబై – రూ.69,710
కోల్‌కతా – రూ.69,710

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.87,500
విజయవాడ – రూ.87,500
ఢిల్లీ – రూ.82,500
ముంబై – రూ.82,500
చెన్నై – రూ.87,500
కోల్‎కతా – రూ.82,500
బెంగళూరు – రూ.83,500

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Toe Rings Reason : పెళ్ళైన స్త్రీలు ఎందుకు మెట్టెలు తొడుగుతారో తెలుసా..! దీని వెనుక సైంటిఫి రీజన్ ఏమిటంటే?

Toe Rings Reason పెళ్లి రోజున వరుడు లేదా మేన మామ నవ వధువు కాలి వేలుకి మెట్టెలు పెట్టడం ప్రాచీన సంప్రదాయం. ఇలా మెట్టేలను ధరించే సాంప్రదాయం వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Toe Rings Reason

ఒక అమ్మాయికి పెళ్లి అయ్యింది అంటే కాలికి మెట్టెలు ఉన్నాయా అని చూస్తారు. ఇలా పెళ్లయిన స్త్రీలు మెట్టెలు ధరించడం వెనుక ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది. ఇది కొందరికి అతిశయోక్తిలా అనిపించవచ్చు. చాలా మంది ఈ నమ్మకాన్ని నమ్మకపోవచ్చు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.

సాధారణంగా పాదం బొటన వేలు పక్కన్న ఉన్న వేలికి అంటే రెండవ కాలి వేలుకి మెట్టేలను ధరిస్తారు. ఎందుకంటే రెండవ వేలు నుండి ఒక నిర్దిష్ట నాడి గర్భాశయానికి అనుసంధానించబడి గుండె గుండా వెళుతుంది.

ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరించడం ద్వారా గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రుతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది.

రెండో కాలివేలుకి మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయం బలపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది మాతృత్వం సమయంలో స్త్రీకి సహాయపడుతుంది.

అంతేకాదు వెండి మంచి లోహం. కాలికి పెట్టుకున్న వెండి మెట్టెలు భూమి నుండి సౌర శక్తిని గ్రహిస్తుంది. శరీరానికి వ్యాపిస్తుంది. కనుక వివాహమైన స్త్రీ కాలికి మెట్టెలు పెట్టుకోవడం మంచిదని చెబుతారు.

వెండి ధ‌రిస్తే శ‌రీరం చల్లగా ఉంటుంది. అందుకే వెండి మెట్టెల‌నే పెట్టుకోవాలి. అంతేకాదు బంగారం, వంటి ఇతర లోహాలతో తయారు చేసిన మెట్టెలను మాత్రం పెట్టుకోవద్దు. ఇలా చేయడం వలన
నెగిటివ్ ఎన‌ర్జీ క‌లుగుతుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Telangana Students విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ఆ విషయంపై మరింత ఫోకస్!

0

Telangana Students గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలు ప్రారంభించారు. త్వరలో అర్హులైన మహిళలకు రూ.2500 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

Telangana Students

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతపై ప్రభుత్వం మరింత ఫోక్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పాఠశాలల పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పరిశ్రభుత బాధ్యతలను ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ కి అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతపై దృష్టి సారించిన నేపథ్యంలో పారిశుద్ద్య పనుల కోసం ప్రభుత్వం గ్రాంట్ ని మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంట్ ని రిలీజ్ చేసింది.

పది నెలలకు కలిపి ఒకేసారి ఆయా పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. 30 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.3 వేల, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.6 వేలు, 101 నుంచి 250 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.8 వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.12 వేలు, 750 విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలకు రూ.20 వేల చొప్పన ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.ఇకపై పాఠశాలల్లో ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం కనిపించకూడదని, పిల్లలు చక్కటి వాతావరణంలో విద్యనభ్యసించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినా.. అపరిశుభ్ర వాతావరణం కనిపించినా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Horoscope Today : వారికి హ్యాపీగా, సాఫీగా కుటుంబ జీవితం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Horoscope Today దిన ఫలాలు (ఆగస్టు 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందే సూచన లున్నాయి. మిథున రాశి వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆస్తి వ్యవహారాలతో పాటు ఆర్థిక వ్యవహారాల్లో కూడా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. స్తోమతకు మించి మిత్రులకు సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పుంజుకుంటాయి. ఉద్యోగ ప్రయ త్నాలు ఫలించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఇష్టమైన పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. దూర ప్రాంతం నుంచి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికా రులకు నమ్మకం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గ్రహ బలం బాగా అనుకూ లంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. రావలసిన డబ్బు సకాలంలో అందు తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. దైవ కార్యాల్లోనూ, సమాజ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. పెళ్లి ప్రయత్నాల విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన కబురు అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పిల్లలు కొద్ది శ్రమతో చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఉపయోగం ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. బంధువులు కొందరు లేని పోని విమర్శలు సాగించే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో తేలికగా విజయాలు సాధిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇష్టమైన మిత్రుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు లభిస్తాయి. ప్రముఖుల పరిచయాలు ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణముం టుంది. ఆదాయపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధి స్తారు. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలను విస్తరించాలన్న ఆలోచన చేస్తారు. అనుకోకుండా ధన లాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీది బండిలా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధించడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొన్ని కీలకమైన వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి మానసిక ఒత్తిడి కలిగిస్తుంది. ధనపరంగా ఒడిదుడుకుల నుంచి చాలావరకు బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అనుకోకుండా ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొన్ని ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికర ఫలితాలినిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహా రాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగి, కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. వ్యక్తి గత సమస్యలను కూడా చాలావరకు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకున్న పనుల్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికర ఫలితాలనిస్తాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి లోటుండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. అధిక శ్రమతో గానీ పనులు పూర్తి కావు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఎవరితోనూ తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. పిల్లల చదువులు అభివృద్ధి బాటపడతాయి. బంధు వుల నుంచి ఊహించని శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపో తాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు మీకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.