Tuesday, January 6, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EmployeesEPF Personal Details Edit Option :...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

EPF Personal Details Edit Option : ఈపీఎఫ్‌లో వ్యక్తిగత వివరాల సవరణలకు అవకాశం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

EPF Personal Details Edit Option ఈపీఎఫ్‌ చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్‌ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్‌వో స్వల్ప మార్పులు చేసింది.

[ad_1]

EPF Personal Details Edit Option

పేరులో మూడక్షరాలు దాటితేనే పెద్ద మార్పుగా పరిగణన

లావాదేవీలు నిర్వహించని ఖాతాల క్లెయిమ్‌లపై కొత్త విధివిధానాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌ చందాదారుల వ్యక్తిగత వివరాల్లో మార్పులు.. లావాదేవీలు నిర్వహించని పీఎఫ్‌ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్‌వో స్వల్ప మార్పులు చేసింది. ఖాతాదారు, తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి పేర్లలో తప్పులు దొర్లితే జాయింట్‌ డిక్లరేషన్ల ద్వారా సవరణలకు అవకాశం కల్పించింది. పేరులో రెండు అక్షరాలకు మించి సవరణ చేయాల్సి ఉంటే గతంలో ‘పెద్ద(మేజర్‌) మార్పు’గా పరిగణించేవారు. ఇప్పుడు ఆ పరిమితిని 3 అక్షరాలకు కుదించారు. స్పెల్లింగ్‌ పరంగా చేయాల్సిన మార్పులకు, పూర్తి పేరు నమోదు చేసుకునేందుకు అక్షరాల పరిమితిని తొలగించింది. చేయాల్సిన మార్పులు మూడక్షరాలకు తక్కువగా ఉన్నా.. వివాహం తరువాత జీవిత భాగస్వామి ఇంటి పేరు మార్చాల్సి ఉన్నా వాటిని చిన్న సవరణలుగానే పేర్కొంది.

 

లావాదేవీలు లేని ఖాతాలపై…

    • ఏళ్లుగా లావాదేవీలు లేని పీఎఫ్‌ ఖాతాల్లో నుంచి నగదు ఉపసంహరణలో ఇబ్బందులతో పాటు మోసాల నివారణకు ఈ-కేవైసీ బయోమెట్రిక్‌ ధ్రువీకరణను ఈపీఎఫ్‌వో తప్పనిసరి చేసింది. 
    • లావాదేవీలు లేని ఖాతాల్లో ఎక్కువ వాటికి యూనివర్సల్‌ అకౌంట్‌ నంబరు(యూఏఎన్‌) లేదు. ఈ తరహా కేసుల్లో ఖాతాదారులు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి లేదా ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ తీసుకుని బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పోర్టల్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే చాలు.. పీఎఫ్‌ సిబ్బందికి ఇంటికే వచ్చి యూఏఎన్‌ను సిద్ధం చేస్తారు.  
    • చందాదారుడి ఖాతాలో నగదు నిల్వ రూ.లక్ష కన్నా తక్కువగా ఉంటే సంబంధిత అకౌంట్స్‌ అధికారి(ఏవో), రూ.లక్ష కన్నా ఎక్కువగా ఉంటే సహాయ పీఎఫ్‌ కమిషనర్‌(ఏపీఎఫ్‌సీ) లేదా ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌(ఆర్‌పీఎఫ్‌సీ) నిర్ణయం తీసుకుంటారు. పనిచేసిన కంపెనీ మూతబడిన సందర్భాల్లో యూఏఎన్‌ లేనివారు పీఎఫ్‌ కార్యాలయాల్లో దాన్ని తీసుకోవాలి. చందాదారు చనిపోయినపుడు.. ఫారం-2లో పేర్కొన్న నామినీ పేరిట ఈ-కేవైసీ చేసి నగదు క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశమివ్వవచ్చు. నామినీ పేరును పేర్కొనకుంటే.. చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్‌ దాఖలు చేయవచ్చు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this