EntertainmentFantasy Thriller in OTT భూమికి ఆకాశానికి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Fantasy Thriller in OTT భూమికి ఆకాశానికి మధ్య వింత రాక్షస ప్రపంచం.. OTT లో బెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Fantasy Thriller in OTT ఈ సినిమా ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇంకా ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. సైన్స్ ఫిక్షన్ , యాక్షన్, అడ్వెంచర్ మూవీస్ ను ఈ మధ్య ప్రేక్షకులంతా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ మంచి ఫాంటసీ థ్రిల్లర్ మూవీ చూడాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

Fantasy Thriller in OTT

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక చిన్న పిల్లోడు బుక్ చదువుతూ ఉండడంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అతని పేరు జాక్ . అతనికి మహారాజుల కథలన్నా , ప్రపంచం గురించి తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం . అయితే జాక్ ఎప్పుడు ఒక మహారాజు కథను వింటూ ఉండేవాడు. అది ఎలాంటిదంటే ప్రపంచం మొత్తం మహారాజుల పెత్తనంలో ఉండేది. ఆ సమయంలో కొంతమంది పాస్టర్లు విత్తనాలు తయారు చేసి వాటిని భూమిలో వేస్తారు. దాని ద్వారా ఆకాశంలోకి వెళ్లి దేవుడిని కలవచ్చని అనుకుంటారు. ఆ విత్తనం ద్వారా చాలా పెద్ద మొక్క తయారౌతుంది. వీరంతా కూడా దాని ద్వారా దేవుడిని కలవడానికి బయల్దేరతారు. ఈ క్రమంలో భూమికి ఆకాశానికి మధ్య మరొక వింత ప్రపంచం ఉన్నట్లు వారు గుర్తిస్తారు. అది చాలా భయంకరమైన ప్లేస్.. అక్కడ మనుషుల కంటే పెద్దగా కనిపించే జైంట్స్ ఉంటారు. ఆ జైంట్స్ మనుషులను చూసిన తర్వాత వాటికి భూమి మీదకు వెళ్లే మార్గం తెలిసిపోతుంది. దీనితో అవి వెంటనే భూమి మీదకు వచ్చి.. అన్నిటిని నాశనం చేయడం స్టార్ట్ చేస్తాయి. మనుషులను చంపేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తాయి.

దీనితో అక్కడ మహారాజు సహాయకులు ఆ జెయింట్స్ ను చంపేస్తాడు. విత్తనాలు తయారు చేసిన పాస్టర్లు ఆ జైంట్ గుండె తీసి ఒక కిరీటం తయారు చేస్తాడు. ఆ కిరీటం పెట్టుకుని మహారాజు మిగిలిన జెయింట్స్ ముందుకు వెళ్ళగానే.. అవన్నీ కూడా రాజు ముందు తల వంచుకు నుంచుని.. బానిసలైపోతాయి. దీనితో మహారాజు వాటిని తిరిగి వాటి లోకానికి వెళ్లిపోవాలని ఆదేశించి. అవి వెళ్ళిపోయినా వెంటనే చెట్టును నరికించేస్తాడు. ఇక రాజు చనిపోయినా తర్వాత అతనితో పాటు ఆ విత్తనాలను, కిరీటాన్ని కూడా అతనితోనే పూడ్చేస్తారు. ఇలా ఈ కథ అంటే జాక్ కు చాలా ఇష్టం. జాక్ మదర్ ఒక మహారాజు కుటుంబానికి చెందినది. ఇదంతా కూడా ఆమె కుటుంబం కథే. కట్ చేస్తే మూవీ స్టోరీని పదేళ్ల తర్వాత చూపిస్తారు. ఇక్కడ జాక్ కు ఇసా బెల్లా అనే ఒక ప్రిన్సెస్ కనిపిస్తుంది. ఇక ప్రిన్సెస్ కు తన కోటకు వెళ్లిన తర్వాత.. అక్కడ ఆమెకు ఒక కిరీటం కనిపిస్తుంది. అది చనిపోయిన ఆ మహారాజు కిరీటం.

ఇక జాక్ తన గుర్రాన్ని అమ్మడానికి ఒక ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత.. ఒక పాస్టర్ అతినికి డబ్బులకు బదులుగా కొన్ని విత్తనాలు ఇచ్చి.. వాటిని ఎట్టి పరిస్థితిలో నీటిలో తడపొద్దు అని చెప్తాడు. మరో వైపు ప్రిన్సెస్ తనతో పాటు ఆ కిరీటాన్ని తీసుకుని వచ్చి.. అనుకోకుండా జాక్ ఇంట్లో చిక్కుకుపోవడం. . అలాగే జాక్ దగ్గర ఉన్న విత్తనాలకు నీరు తగలడంతో.. ఆ ఇంటితో పాటు ఓ పెద్ద చెట్టు పెరిగిపోతుంది. అచ్చం ఆ కథలో చెప్పిన దానిలానే జరుగుతుంది. దీనితో మళ్ళీ ఆ జెయింట్స్ భూమి మీదకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది ? ఆ జెయింట్స్ భూమి మీదకు రావడం వలన ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ? వారి వద్ద ఉన్న కిరీటాన్ని వారు ఉపయోగించుకున్నారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే.. “జాక్ ది జైంట్ స్లేయర్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే తెలుగులో చూడాలంటే అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే. వెంటనే చూసేయండి. ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this