Sukanya Samriddhi Yojana ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం అప్పుడే పుట్టిన పిల్లల నుండి 10 సంవత్సరాల్లోపు ఉన్న ఆడపిల్లలకు, ప్రతి నెల రూ.250 నుండి ఆపై ఎంతైనా జమ చేస్తే , దాన్నిబట్టి మనకు 15 సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని నకిరేకల్ సబ్ పోస్ట్ మాస్టర్ రమేష్ లోకల్ 18 ద్వారా తెలియజేశాడు.
april 26, 2026, 10:26 pm - duniya360
వివరాల్లోకెళ్తే… సూర్యాపేట డివిజన్ నకిరేకల్ సబ్ పోస్ట్ మాస్టర్ రమేష్.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుండి పది సంవత్సరాలు లోపు ఆడపిల్ల ఈ పథకానికి అర్హులు అయితారు.
అలాగే వారు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. దీనితో పాటు పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అకౌంట్ ఫామ్ నింపి అకౌంట్ ఓపెన్ చేయాలి. వీటితోపాటు తల్లి గాని తండ్రి గాని పాన్ కార్డు ఆధార్ కార్డు కూడా జమ చేయాలి. సుకన్య సమృద్ధి యోజన ప్రతి నెల పొదుపు రూ .250 నుండి మొదలవుతుంది.
ఒక సంవత్సరం లోపు లక్షన్నర వరకు కుటుంబ శక్తి మేరకు పొదుపు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా వడ్డీ కల్పిస్తుంది ఈ పథకానికి. ఈ యొక్క పథకం అనేది దాదాపు 15 సంవత్సరాలు కట్టాలి. ఆ తర్వాత పై చదువుల కోసం ఎడ్యుకేషన్ లోను కూడా తీసుకోవచ్చు. ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు కడితే అవి రూ.1,80,000 అవుతాయి.
భారత ప్రభుత్వం వడ్డీతో కలుపుకొని రూ .5 లక్షల 50 వేలు ఇవ్వడం జరుగుతుంది. ఆడపిల్ల పుట్టడం భారమే కాదు అదృష్టం కూడా ఇప్పుడు భావించవచ్చు, ఇట్లాంటి కేంద్ర పథకాలు ఆడపిల్లలున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ వినియోగించుకోవాలని లోకల్ 18 ద్వారా తెలియజేశారు.
ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పేరుతో కొత్త పింఛన్ పథకం
మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
ఈ కేంద్ర పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర
april 26, 2026, 10:26 pm - duniya360
UPS Implementation కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రకటించిన ఒక రోజు తర్వాత.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర ఉద్యోగుల కోసం కూడా ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కేంద్ర పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ పథకానికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అటువంటి పరిస్థితిలో.. రాష్ట్రంలో కొత్త పెన్షన్ స్కీమ్ (NPS) బదులుగా యూపీఎస్ అమలుకు మార్గం సుగమం చేయబడింది.
కాగా.. ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) పేరుతో కొత్త పింఛన్ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో 50 శాతం కచ్చితంగా పింఛన్ రూపంలో అందుతుంది.
23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పింఛన్ పథకం వర్తిస్తుంది. 2004లో తీసుకువచ్చిన కొత్త పింఛన్ పథకాన్ని(ఎన్‌పీఎస్) రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్‌లో కేంద్రం టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం రూపొందించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
We want OPS కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో (యూనిఫైడ్ పెన్షన్ స్కీం) యుపిఎస్ అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అదనంగా వనగూరే ప్రయోజనం ఏమీ లేదని, కావున పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని, వేరొక దాన్ని అంగీకరించేది లేదని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
april 26, 2026, 10:26 pm - duniya360
We want OPS
ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన యుటిఎఫ్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన జిల్లా స్వర్ణోత్సవాలకు సంబంధించి తన గోడ పత్రికను ఉపాధ్యాయ సంఘాలకు నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగి ఎలాంటి కంట్రిబ్యూషన్ చెల్లించకుండా ఇచ్చే పాత పెన్షన్‌ను పునరుద్ధరించకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి ప్రయత్నించిన జిపిఎస్ లాంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్నారు.
ఈ విధానంలో కన్యుకేషన్ పెరిగిన పిఆర్‌సిలు, డిఎ విషయాలు లేవని తెలిపారు. 10 శాతం ఉద్యోగుల నుంచి కట్టించుకునే సొమ్ము షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల ఉద్యోగులకు ఉపయోగం కాదని తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్.మురళీమోహనరావు, ఎస్.కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యారంగా సంస్కరణ వల్ల ప్రభుత్వ విద్యారంగం విచ్ఛిన్నమై విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు.
పని సర్దుబాటు అవసరం మేరకు చేస్తామని చెప్పి ఇప్పుడు గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. అలాగే అక్టోబర్ 20, 21 తేదీల్లో జరిగే జిల్లా స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ.భాస్కరరావు, సహాధ్యక్షులు వి.జ్యోతి, కోశాధికారి కె.మురళి, రాష్ట్ర కార్యదర్శి ఆర్.మోహన్‌రావు పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి : ఎపిటిఎఫ్‌కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీం పేరుతో ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ వంటిదేనని, సర్వీసు వ్యవధితో సంబంధం లేకుండా అందరికీ పాత పెన్షన్ వర్తింపజేయడమే న్యాయ సమ్మతమని ఎపిటిఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్, బాలకష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీముకు మరో రూపమే తప్ప పాత పెన్షన్ విధానం కాదన్నారు. సిపిఎస్ వలే ఉద్యోగి జీతంలో నుండి 10శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న కొత్త పెన్షన్స్ పథకాన్ని ఎపిటిఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఉద్యోగులకు ప్రతికూలమైన ఈ పథకాన్ని తిరస్కరిస్తూ పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Anand Mahindra పేపర్ ప్లేన్ తయారీకి సంబంధించిన ఓ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను బాగా ఆకట్టుకుంది. వీడియో తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చిందని ఆయన అన్నారు. వీడియోలోని టెక్నిక్ తనకు చిన్నప్పుడు తెలిసుంటే నాటి పోటీల్లో తానే నెం.1గా నిలిచేవాడినని కామెంట్ చేశారు.
Anand Mahindra ఎవరి జీవితంలోనైనా చిన్నతనం అత్యంత ప్రత్యేకమైనది. ఎన్నేళ్లు వచ్చినా కూడా చిన్నతనం గుర్తుకు రాగానే మోముపై నవ్వులు విరబూస్తాయి. ఆ స్నేహాలు, ఆటలు, గిల్లికజ్జాలు గుర్తుకు తెచ్చుకుని మరీ మైమరిచిపోయేవారూ ఉంటారు. అయితే, తాజాగా నెట్టింట వైరల్ (Viral) అవుతున్న ఓ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. వీడియోలో చూపించిన టెక్నిక్ తనకు చిన్నప్పుడు తెలిసుంటే ప్రతిపోటీలో తానే ముందుండెవాణ్ణని ఆయన కామెంట్ చేశారు. నెటిజన్లను ప్రస్తుతం అమితంగా ఆకర్షిస్తున్న ఈ వీడియో పూర్తి వివరాల్లోకి వెళితే..
కాగితపు విమానాల వీడియోను ఆనంద్ మహీంద్రా తాజాగా పంచుకున్నారు. వీడియోలోని వ్యక్తి సరికొత్త డిజైన్‌లో కాగితపు విమానాన్ని తయారు చేశాడు. అతడి డిజైన్ కారణంగా విమానం చాలా దూరమే ఎగిరింది. అసలు అది కిందపడే అవకాశమేలేదన్నంత రేంజ్‌లో విమానం గాల్లో దూసుకుపోయింది. ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఈ కాలం పిల్లలకు కాగితపు విమానాలపై ఆసక్తి ఉందో లేదో తెలీదు కానీ నా స్కూలు రోజుల్లో మేమందరం వీటితో ఆడే ఆటల్లో ముగినితేలేవాళ్లం. ఇతరుల పేపర్ ప్లేన్ల కంటే ఎక్కువ దూరం వెళ్లేలా ప్లేన్ డిజైన్ చేసేందుకు ఉత్సాహం చూపేవాళ్లం. కానీ ఈ వీడియోలోని డిజైన్ నాకు చిన్నప్పుడే తెలిసుంటే అన్ని పోటీల్లో నేనే గెలిచుండేవాణ్ణి. ఆదివారాలు ఇలాంటి పనుల చేసేందుకు సరైన సమయం’’ అని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.
ఈ పోస్టు నెటిజన్లకు తమ చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చింది. దీంతో, వారు వందలకొద్దీ కామెంట్స్ గుప్పించారు. తామూ చిన్నతనంలో ఇలాంటి ప్లేన్లు తయారు చేసేవారమని అనేక మంది చెప్పుకొచ్చారు. చిన్నతనంలో వీటితో ఆడిన ఆటలు ఇప్పటికీ గుర్తున్నాయని మరికొందరు చెప్పుకొచ్చారు. తాను కాలేజీ రోజుల్లో కూడా ఇలాంటి ప్లేన్లు చేశానని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. నేటి తరం వీడియో గేమ్స్ కంటే ఇవే మంచి వ్యాపకంగా ఉండేవని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలోని పేపర్ ప్లేన్ తాయరీ టెక్నిక్ అనేక మందికి నచ్చిడంతో దీన్ని తెగ రీట్వీట్ చేస్తున్నారు.
Don’t know if kids are still interested but in my school days designing the farthest travelling paper plane was a preoccupation
Wish I had seen this design in those days… would have handily won the competition. #Sunday is perfect for paper planes…pic.twitter.com/jifbSuwtxy
Krishnastami Specials పండుగలకి ఆయా ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయ వంటకాలు చేయడం సహజం. అయితే అదే పండుగకి పక్క రాష్ట్రాల్లో చేసే సంప్రదాయ వంటకాలను కూడా ట్రై చేస్తే బాగుంటుంది.అలాంటివే ఇవి కూడా.. రేపు అంటే ఆగస్టు 26న శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినాన ఈ వెరైటీ వంటకాలు వండి రుచి చూడండి.
april 26, 2026, 10:26 pm - duniya360
Krishnastami Specials
వెన్న ఉండలు
కావాల్సినవి :
బియ్యప్పిండి – ఒక కప్పు మినప్పిండి – ఒక టేబుల్ స్పూన్ వెన్న – రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి – ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర – ఒక టీస్పూన్ ఇంగువ – పావు టీస్పూన్ నీళ్లు – సరిపడా నూనె – వేగించడానికి సరిపడా నువ్వులు – ఒక టీస్పూన్ (ఇష్టపడితే)
తయారీ : ఒక పాన్‌లో బియ్యప్పిండి వేసి రెండు నిమిషాలు వేగించి పిండిని ఒక ప్లేట్లోకి తీయాలి. అదే పాన్‌లో మినప్పిండి వేగించాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, మినప్పిండి వేసి కలపాలి. పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన కొబ్బరిని పాన్‌లో వేసి తేమపోయేవరకు వేగించాలి. తరువాత దాన్ని కూడా బియ్యప్పిండి మిశ్రమంలో వేసి కలపాలి. అందులో వెన్న, ఉప్పు, జీలకర్ర, ఇంగువ వేసి కలిపి ముద్ద చేసి, ఉండలు చేయాలి. ఆ ఉండల్ని పొడి బట్ట మీద అరగంట ఆరబెట్టాలి. పాన్‌లో నూనె వేడి చేయాలి. అందులో రెడీ చేసిన ఉండల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఒక పళ్లెంలో టిష్యూ పేపర్ వేసి, వేగించిన ఉండలు దానిమీద వేసి చల్లారబెట్టాలి.
గోపాలకలా
కావాల్సినవి :
పోహా (అటుకులు) – రెండు కప్పులు పెరుగు – అర కప్పు పాలు – ఒక కప్పు ఉప్పు – సరిపడా నెయ్యి – ఒక టీస్పూన్ ఆవాలు – పావు టీస్పూన్ మినప్పప్పు – అర టీస్పూన్ జీలకర్ర – పావు టీస్పూన్ ఇంగువ – చిటికెడు కరివేపాకు, కొత్తిమీర – కొంచెం పచ్చిమిర్చి – ఒకటి కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక గిన్నెలో పోహా వేసి అందులో పాలు, నీళ్లు పోయాలి. పెరుగు కూడా వేసి బాగా కలపాలి. తరువాత ఉప్పు వేసి మరోసారి కలపాలి. ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేగించాలి. ఆ తాలింపును పోహా మిశ్రమంలో వేసి కలపాలి. ఈ వంటకాన్ని చల్లారాక తింటేనే టేస్టీగా ఉంటుంది.
పోహా స్వీట్ పొంగల్
కావాల్సినవి :
పోహా (అటుకులు) – ఒక కప్పు పెసరపప్పు – పావు కప్పు నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు నీళ్లు – ఒకటిన్నర కప్పు జీడిపప్పులు – మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర, మిరియాలు – ఒక్కో టీస్పూన్ కరివేపాకు – కొంచెం పచ్చిమిర్చి – రెండు
తయారీ : పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేయాలి. అందులో పెసరపప్పు వేసి ఒక నిమిషం వేగించాలి. అందులో నీళ్లు పోసి తెర్లాక తీసేయాలి. మరో పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి పోహా వేగించాలి. తర్వాత నీళ్లు పోసి ఉడికించాలి. అవి ఉడికాక, పెసరపప్పు వేసి కలపాలి. మరో పాన్‌లో నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పులు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేగించాలి. వాటిని పొంగల్ మిశ్రమం పై పోసి, బాగా కలపాలి. పొంగల్ బాగా ఉడికాక స్టవ్ ఆపేయాలి.
మిక్స్‌డ్‌ఫ్రూట్ కేసరి
కావాల్సినవి :
బొంబాయి రవ్వ, నీళ్లు, పాలు – ఒక్కో కప్పు చొప్పున చక్కెర – ఒకటిన్నర కప్పు నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు యాపిల్, ఆరెంజ్, అరటి పండ్ల ముక్కలు – ఒక్కోటి పావు కప్పు దానిమ్మ గింజలు, ద్రాక్షలు – ఒక్కోటి పావు కప్పు బాదం, జీడిపప్పులు – ఒక్కోటి పది చొప్పున ఎండుద్రాక్ష- రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి – ఒక టీస్పూన్
తయారీ : ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి బాదం, జీడిపప్పులు, కిస్మిస్ వేగించి ప్లేట్లోకి తీయాలి. అదే నెయ్యిలో యాపిల్, ఆరెంజ్, అరటి పండ్ల ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్షలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఒక పాలగిన్నెలో పాలు, నీళ్లు పోసి కాగబెట్టాలి. పాలు మరిగాక వేగించిన పండ్లన్నీ అందులో వేసి ఉడికించాలి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మరో పాన్‌లో బొంబాయి రవ్వ, చక్కెర వేగించాలి. అందులో పాలు, పండ్ల మిశ్రమం వేసి కలుపుతూ ఉండాలి. మిశ్రమం గట్టి పడ్డాక యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి, బాదం, జీడిపప్పులు, ఎండుద్రాక్ష వేసి కలపాలి.
పెసర పాయసం
కావాల్సినవి :
పెసరపప్పు – ఒక కప్పు బెల్లం – ఒక కప్పు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు – మూడున్నర కప్పులు జీడిపప్పు పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు ఎండుద్రాక్ష – రెండు టేబుల్ స్పూన్లు యాలకులు – నాలుగు
తయారీ : పాన్‌లో నెయ్యి వేడి చేయాలి. అందులో జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి వేగించి పక్కనపెట్టాలి. అదే పాన్‌లో పెసరపప్పును రెండు నిమిషాలు వేగించాలి. అందులోనే కొబ్బరి పాలు పోసి అవి మరిగాక, యాలకులు వేసి పావుగంట పెసరపప్పును ఉడికించాలి. ఆ తర్వాత బెల్లం వేసి ఐదు నిమిషాలు బాగా కలపాలి. అవసరం అనిపిస్తే మరికొన్ని కొబ్బరి పాలు పోసి కలపాలి. తరువాత పెసర పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసి మిగిలిన నెయ్యితోపాటు జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి కలపాలి. వేడి వేడి పెసర పాయసం రెడీ.
Knowledge OK ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, నో మెసేజ్ పంపేటప్పుడు ఓకే అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే సరే అనే పదం ఎక్కడ నుండి వచ్చింది దాని అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
april 26, 2026, 10:26 pm - duniya360
స్మిత్సోనియన్ మ్యాగజైన్‌లోని కథనం ప్రకారం, OK అనే పదానికి తప్పు అని అర్థం. కానీ కాలక్రమేణా, ప్రజలు AC (ఆల్ కరెక్ట్) అనే పదానికి బదులుగా ఓకే అనే పదాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభించారు.
Knowledge OK 182 సంవత్సరాల క్రితం, అమెరికన్ జర్నలిస్ట్ చార్లెస్ గోర్డాన్ గ్రీన్ మొదటిసారి ఓకే అనే పదాన్ని ఉపయోగించారు. తరువాత 1839లో, చాలా మంది రచయితలు వివిధ ఆంగ్ల పదాల సంక్షిప్త రూపాలను ఉపయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు మనం వాడుతున్న LOL లాగా, అప్పట్లో OK వాడేవారు.
OK అంటే గ్రీకులో ‘ఆల్ ఈజ్ వెల్’ అని అర్థం. దీనినే మనం క్లుప్తంగా ఓకే అంటాం.
అయితే, HuffPost నివేదించినట్లుగా, ‘OK’ అనేది ‘Okeh’ అనే పదం నుండి వచ్చింది. ఈ పదాన్ని అమెరికాలోని చోక్టావ్ తెగ వారు ఉపయోగిస్తున్నారని చెబుతారు.
అయితే, ఓకే అనే పదం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1840లో, US అధ్యక్షుడు మార్టిన్ వాన్ బ్యూరెన్ తన ఎన్నికల ప్రచారంలో Ok అనే పదాన్ని ఉపయోగించారు. వాన్ బ్యూరెన్ యొక్క మారుపేరు ‘ఓల్డ్ కిండర్‌హుక్’. ప్రచారానికి ఓకే అనే పదాన్ని సంక్షిప్తలిపిగా వాడుకున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ‘ఓకే క్లబ్’ కూడా ప్రారంభమైంది.
Knowledge OK అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనే దానితో సంబంధం లేకుండా ఈ రోజుల్లో మనం ఎక్కువగా వాడుతున్నాం. అలాగే ఓకే అంటే ఏమిటో ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఎవరైనా దేనికైనా సరే చెబితే, మీరు కూడా అతనికి ఓకే చెప్పవచ్చు.
Rain Alert in Telugu States తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగాల 2 రోజులలో తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. తెలంగాణలో మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు కురవనున్నాయి. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో వనపర్తి జిల్లా రేవెల్లిలో అత్యధికంగా 9.65 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
april 26, 2026, 10:26 pm - duniya360
Rain Alert in Telugu States
మరోవైపు వర్షాల దాటికి రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు గరిష్టంగా ప్రబలుతున్నాయి. జూలై 1 నుంచి ఆగస్టు 18 మధ్యకాలంలో రాష్ట్రంలో మూడువేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 32 వేల కేసులు నమోదయ్యాయి. అంటే జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో కేసులు పదిశాతం మేర ఉన్నయాన్నమాట. అందులో అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం గమనార్హం. డెంగీతో పాటు ఇతర సీజనల్ వ్యాధులూ వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రోగులతో సర్కారు దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యపరీక్షల కిట్ల కొరత కారణంగా బాధితులను ప్రైవేటు కేంద్రాలకు పంపిస్తున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో కామారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాలలో డెంగీ జ్వరాల తీవ్రతకు గురై ఐదుగురు మృత్యువాత పడ్డారు.
గతంలోనూ వైరల్ జ్వరాలు వచ్చేవని.. అయితే అవి మందులు వేసుకున్నా లేకున్నా మూడు నాలుగురోజులు తర్వాత తగ్గేవని, ఇప్పుడు పది రోజులవుతున్నా జ్వరాలు తగ్గడం లేదని, శరీరంలో ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా త్వరగా పడిపోతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ఈ జ్వరాల బారిన పడి మృతి చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ విభాగాన్ని పటిష్టవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీధులపై ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త, నీటి నిల్వలతో డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను యుద్ధ ప్రాతిపదికన నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
Monkeypox : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాల్లో చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న ఈ మంకీపాక్స్ వైరస్‌కు చికిత్స లేకపోవడంతో ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మంకీపాక్స్ వైరస్ పట్ల ప్రపంచ దేశాలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే ఈ మంకీపాక్స్ వైరస్.. ఇప్పుడు మన ఆసియా ఖండంలోకి విస్తరించింది. మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో మంకీపాక్స్ కేసులు నమోదవుతుండటంతో భారత్‌లోనూ తీవ్ర ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు అడ్వైజరీలు జారీ చేసింది. ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.
april 26, 2026, 10:26 pm - duniya360
Monkeypox
అయితే గతంలోనూ ఈ మంకీపాక్స్ వైరస్ ఉన్నా.. ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒకప్పుడు మంకీపాక్స్‌గా పిలిచిన ఈ వైరస్‌ను.. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇటీవల ఎమ్‌పాక్స్ అని పేరు మార్చింది. ఈ ఎమ్‌పాక్స్ సోకి ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారని.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికా ఖండం అంతటా ఈ మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ఇది ఇతర ఖండాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
Monkeypox ఇప్పటివరకు ఆఫ్రికాలో 14 వేల కంటే ఎక్కువ కేసులు.. 524 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే మంకీపాక్స్ కేసులు, మరణాలు ఈసారి భారీగా పెరిగిపోయాయని.. డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇక ఆఫ్రికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఈ ఎమ్‌పాక్స్‌ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ ఎమ్‌పాక్స్‌ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేయడం సహా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే మరోసారి ప్రపంచంలో లాక్‌డౌన్లు విధించే అవకాశాలు లేకపోలేదని.. నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక ఎవరైనా దద్దుర్లు ఉన్న రోగులను గుర్తిస్తే.. వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందించాలని ఆస్పత్రులను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని 3 నోడల్ ఆస్పత్రులైన సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లలో ఎమ్‌పాక్స్ కోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ Monkeypox ఎమ్‌పాక్స్ కూడా కొవిడ్ వైరస్ లక్షణాలు ఉంటాయి. ఎమ్‌పాక్స్ వైరస్ సోకిన వారికి దగ్గు, ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. కానీ కరోనాతో పోలిస్తే కొన్ని ప్రాథమికంగా లక్షణాల్లో తేడా ఉంటుంది.
మీ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ యూజర్ ఐడి ని ఈ క్రింది లింక్ లో తెలుసు కొండి. జిల్లా >> మండలం సెలెక్ట్ చేయగానే ఆ మండలం లో సచివాలయాలు చూపిస్తాయి. మీకు కావల్సిన సచివాలయ కోడ్ మీద క్లిక్ చేస్తే WEA ఐడి తెలుస్తుంది. https://app.newstone.in/ammavodi/inactive/scode.php