Home Blog Page 54

Garuda Puranam Punishments : గరుడ పురాణంలో ప్రతి పాపాలకు ఏ శిక్షలు విధిస్తారో తెలుసా..

0

రామాయణం, మహాభారతం వంటి హిందూ పురాణ గ్రంథాలు మనిషి జీవితం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి.. తప్పు ఒప్పులను గురించి తెలియజేస్తే.. గరుడ పురాణం మనిషి ఇలలో చేసిన తప్పులకు మరణం తర్వాత పడే శిక్షలను తెలియజేస్తుంది. హిందూ మతంలోని ముఖ్యమైన గ్రంథాలలో ఒకటైన గరుడ పురాణంలో మరణం, పాప పుణ్యాలు, స్వర్గం, నరకం.. మోక్షం.. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తుంది. గరుడ పురాణం అలాంటి కొన్ని పాపాల గురించి చెబుతుంది, ఒక వ్యక్తి వాటిని చేస్తే, మరణానంతరం అతనికి కఠినమైన శిక్ష పడుతుంది.

october 1, 2026, 4:37 am - duniya360

Garuda Puranam Punishments

హిందూ మతంలో గరుడ పురాణం అష్టాదశ మహా పురాణాల్లో (18 మహాపురాణాల్లో) ఒకటిగా చేర్చబడింది. లోక రక్షకుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తులకు ప్రసాదించిన జ్ఞానం ఈ గరుడ పురాణం. దీనికి విష్ణువే అధిపతి. గరుడ పురాణం మరణం తరువాత ఆత్మ ప్రయాణాన్ని వివరిస్తుంది. గరుడ పురాణంలో కూడా స్వర్గం, నరకం గురించి వివరించబడింది. దీనితో పాటు భూమిపై పాపాలు చేసే ఆత్మలకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో కూడా చెప్పబడింది.

గరుడ పురాణంలో మరణానంతరం మనిషి ఆత్మ యమరాజు ముందు హాజరుపరచబడుతుందని చెప్పబడింది. అక్కడ చిత్ర గుప్తుడు మనిషి చేసిన కర్మలను అనుసరించి పాప పుణ్యాలను ఎంచి అతని చేసిన కర్మల ఆధారంగా ఆ వ్యక్తిని నరకానికి పంపాలో లేదా స్వర్గానికి పంపాలా అనేది నిర్ణయిస్తారు. అంతేకాదు అతను చేసిన పాప కర్మల ఆధారంగా అతనికి ఏ శిక్ష విధించాలో నిర్ణయించబడుతుంది. వ్యక్తి తన కర్మలకు వివిధ రకాల శిక్షలను విధిస్తారు. అంతేకాదు వివిధ జాతులలో జన్మించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో గరుడ పురాణం ప్రకారం ఏయే పాపాలకు ఏ శిక్షలు విధిస్తారో తెలుసుకుందాం.

హత్యలు చేసే వాళ్ళు ఈ నరకాన్ని అనుభవించాల్సిందే.

గరుణ పురాణంలో 36 నరకాల గురించి వివరణ ఉంది. ఒక వ్యక్తి ఆత్మ నరకానికి పంపబడి అతని కర్మను బట్టి శిక్షించబడుతుంది. గరుడ పురాణంలో భ్రూణహత్య చేసేవారిని మహా పాపులు అంటారు. భ్రూణహత్యలు చేసే వారిని రోధ అనే నరకానికి పంపించి హింసిస్తారు. అలాంటి వారు తదుపరి జన్మలో నపుంసకులు అవుతారు. క్షత్రియులను, వైశ్యులను చంపేవారు తాళ నరకంలోని హింసలను అనుభవించాల్సి ఉంటుంది.

గురువును విమర్శించే వారు

తమకు విద్యా దానం చేసి.. భవిష్యత్ కు బాటలు వేసిన గురువును విమర్శించి అవమానించిన వారిని మరణానంతరం శబల అనే నరకానికి పంపి హింసిస్తారు.

దొంగతనం చేసేవారు..

బంగారం దొంగిలించే వారిని సుకర అనే నరకానికి పంపించి హింసిస్తారు. ఇలాంటి వ్యక్తులు తర్వాతి జన్మలో పురుగు లేదా కీటకంగా జన్మిస్తారు.

రేపిస్టులకు ఈ శిక్ష

స్త్రీలపై చెడు దృష్టి ఉన్నవారు వ్యభిచారం, అత్యాచారం చేస్తారు. అలాంటి వారు కూడా మహా పాపులు. అలాంటి వారి ఆత్మలకు నరకంలో భయంకరమైన హింసలు విధించబడతాయి. పిల్లలను, వృద్ధులను, స్త్రీలను అవమానించే వారికి యమరాజు దూతలు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారు. కోడలిని కుమార్తెను బలవంతాన అనుభవించేవాడు ‘మహాజ్వాల’ అనే నరకంలో పడతాడు. పరస్త్రీని పొందేవాడు ‘శబల’ అనే నరకంలో పడతాడు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

How to Apply For AP Corporation loans 2025 Online Process

AP State లో AP Corporation Loans 2025 కు AP OBMMS Web Site లో Online Application కు Option ఓపెన్ అయ్యింది . BC / EWS / OC Caste కు చెందిన Male & Female అందరు Apply చేసుకోవచ్చు .  

AP Corporation Loans 2025

Apply చేసుకోవటానికి Applicatuion Fee అంటూ ఎం ఉండదు, పూర్తిగా ఉచితం . AP Corporation Loans Apply చేసుకోవాటికి ఎవరికి వారు సొంతంగా AP OBMMS Site లో లేదా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లో లేదా మీయొక్క Grama Ward Sachivalayams నందు  AP Corporation Loans కొరకు Application చేసుకోవచ్చు .

AP Corporation Loan Amount Details 2025 – Slabs

మొత్తం రుణాన్ని మూడు స్లాబ్ కింద విభజించడం జరిగింది.


how to apply for ap corporation loans 2025 online process
october 1, 2026, 4:37 am - duniya360

Slab 1:

మొదటి స్లాబ్ లో 2 లక్షల లోపు రుణాన్ని ఇస్తారు. ఇందులో 50 శాతం వరకు యూనిట్ కాస్ట్ పైన 75 వేల మించకుండా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. యూనిట్ కాస్ట్ పై 50% మించకుండా 1 లక్ష 25 వేల రూపాయల వరకు బ్యాంకు నుంచి లోన్ ఇవ్వటం జరుగుతుంది.  మొత్తంగా రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది .

Slab 2 :

స్లాబ్ 2 లో 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది రూ.1,25,000 సబ్సిడీ అందుతుంది అంటే వీటిపై ఎటువంటి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు యూనిట్ కాస్ట్ పై 50% అంటే రూ.1,75,000 వరకు  బ్యాంకు నుంచి లోన్ అందుతుంది .

Slab 3 :

స్లాబ్ 3 లో 3 లక్షల నుండి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది.  రూ.2,00,000 సబ్సిడీ అందుతుంది అంటే వీటిపై ఎటువంటి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు యూనిట్ కాస్ట్ పై 50% అంటే రూ.3,00,000 వరకు  బ్యాంకు నుంచి లోన్ అందుతుంది . అన్ని బ్యాంకు లోన్లపై AP Corporation Loans 2025 Interest Rates వడ్డీ రూపాయి కన్నా [ 12% ] తక్కువే ఉంటుంది . 

Eligibility Criteria for AP Corporation Loans 2025

Who Can Apply for AP Corporation Loans?

కింద తెలిపిన అర్హతలు ఉంటే సులువుగా AP Corporation Loans  ని అందుకోవచ్చు

  1. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి
  2. రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కఉండాలి
  3. 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి
  4. ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి
  5. ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
  6. మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి
  7. చదువుతో సంబంధం లేదు . చదివితే పాస్ సర్టిఫికెట్ ఉంటె పెట్టవచ్చు , లేక పోతే లేదు .
  8. ట్రైనింగు / పథకము / సబ్సిడీ పొందు ఉంటే సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలి
  9. మెడికల్ షాప్ కు పెట్టాలనుకుంటే డి ఫార్మసీ / బి ఫార్మసీ /ఎం ఫార్మసీలో ఏదైనా ఉండాలి

Required Documents for AP Corporation Loans 2025 

  1. క్యాస్ట్ సర్టిఫికేట్ 
  2. రేషన్ కార్డు 
  3. ఆధార్ కార్డు 
  4. గతంలో ట్రైనింగు లేదా శిక్షణ పొందు ఉంటే ఆ సర్టిఫికెట్ 
  5. వాహన రంగ వ్యాపారానికి లేదా పనిని ప్రారంభించడానికి డ్రైవింగ్ లైసెన్సు 
  6. మొబైల్ నెంబరు 
  7. ఫార్మసీ సెక్టార్ కి సంబంధించి బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ సర్టిఫికెట్

AP Corporation Loans Category List 2025 

ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ లోన్లు AP Corporation Loans 2025  కింద తెలిపిన 6 సెక్టార్లలో ఏదైనా పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది . 6 సెక్టార్ లో ఉన్నటువంటి వివిధ రకములైన పనులను కింద ఇవ్వటం జరిగింది ఒకసారి చూడండి అందులో మీరు దేని ప్రారంభించాలనుకుంటున్నారో దానిపై మీరు కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు 

1.వ్యవసాయ రంగం : 

october 1, 2026, 4:37 am - duniya360
  1. వ్యవసాయం దున్నడానికి యంత్రాలు & పనిముట్లు
  2. బండి & ఎద్దులు
  3. కంప్రెసర్ ట్రాక్టర్
  4. డ్రోన్ స్ప్రేయర్
  5. మినీ ట్రాక్టర్
  6. మినీ వెజిటబుల్ సీడింగ్ నర్సరీ
  7. మౌంటెడ్ స్ప్రేయర్
  8. బహుళ పంట త్రషర్
  9. ముష్రోమ్ సాగు యూనిట్
  10. ఆయిల్ ఇంజిన్ (20 HP)
  11. పవర్ ట్రిల్లర్
  12. రోటో వీడర్-(ఇంటర్ కల్టివేటర్)
  13. ట్రాక్టర్
  14. ట్రైలర్ తో ట్రాక్టర్

2.పశు సంపద రంగం :

  1. మిల్క్ కాటిల్
  2. పౌల్ట్రీ ఫారం 

3.వ్యాపార రంగం:

october 1, 2026, 4:37 am - duniya360
  1. అడ్డా ఆకు తయారీ
  2. ఆటో మొబైల్ షాప్ (విడిభాగాలు)
  3. బ్యాటరీ యూనిట్
  4. పుస్తకాల బైండింగ్ పనులు
  5. పుష్పగుచ్ఛాలు & దండల వ్యాపారం
  6. బోటిక్ / ఫ్యాషన్ డిజైనింగ్
  7. ఇటుకల వ్యాపారం
  8. కేబుల్ / రాగి వ్యర్థాలు మరియు స్క్రాప్ వ్యాపారం
  9. చెరకు యూనిట్లు
  10. సిమెంట్ & ఇనుము దుకాణం
  11. చప్పల్స్ / షూ మార్ట్
  12. వస్త్ర వ్యాపారం
  13. కొబ్బరి వ్యాపారం
  14. కొబ్బరి మాత్రికల తయారీ
  15. కాంక్రీట్ మిల్లర్
  16. సైకిల్ దుకాణం & మరమ్మత్తు
  17. డ్రై ఫ్రూట్స్ వ్యాపారం
  18. ఫ్యాన్సీ & జనరల్ స్టోర్
  19. ఫిషింగ్ బోట్లు
  20. ఫిషింగ్ నెట్స్
  21. చేపలు (నిల్వ) అమ్మే దుకాణం
  22. ఫ్లెక్సీ & ప్రింటింగ్
  23. ఫోమ్ మాత్రికలు
  24. ఫర్నిచర్ దుకాణం
  25. జనరల్ స్టోర్ & కిరణా దుకాణం
  26. గాజు అలంకరణ – కటింగ్
  27. గన్నీ బ్యాగుల వ్యాపారం
  28. చేనేత & నూలు యూనిట్
  29. ఐస్ క్రీమ్ పార్లర్
  30. గుర్తింపు కార్డులు, బ్యాగులు & బెల్టుల తయారీ
  31. ఐరన్ బీరువా తయారీ యూనిట్
  32. ఇనుప గేట్ల తయారీ
  33. జ్యూస్ దుకాణం
  34. జనపనార సంచుల తయారీ
  35. కిరాణా / పాన్ షాప్ 
  36. లాండ్రీ దుకాణం
  37. మినీ హోటల్
  38. మినీ పవర్ లూమ్ మెషిన్ యూనిట్
  39. మినీ సూపర్ మార్కెట్
  40. మొబైల్ సేల్స్ మరియు సర్వీసింగ్ సెంటర్
  41. మటన్/ చికెన్ షాప్
  42. ఆప్టికల్ షాప్
  43. పెయింట్ దుకాణం · పెయింటింగ్ పనులు
  44. పేపర్ బ్యాగుల తయారీ
  45. పికెల్ & పాపడ్ తయారీ
  46. పివిసి పైపులు & ప్లంబింగ్ మెటీరియల్స్
  47. బియ్యం వ్యాపారం
  48. ఉప్పు తయారీ యూనిట్
  49. స్లాబ్ కటింగ్ మెషిన్
  50. సోడా తయారీ యూనిట్
  51. స్టేషనరీ పుస్తక దుకాణం
  52. స్టీల్ ఫర్నిచర్ దుకాణం
  53. స్టోన్ క్రషర్ 
  54. టెంట్ హౌస్/షామియానా
  55. ట్రంక్ బాక్స్ తయారీ
  56. కూరగాయలు & పండ్ల దుకాణం
  57. వర్మీకంపోస్ట్ యూనిట్
  58. వెల్డింగ్ దుకాణం
  59. చెక్క పనిముట్లు

4.పరిశ్రమల రంగం :

  1. కమ్మరి
  2. ఇటుక తయారీ / ఫ్లై యాష్ ఇటుకలు
  3. ఆధునిక & అధునాతన యంత్రాలతో వడ్రంగి పని
  4. జీడిపప్పు / ప్రాసెసింగ్ (డ్రై ఫ్రూట్స్)
  5. సిమెంట్ ఇటుకలు Mfg.
  6. సిమెంట్ మిక్సర్ మెషిన్/మిల్లర్
  7. ఇనుప పలకలతో కేంద్రీకరణ పదార్థం
  8. చిక్కీ Mfg.
  9. డిస్టిల్డ్ వాటర్ తయారీ యూనిట్
  10. ఇంజనీరింగ్ వర్క్‌షాప్ (లేత్ వర్క్స్)
  11. ఫ్యాబ్రికేషన్ వర్క్స్
  12. ఫ్లోర్ మిల్లు
  13. స్వర్ణకారుడు(స్వర్ణకర)
  14. గ్రానైట్ స్టోన్/మార్బుల్స్ పాలిషింగ్ & అమ్మకం యూనిట్
  15. ఇనుప అల్మారాలు / లాకర్ల తయారీ
  16. మామిడి జెల్లీ తయారీ
  17. చిప్స్ తయారీ (అరటి/బంగాళాదుంప)
  18. పాలీ బ్యాగులు మొదలైన వాటి యొక్క Mfg.,
  19. ఎంఎస్ గ్రిల్స్ (ఇనుము / ఉక్కు) / వెల్డింగ్ పనులు
  20. నూడుల్స్ తయారీ
  21. పేపర్ ప్లేట్లు & డిస్పోజబుల్ పేపర్ గ్లాసెస్ తయారీదారులు
  22. దిండ్లు & పడకల తయారీ యూనిట్ (పరుపులు)
  23. పోహా / పాప్‌కార్న్ తయారీ
  24. కుండల తయారీ
  25. రెడీమేడ్ దుస్తుల తయారీ
  26. RO వాటర్ ప్లాంట్
  27. చీర రోలింగ్ / ఫాబ్రిక్ పెయింటింగ్
  28. స్లాబ్ కటింగ్ మెషిన్
  29. స్టీల్ / వెల్డింగ్ దుకాణం 

5.సేవా రంగం :

  1. 2 వీలర్ మరమ్మతు
  2. 4 వీలర్ మరమ్మతు
  3. AC & ఫ్రిజ్ మరమ్మతు దుకాణం
  4. ఆటో సర్వీస్ సెంటర్
  5. బేకరీ ఉత్పత్తుల దుకాణం
  6. బ్యాండ్ సెట్ యూనిట్
  7. క్షౌరశాల
  8. బ్యాటరీ సర్వీసింగ్ దుకాణం
  9. బ్యూటీ పార్లర్లు & స్పా / ఆధునిక బ్యూటీ సెలూన్లు
  10. బుక్ స్టాల్
  11. బ్రాస్ స్మిత్
  12. కేబుల్ టీవీ నెట్‌వర్క్
  13. క్యాటరింగ్ యూనిట్
  14. సెల్ ఫోన్ మరమ్మతు దుకాణం
  15. చెక్కతో మెట్రియల్‌ను కేంద్రీకరించడం
  16. కంప్యూటర్ డిటిపి & జిరాక్స్ సెంటర్
  17. కంప్యూటర్ హార్డ్‌వేర్ దుకాణం
  18. పాల ఉత్పత్తుల దుకాణం
  19. డ్రై ఫ్రూట్స్ అమ్మే దుకాణం 
  20. గుడ్డు వ్యాపారం
  21. ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ మరమ్మతు దుకాణం
  22. ఎంబ్రాయిడరీ పని
  23. పండ్లు & కూరగాయలు అమ్మే దుకాణం
  24. గాజు అలంకరణ-కటింగ్
  25. మెకానిక్ షాప్
  26. మైక్ సెట్/ సౌండ్ సిస్టేమ్
  27. మోడరన్ డ్రై క్లీనింగ్ షాప్
  28. మోడరన్ సెలూన్
  29. ఫోటో ఫ్రేమింగ్ / ఫోటో స్టూడియో/డ్రోన్ కెమెరాలు
  30. ప్లంబింగ్ పనులు
  31. చీర పాలిషింగ్, రోలింగ్ & డ్రై క్లీనింగ్
  32. స్క్రీన్ మరియు ఆఫ్‌సెట్ ప్రింటింగ్
  33. సోఫా తయారీ మరియు మరమ్మతు పని
  34. స్టిక్కరింగ్ పని
  35. టాడీ ట్యాపింగ్
  36. గడియారం మరమ్మతు 

6.వాహన రంగం :

  1. రవాణా 
  2. ఈ-ఆటోలు (3 వీలర్లు)
  3. ఇ-ట్రక్
  4. మినీ వ్యాన్ (ప్యాసెంజర్ / ట్రక్)
  5. మినీ వ్యాన్లు (లగేజీ క్యారియర్లు)
  6. ప్యాసింజర్ ఆటో / ట్రక్ ఆటో (డీజిల్) 

Process of AP Corporation Loans 2025 

process of ap corporation loans 2025

దరఖాస్తు చేయాలనుకునే వారు అనులైన్ లో కింద తెలిపిన AP Corporation Loans 2025 Application Online Processవిధంగా మొదట దరఖాస్తు చేసుకోవాలి . అప్లికేషన్ అన్నీ కూడా సంబంధిత గ్రామాల్లో అయితే MPDO వారికి పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ MC వారి వారి లాగిన్ కు వెళ్లడం జరుగుతుంది. అక్కడే అప్లికేషన్ ఆమోదమా లేదా రద్ద  AP Corporation Loans Approve or Reject అనేది జరుగుతుంది. తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ DBSCSC వారి ఆమోదం కు వెళ్తుంది. తుది ఆమోదం కొరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ వారికి వెళ్తుంది. అదేవిధంగా సమాచార నిమిత్తం మరియు శాంక్షన్ కొరకు VS & MD APBCCFC వారి లాగిన్ కు వెళ్లడం జరుగుతాయి.  సాంక్షన్ అయిన తర్వాత సంబంధిత సబ్సిడీ నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమవుతుంది మిగిలిన నగదు కొరకు లబ్ధిదారులు తప్పనిసరిగా  ఏ బ్యాంకు వివరాలను ఇస్తారో ఆ యొక్క బ్యాంకుకు వెళ్లి లోన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది .  

How to Apply for AP Corporation Loans 2025

Step  1 : ముందుగా కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి .

AP OBMMS Website

Step  2 :  కింద చూపించినట్టుగా For Registration అనే ఆప్షన్ పెట్టి చేయండి.

october 1, 2026, 4:37 am - duniya360

 Step  3 : Basic Details లో

october 1, 2026, 4:37 am - duniya360
  • జిల్లా పేరు 
  • ఆధార్ నెంబరు 
  • మొబైల్ నెంబరు 
  • దరఖాస్తుదారిని పూర్తి పేరు [ As Per Aadhaar ]
  • తండ్రి లేదా భర్త లేదా సంరక్షకుల పేరు 
  • లింగము 
  • పుట్టిన తేదీ [ As Per Aadhaar ]
  • కులము [ As Per Certificate ]
  • ఉపకులము 

నమోదు చేసి Generate OTP పై క్లిక్ చేసినట్లయితే పైన మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు 8 అంకెల ఓటిపి వస్తుంది ఆ ఓటీపీను ఎంటర్ చేసి తర్వాత పేజీ కు వెళ్లాలి.

 Step  4 : రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టు కింద చూపించినట్టుగా చూపిస్తుంది User ID గా మొబైల్ నెంబర్ ఉంటుంది ,Password ను మీరు Forget Password ద్వారా మార్చుకోవచ్చు లేదా నేరుగా లాగిన్ పేజీ కు వెళ్తుంది .

october 1, 2026, 4:37 am - duniya360

Step  5 :  Candidate Details లో

october 1, 2026, 4:37 am - duniya360

Caste Certificate నెంబరు నమోదు చేసి Get Details పై ఎంటర్ చేసినట్లయితే పేరు, కులము,  ఉప కులము వివరాలు వస్తాయి. Ration Card Number / Rice Card Number  రేషన్ కార్డు నెంబరు నమోదు చేసి రేషన్ కార్డును PDF కానీ ఫోటో రూపంలో గానీ అప్లోడ్ చేయాలి. వివాహం చేసుకున్నట్లయితే వివాహం చేసుకున్నారని నమోదు చేయాలి. వికలాంగులు అయితే వికలాంగులుగా నమోదు చేస్తూ ఎటువంటి వికలాంగులు నమోదు చేస్తూ % ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి .

చదువుకోకపోతే చదువుకోలేదు అని చెప్పి సెలెక్ట్ చేయాలి చదువుకున్నట్లయితే ఏ సంవత్సరం పాస్ అయ్యారు, ఏ జిల్లాలో పాస్ అయ్యారు, అనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది సర్టిఫికెట్ అందుబాటులో ఉంటే అప్లోడ్ చేయొచ్చు అందుబాటులో లేకపోతే అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు . తరువాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ కింద చిరునామా వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుత జిల్లా ప్రస్తుత మండలం ప్రస్తుత గ్రామం ప్రస్తుత పిన్కోడు ప్రస్తుత డోర్ నెంబరు ప్రస్తుత పూర్తి చిరునామాలు నమోదు చేసి Save & Continue పై క్లిక్ చేయాలి .

Step  6 : Eligible Scheme లో Main Scheme వద్ద Self Employment Schemeను సెలెక్ట్ చేసుకుని Sector లో పైన తెలిపిన వాటిలో మీరు ఏ వ్యాపారాన్ని లేదా పనిని ప్రారంభించాలో ఆ యొక్క Sector సెలెక్ట్ చేసుకొని Schemeసెలెక్ట్ చేసుకొని Unit Cost కింద మీకు వ్యాపార ప్రారంభానికి అవసరమయ్యే మొత్తం నగదును 5 లక్షలకు మించకుండా ఎంటర్ చేసి Eligible Criteria కింద ఎప్పుడైనా సరే ట్రైనింగ్ తీసుకున్నట్లయితే తీసుకున్నట్టు చెక్ చేసి సంబంధిత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి గతంలో ఎప్పుడైనా మీరు ఇటువంటి పథకాన్ని పొందినట్లయితే No అని సెలెక్ట్ చేయాలి పొందకపోతే YESసెలెక్ట్ చేయాలి తరువాత గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి లేదా కార్పొరేషన్ ద్వారా ఇటువంటి లోన్లు తీసుకున్నారని అడుగుతుంది తీసుకోకపోతే NO తీసుకుంటే YES అని సెలెక్ట్ చేసి Save & Continu పై క్లిక్ చేయాలి  

Step  7 : Preview లో ఇప్పటివరకు నమోదు చేసిన అన్ని వివరాలను సరి చూసుకున్న తర్వాత Submit పై క్లిక్ చేయాలి.

Step  8 : Print పై క్లిక్ చేసి మసీదును లేదా అప్లికేషన్ను పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి

ఆధార్ కార్డు జిరాక్స్,  రేషన్ కార్డు లేదా రైస్ కార్డు జిరాక్స్,  అప్లికేషన్ ఫారం  [ ఇప్పుడు ప్రింట్ తీసుకున్నది ], కుల దృవీకరణ పత్రము, ఆదాయ ధ్రువీకరణ పత్రము వీటన్నిటితో సంబంధిత MPDO లేదా MC వారి ఆఫీసులో సబ్మిట్ చేసినట్లయితే  అప్లికేషన్ చేయు ప్రాసెస్ పూర్తి అయినట్టు అర్థం

School Girls Kidnap : పాఠశాల బాలికలే టార్గెట్.. కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారాలు..? పోలీసుల అదుపులో ప్రధాన నిందితురాలు..?

School Girls Kidnap పాఠశాల బాలికలే టార్గెట్ గా ఓ మఠా అరాచకాలకు పాల్పడుతుంది. బాలికలను కిడ్నాప్ చేసి ఆ తరువాత వారికి చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ ఇచ్చి, మానవ మృగాల చేతుల్లో పెట్టి ఆ చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. అయితే, ఆ కిలాడీ లేడీ ముఠా భాగోతం వరంగల్ లో వెలుగు చూసింది. మిల్స్ కాలనీ పోలీసులు ముఠాలోని ప్రధాన నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

october 1, 2026, 4:37 am - duniya360

వరంగల్ మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తరువాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ ఇచ్చినట్లుగా తేలినట్లు సమాచారం. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మిల్స్ కాలనీ పోలీసులు యువతితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని పలు కోణాల్లో కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.

School Girls Kidnap

హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ వరంగల్, మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోంది. డ్రగ్స్ కు బానిసైన ఆ లేడీ, తనతోపాటు డ్రగ్స్ కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది. పాఠశాల బాలికలే లక్ష్యంగా ఈ కిలాడీ లేడీ వరంగల్ లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తుంది. పాఠశాలకు వెళ్లివచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. ఆ తరువాత బాలికలను కిడ్నాప్ చేస్తోంది.

కిడ్నాప్ చేసిన బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి అప్పటికే తన గ్యాంగ్ కు టచ్ లో ఉన్న కస్టమర్లకు అప్పగిస్తోంది. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడి వదిలేసి వెళ్లిపోతారు. ఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారం. అయితే, కిలాడీ లేడీ గ్యాంగ్ వ్యవహారంపై ఇవాళ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Mega DSC Notification : ‘ఒక్క ప్రభుత్వ బడిని మూసేది లేదు.. ఈ ఏడాదిలోపే మెగా డీఎస్సీ పూర్తి’.. మంత్రి లోకేష్‌

0

Mega DSC Notification : గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ-117 వల్ల గత ఐదేళ్లలో దాదాపు 12 లక్షల మంది పేద పిల్లలకు చదువు దూరమైందని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూసే ప్రసక్తి లేదనీ.. ఒక్క విద్యార్ధి ఉన్నా కొనసాగిస్తామని అన్నారు. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని ఏప్రిల్‌ 24 తర్వాత నేరుగా ఆయా కాలేజీల ఖాతాల్లో..

mega dsc notification
october 1, 2026, 4:37 am - duniya360

గత ప్రభుత్వం తప్పిదం వల్ల గత ఐదేళ్లలో 12 లక్షల మంది పేద పిల్లలకు చదువు దూరమైందని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూసే ప్రసక్తి లేదనీ అన్నారు. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని ఏప్రిల్‌ 24 తర్వాత నేరుగా ఆయా కాలేజీల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో టీచర్లపై పెట్టిన కేసులను కూటమి సర్కార్ కొట్టివేస్తుందని అన్నారు. ఈ మేరకు విద్యారంగ సంస్కరణలపై మండలిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పతనానికి జీఓ-117 కారణమని, పదిమంది పిల్లల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు టీడీపీ హయాంలో కేవలం 1215 ఉంటే, అదే జీఓ-117 వల్ల ఆ సంఖ్య 5,500కు చేరిందని అన్నారు. 20 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలల సంఖ్య 5,520 నుంచి 12,512కు పెరిగాయని వివరించారు.

ఒక్క విద్యార్ధి ఉన్నా కొనసాగిస్తామని.. ఒక్క ప్రభుత్వ పాఠశాలనూ మూసేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఒక నమూనా ప్రాథమిక పాఠశాల ఏర్పాటుచేసి, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తామన్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామన్నారు. దీనికోసం అమరావతిలో ప్రపంచస్థాయి శిక్షణ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందన్నారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఆన్‌లైన్‌లో ఉంచుతామని, దాని ఆధారంగా బదిలీలు ఉంటాయని తెలిపారు.

Mega DSC Notification : ‘ఈ ఏడాదిలోనే డీఎస్సీ నియామకాలు పూర్తి’

ఎస్సీ వర్గీకరణపై కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించిందని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తోందని, అనంతరం కేబినెట్‌ ఆమోదంతో ఎస్సీ కమిషన్‌కు పంపుతామన్నారు. కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామన్నారు. మొత్తానికి ఈ ఏడాదిలోనే నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని పేర్కొన్నారు. విద్యార్ధుల పుస్తకాల భారాన్ని కూడా తగ్గిస్తామన్నారు. గతంలో 8 పుస్తకాలు ఇచ్చేవారని, కానీ ఒకటో తరగతి విద్యార్థులకు మొదటి సెమ్‌లో 2, రెండో సెమ్‌లో 2 చొప్పున మొత్తం నాలుగు పుస్తకాలు ఇస్తామన్నారు. ఇలా అన్ని తరగతుల్లో పుస్తకాల సంఖ్య తగ్గించి పిల్లల బ్యాగ్ బరువు తక్కువ చేస్తామన్నారు.

AP Weather Summer : ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

AP Weather Summer ఏపీలో వాతావరణం చిత్రవిచిత్రంగా ఉంది. మొన్న రెండు రోజులు కొన్ని చోట్ల వర్షాలు పడగా.. ఇప్పుడు మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయి. అసలు వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండబోతోంది.. ఈ వార్తలో ఇప్పుడు తెలుసుకుందామా మరి.! ఆ వివరాలు ఇలా

october 1, 2026, 4:37 am - duniya360

AP Weather Summer

బుధవారం పశ్చిమ భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న మాల్దీవులు ప్రాంతం మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు తీర నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి ఇప్పుడు పశ్చిమ భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం.. దానికి ఆనుకుని ఉన్న మాల్దీవుల మీదుగా దక్షిణ కేరళ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రాయలసీమ:-

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

AP Polycet 2025 Notification : ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ రాత పరీక్ష ఎప్పుడుంటంటే?

AP Polycet 2025 Notification ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఏప్రిల్‌ 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..

ap polycet 2025 notification
ap polycet 2025 notification

AP Polycet 2025 Notification

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఏప్రిల్‌ 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుతో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. NIOS/ APOSS/ ఇతర పరీక్షలకు చెందిన అభ్యర్థులు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సహా అన్ని సబ్జెక్టులలో ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. SSC లేదా తత్సమాన పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

దరఖాస్తు సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 30న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు. ఫలితాలు మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ప్రాథమిక కీ విడుదల.. రేపటితో ముగుస్తున్న అభ్యంతరాల స్వీకరణకు గడువు

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2024 పరీక్షల ప్రాథమిక కీ తాజాగా వెలువడింది. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 164 సెంటర్లలో 2,38,451 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మార్చి14వ తేదీలోపు రూ.200 చెల్లించి ప్రాథమిక కీ పై అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా తెలుపవచ్చు.

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

AP Model Schools 6th Class Admission Notification for 2025-2026

0

AP Model Schools 6th Class Admission Notification for 2025-2026

➪ ఏపి ఆదర్శ పాఠశాలలో (APMS- మోడల్ స్కూల్స్) 2025-2026 లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.

➪ రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

➪ ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10గంటల – మధ్యాహ్నం 12గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

➪ 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చు.

➪ అప్లికేషన్ వివరాలు, నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి 

Download Detailed AP Model Schools 6th Class Admission Notification for 2025-2026

Mega Parents Meeting Orientation Youtube Live

https://youtube.com/live/v_QSprw5hbg?feature=share Mega Parents Meeting Orientation Youtube Live

Mega Parents Meeting Orientation Youtube Live
Mega PTM 2024 Live Orientation Today 30-11-2024

నిర్వహణ: School Education Department
★ ఎవరెవరు పాల్గొనాలి?:
All MEOs, HMs, SMC చైర్పర్సన్స్, SMC సభ్యులు.
★ Topic: MEGA PTM 2024
★ తేదీ: 30.11.2024
★ సమయం: 12 PM

YouTube Live Link

https://youtube.com/live/v_QSprw5hbg?feature=share

PFMS School Composite Grants Withdrawal Process

0

Please read all points carefully before calling

Purpose: PFMS ఖాతా నుండి మీ ఖాతాకు స్కూల్ గ్రాంట్స్ ను విత్ డ్రా చేయుటకు…

ముందుగా కావాల్సిన వివరాలు:

PM Shri యాప్ లో మీ పాఠశాలకు 100% ఎస్టిమేషన్ వేసి ఉండాలి.

మీ స్కూల్ కి సంబంధించి https://pfms.nic.in/ పోర్టల్ నందు అడ్మిన్ లాగిన్, అప్రూవర్ లాగిన్, ఆపరేటర్ లాగిన్ మీ వద్ద ఉండాలి.

ఈ లాగిన్ లలో అడ్మిన్ లాగిన్ ను మీ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం మీకు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చినది. మీ అడ్మిన్ లాగిన్ నుండి మీ స్కూల్ అప్రూవర్ లాగిన్, ఆపరేటర్ లాగిన్ లను మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నారు. ఈ వివరాలు అనగా ఈ లాగిన్ల యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ లు మీ వద్ద ఉండాలి. Duniya360.com

గుర్తుంచుకొండి.

మీరు కొత్తగా 2023 బదిలీలలో వచ్చిన వారు అయితే, ఈ వివరాలను మీ పూర్వపు ప్రధానోపాధ్యాయుడి నుండి పొందండి.

అసలు ఏ విధంగా కూడా మీకు లాగిన్లు పొందే విధానం లేనప్పుడు, https://pfms.nic.in/SitePages/SearchAgency.aspx ఈ లింక్ లో ఏజెన్సీ నేమ్ వద్ద మీ పాఠశాల డైస్ కోడ్ ఇచ్చి సెర్చ్ చేయండి. వచ్చే రిజల్ట్ లో Unique Code XXXXXXX1324 అని ఉంటుంది. ముందు హైడ్ చేయబడిన లెటర్స్ ను మీ మండల ఆపరేటర్ ను లేదా మీ ప్రక్క పాఠశాల వారిని అడిగి తెలుసుకొండి. Duniya360.com

దీని ద్వారా అడ్మిన్ లాగిన్ పాస్వర్ రీసెట్ చేయవచ్చు. పాస్వర్డ్ రీసెట్ చేయడానికి, గత ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన మొబైల్ లేదా ఈ మెయిల్ కి OTP వెలుతుంది. దీని ద్వారా పాస్వర్డ్ రీసెట్ చేయవచ్కు.

అడ్మిన్ లాగిన్ రీసెట్ అయితే, అప్రూవర్ లాగిన్, ఆపరేటర్ లాగిన్ లను మనం తిరిగి పొందవచ్చు.

సమగ్ర శిక్ష వారు రిలీజ్ చేసిన అమౌంట్ మీ స్కూల్ PFMS Bank అకౌంట్ నందు రిఫ్లెక్ట్ అవ్వదు. కేవలం PFMS లాగిన్ నందు మాత్రమే చూపిస్తుంది. మీరు PPA బ్యాంక్ కు ఇచ్చాక్ మాత్రమే, మీ వ్యక్తిగత ఖాతాకు జమ అయ్యేటప్పుడు PFMS అకౌంట్ జమ అయినట్టు చూపించి, వెంటనే మీ వ్యక్తిగత ఖాతాకు (ఇవ్వబడిన వెండర్) కు జమ అవుతాయి.

ప్రాసెస్

మీ స్కూల్ కి సంబంధించి https://pfms.nic.in/ పోర్టల్ నందు అడ్మిన్ లాగిన్ పొందిన తర్వాత, మీ మొబైల్ నంబర్ అప్దేట్ చేయాలి. దీనికి గాను మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఈ అప్డేట్ ఎడిట్ రిక్వస్ట్ మీ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి వెళుతుంది. వారు 24 గంటలలో అప్రూవ్ చేస్తారు. అలా చేయకపోతే, వారిని సంప్రదించి మీరు అప్రూవ్ చేయించుకోవాలి. దీని కొరకు మీ మండల ఆపరేటర్ సహాయం తీసుకొండి.

ఇలా అడ్మిన్ లాగిన్ పొందిన అప్రూవ్ అయిన తర్వాత, మీ అడ్మిన్ లాగిన్ ద్వారా మీ పాఠశాల అప్రూవర్ లాగిన్, ఆపరేటర్ లాగిన్ లను తిరిగి పొందవచ్చు.

ఈ వివరాలు అన్నీ సిధ్దంగా ఉన్నవారు మాత్రమే, మీ పాఠశాల గ్రాంట్స్ మీ వ్యక్తిగత ఖాతా లేదా, మీరు ఎవరికి జమ చేయాలనుకుంటున్నారో వారి ఖాతాకు జమ చేసే ప్రక్రియ ప్రారంభించవచ్చు.

ఉదాహరణకు ప్రధానోపాధ్యాయుని వ్యక్తిగత ఖాతాకే జమ చేసుకోవాలనుకుంటే, మీరు కొత్తగా 2023 బదిలీలలో వచ్చిన వారు అయితే మీ వెండర్ కోడ్ ను మీ బ్యాంక్ అకౌంట్ తో సహా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొత్తగా యాడ్ చేస్తే, మీ బ్యాంక్ అకౌంట్ వాలిడేషన్ కి 24 గంటలు సమయం పడుతుంది. ఒకవేళ మీ అకౌంట్ ఇది వరకే అక్కడ వెండర్ గా యాడ్ అయ్యి ఉంటే కొత్తగా యాడ్ చేయాల్సిన పని లేదు.

అన్నీ సిద్ధం అయిన తర్వాత, ఆపరేటర్ లాగిన్ నుండి ఖర్చు అయినట్టుగా సబ్మిట్ చేసి, జమ చేయాల్సిన బ్యాంక్ అకౌంట్ (వెండర్) ఇచ్చి సబ్మిట్ చేస్తాం. తదుపరి అప్రూవర్ లాగిన్ నుండి అప్రూవ్ చేసిన తర్వాత 3 పేజీల PDF PPA జనరేట్ అవుతుంది.

ఇలా జనరేట్ అయిన 3 పేజీల PDF PPA ని 2 సెట్ల జిరాక్స్ తీసుకుని, ప్రతి పేజీ మీద ప్రధానోపాధ్యాయుడు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సంతకాలు చేసి, మీ పాఠశాల PFMS అకౌంట్ ఉన్న యూనియన్ బ్యాంక్ లో ఇచ్చినట్లయితే వారు ఒక సెట్ ను రిసీవ్డ్ కాపీ గా సంతకం చేసి మీకు వెనుకకు ఇచ్చి, ఒక కాపీ వారి వద్ద ఉంచుకుంటారు. ఇలా మీరు బ్యాంక్ కి PPA ఇచ్చిన 24-48 గంటలలో మీరు సూచించిన ఖాతాకు సొమ్ము జమ అవుతుంది.

ముఖ్య గమనిక:

ఈ ప్రాసెస్ ఏ పాఠశాలకు వారు చేసుకోవాలి, లేదా మీకు తెలిసి యాక్టివ్ గా ఉండే టీచర్స్ చేస్తారు, లేదా కొన్ని చోట్ల ఎంతో కొంత సొమ్ము తీసుకుని చేసే వారు ఉంటారు. వారి చేత చేయించుకొండి.

ఈ ప్రాసెస్ నేను చేయడానికి రూ.500/- తీసుకుంటాను. కావున పై సమాచారం అంతా చదివి, కావాల్సిన వారు మాత్రమే నా నంబర్ 9493308090 కి కాల్ చేయండి. లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. పై సమాచారం చదవకుండా కాల్ చేసి నా సమయం వ్రుధా చేయకండి. మీ సమయం వ్రుధా చేసుకోకండి.

ఇది అధికారిక మైన వారి తరపున కాదు, ప్రాసెస్ తెలియని వారి రూ.500 తీసుకుని పని చేసిపెట్టే పద్ధతి. గమనించగలరు.

AP : November 2024 Session Department Tests

0

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 2024 సెక్షన్ సెషన్ లో డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ను నవంబర్ 7వ తేదీన విడుదల చేసింది. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ https://portal-psc.ap.gov.in/Default లో వెబ్ నోట్ మరియు నోటిఫికేషన్ ను ఉంచింది. November 2024 Session Department Tests కు సంబంధించిన సమాచారం ఈ వెబ్ పేజీలో ఉంచబడుతుంది.

november 2024 session department tests
october 1, 2026, 4:37 am - duniya360

November 2024 Session Department Tests

పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఉంచిన వెబ్ నోట్లో వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మరియు నోటిఫికేషన్ లో సమాచారాన్ని మరింత విస్తృతంగా పేర్కొంది.

Webnote

ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA
DEPARTMENTAL TESTS NOVEMBER 2024 SESSION
Notification No.17/2024
WEB NOTE
Online applications are invited for the Departmental
Tests November – 2024 Session (Notification No:17/2024)
from 13/11/2024 to 03/12/2024 and the last date for
payment of fee is 03/12/2024 (11:59PM).
The Notification is available on the Commission’s
website https://psc.ap.gov.in from 07/11/2024 onwards.
The examination will be commenced form 18.12.2024 to
23.12.2024.
Place: Vijayawada. Sd/- J.Pradeep Kumar, I.R.S.M.E.,
Date: 07.11.2024. Secretary.

వెబ్ నోట్ ను డౌన్లోడ్ చేసుకొనుట కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Notification

నవంబర్ 2024 సెక్షన్ సెషన్ కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మీకు ఇక్కడ లభిస్తుంది. దీనిలో అప్లికేషన్ ప్రారంభ తేదీ, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ సెంటర్స్, ఎలిజిబిలిటీ క్రిటీరియా, పేమెంట్ ప్రొసీజర్, టైం టేబుల్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ లో పొందుపరిచారు. ఈ లింకుపై క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ తో పాటుగా అదనపు సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Important Information

Below information updated as on 07.11.2024

S.NoDescriptionInformation
1Online Application Start Date13.11.2024
2Application End Date03.12.2024
3Examinations from Date18.12.2024
4Examination to Date23.12.2024
5Examination TypeObjective
6Payment Last Date03.12.2024
7Exam Time TableDownload
8Exam feeRs.500 per each exam
9Official mail idappschelpdesk@gmail.com
10Help desk numbers08662527820
08662527821
11Official Websitehttps://psc.ap.gov.in

మరింత అదనపు సమాచారాన్ని ఇక్కడ చేర్చబడుతుంది కావున ఈ పేజీని సందర్శిస్తూ ఉండగలరు.