FoodMutton Biryani in Cooker: కుక్కర్‌లో సింపుల్‌గా...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Mutton Biryani in Cooker: కుక్కర్‌లో సింపుల్‌గా మటన్ బిర్యానీ ఇలా చేశారంటే.. ఆహా అనాల్సిందే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మటన్ అంటే చాలా మందికి ఇష్టం. బయట తినడం కంటే ఇంట్లో తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయట వేలు పెట్టినా.. చాలా తక్కువ ముక్కలే వేస్తారు. అయినా ఈ మధ్య హోటల్స్ ఎలా చేస్తున్నాయో టీవీల్లో కూడా చూశాం. ఎలా వండుతారో కూడా తెలీదు. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం. బయట తినడం అంత సేఫ్ కాదు. అదే మన ఇంట్లోనే చేసుకుని తింటే ఆరోగ్యం. కాబట్టి సింపుల్‌గా త్వరగా మటన్ బిర్యానీని కుక్కర్‌లో ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా త్వరగా కూడా అయిపోతుంది. అంతే కాదు టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంత రుచికరమైన మటన్ బిర్యానీని కుక్కర్‌లో ఎలా చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

మటన్, బియ్యం (ఏదైనా), కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పులావ్ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, నిమ్మరసం, నెయ్యి, ఆయిల్.

కుక్కర్‌లో మటన్ బిర్యానీ తయారు చేయు విధానం:

ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకుని అందులో.. కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత పులావ్ దినుసులు అన్నీ వేసి వేగాక, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ వేసి ఓ నిమిషం ఫ్రై అయ్యాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాక.. టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి ఓ ఐదు నిమిషాలు వేగాక వాటర్, గరం మసాలా వేసి కుక్కర్ మూత పెట్టి.. ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి.

కుక్కర్ వేడి తగ్గాక మూత తీసి.. మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. ముక్క ఉడికితే అన్నీ రుచి చూసుకుని పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. బాస్ మతీ రైస్ అయితే ఒకటికి.. ఒకటింపావు వేయాలి. సాధారణ బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర వేయాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర చల్లి.. మూత పెట్టాలి. ఓ రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ బిర్యానీ సిద్ధం. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ బిర్యానీ సిద్ధం. మీరు కూడా ముందు కొద్దిగా వండి ట్రై చేయండి.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this