Andhra PradeshRain Danger Alert తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్…...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Rain Danger Alert తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్… ఈ జిల్లాల్లో అత్యవసరమైతేనే బయటకు రండి!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Rain Danger Alert రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గతమూడు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారటంతో ఈవానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య దిశగా పయనించి ఒడిశాలోని  పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇక బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదే విధంగా పార్వతీపురం మన్యం,నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.  ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావారి జిల్లాలో, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.

Rain Danger Alert

ఇక పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలకు అధికారులు సూచించారు. అత్యవసమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపారు. ఏపీలో సగటున గంటకు 19 నుంచి 23 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.  ఇక భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరం అయినేతే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this