FoodGond Katira Ladoo: బంక లడ్డూలు.. ఒక్కసారి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Gond Katira Ladoo: బంక లడ్డూలు.. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gond Katira Ladooబంక లడ్డూల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వీటిని ఎక్కువగా బాలింతలకు ఇస్తూ ఉంటారు. ఇవి తింటే బాలింతలు బలంగా, దృఢంగా ఉంటారు. పాలు కూడా ఎక్కువగా పడతాయి. బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. బంక లడ్డు లేదా గోంద్ కతీరా లడ్డూ ప్రత్యేక రుచే వేరు. వీటిని ఎవరైనా తినవచ్చు. ఈ లడ్డూలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఒక్కసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ అడిగి తింటారు. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది. శరీరానికి బలాన్ని ఇచ్చి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మరి పోషకాహారమైన బంక లడ్డూని ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Gond Katira Ladoo బంక లడ్డూకి కావాల్సిన పదార్థాలు:

గోంద్ కతీరా, బాదం పప్పు, జీడిపప్పు, కిస్ మిస్, గసగసాలు, ఎండు ఖర్జూరం, యాలకుల పొడి, జాజికాయ పొడి, బెల్లం లేదా పంచదార పొడి, నెయ్యి.

గోంద్ కతీరా లడ్డూల తయారీ విధానం:

ముందుగా ఒక కడాయిలో పావు కప్పు నెయ్యి వేసి వేయించుకోవాలి. అందులో గోంద్ కతీరా వేసి వేయించు కోవాలి. ఇది ఇప్పుడు బాగా పొంగుతుంది. వెంటనే ఒక పల్లెంలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే బాదం, జీడిపప్పు, గసగసాలు కూడా వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి బాదం, జీడిపప్పు, గోంద్ కతీరా వేసి బరకగా మిక్సీ పట్టాలి. ఆ రత్వాత ఎండు ఖర్జూరం ముక్కలు, పంచదార లేదా బెల్లం పొడి వేసి మరోసారి మిక్సీ పట్టాలి.

మిక్సీ పట్టుకున్న పొడి అంతా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇందులో వేడి చేసుకున్న నెయ్యి వేసి అంతా కలిసేలా కలపాలి. చివరలో గసగసాలు, కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ఉండల్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత ఓ బాక్స్ లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇవి రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this