FoodThalakaya Kura: తలకాయ కూర ఇలా ఒక్కసారి...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalakaya Kura: తలకాయ కూర ఇలా ఒక్కసారి వండారంటే.. అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాల్లో తలకాయ కూర కూడా ఒకటి. తలకాయ కూర అనగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. మరి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తినే కొద్దీ తినాలని అనిపిస్తుంది. నోట్లోకి అలా ముక్క పెట్టగానే కరిగిపోతుంది. ఈ కర్రీని పులావ్, అన్నం, చపాతీ, రోటీ దేనితో అయినా తినొచ్చు. అయితే చాలా మందికి తలకాయ కూర చేయడం అస్సలు రాదు. కానీ ఒక్కసారి ఈ పద్దతిలో వండారంటే.. తిన్న వాళ్లందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు. అంత రుచిగా వస్తుంది. మరింకెందుకు లేట్ ఈ తలకాయ కూర ఎలా చేస్తారు? ఈ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దం.

తలకాయ కూరకు కావాల్సిన పదార్థాలు:

తలకాయ కూర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కరివేపాకు, కొత్తి మీర, చింత పండు పులుసు, బిర్యానీ దినుసులు, ఆయిల్.

తలకాయ కూర తయారీ విధానం:

ముందుగా తలకాయ కూరను శుభ్రంగా చేసుకుని దాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఓ అరగంటైనా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ సమయం అయినా పర్వాలేదు. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ముందుగా బిర్యానీ దినుసులు వేసి వేయించుకోవాలి. నెక్ట్స్ ఉల్లి పాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలర్ మారేంత వరకూ ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. నెక్ట్స్ టమాటా ముక్కలు వేసి, మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న తలకాయ కూర వేసి ఓ పది నిమిషాల పాటు బాగా వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి ఓ రెండు నిమిషాలు వేయించి.. సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఓ ఆరు విజిల్స్ వచ్చాక కట్టేయాలి. ఇప్పుడు కూర సగం ఉడికి ఉంటుంది. ఈ టైమ్‌లో చింత పండు పులుసు కొద్దిగా వేసి.. మళ్లీ మీడియం మంటపై ఓ పది నిమిషాలు ఉడికించాలి. కర్రీ దగ్గర పడుతున్న సమయంలో అన్నీ ఒకసారి రుచి చూసుకుని.. కొత్తి మీర చల్లి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ తలకాయ కూర సిద్ధం.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this