Home Blog Page 68

Paris Olympics 2024 : పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు భారీగా నగదు..!

0

Paris Olympics 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో షూటింగ్‌లో భారత్‌ రెండు కాంస్య పతకాలు సాధించి శుభారంభం చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్ పతకాలు సాధించినందుకు భారత్ అథ్లెట్లకు ఎంత రివార్డ్ ప్రకటించాయో ఇప్పుడు చూద్ధాం.

Paris Olympics 2024

భారతదేశంలో పతక విజేతలకు ఎంత డబ్బు వస్తుంది?
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారి క్రీడాకారులకు కనీసం 33 దేశాలు నగదు బహుమతులు ఇస్తాయి. వీటిలో 15 దేశాలు గోల్డ్ మెడల్ కోసం $1,00,000 (సుమారు రూ. 82 లక్షలు) కంటే ఎక్కువ ఇచ్చి ఆటగాళ్లను ప్రోత్సహిస్తాయి. వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించిన భారతీయ ఆటగాళ్లకు రూ. 75 లక్షలు, రజత పతక విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ. 30 లక్షలు అందజేస్తామని భారతదేశంలోని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2019లో ప్రకటించింది.

ఏ దేశం ఎక్కువ మొత్తం ఇస్తుంది?
Paris Olympics 2024 ఒలింపిక్ పతక విజేతలకు అత్యధిక రివార్డులు ఇచ్చే దేశం హాంకాంగ్. చైనా నుంచి స్వతంత్రంగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న హాంకాంగ్, బంగారు పతకానికి 768,000 డాలర్లు (దాదాపు రూ. 6.3 కోట్లు) చెల్లిస్తుంది. రజత పతకాలు సాధించిన అథ్లెట్లకు $380,000 (దాదాపు రూ. 3.1 కోట్లు) ఇస్తుంది. బంగారు పతకం కైవసం చేసుకున్న క్రీడాకారులకు ఇజ్రాయెల్ 2,75,000 డాలర్లు (దాదాపు రూ. 2.2 కోట్లు) ఇస్తుంది. పెద్దమొత్తంలో నగదు ఇవ్వడంలో ఇజ్రాయెల్ రెండోస్థానంలో నిలిచింది. సెర్బియా 218,000 డాలర్లు (దాదాపు రూ. 1.8 కోట్లు)తో మూడో స్థానంలో ఉంది. ఆసక్తికరంగా, ఈ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లు 2021 టోక్యో గేమ్స్‌లో బంగారు పతకాలను గెలుచుకున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Swiggy Veg Orders : స్విగ్గీలో వెజ్‌ ఆర్డర్లు.. ఈ నగరాల నుంచే అధికం

0

Swiggy Veg Orders ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ (Swiggy) తాజా నివేదికలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చాలామంది మాంసాహారాన్ని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ, పలు నగరాల్లో శాకాహారాన్ని అత్యధికంగా ఆర్డర్‌ చేసుకుంటున్నట్లు తాజా నివేదికలో వెల్లడించింది. వీటిలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ముంబయి, హైదరాబాద్‌ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

Swiggy Veg Orders

దేశ సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరును ‘వెజ్జీ వ్యాలీ’గా స్విగ్గీ పేర్కొంది. తమకు దేశవ్యాప్తంగా వచ్చిన శాకాహార ఆర్డర్లలో మూడింట్లో ఒకటి ఈ నగరం నుంచి వచ్చినట్లు తెలిపింది. మసాలా దోస, పన్నీర్‌ బిర్యానీ, పన్నీర్‌ బటర్‌ మసాలాను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. ఇక ముంబయి రెండో స్థానంలో నిలిచింది. దాల్‌ కిచిడీ, మార్గరీటా పిజ్జా, పావ్‌ భాజీని ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారు. మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ వాసులు మసాలా దోస, ఇడ్లీని ఆస్వాదిస్తున్నారట.

Swiggy Veg Orders దేశంలో స్విగ్గీ స్వీకరిస్తున్న ఆర్డర్లలో టాప్‌ 10 వంటకాల్లో.. తొలి 6 స్థానాల్లో శాకాహార వంటకాలే ఉండడం విశేషం. వీటిలో మసాలా దోస, పన్నీర్‌ బటర్‌ మసాలా, మార్గరీటా పిజ్జా, పావ్‌ భాజీ టాప్‌లో నిలిచాయి. వారంలో 60 వేల వెజ్‌ సలాడ్‌ ఆర్డర్లను స్విగ్గీ అందుకుంటోంది.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Squid Game Season 2 : స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై బిగ్ అప్డేట్! స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Squid Game Season 2 –  2021లో వచ్చిన ఈ కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచం మెుత్తాన్ని ఉర్రూతలూగించింది. మూడేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ ల్లో టాప్ లో నిలిచింది. ఇక సీజన్ 1 సాధించిన భారీ విజయంతో.. సీజన్ 2 శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుందంటే?

Squid Game Season 2

‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ.. సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. హ్వాంగ్ డాంగ్ హ్యూక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తొలి సీజన్ లాగే తెలుగు డబ్బింగ్ కూడా ఉండనుంది. దీంతో పాటుగా వచ్చే సంవత్సరం అంటే 2025లో సీజన్ 3 తీసుకొస్తామని, అలాగే ఈ సిరీస్ కు ముగింపు పలుకుతామని తెలిపింది.

Squid Game Season 2 కాగా.. స్క్విడ్ గేమ్ సీజన్ 1ను 9 ఎపిసోడ్స్ తో తీశారు. 2021లో వచ్చిన ఈ సిరీస్ మూవీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. క్షణక్షణం ఉత్కంఠ రేపే సీన్స్ తో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఉర్రూతలుగించింది. అప్పట్లో మోస్ట్ పాపులర్ సిరీస్ గా నిలిచింది. చిన్న చిన్న గేముల్లో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్స్ చేసే పోరాటాలు ఇందులో ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పుడు సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కావడంతో.. అభిమానులు సంబరపడిపోతున్నారు. మరి మీలో ఎంత మంది స్క్విడ్ గేమ్ సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Student Kit App Latest Version Download Now

Student Kit App Latest Version ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖకు సంబంధించిన Student Kit App అప్డేటెడ్ లేటెస్ట్ వెర్షన్ యాప్ ను ఈ పేజీ నుండి డౌన్లోడ్ చేసుకొండి.

school apps latest version

School Apps Latest Version main website Click Here

School App Latest Version Download

  • Download Now Click Here
  • Version: 1.6.2
  • Date: 31.07.2024

IND vs SL : శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌.. హాట్‌స్టార్‌, జియో సినిమాలో రాదు.. మొబైల్‌లో ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?

0

India vs Sri Lanka : శ్రీలంక‌తో జ‌రిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్ పై ప‌డింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌కు సిద్ధం అవుతోంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ల‌తో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ వంటి ఆట‌గాళ్ల రాక‌తో భార‌త జ‌ట్టు బ‌లం పెరిగింది.

IND vs SL

ఇక హెడ్ కోచ్‌గా తొలి సిరీస్‌తోనే విజ‌యాన్ని అందుకున్న గౌత‌మ్ గంభీర్ వ‌న్డే సిరీస్ పై ఫోక‌స్ పెట్టాడు. వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025కి జ‌ట్టును స‌న్న‌ద్దం చేసేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ల‌ను మొద‌లు పెట్టాడు. మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌ను సైతం వైట్‌వాష్ చేయాల‌ని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.

IND vs SL స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్ చేరుకుంది. ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. ఫైన‌ల్ మ్యాచ్ త‌రువాత సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఆడుతున్న తొలి వ‌న్డే సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు లంక జ‌ట్టు వ‌న్డే సిరీస్‌లో గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది.

ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం ఎక్క‌డంటే..?
భార‌త జ‌ట్టు విదేశాల్లో ఆడే మ్యాచుల‌కు సంబంధించిన హ‌క్కులు అన్నీ సోనీ నెట్‌వ‌ర్క్‌ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు అన్ని సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు. ఓటీటీలో సోనీ లివ్ లో ప్ర‌సారం అవుతాయి.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?
హాట్ స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో శ్రీలంక వ‌న్డే సిరీస్ రాదు. కేవ‌లం సోనీ లివ్ ఓటీటీలో మాత్ర‌మే చూడొచ్చు. అయితే.. ఇందుకు స‌బ్‌స్ర్కిప్ష‌న్ తీసుకోవాలి. అయితే.. మొబైల్‌లో ఫ్రీగా చూడాల‌నుకుంటే జియోటీవీ యాప్‌లో చూడొచ్చు. జియో టీవీ యాప్‌లో ఛానెల్స్‌లో సోనీ టీవీ నెట్ వ‌ర్క్ ఛానెల్స్‌ను ఎంచుకోని వ‌న్డే సిరీస్‌ను ఉచితంగా చూడొచ్చు.

వ‌న్డే సిరీస్ షెడ్యూల్‌..

తొలి వన్డే – ఆగస్ట్ 2
రెండో వన్డే – ఆగస్ట్ 4
మూడో వన్డే – ఆగస్ట్ 7

IND vs SL జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు మొత్తం కొలంబో వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభం కానుంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Maharaja Movie కి విజయ్ సేతుపతి రెమ్యూనరేషనే తీసుకోలేదు! కానీ.. కోట్లలో లాభం!

Maharaja Movie వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్న కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి. కంటెంట్ ఉన్న వాడికి హ్యాండ్సమ్ లుక్, ఫిట్నెస్ బాడీ ఉండనక్కర్లేదని నిరూపించిన హీరో. కేవలం హీరో ఇమేజ్‌కు కట్టుబడిపోలేదు. విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అలరిస్తున్నాడు. దక్షిణాది పరిశ్రమను చుట్టేసిన అతడు.. బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మేరీ క్రిస్మస్, మహారాజ చిత్రాలతో పలకరించాడు. ఇందులో మహరాజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ భారీ కలెక్షన్లను అందుకుంది. రూ. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. సుమారు రూ. 110 కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుంది. ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూస్ రాబట్టుకుంటుంది.

Maharaja Movie

అయితే ఈ సినిమాలో నటించేందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేద విజయ్ సేతుపతి. ఇక ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు కానీ కథ కీ రోల్ ప్లే చేసింది. ఇందులో సెలూన్ షాపులో పనిచేసే బార్చర్‌గా ఆకట్టుకున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. కూతురు అంటే పంచ ప్రాణాలతో బతికే అతడు పోలీసుల దగ్గర చేసే డ్రామా, విలన్ల కోసం అతడు వేసే ప్లాన్ ఈ మూవీకి హైలెట్. లైంగిక వేధింపుల గురించి ఈ మూవీలో చూపించాడు దర్శకుడు నితిలన్ స్వామి నాథన్. ఈ మూవీని కేవలం రూ. 20 కోట్లు పెట్టి తెరకెక్కించారు సుధన్ సుందరం, జగదీష్ పళని స్వామి. ఇంతే బడ్జెట్‌తో సినిమా తీస్తామని నిర్మాతలు విజయ్ సేతుపతికి చెప్పగా ఓకే చెప్పారట. లాభాల్లో వాటా ఇస్తామని చెప్పారట. దీనికి ఓకే చెప్పాడట విజయ్.

Maharaja Movie ఇప్పుడు 20 కోెట్ల రూపాయలను పెట్టి సినిమా తీస్తే భారీ హిట్ అందుకోవడమే కాదు వసూళ్లను రాబట్టుకుంది. ఈ లెక్కన చూస్తే.. ఈ మూవీకి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. సాధారణంగా విజయ్ సేతుపతి సాధారణంగా ఒక్కో మూవీకి రూ. 10-12 కోట్లు తీసుకుంటాడని టాక్ నడుస్తుంది. కానీ లాభాల్లో షేర్ తీసుకుంటున్నట్లయితే ఇప్పుడు ఆయనకు భారీగా ముట్టనున్నట్లు తెలుస్తుంది. దీంతో నక్కతోక తొక్కినట్లయ్యింది. ఇక విజయ్ సేతుపతి మూవీల విషయానికి వస్తే.. గాంధీ టాక్స్ అనే మూవీతో పాటు విడుదలై పార్ట్ 2లో నటించబోతున్నాడని తెలుస్తుంది. అలాగే ఫర్జీ వెబ్ సిరీస్ మూవీతో బాలీవుడ్ బాట పట్టిన ఈ వర్సటైల్ నటుడు.. ఇప్పుడు మరికొన్ని కథలను వింటున్నట్లు తెలుస్తుంది.





Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Satya Sri Jabardasth ఏంటీ..! పెద్దరాయుడులో బ్రహ్మానందం భార్య.. ఈ ఫెమస్ జబర్దస్త్ నటి అమ్మా..!!

0

Satya Sri Jabardasth హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎన్నో వందల సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు పడీపడీ నవ్వుతారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు వేసి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి నవ్వించారు. బ్రహ్మానందం గారి కామెడీ గురించి చెప్పాలంటే ఒకటో.. రెండో సినిమాలు చెప్తే సరిపోదు. ఆయన నటించిన సినిమాలన్నీ చెప్పాలి.. సినిమా సినిమాకు ఆయన తన కామెడీతో ఆకట్టుకున్నారు. అలాగే కలక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు, సీన్స్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా పెద్దరాయుడు సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

Satya Sri Jabardasth

ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. రజినీకాంత్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. అలాగే మోహన్ బాబు ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని తన తండ్రి దగ్గరకు వచ్చే సీన్ బాగా పండింది.

ఈ సీన్ లో బ్రహ్మానందం భార్యగా నటించిన నటి గుర్తుందా.? ఆమె ఎవరో కాదు జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లి. సత్య శ్రీ జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. చమ్మక్ చంద్ర స్కిట్స్‌లో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వుస్తుంది. ఆ మధ్య జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది. ఆతర్వాత తిరిగి జబర్దస్త్ లోకి వచ్చి ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తోంది. సత్య శ్రీ తల్లి పెద్దరాయుడు సినిమాతో పాటు ఇష్క్, ఆర్య 2 సినిమాల్లోనూ నటించింది. ఇక కూతురి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె సినిమాలు మానేసింది. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో  సత్య శ్రీ తెలిపింది. ఇక సత్య శ్రీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

సత్య శ్రీ సోషల్ మీడియా

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


AP CM Chandrababu: మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఇసుక లభ్యత, ధరలపై కీలక చర్చ

AP CM Chandrababu : ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై చర్చించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24 శాతం గ్రోత్ సాధించగా.. 2019-24 మధ్య 7 శాతం మాత్రమే ఉందని నిర్ధారించారు. గత ఐదేళ్ల కాలంలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్ష చేపట్టారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ. 1025 కోట్లు చెల్లించలేదని అధికారులు తేల్చారు.

AP CM Chandrababu

దీనిపై కేసులు నమోదు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. మైనింగ్ శాఖలో అస్తవ్యస్త విధానాల వల్ల తలెత్తిన సమస్యలపై సీఎం సమీక్షలో ప్రస్తావించారు. ఉచిత ఇసుక పాలసీ అమలు, వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత, ధరలపై చర్చలు జరిపారు. రవాణా ఖర్చుల కారణంగా కొన్ని చోట్ల అనుకున్నంత తక్కవ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైనా చర్చించారు. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా.. కొత్తగా ఏఏ విధానాలు అవలంభించవచ్చనే అంశంపై అధికారులతో సమీక్షించారు. రీచ్ నుంచి నేరుగా అవసరం ఉన్నవారికి ఇసుక తీసుకువెళ్లగలిగితే భారం ఉండదని సీఎం పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని.. వినియోగదారులకు భారం కాకుండా చూడాలని అధికారులను AP CM Chandrababu ఆదేశించారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Devara Second Song దేవర సెకండ్ సాంగ్ ఆ రేంజ్ లో! నాగవంశీ ట్వీట్ వైరల్!

Devara Second Song తారక్ ఈ మధ్య చేసినవన్నీ కూడా యాక్షన్ థ్రిల్లర్స్ ఏ ఉన్నాయి. ఎప్పుడో ఆరేళ్ళ క్రితం వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో తారక్ లో క్యూట్ యాంగిల్ ను చూశారు ప్రేక్షకులు.. ఇక ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలే. ఆర్ఆర్ఆర్ తర్వాత అయితే తారక్ ను స్క్రీన్ మీద చూసి చాలా కాలమే అయింది. దీనితో ప్రేక్షకులంతా కూడా తారక్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన అప్ డేట్స్ అన్ని కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నాగవంశీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Devara Second Song

తాజాగా నాగవంశీ తారక్ ను ట్యాగ్ చేస్తూ.. “తారక్ ను ఇలా చూసి ఆరేళ్ళు అయింది కదా.. మళ్ళీ అలా క్యూట్ గా స్మైల్ చేస్తూ రొమాన్స్ చేయడం చూస్తారు ఈసారి.. మనకి ఇదే సరిపోతుంది కదా” అంటూ అరవింద సామెత రాఘవ సినిమాలోని ఫొటోస్ ను షేర్ చేశారు. దీనితో ఈ సినిమాపై ఇంకాస్త ఆసక్తి పెరిగిపోయింది. చూడబోతుంటే ఈ సినిమా నుంచి నెక్ట్ వచ్చే సాంగ్ అప్ డేట్.. ఇలాంటి లవ్ , రొమాన్స్ యాంగిల్ లోనే ఉంటూ.. వింటేజ్ తారక్ ను గుర్తుచేస్తుందేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే .. ఈసారి తారక్ లుక్స్ కు అందరూ ఫిదా అవ్వాల్సిందే . ప్రస్తుతం నాగవంశీ ట్వీట్ సామాజిక మాధ్యమాలలో తెగ చెక్కర్లు కొడుతోంది. మూవీపై నెక్ట్ అప్ డేట్ ఏంటా ఏమై ఉంటుందా అని ప్రేక్షకులు ఇంకాస్త ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఈ ట్వీట్ తో సినిమాపై ఇంకాస్త అంచనాలు పెంచేశాడని చెప్పి తీరాల్సిందే . త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్ .

Devara Second Song ఇక అంతే కాకుండా.. జాన్వీ కపూర్ కూడా లేటెస్ట్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో.. దేవర మూవీ షూటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ పోస్ట్ ను కూడా షేర్ చేసింది. ఒక్కొక్కటిగా ఈ సినిమా నుంచి వస్తున్న న్యూస్ చూస్తుంటే.. ప్రేక్షకులు ఊహించిన దానికంటే కూడా.. నెక్ట్ లెవెల్ లో మూవీ ఉండబోతుందేమో అనే అంచనాలు.. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కాగా సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అనుకున్న తేదీ ప్రకారం రిలీజ్ అయితే కనుక.. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న హైప్ కు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం. మరి లేటెస్ట్ గా నాగ వంశి చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

anna @tarak9999 ni ila cute chusi 6 years ayindhi kada … malli aa cute ga smile chesthu romance cheyatam chustharu ee sari… Manaki ade saripothundhi kada🤪 🤩 pic.twitter.com/vT5jAnCu9r

— Naga Vamsi (@vamsi84) July 31, 2024

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


10th Qualification Jobs ఉంటే చాలు? ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీవే.. నెలకు 69 వేల జీతం

10th Qualification Jobs ఆర్థిక పరిస్థితి కారణంగా చాలామంది టెన్త్ పూర్తవగానే చదువు మానేస్తుంటారు. ప్రతిభ ఉన్నా కూడా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరమవతుంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని గడుపుతుంటారు. పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే బాగుండని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. మీరు టెన్త్ పాసైతే చాలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందొచ్చు. టెన్త్ అర్హతతో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది బెస్ట్ ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) పలు ఉద్యోగా భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

10th Qualification Jobs

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ఫోర్స్‌లో నాన్‌ మినిస్టీరియల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మెన్‌ గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. పురుష, మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 18 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 51.

పోస్టుల వివరాలు:

  • కానిస్టేబుల్‌(టైలర్‌)–18, కానిస్టేబుల్‌(కోబ్లర్‌)–33.

10th Qualification Jobs అర్హత:

  • టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత­తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 18.08.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • నెలకు రూ.21,700 నుంచి రూ.69,100

దరఖాస్తు ఫీజు:

  • అన్ రిజర్వ్డ్, ఈడబ్య్లూఎస్ వారు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది:

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.