Home Blog Page 67

Olympics 2024 Prize Money : ఒలింపిక్స్‌ విజేతలకు భారీగా నగదు.. ఎంత ఇస్తారంటే

0

Olympics 2024 Prize Money క్రీడా రంగంలో అ‍త్యంత ప్రతిష్టాత్మతకంగా భావించే ఒలింపిక్స్‌ 2024 ప్రారంభం అయ్యింది. నాలుగేళ్లకు ఓ సారి జరిగే ఈ వేడుకులకు ఈ సారి పారిస్‌ వేదికయ్యింది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. ఇక ఈ ఏడాది మన దేశం నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు.. వేర్వేరు అంశాల్లో తమ సత్తా చాటడానికి పారిస్‌ వెళ్లారు. ఇప్పటికే మను బాకర్‌ రెండు పతకాలను ఇండియాకు అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. వీరిద్దరి సాధించిన విజయాల పట్ల దేశం యావత్తు పొంగిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా.. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Olympics 2024 Prize Money

అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి.. దేశం కీర్తిని ప్రపంచవేదికల మీద వేనోళ్ల పొగిడేలా చేసిన క్రీడాకారులకు, వారు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ.. ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలను అందిస్తాయి. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. సుమారు 33 దేశాలు.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందిస్తాయి. వీటిల్లో సుమారు 15 దేశాలు గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి లక్ష డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. సుమారు 82 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చి ప్రోత్సాహిస్తాయి.

Olympics 2024 Prize Money ఇక ఇండియా విషయానికి వస్తే.. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ).. వ్యక్తిగత ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించిన భారతీయ ఆటగాళ్లకు రూ. 75 లక్షలు, రజత పతక​ సాధించిన వారికి రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ. 30 లక్షలు అందజేస్తామని భారతదేశంలోని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2019లో ప్రకటించింది.

అయితే ఈ ఒలింపిక్స్‌ నాటికి ఐఓఏ ఈ ప్రైజ్‌మనీని పెంచింది. దీని ప్రకారం ఇప్పుడు గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఆటగాళ్లలకు రూ.కోటి, సిల్వర్‌ మెడల్‌ సాధించిన వారికి 75 లక్షలు, మిగతా వారికి 50 లక్షల రివార్డు అందించనుంది. ఇవి కాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రత్యేకంగా నగదు బహుమతి అందజేస్తాయి.

ఏ దేశం ఎక్కువ నగదు ఇస్తుందంటే..

ఒలింపిక్ పతక విజేతలకు అత్యధికంగా నగదు రివార్డు ఇచ్చే దేశం హాంకాంగ్‌. చైనా నుంచి స్వతంత్రంగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న హాంకాంగ్.. గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి 7,68,000 డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే.. దాదాపు రూ. 6.3 కోట్లు చెల్లిస్తుంది. అలానే రజత పతకాలు సాధించిన క్రీడాకారులకు 3,80,000 అంటే దాదాపు రూ. 3.1 కోట్లు ఇస్తుంది. హాంకాంగ్‌ తర్వాత క్రీడాకారులకు పెద్ద మొత్తంలో నగదు రివార్డు ఇచ్చే మరో దేశం ఇజ్రాయేల్‌. ఈ దేశం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు 2,75,000 డాలర్లు అంటే దాదాపు రూ. 2.2 కోట్లు ఇస్తుంది. ఆ తర్వాత స్థానంలో సెర్బియా నిలిచింది. ఈ దేశం ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి 218,000 డాలర్లు అంటే దాదాపు రూ. 1.8 కోట్లు ఇస్తుంది.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Scooty Car కారుకే మాత్రం తీసిపోని స్కూటీ.. కాలు కింద పెట్టే పని లేదు.. ధర 88 వేలే!

Scooty Car బైక్ లేదా స్కూటీ టూవీలర్ ఏదైనా గానీ ట్రాఫిక్ లో నడపాలంటే మహా కష్టం. అస్తమానూ కాలు కింద పెట్టాల్సి ఉంటుంది. కొంతమందికి ఇది విసుగు కలిగిస్తుంది. ఇక వర్షాలు పడితే అంతే సంగతులు. ఆ బురదలో కాలు పెడితే షూస్, ప్యాంటు నాశనమైపోతాయి. బండి నడపాలన్న మూడు, ఉత్సాహం సర్వనాశనమైపోతాయి. వర్షంతో, ట్రాఫిక్ తో.. మధ్యతరగతి వాళ్ళు నిత్యం పోరాటం చేస్తుంటారు. అలాంటి వారి కోసమే అన్నట్టు ఇప్పుడు మంచి మంచి ఆవిష్కరణలు వస్తున్నాయి. కారు కొనలేకపోతున్నామని బాధపడేవారి కోసమే ఈ కారు లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్. కాలు కింద పెట్టే పని లేదు. ఎంత దూరమైనా దర్జాగా, సౌకర్యంగా వెళ్ళచ్చు. పీఈవీ ఎలక్ట్రిక్ కంపెనీ 2 వీలర్ స్కూటీలతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేస్తుంది. 

Scooty Car

త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ సీటు, డబుల్ సీటుతో వస్తుంది. వెనకాల ఒక వ్యక్తి కూర్చోవచ్చు. పిల్లలు ఉంటే పెద్దవాళ్ళతో పాటు ఒక పాప, బాబు కూర్చోవచ్చు. సీటు పెద్దగా ఉండడం వల్ల సౌకర్యంగా ఉంటుంది. సీటుని ముందుకి, వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనక ఒక స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చారు. హెల్మెట్, ఛార్జర్ వంటివి పెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఎత్తైన ప్రదేశాల్లో రివర్స్ మోడ్ లో కూడా ఈజీగా ప్రయాణిస్తుంది. త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1000 వాట్ మోటార్ పవర్ తో వస్తుంది. సింగిల్ ఛార్జ్ తో 50 నుంచి 60 కి.మీ. ప్రయాణం చేయవచ్చు. 32 ఏహెచ్, 60 వోల్ట్స్ బ్యాటరీతో వస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 7 నుంచి 8 గంటలు పడుతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 30 కి.మీ.గా ఉంది. ఇది వయసులో పెద్ద వారికి బాగా సూట్ అవుతుంది. సింగిల్ సీటుది కావాలంటే సింగిల్ సీటు కొనుక్కోవచ్చు, డబుల్ సీటుది కావాలంటే డబుల్ సీటుది కొనుక్కోవచ్చు.

Scooty Car ఇక ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ కారు విషయానికొస్తే సింగిల్ సీటుతో వస్తుంది. నాలుగు చక్రాలతో వస్తుంది. సీటు కింద డిక్కీ ఇచ్చారు. వెనక ఒక చిన్న బాస్కెట్ ఇచ్చారు. వయసులో పెద్ద వారికి ఇది యూజ్ అవుతుంది. ముఖ్యంగా లేడీస్ కి బాగా ఉపయోగపడుతుంది. షాపింగ్ కి, ఆఫీసులకు వెళ్ళవచ్చు. డ్రైవింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కాలు కింద పెట్టే పని ఉండదు కాబట్టి కొత్తగా నేర్చుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేసిన వ్యక్తి చెప్తున్న దాని ప్రకారం అతను 88 వేలకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ కంపెనీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ వాహనాలను డెలివర్ చేస్తున్నారని.. రవాణా ఛార్జీలు లేకుండా వాళ్ళే సొంత ఖర్చులతో డెలివర్ చేస్తున్నారని ఈ వెహికల్ ని కొన్న వ్యక్తి వెల్లడించారు. ఈ కంపెనీ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సిటీలో ఉంది. మరి మీకు ఈ వాహనం కొనాలనుకుంటే కనుక పీఈవీ ఎలక్ట్రిక్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Nani – Keerthy Suresh : నాని కొడుకు కీర్తి సురేష్ ని ఏమని పిలుస్తాడా తెలుసా? నాని కొడుకుపై కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు..

Nani – Keerthy Suresh : కీర్తి సురేష్, నాని కలిసి నేను లోకల్, దసరా సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే సినిమాల కంటే కూడా వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉంది. గతంలో కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హైదరాబాద్ కి వస్తే నాని ఇంటికే వెళ్తాను, వాళ్ళ వంటింట్లోకి కూడా వెళ్లి వంట చేసుకుంటాను. నాని ఫ్యామిలీ నాకు అంత క్లోజ్. నాని భార్య అంజనా కూడా చాలా క్లోజ్ అని చెప్పింది.

కీర్తి సురేష్ త్వరలో రఘు తాత అనే సినిమాతో తమిళ్ లో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని కొడుకు అర్జున్ గురించి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Nani – Keerthy Suresh

కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నాని కొడుకు జున్ను( నాని కొడుకు ముద్దు పేరు) నా స్ట్రెస్ బస్టర్. జున్ను నన్ను కీర్తి అత్త అని పిలుస్తాడు. వాడి క్యూట్ నెస్ చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. జున్ను చాలా తొందరగా పెరుగుతున్నాడు. జున్ను పెద్దవాడవడం సంతోషంగా ఉంది. హైదరాబాద్ కి వస్తే కచ్చితంగా జున్నుని కలిసే వెళ్తాను. వాడి వాయిస్ మెసేజెస్ వింటూ ఉంటాను. నాకు బర్త్ డే విషెష్ కూడా క్యూట్ గా చెప్పాడు అని తెలిపి హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అని అర్జున్ చెప్పిన వాయిస్ క్లిప్ ని ఆ ఇంటర్వ్యూలో వినిపించింది. దీంతో నాని ఫ్యామిలీకి కీర్తి సురేష్ తో మంచి సాన్నిహిత్యం ఉందని మరోసారి అర్ధమవుతుంది. ఇక నాని కొడుకు గురించి కీర్తి ఇలా చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Indian2 OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న భారతీయుడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Indian2 OTT ఉలగనాయగన్ కమల్ హాసన్,భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో 1996 లో వచ్చిన చిత్రం భారతీయుడు. వ్యవస్థల్లో కురుకుపోయిన అవినీతిని అంతమొందించి, సామాన్యుడికి న్యాయం చేసేందుకు భారతీయుడు చేసిన పోరాటాలకు అటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకులతో పాటు హిందీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. భారీ బడ్జెట్ తో రూపొందిన భారతీయుడుకు ఘాన విజయం కట్టబెట్టారు. ఈ చిత్రానికి సిక్వెల్ గా మరోసారి అదే కలయికలో భారతీయుడు-2 ను తెరకెక్కించాడు దర్శకుడు శంకర్.

Indian2 OTT

Indian2 OTT గత నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఇండియన్-2 బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు రూ.250 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో వచ్చిన ఈ చిత్రం కనీసం 150 కోట్ల రూపాయలు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ నిర్మాతలకు సదురు ఓటీటీ సంస్థలకు తకరారు నడిచింది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్, లైకా మధ్య భారతీయుడు -2 వివాదం ముగిసిందని సమాచారం. ఇక మరోవైపు ఇండియన్ -2 థియేట్రికల్ రన్ కూడా దాదాపు ముగిసినట్టే. దీంతో భారీ రేట్ కు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం,థియేటర్లలో భారీ ఫ్లాప్ గా నిలవడంతో డిజిటల్ ప్రీమియర్ గా ఇండియన్ -2 ను ఒప్పందం కంటే ముందుగా ఆగస్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సదరు సంస్థ. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Delhi Rains : దిల్లీలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ.. 10 విమానాలు దారి మళ్లింపు

0

Delhi Rains దేశ రాజధానిలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నగరానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం.

Delhi Rains

దిల్లీ: దేశ రాజధాని నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ దిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిల్లీకి రావాల్సిన పలు విమానాల దారి మళ్లించినట్లు సమాచారం. రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు రాడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు, రావూస్‌ అకాడమీలో ముగ్గురు సివిల్స్‌ విద్యార్థుల మృతికి నిరసనగా ఓల్డ్‌ రాజిందర్‌నగర్‌లో సివిల్స్‌ అభ్యర్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్నారు.

ఇటీవల ముగ్గురు సివిల్స్‌ అభ్యర్థులు మరణించిన రాజేంద్రనగర్‌ ప్రాంతం మరోసారి వరద నీటితో మునిగిపోయింది. ఆ ప్రాంతంలోనే అనేక కోచింగ్‌ సెంటర్లలోకి నీరు వచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో స్థానిక ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ మోకాళ్లలోతు నీరు నిలిచిపోగా.. అందులో చిక్కుకున్న వాహనాలను బయటకు తీయడంతో స్థానిక పోలీసులకు కొందరు విద్యార్థులు సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమ్‌ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసింది.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


SC ST Reservations SC Judgement : ఏళ్ల నిరీక్షణకు తెర.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సంచలన తీర్పు

0

SC ST Reservations SC Judgement ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ తప్పనిసరి అని, ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

sc st reservations sc judgement
october 1, 2026, 6:38 pm - duniya360

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తుది తీర్పును వెల్లడించింది. ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దీంతో దేశ వ్యాప్తంగా ఎస్సీ కులస్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు విచారణ సాగిన విషయం తెలిసిందే. వర్గీకరణ సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. సుదీర్ఘ వాదనలు అనంతరం ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.

  • ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
  •  విచారణ చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం
  •  వర్గీకరణ తప్పనిసరి అని కోర్టు తీర్పు
  •  ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ

SC ST Reservations SC Judgement ఎస్సీ ,ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల కేసు బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ..

ఎస్సీ , ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌ర‌ణ సంబంధించి ఉమ్మడి ఆంధ్రప‌దేశ్ లో బీజం ప‌డింది. 2000-2004 వ‌రకు అప్పటి చంద్రబాబు స‌ర్కార్ ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ ను అమ‌లు చేసింది. అయితే మాల‌మ‌హ‌నాడు వ‌ర్గీక‌ర‌ణ‌ను వ్యతిరేకించింది.. హైకోర్టులో న్యాయ‌పోరాటం చేసింది.
హైకోర్టు వ‌ర్గీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004 లో అనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం విచార‌ణ అనంత‌రం వ‌ర్గీక‌రణను వ్యతిరేఖించింది. వివ‌క్ష, వెనుక బ‌డిన వాళ్లంద‌రిని ఒకే కేట‌గిరిలో ఉంచాల‌ని ఆదేశాలిస్తూ.. హైకోర్టును తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్గీక‌ర‌ణ కోసం పోరాటాలు ప్రజా ఉద్యమాలుగానూ, రాజ‌కీయ ఉద్యమాలుగానూ జ‌రుగుతూనే ఉన్నాయి.

అయితే పంజాబ్ ప్రభుత్వం తాజాగా వ‌ర్గీక‌ర‌ణ చేసేందుకు సిద్ధం అవ‌డంతో అక్కడి హైకోర్టు సుప్రీం కోర్టులోని 2004 కేసుకు రిఫ‌ర్ చేసింది. తెలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల ప్రచారంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు తాము అనుకూలం అనే బీజేపీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కేంద్రం క్యాబినేట్ సెక్రట‌రీ నేతృత్వంలో క‌మిటీ కూడా వేసింది. దాంతో ఏడుగురు స‌భ్యుల రాజ్యాంగ ధ‌ర్మాసనం మూడు రోజుల పాటూ సుప్రీం కోర్టులో సుదీర్గ విచార‌ణ జ‌రిపింది. ఫిబ్రవ‌రి 8 న తీర్పును రిజ‌ర్వ్ చేసింది. తాజాగా ఈమేరకు తీర్పు వెలువడింది. ఏళ్ల కల నెరవేరింది.

Thalliki Vandanam Scheme సంవత్సరానికి రూ. 15,000 ప్రతీ విద్యార్థికి ఆర్థిక సహాయం 2024 Check Eligibility, Benefits and Application Process

Thalliki Vandanam Scheme Check Eligibility, Benefits and Application Process 2024 | చంద్రబాబు నాయుడు తన 2024 మానిఫెస్టోలో “తల్లికి వందనం” కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థి 9 విద్యను కొనసాగించేందుకు సంవత్సరానికి రూ. 15,000 అందించడం ద్వారా, ఈ విప్లవాత్మక ప్రాజెక్ట్ యువతకు మెరుగైన భవిష్యత్ సృష్టించడంలో టీడీపీ పార్టీ యొక్క ప్రతిబద్ధతను ప్రదర్శిస్తుంది. తల్లికి వందనం పథకం విద్యనే అభివృద్ధికి అడ్డంగా భావించే టీడీపీ యొక్క అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రతీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా, టీడీపీ సమాన అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Thalliki Vandanam Scheme

ఈ కార్యక్రమం రాష్ట్ర యువతను ఆర్ధిక పరిమితుల ద్వారా తగిలించకుండా తమ కలలను అనుసరించడానికి శక్తినిస్తుంది. ఈ దూరదృష్టి ప్రాజెక్ట్ ప్రతి పిల్లవాడి భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు ఉత్తమమైన, ధనికమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.

thalliki vandanam scheme

Thalliki Vandanam Scheme వివరాలు

తల్లికి వందనం పథకం వివరాలు
Name of the schemeThalliki Vandanam Scheme
Launched byThe Telugu Desam Party (TDP)
ObjectiveTo create a better future for young people through education
ModeOnline (application to be launched)
BeneficiariesStudents
BenefitRs. 15,000 per year per student
StateAndhra Pradesh

టీడీపీ పార్టీ ఎట్టకేలకు తమ పిల్లలను చదివించలేని కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం Thalliki Vandanam Scheme ప్రారంభించింది 2024.
తల్లికి వందనం పథకం 2024ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం 2024ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు డబ్బు గురించి చింతించకుండా తమ చదువును కొనసాగించవచ్చు. తల్లికి వందనం స్కీమ్ 2024 1 నుండి 12 తరగతులలో నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులందరికీ రెగ్యులర్ ప్రాతిపదికన ట్యూషన్ చెల్లించలేని వారికి అందుబాటులో ఉంటుంది. తల్లికి వందనం పథకం 2024 కింద ఎంపిక కోసం పరిగణించాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తును పూర్తి చేయాలి.

అర్హత ప్రమాణం

  • దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
  • దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  • దరఖాస్తుదారు ఆర్థికంగా అస్థిర పౌరుడిగా ఉండాలి.
  • దరఖాస్తుదారు కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.

అవసరమైన పత్రాలు

  • ఫోటోతో కూడిన బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్
  • పాన్ కార్డ్
  • రేషన్ కార్డు
  • ఓటరు గుర్తింపు కార్డు
  • కిసాన్ ఫోటో పాస్‌బుక్
  • వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత

ఆంధ్రప్రదేశ్ Thalliki Vandanam Scheme యొక్క ప్రయోజనాలు

తల్లికి వందనం పథకం యొక్క ప్రయోజనాలు తక్షణం మరియు సుదూరమైనవి:

ఆర్థిక సహాయం:-  ప్రతి బిడ్డకు రూ. విద్యా ఖర్చులను కవర్ చేయడానికి సంవత్సరానికి 15,000.

సమానత్వాన్ని ప్రోత్సహించడం:-  ఆర్థిక అడ్డంకులను తొలగించడం ద్వారా, పిల్లలందరికీ వారి ఆర్థిక నేపథ్యంతో  సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను పొందేలా ఈ పథకం నిర్ధారిస్తుంది.

దీర్ఘకాలిక ప్రభావం:- విద్యావంతులైన జనాభా ఆవిష్కరణ, ఆర్థిక పురోగతి మరియు సామాజిక సామరస్యానికి పునాది.

తల్లికి వందనం పథకం 2024 దరఖాస్తు ప్రక్రియ

తల్లికి వందనం స్కీమ్ కోసం దరఖాస్తు ప్రక్రియ సూటిగా ఉండేలా సెట్ చేయబడింది, అయితే అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించడంపై నిరంతరంగా ఉంటుంది. వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, అర్హత ఉన్న కుటుంబాలు వీటిని చేయాలి:

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. https://www.ap.gov.in/#/
  • ఖచ్చితమైన సమాచారంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • సమీక్ష కోసం దరఖాస్తును సమర్పించండి.
  • అప్‌డేట్‌ల కోసం అందించిన సంప్రదింపు వివరాల ద్వారా అనుసరించండి.

Big Rain Alert in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

0

Big Rain Alert in Telugu States దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. గత నెల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మహరాష్ట్ర, గుజరాత్, అస్సాం, తెలుగు రాష్ట్రాలతో పాటు కేళాలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా డ్యాములు, చెరువులు నిండి పొంగిపొర్లుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెరువులకు, కాల్వలకు గండ్లు పడి గ్రామాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికే పలు గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు నుంచి మరో మూడు రోజులు పలు జిల్లాల్లో భారీవర్షాలు పడే సూచన ఉందని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

Big Rain Alert in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో ఒకటీ రెండు రోజులు తప్ప వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత పది రోజలు నుంచి ఎడతేరిపి లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. జలాశయాలు నిండుకుండలా తలపిస్తున్నాయి. నేటి నుంచి మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వరుసగా పడుతున్న వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో భద్రాద్రి, ఖమ్మం, ములుగు, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారుల తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Big Rain Alert in Telugu States పశ్చిమ భారత్ లో రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలోనూ తుఫాన్ సుడి ఏర్పడిందని.. దీని ప్రభావంతో మూడు రోజుల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఏపీలో రుతుపవనాల ప్రభావం గట్టిగానే ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, ప్రకాశం, ఎన్టీఆర్, అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రైతులు, మత్స్యాకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Vizianagaram : ఏకాంతంగా ఉన్న లవర్స్ వద్దకు వెళ్లిన హోంగార్డు.. ఆపై వారిని బెదిరించి..

0

Vizianagaram జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నెల్లిమర్ల మండలంలో ఓ యువతిపై పోలీసు హోంగార్డు అత్యాచారానికి ఒడిగట్టాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలి కంప్లైంట్ చేయడంతో.. హోంగార్డును అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి… బొండపల్లి పోలీసుస్టేషన్‌లో డ్యూటీ చేస్తున్న హోంగార్డు మొయిద సురేశ్‌ మంగళవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. దారిలో కొండకరకం దగ్గర్లో..  ఓ లవ్ కపుల్ కనిపించడంతో వారి వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను ఎస్సైని అని, ఇద్దరిపై కేసు బుక్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ప్రియుడు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.

Vizianagaram

ఆ తర్వాత హోంగార్డు సురేశ్‌ ఆ యువతిని ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కిస్తానని నమ్మించాడు. ఆపై బైకుపై రామతీర్థం సమీపంలోని చంపావతి నది ఒడ్డునున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తిరిగి ఆమెను రామతీర్థం సర్కిల్‌లో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడు. బాధితురాలి కంప్లైంట్ చేయడంతో.. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేశ్‌ను అరెస్టు చేశామని.. అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ చెప్పారు.  

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Ismail Haniyehs assassination : ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ అధినేత ఆదేశాలు!.. తీవ్ర ఉద్రిక్తత

0

  • హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా దాడికి ఆదేశాలు
  • హత్య జరిగిన వెంటనే ఇరాన్ అధినేత అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం
  • ముగ్గురు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వెలువడుతున్న కథనాలు

Ismail Haniyehs assassination హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యతో మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలంటూ ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు ఇచ్చారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇస్మాయిల్ హత్యకు గురైనట్లు మీడియాలో వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగిందని, ఈ భేటీలో అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీ దాడికి ఆదేశాలు ఇచ్చారని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ముగ్గురు అధికారులకు ఆదేశాలు వెళ్లాయని, ఇందులో ఇద్దరు రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు కూడా ఉన్నారని పేర్కొంది.కాగా హమాస్ అధినేత ఇస్మాయిల్ హత్య ఇజ్రాయెల్ పనేనని ఇరాన్, హమాస్ బలంగా నమ్ముతున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం తమ ప్రమేయం లేదని ఖండించింది. అయితే విదేశాలలో శత్రువులను మట్టుబెట్టిన చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉండడంతో ఇస్మాయిల్ హత్యలో ఇజ్రాయెల్ ప్రమేయం ఉందని ఇరాన్ విశ్వసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

Ismail Haniyehs assassination

హమాస్ చీఫ్ హతం
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. మంగళవారం టెహ్రాన్‌లోని ఇస్మాయిల్ నివాసంపై జియోనిస్టులు జరిపిన దాడిలో ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారని హమాస్ నిర్ధారించింది. పాలస్తీనాలో యూదుల హక్కులు, ప్రత్యేక రాజ్యం కోసం పోరాడుతున్న జియోనిస్టులు జరిపిన ఈ దాడిపై దర్యాప్తు కొనసాగుతోందని హమాస్ తెలిపింది. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇస్మాయిల్ ఇరాన్ రాజధానికి టెహ్రాన్ వెళ్లారు.

Ismail Haniyehs assassination కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి దగ్గరగా వచ్చి వెనక్కి తగ్గాయి. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ఇజ్రాయెల్ కారణమంటూ ప్రతీకారంగా వందలాది క్షిపణులు, డ్రోన్‌తో ఇరాన్ దాడి చేసింది. వీటిని ఇజ్రాయెల్‌ ఆర్మీ తిప్పికొట్టిన విషయం తెలిసిందే.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.