Home Blog Page 69

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ ‘రక్షణ’ సినిమా ఓటీటీలోకి.. ఎందులో.. ఎప్పట్నించి..?

Payal Rajput Rakshana Movie : పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ‘రక్షణ’ అనే సినిమాతో జూన్ 7న థియేటర్స్ లో ప్రేక్షకులని పలకరించింది. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో రోష‌న్‌, మాన‌స్, రాజీవ్ కనకాల.. పలువురు ముఖ్య పాత్రల్లో క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రక్షణ సినిమా తెరకెక్కింది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ఈ సినిమాని నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమాలో పాయల్ పోలీసాఫీసర్ గా నటించింది.

Payal Rajput

తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. రెగ్యులర్ గా ప్రతి వారం కొత్త సినిమాలు అందించే తెలుగు ఓటీటీ ఆహాలో ఆగస్టు 1 నుంచి రక్షణ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఆహా ఓటీటీలో భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ ద్వారా రక్షణ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రక్షణ సినిమాని థియేటర్స్ లో మిస్ అయితే ఆహా ఓటీటీలో ఆగస్టు 1 నుంచి చూసేయండి.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Karnataka Health Minister : జైపూర్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన మాంసం కుక్కలది కాదు.. గొర్రెలదే

0

Karnataka Health Minister శుక్రవారం రాత్రి జైపూర్ నుంచి బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు రైలులో వచ్చిన మాంసం కుక్కలది కాదు, గొర్రెలదేనని రుజువైంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన మాంసం నమూనాల పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ కేసులో రైల్వే స్టేషన్‌లో అల్లకల్లోలం సృష్టించిన గోసంరక్షకుడు, అతని సహచరులు, మాంసం రవాణా చేస్తున్న వారిపై సహా మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. బెంగళూరు రైల్వేస్టేషన్‌లో శుక్రవారం భారీగా మాంసం లభించడంతో కలకలం రేగింది. జైపూర్‌ నుంచి బయలుదేరిన రైలులో 90 కంపార్ట్‌మెంట్లలో మూడు టన్నుల బరువున్న మాంసం లభ్యమైంది. సమాచారం అందుకున్న గో సంరక్షకులు స్టేషన్‌కు చేరుకుని కుక్క మాంసం అంటూ నానా హంగామా చేశారు.

Karnataka Health Minister

కాగా.. పోలీసు శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ విభాగం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపి 84 మాంసం నమూనాలను సేకరించారు. జంతువుల జాతులకు సంబంధించిన విశ్లేషణ కోసం నమూనాలను ఆహార ప్రయోగశాలకు పంపారు. జంతు మాంసం రవాణా ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మాంసం నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని జాతీయ మాంస పరిశోధన సంస్థకు పంపించారు. ఇక్కడి నుంచి వచ్చిన శాంపిల్స్‌ను పరీక్షించగా ఆ మాంసం గొర్రెలదేనని నిర్ధారించారు.

Karnataka Health Minister  ఈ కేసులో పోలీసులు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మాంసం రవాణాపై మొదటి ఎఫ్‌ఐఆర్, ప్రభుత్వ పనిని అడ్డుకున్నందుకు గోసంరక్షకుడిపై రెండవ ఎఫ్‌ఐఆర్.. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో గుమిగూడినందుకు గోసంరక్షకుడు, అతని సహచరులపై మూడవ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సిరోహి అనే ప్రత్యేక మేక జాతికి చెందిన మాంసం అని ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారి తెలిపారు. ఇది సాధారణంగా రాజస్థాన్.. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో లభిస్తుంది. అయితే.. కర్ణాటకలో మటన్ సరఫరా తక్కువగా ఉండడంతో కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Wayanad Landslides : వరద భయం.. వీరిని వెంటాడింది.. వారిని కాపాడింది..!

0

Wayanad Landslides : వరద భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లి ఓ కుటుంబం కొండచరియల కింద నలిగిపోగా.. అదే భయం ఓ కుటుంబం నిండు ప్రాణాలు కాపాడింది. కేరళ (Kerala)లోని వయనాడ్‌లో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులో (Wayanad Landslides) వెలుగుచూస్తున్న ఇలాంటి మానవీయ కథనాలు ఎందరో మనసుల్ని మెలిపెడుతున్నాయి.

Wayanad Landslides బంధువుల ఇంటికెళ్లి..

వయనాడ్‌ జిల్లాలోని చూరాల్‌మలలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించే అవకాశం ఉందని ఈ ప్రాంతంలోని ఓ కుటుంబం భయపడింది. విపత్తు నుంచి తప్పించుకునేందుకు సోమవారం ముండక్కై సమీపంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. కానీ మృత్యువు వీరిని వదల్లేదు. కొండచరియల రూపంలో బలితీసుకుంది. ముండక్కై వద్ద మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఈ కుటుంబంలోని మొత్తం 11 మంది చిక్కుకుపోయారు. వీరిలో రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి వెలికి తీశారు. మిగతా 8 మంది ఎక్కడున్నారో ఇంకా ఆచూకీ తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

కుటుంబాన్ని కాపాడిన ఆమె ఆందోళన..

Wayanad Landslides ఇక, ముండక్కై గ్రామానికి చెందిన మహమ్మద్‌ అలీస్‌ కుటుంబం త్రుటిలో ఈ పెను విపత్తు నుంచి బయటపడింది. వర్షాల కారణంగా విపత్తును ముందే ఊహించిన అలీస్‌ భార్య షకీరా అక్కడి నుంచి వెళ్లిపోదామని పట్టుబట్టింది. తొలుత కుటుంబసభ్యులెవరూ ఆమె మాటలు పట్టించుకోలేదు. కానీ, తీవ్రంగా ఒత్తిడి చేయడంతో సోమవారం రాత్రి 16 కిలోమీటర్ల దూరంలోని మెప్పడికి వెళ్లి అక్కడ ఓ సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నారు.

వారు వెళ్లిన కొన్ని గంటల తర్వాత ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్క అలీస్‌ నివాసం మినహా వీరి చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లు కూలిపోయాయి. ప్రస్తుతం తమ ఇళ్లు శిథిలాలు, బురదలో కూరుకుపోయిందని, తన భార్య ఆందోళనే తమ కుటుంబం ప్రాణాలు కాపాడిందని అలీస్‌ తెలిపారు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


IT Cell Voice Message on TIS Update

0

IT Cell Voice Message on TIS Update Regarding TIS updation. Plz be alert and do confirm all profiles duly modifying the errors.

it cell voice message on tis update
october 1, 2026, 8:55 pm - duniya360

IT Cell Voice Message on TIS Update

MOST URGENT
All the Dy.E.Os and MEOs are requested to update the teacher information i.e., Date of joining in present cadre, date of joining in present station and methodology in TIS portal immediately.
DEO,WG & RJD,KKD
Employees Information System EIS(Earlier TIS):

ఉపాధ్యాయులందరికి గమనిక.EIS(TIS) అనేది ప్రధాన డేటా వనరు అనేది విదితమే.అందులో నమోదు చేసిన వివరాలతో మాత్రమే డిపార్ట్మెంట్ వివిధ గణాంకాలు,ట్రైనింగ్ లు,బదిలీలు,పదోన్నతులు,సర్దుబాట్లు,NOC, VISA,మెడికల్…తదితర అనేక సేవలు ప్రాప్తిని పొందుతున్నాము.

ఈ విషయంలో ప్రతి ఉపాధ్యాయుడు,ప్రధానోపాధ్యాయులు తమ తమ వివరాలను….
1. వ్యక్తిగత లాగిన్ లో PDFడౌన్లోడ్ చేసుకొని ప్రతి పాయింట్ ని క్షుణ్ణంగా పరిశీలించి ,తప్పు గా నమోదులు ఉంటే వెంటనే మీ DEO ఆఫీసు నకు అభ్యర్థించుట ద్వారా మీ ప్రొఫైల్ UNFREEZE చేయించుకొనవలెను.
ఇప్పుడు మీ ప్రొఫైల్ Edit వచ్చాక వివరాలు సరిచేసుకొని submit చేయవలెను.

2.లేదా మీ DDO లాగిన్ లో కూడా PDFఅందుబాటులో ఉంటుంది. అది కూడా ఉపయోగించుకొని సరిచేసుకోవచ్చు.

మీ‌డేటాలో పొరబాట్లకు లేదా నమోదు కాకపోవడానికీ…వ్యక్తి గత బాధ్యత వహించవలసినది అని మనవి.

అలాగే DDOలు కూడా తమ పరిధిలోని ఉపాధ్యాయిలందరూ తమతమ వివరాలు నమోదు చేసుకొనేలా…నమోదైనవారైతే సరిచూసుకొనేలా…తప్పు నమోదులు ఉంటే తగు చర్య గైకొనేలా వ్యవహరించగలరు.

ఇది సమష్టి బాధ్యత.
తదుపరి చర్యలకు ఇరువురూ బాధ్యులేనన్నది గమనిక..

Treat it as most urgent
Link for EIS/TIS data check https://studentinfo.ap.gov.in/
Regarding TIS updation. Plz be alert and do confirm all profiles duly modifying the errors.

Kerala Vayanad .. గ్రామాలకు గ్రామాలే ధ్వసం.. నిద్రలోనే ప్రాణాలు పోగొట్టుకున్న వందలాది మంది.. ఫోటోలు చూస్తే కన్నీరు ఆగదు..

0

Kerala Vayanad .. గ్రామాలకు గ్రామాలే ధ్వసం.. నిద్రలోనే ప్రాణాలు పోగొట్టుకున్న వందలాది మంది.. ఫోటోలు చూస్తే కన్నీరు ఆగదు..అందాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కేరళ వాయనాడ్ లో భారీ వర్షాలతో అతిపెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గ్రామం తర్వాత గ్రామం ధ్వంసమైంది. అనేక కుటుంబాలు ధ్వంసమయ్యాయి. జులై 30 ఉదయం ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిరంతర భారీ వర్షాల వలన సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Kerala Vayanad

నదులలో శవాలు తేలుతూ వస్తున్నాయి. బురద ప్రవాహం మధ్య ప్రజల శరీర భాగాలు కూడా కనుగొనబడుతున్నాయి. ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన.. ఎక్కడ చూసినా బాధితులు, ప్రజల అరుపులు మిన్నంటుతున్నాయి.

వాయనాడ్ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌లకు ఆటంకం కలుగుతోంది, అయినప్పటికీ వాతావరణ పరిస్థితులకు ఎదురీదుతూ తప్పిపోయిన వారి కోసం ఆర్మీ, నేవీ, NDRF రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి.

తెల్లవారుజామున ప్రజలు తమ ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కొండచరియలు విరిగి పడడంతో చాలా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఎక్కడ చూసినా విషాదమే, గ్రామాలకు గ్రామాలే మాయం అయ్యాయి. చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి . నదులు ఉప్పొంగుతున్నాయి. వందలాది మంది కనిపించడం లేదు.

ఇప్పటి వరకు ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా వందలాది మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. శిథిలాలలో లభించిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వివిధ ఆసుపత్రుల మార్చురీలకు తరలిస్తున్నారు.

వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వస్తున్న చిత్రాలలో విధ్వంసం దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనం పూర్తిగా పాడైపోయి మట్టిలో ఎలా కప్పబడిందో ఈ చిత్రాలలో చూడవచ్చు. కుప్ప కూలిన ఇల్లు, విరిగిన వాహనాలకు సంబంధించిన భయానక దృశ్యాలు చూస్తే కొండచరియలు చేసిన గాయాన్ని అంచనా వేయవచ్చు.

వాయనాడ్ ప్రజలకు జూలై 30, 2024 తేదీ చాలా బాధాకరమైన రోజుగా నిలిచిపోతుంది. చాలా మందికి కళ్ళు తెరవడానికి కూడా అవకాశం లేదు. అక్కడ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, నదుల ప్రవాహానికి పలువురు గల్లంతయ్యారు.

కొండచరియలు విరిగిపడటంతో నదుల ప్రవాహం వేగంగా మారింది. శిథిలాలలో చిక్కుకుని చాలా మంది చనిపోయారు. పలువురు కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించారు.

నదుల ప్రవాహం ఉధృతంగా మారింది. దీంతో ప్రజలతో పాటు పలు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. గ్రామ ప్రాంతాలలో చుట్టూ నీరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పకృతి చేసిన విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది.

భారీ వర్షాల మధ్య ప్రజలను రక్షించే పనిలో NDRF కి చెందిన మూడు బృందాలు పనిచేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ప్రభావిత ప్రాంతాన్ని సమీప పట్టణానికి కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. భారత సైన్యం తాడుతో కలుపుతూ సహాయక చర్యలను చేస్తోంది.

ముండకైలో అనేక మృతదేహాలు పేరుకుపోయినట్లు సమాచారం. వీటిని మేపాడుకు తరలించ చేయలేకపోయారు. కుప్పకూలిన భవనాలపై మృతదేహాలు పడి ఉన్నాయని ముండకై సమాచారం అందింది. అక్కడికి చేరుకోవడానికి మార్గం లేదు.. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఇళ్లు ధ్వంసమై ఆహారం, నీరు కరువయ్యాయి. 12 గంటల పాటు విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో చాలా మంది ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ కావడంతో రెస్క్యూ ఆపరేషన్లపై ఈ ప్రభావం పడింది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Plastic Surgery ప్లాస్టిక్ సర్జరీలు తప్పుకావు.. నేను కూడా చేయించుకుంటా..

0

Plastic Surgery ప్లాస్టిక్ సర్జరీలు తప్పుకావు.. నేను కూడా చేయించుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే నటన ఒక్కటే ఉంటే సరిపోదు. అందం, అదృష్టం కూడా ఉండాలి. ఇక పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి, అందంగా కనిపించడానికి చాలా మంది హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ముక్కు, పెదాలు ఇలా తమ శరీర భాగాలకు ఆపరేషన్ చేయించుకోవడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం తప్పేం కాదంటోంది ఓ హీరోయిన్. పైగా భవిష్యత్ లో తాను కూడా ఇలాంటి సర్జరీ చేయించుకుంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Plastic Surgery

రాధిక మదన్.. బాలీవుడ్ లో గుర్తింపు ఉన్న హీరోయిన్. చివరిగా సర్పిరా మూవీలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం సనా మూవీ చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ప్లాస్టిక్ సర్జరీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రాధిక మదన్ మాట్లాడుతూ..”కాస్మోటిక్ సర్జరీలు చేసుకునే వారిని నేను తప్పుబట్టను. ఎందుకంటే? సర్జరీల వల్ల వారిలో అందంతో పాటుగా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే నేనిక్కడ చెప్పదలచుకుంది సర్జరీలే బెస్ట్ అని కాదు. ఇక భవిష్యత్ లో నేను కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే విషయమై ఆలోచిస్తాను. ఆ సమయానికి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాను. నా దృష్టిలో ఇలాంటి సర్జరీలు తప్పేం కాదు” అని స్పష్టంగా చెప్పుకొచ్చింది రాధిక మదన్. మరి ప్లాస్టిక్ సర్జరీలు తప్పు కాదు అంటూ ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Raus IAS Academy : ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదంపై నెల రోజుల ముందే విద్యార్థి హెచ్చరిక.. స్పందించి ఉంటే ఆ ముగ్గురూ బతికేవారేమో.. వీడియో ఇదిగో!

0

Raus IAS Academy ఢిల్లీలోని రౌస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు చనిపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమా? వైరల్ అవుతున్న నెల రోజుల క్రితం నాటి వీడియో చూస్తే అదే నిజమని అనిపించకమానదు.

  • కోచింగ్ సెంటర్ నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్‌లో తరగతులు నిర్వహిస్తోందని ఐఏఎస్ ఆశావహుడి ఫిర్యాదు
  • విద్యార్థుల ప్రాణాలతో కోచింగ్ సెంటర్ చెలగాటమాడుతోందని ఆవేదన
  • చర్యలు తీసుకోవాలంటూ వారంలో రెండుసార్లు ఫిర్యాదు
  • అతడి ఫిర్యాదు ఇంకా ప్రాసెస్‌లోనే

అధికారుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే రౌస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో లైబ్రరీ నిర్వహిస్తూ విద్యార్థులు, స్టాఫ్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసిందంటూ కిశోర్ సింగ్ కుష్వాహ అనే ఐఏఎస్ ఆశావహుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు లేఖ రాశాడు.

Raus IAS Academy

నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే రౌస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో తరగతులు నిర్వహిస్తోందని, ఇది పెను ప్రమాదానికి దారితీయవచ్చని కరోల్‌బాగ్ జోన్‌లోని భవన నిర్మాణ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కుమార్ మహేంద్రకు పంపిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యూపీఎస్‌సీ కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కుష్వాహా ఒకసారి కాదు, రెండుసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎవరూ స్పందించలేదు.

జులై 15న ఫిర్యాదు చేస్తూ.. ‘‘సర్ ఇది చాలా ముఖ్యమైన, అత్యవసరమైన విషయం. దానిపై కఠిన చర్యలు తీసుకోండి’’ అని కోరితే, సరిగ్గా వారం రోజుల తర్వాత 22న ‘‘సర్ చర్యలు తీసుకోండి. ఇది విద్యార్థుల భద్రతకు సంబంధించిన విషయం’’ అని రాసుకొచ్చాడు. కుష్వాహా ఫిర్యాదును ఆన్‌లైన్‌లో పరిశీలించినప్పుడు విషయం ఇంకా ‘ప్రాసెస్’లోనే ఉందని చూపిస్తోంది.

కుష్వాహా ఫిర్యాదుపై అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, భవన నిర్మాణ విభాగం కానీ.. వీరిలో ఎవరు స్పందించినా ముగ్గురి విలువైన ప్రాణాలు మిగిలి ఉండేవి. వారి తల్లిదండ్రులకు కడుపు కోత తప్పేది.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


SMC Election Guidelines in Telugu

SMC Election Guidelines in Telugu – స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు (2024) Rc.No.SSA-16021/54/2023-SEC-CMO SS, తేదీ: 30/07/2024 లేదా AP 2 SMC ఎన్నికలు 2024 నోటిఫికేషన్, మార్గదర్శకాలు విడుదల చేయబడ్డాయి.

SMC Election Guidelines in Telugu

పాఠశాలల్లో ఎన్నికల నగారా

ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు ఆగష్టు 8వ తేదీన జరుగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటేతర పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. ఇందుకు ఎన్నికలకు సంబంధించి పాఠశాలల వారీగా సంబంధిత ప్రధానోపాధ్యాయులు ప్రకటన గురువారం (ఆగష్టు 1వ తేదీన) జారీ చేస్తారు. ఈ ఎన్నికల్లో పిల్లల తల్లిదండ్రులు ఆయా పాఠశాల పరిధిలో పాల్గొనున్నారు. ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థల సభ్యుల భాగస్వామ్యంతో వీటినిఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ పాఠశాలలో తరగతుల నిర్వహణ, నిధుల వినియోగం, ప్రభుత్వ పధకాలు అమలు తీరు తదితర వాటిని పర్యవేక్షిస్తాయి. ఎన్నికల అధికారిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యవహరిస్తారు. ఆగస్టు 8వ తేది ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో పాఠశాలలోని ప్రతి నుంచి ముగ్గురు తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరిలో ఎస్సీ/ ఎస్టీ, బీసీ, ఇతరుల్లో నుంచి సభ్యులు ఒక్కొక్కరు చొప్పున కచ్చితంగా ఉండాలి. ఎన్నికైన సభ్యుల కాలపరిమితి రెండేళ్లు.

“పేరెంట్స్ కమిటీ పేరును స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా మార్చడం”…

  • రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు మరియు అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు విద్యా చట్టం – 2009 ప్రకారం పిల్లల ఉచిత మరియు నిర్బంధ హక్కులోని సెక్షన్ 21 ప్రకారం ఎన్నుకోబడిన సంస్థకు పేరు పెట్టడానికి “పేరెంట్ కమిటీ”కి బదులుగా “స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ” అనే పదాన్ని ఉపయోగించాలని ఇందుమూలంగా తెలియజేయడం జరిగింది.
  • రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు మరియు అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు తమ జిల్లాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను పునర్నిర్మించడానికి మరియు తీసుకున్న చర్యలను నివేదించడానికి ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్ మినహా అన్ని పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను పునర్నిర్మించడానికి ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలు మినహా అన్ని పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ క్రింది విధంగా ఉంది.

smc election guidelines in telugu

స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికల మార్గదర్శకాలు (2024)

SMC Election Guidelines in Telugu స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పునర్నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు క్రింది విధంగా ఉన్నాయి.

రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల (SMCలు) పునర్వ్యవస్థీకరణ కోసం మార్గదర్శకాలు.

  • స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) దాని అధికార పరిధిలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కాకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయబడుతుంది.
  • ప్రధాన ఉపాధ్యాయుడు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC)ని పునర్నిర్మించాలి.
  • ఎన్నికల నిర్వహణకు కనీసం 50% తల్లిదండ్రులు/ సంరక్షకులు హాజరు కావాలి. కోరం ఏర్పడటానికి సమయ పరిమితిని హెడ్ మాస్టర్ నిర్ణయిస్తారు.
  • ఎన్నికలు సాధారణంగా చేతులను ఎత్తడం ద్వారా లేదా నోటితో చెప్పడం ద్వారా నిర్వహించబడతాయి. అపరిష్కృత వివాదాల అసాధారణ పరిస్థితుల్లో, రహస్య బ్యాలెట్ విధానాన్ని అవలంబించవచ్చు.
  • SMCకి పేరెంట్/సంరక్షకులు రిప్రజెంటేటివ్ ఎన్నిక కోసం తల్లిదండ్రులలో ఒకరు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు.
  • వివిధ తరగతులలో పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు/సంరక్షకులు ప్రతి తరగతి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు.
  • స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) దాని ఎన్నికైన సభ్యుల నుండి చైర్పర్సన్ మరియు వైస్ ఛైర్పర్సన్ ను ఎన్నుకోవాలి.
  • వారిలో కనీసం ఒకరు వెనుకబడిన సమూహం లేదా బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు తల్లిదండ్రులు అయి ఉండాలి. వారిలో కనీసం ఒకరైనా మహిళ అయి ఉండాలి.
  • స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు మరియు ప్రధాన ఉపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్నికలలో పాల్గొనడానికి అర్హులు కాదు లేదా వారికి ఎలాంటి ఓటు హక్కు ఉండదు.
  • సంబంధిత తరగతుల ఎలెక్టర్లు ప్రవేశ తరగతి నుండి SMC యొక్క కొత్త పేరెంట్/ సంరక్షకులు సభ్యులను ఎన్నుకుంటారు మరియు ఏదైనా సాధారణ ఖాళీని కూడా భర్తీ చేస్తారు.
  • ఒకసారి ఏర్పాటు చేయబడిన స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ (SMC) దాని రద్దు లేదా విలీనం వరకు శాశ్వతంగా ఉనికిలో ఉంటుంది,
  • ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత ప్రాథమిక పాఠశాలల విషయంలో మండల్ ఎడ్యుకేషన్ అధికారి మరియు ఇతర పాఠశాలల విషయంలో జిల్లా విద్యా అధికారి ద్వారా అధికారం ఉంటుంది.
  • అయితే సభ్యులు వారి నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేస్తారు.
  • ఇంప్లిమెంటేషన్ అథారిటీ సూచించిన విధంగా చక్రీయ మరియు సాధారణ ఖాళీలు సహేతుకమైన సమయంలో భర్తీ చేయబడతాయి.
  • “ది ఇంప్లిమెంటింగ్ అథారిటీ’ అంటే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష మరియు ఇందులో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్.
  • ‘పాఠశాల యొక్క పొరుగు ప్రాంతం’ అంటే ప్రాథమిక పాఠశాలకు 1 కి.మీ., తరగతులు ఉన్న ప్రాథమికోన్నత / హైస్కూల్కు 3కి.మీ.ల దూరంలో సురక్షితమైన నడక దూరంలో ఉండే ఆవాసాలు.
  • ‘సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన పిల్లవాడు అంటే షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, అనాథలు, వలస మరియు వీధి పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు (CWSN) మరియు HIV బాధిత/సోకిన పిల్లలను కలిగి ఉంటారు.
  • ‘బలహీన వర్గాలకు చెందిన పిల్లవాడు’ అంటే BC, మైనారిటీలకు చెందిన పిల్లవాడు మరియు ప్రభుత్వం సూచించిన విధంగా తల్లిదండ్రుల ఆదాయం మించని OCలను కలిగి ఉంటుంది.
  • ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు.
  • తహశీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO), గ్రామ కార్యదర్శి లేదా గ్రామ రెవెన్యూ అధికారి (VRO), గ్రామ రెవెన్యూ సహాయకుడు (VRA) ఎన్నికల ప్రక్రియలో పరిశీలకులుగా పాల్గొనవచ్చు.
  • పునర్నిర్మాణ ప్రక్రియలో అంతరాయం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
  • ఓటింగ్ కోసం ప్రాధాన్యత క్రమం తల్లి, తండ్రి, సంరక్షకుడు. అయితే వీరిలో ఒకరికి మాత్రమే ఓటు వేయవచ్చు.
  • ప్రతి ఓటరు సంబంధిత అధికారి ద్వారా ఈ ప్రయోజనం కోసం జారీ చేయబడిన వారి గుర్తింపు పత్రాలు లేదా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ID లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు పత్రాలు ఏదైనా చెల్లుబాటు అయ్యే IDని తీసుకురావాలి.
  • పేరెంట్ సభ్యులు అందుబాటులో లేని పక్షంలో ‘బలహీనమైన’ లేదా ‘బలహీనమైన వర్గాలకు చెందినవారు అయితే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ రూల్ ప్రకారం దాన్ని పూరించవచ్చు.

SMC మెంబర్ కమిటీ సభ్యులు 2024

SMC కమిటీ కూర్పు క్రింది విధంగా ఉంటుంది

  1. ఎన్నుకోబడిన సభ్యులు
  • ప్రతి తరగతిలోని పిల్లల తల్లిదండ్రులు/సంరక్షకులచే ఎన్నుకోబడిన ముగ్గురు తల్లిదండ్రులు/సంరక్షకులు,

*వీరిలో కనీసం ఒక వ్యక్తి వెనుకబడిన వర్గానికి చెందిన పిల్లలకు తల్లిదండ్రులు సంరక్షకుడు మరియు మరొక వ్యక్తి బలహీన వర్గాలకు చెందిన పిల్లల తల్లిదండ్రులు/సంరక్షకులు మరియు ఇద్దరు మహిళలు.

*ఒకవేళ, ఒక తరగతిలో పిల్లల సంఖ్య 6 కంటే తక్కువగా ఉంటే, ఆ సంఖ్యను తదుపరి తక్కువ లేదా అంతకంటే ఎక్కువ తరగతితో కలపాలి.

  • ఎన్నుకోబడిన సభ్యుని పదవీకాలం రెండు సంవత్సరాలు లేదా సభ్యుని చైల్డ్ / వార్డ్ పాఠశాల నుండి నిష్క్రమించే తేదీ, ఏది ముందు అయితే అది.
  • తమ పిల్లలు పాఠశాలను విడిచిపెట్టినప్పుడు SMC నుండి బయటకు వెళ్లే తల్లిదండ్రుల సభ్యులను భర్తీ చేయడానికి ఎంట్రీ క్లాస్ నుండి కొత్త పేరెంట్/సంరక్షకులు సభ్యులుగా SMCలో చేర్చబడతారు.

2.ఎక్స్-అఫీషియో సభ్యులు

  1. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్గా ఉంటారు,
  2. MEO ద్వారా నామినేట్ చేయబడిన అదనపు ఉపాధ్యాయ సభ్యుడు (ప్రధానోపాధ్యాయులు వారు పురుషుడు అయితే మహిళా ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయులు వారు మహిళ అయితే పురుష ఉపాధ్యాయుడు)
  3. సంబంధిత కార్పొరేటర్ / కౌన్సిలర్/ వార్డు సభ్యుడు, సందర్భానుసారం:
  4. పాఠశాల పరిసరాల్లో సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్త(లు):
  5. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పాఠశాల పరిసరాల్లో సేవలందిస్తున్న స్త్రీ (ANM):
  6. సంబంధిత గ్రామం / వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

3.కో-ఆప్టెడ్ సభ్యులు

  • SMC ద్వారా ప్రముఖ విద్యావేత్త, పరోపకారి, స్వచ్ఛంద సంస్థ యొక్క ఆఫీస్ బేరర్, పూర్వ విద్యార్థులు లేదా పాఠశాలకు మద్దతు ఇచ్చే వ్యక్తులలో ఇద్దరు పాఠశాల మద్దతుదారులు సభ్యులుగా ఎన్నిక అవ్వొచ్చు.
  • కో-ఆప్షన్ తేదీ తర్వాత మొదటి సమావేశం జరిగిన తేదీ నుండి కో-ఆప్టెడ్ సభ్యుల పదవీకాలం రెండు సంవత్సరాలు ఉండాలి.
  1. స్థానిక-అధికార-చైర్పర్సన్

సంబంధిత సర్పంచ్/మునిసిపల్ చైర్పర్సన్ / మేయర్ తన/ఆమె అభీష్టానుసారం వారి సంబంధిత ప్రాంతాల్లో పేరెంట్ మానిటరింగ్ కమిటీ యొక్క ఏదైనా సమావేశానికి హాజరు కావచ్చు.

  • కొత్త అడ్మిషన్లు: సంబంధిత పాఠశాల ద్వారా పునర్నిర్మాణ నోటీసును ప్రచురించిన తర్వాత లేదా నమోదు చేసుకున్న పిల్లల తల్లిదండ్రులు/సంరక్షకులు ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు కాదు.
  • చైర్పర్సన్: ఆ పిల్లల తల్లితండ్రులు ఎవరైనా సజీవంగా ఉన్నట్లయితే గార్డియన్ని ఛైర్మన్గా ఎన్నుకోలేరు. అలాంటి కేసులు ఏవైనా ఉంటే సంబంధిత హెచ్ఎంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
  • పొరుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు: తల్లిదండ్రులు ఒరిస్సా వంటి పొరుగు రాష్ట్రాలకు చెందినవారు, ఇక్కడ మన రాష్ట్రంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నిబంధనల ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో పాల్గొనడానికి కూడా అర్హులు.
  • కోరం: తరగతుల వారీగా ఎన్నికలు జరుగుతాయి మరియు కోరమన్ను తరగతుల వారీగా మాత్రమే గమనించాలి.
  • ఆర్థిక సహాయం: స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పునర్నిర్మాణం కోసం అయ్యే ఖర్చు సంబంధిత పాఠశాలల మిశ్రమ పాఠశాల గ్రాంట్ల నుండి చెల్లించబడుతుంది.
  • కన్వీనర్: ప్రధాన ఉపాధ్యాయుడు లేని చోట సంబంధిత హెడ్ మాస్టర్ లేదా ఇన్ఛార్జ్ టీచర్ ద్వారా ఎన్నికలు నిర్వహించబడతాయి. GPS పాఠశాలల్లో పాఠశాల అధిపతిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న CRTS కన్వీనర్లుగా వ్యవహరించవచ్చు.
  • బయటి వ్యక్తులను అనుమతించకూడదు: తల్లిదండ్రులు తప్ప ఇతర వ్యక్తులు ఎన్నికలలో పాల్గొనకూడదు లేదా ఎన్నికల సమయంలో వారిని ప్రాంగణంలోకి అనుమతించకూడదు. అవసరమైతే, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదంతో పోలీసు సహాయాన్ని కూడా అభ్యర్థించవచ్చు..
  • డేటా అప్ లోడ్ చేయడం: బలహీనమైన సిగ్నల్ ఉన్నట్లయితే, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక మరియు సమావేశానికి సంబంధించిన డేటాను సపోర్టింగ్ ఫంక్షనరీలు నెట్వర్క్ ప్రాంతంలో అప్లోడ్ చేయాలి.
  • స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాల నుండి ఎటువంటి తేడాలు ఉండకూడదు

Download Guidelines in Telugu Click here

Download required forms for SMC Elections Click here

Guidelines in English and Download Proceeding Click here

Chit Fraud Viajyanagaram : చిట్టీల పేరుతో ఘరనా మోసం.. రాత్రికి రాత్రే రూ. రెండు కోట్లతో జంప్‌

Chit Fraud Viajyanagaram జిల్లాలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కత్తెర వెంకటరావు అనే వ్యక్తి సుమారు వందమంది నుండి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపీ పెట్టి రాత్రికి రాత్రే ఉడాయించాడు. చిట్టీల నిర్వాహకుడు వెంకటరావు గత కొన్ని ఏళ్లుగా కూలీలు, చిరు వ్యాపారులే లక్ష్యంగా ప్లాన్ చేసుకున్నాడు. వెంకటరావు మొదట్లో ఇంటింటికి తిరిగి వారికి కావలసిన సామానులను వాయిదాల పద్ధతిలో ఇస్తూ వ్యాపారం చేసేవాడు. అలా కొన్నాళ్ల తరువాత అతనికి పరిచయమైన కస్టమర్స్ తో చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు.

Chit Fraud Viajyanagaram

వాయిదాల పద్ధతిలో సామాన్లు తీసుకుంటున్న తన కస్టమర్లను చిట్టీల వైపు మళ్లించాడు. అలా మొదట పదిమందితో ప్రారంభమైన చిట్టీల వ్యాపారం సుమారు వంద మందికి పైగా చేరింది. మొదట్లో కొన్నాళ్లు తన వద్ద చిట్టీలు వేసిన కస్టమర్లకు మంచి లాభాలు ఇవ్వడంతో పాటు, సమయానికి డబ్బులు అందిస్తూ నిజాయితీపరుడిలా నటించాడు. చిట్టీలు కట్టే కస్టమర్స్ కు సైతం మంచి లాభాలే వచ్చాయి. అలా అతనిని నమ్మి కస్టమర్స్ కూడా పెరగడంతో తన అసలు రూపం బయటికి తీశాడు. 15 మంది సభ్యులు ఉండాల్సిన చిట్టీలో ఒకరికి తెలియకుండా ఒకరిని యాభై మంది వరకు సభ్యులను చేసేవాడు.

ఎవరికి వారే పదిహేను మంది సభ్యులే అనుకున్నారు. వారిలో ఒకరికి ఒకరు పరిచయం కాకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. చిట్టీ పాట కూడా ఫోన్ కాన్ఫరెన్స్ లోనే పెట్టేవాడు. ఒకరి మొహం ఒకరికి తెలియక పోవడంతో చిట్టీ సభ్యుల మాదిరిగా వెంకట్రావు తన సొంత మనుషులతో అధిక లాభాలు వచ్చేలా పాడించి ఏ ఒక్కరికి చిట్టీ దక్కకుండా ప్లాన్ చేసుకున్నాడు. పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయనుకొని ఎవరికి వారే ఆనందంగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఎవరైనా సభ్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ నష్టానికి చిట్టీ పాడుకుంటే వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి నిర్వాహకుడు వెంకట్రావే తీసుకునేవాడు.

Chit Fraud Viajyanagaram మరికొందరు సభ్యులు పాడుకోవడానికి ప్రయత్నిస్తే తన సొంత మనుషులతో అధిక లాభం వచ్చేలా రేటు పెంచి చిట్టీ వారికి రాకుండా చేసేవాడు. అలా అనేక రకాలుగా మోసాలకు పాల్పడ్డాడు. ఒకరికి ఒకరు పరిచయం లేకపోవడంతో భాదితులు ఎంత మంది ఉన్నారో? ఎవరికి డబ్బులు ఇస్తున్నారో? ఎవరికి డబ్బులు ఇవ్వలేదో? ఏ ఒక్కరికీ తెలియదు. వీరిలో కొంతమంది అవసరానికి పాడుకున్న చిట్టీ డబ్బు ఎంత అడిగినా ఇవ్వకపోవడంతో చివరికి వెంకటరావును నిలదీశారు.

దీంతో అసలు భాగోతం బయటపడుతుందని గమనించిన వెంకట్రావు ఈ నెల 18 రాత్రి ఇంట్లో సామానులు తీసుకొని, భార్యాపిల్లలతో పరారయ్యాడు. ఆ మరుసటి రోజు డబ్బు కోసం వెళ్లిన పలువురు కస్టమర్లు ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఖంగుతిన్నారు. తరువాత కొద్ది రోజులకు భాదితులంతా ఒక్కరొక్కరిగా బయటకు వచ్చి జరిగిన మోసం తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు అందిన వివరాల ప్రకారం సుమారు వంద మందికి పైగానే భాదితుల వద్ద దాదాపు రెండున్నర కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తుంది. జరిగిన ఘటన పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Mammutty Action Thriller OTT : మమ్ముట్టి యాక్షన్ థ్రిల్లర్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా

Mammutty Action Thriller OTT ఇప్పుడు చాలా మంది ఓటీటీ లో సినిమాలను , సిరీస్ లను చూడడానికి అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో ఓటీటీ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ కు తగినట్లుగానే ప్రతి వారం ఓటీటీ లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక వాటిలో ఏ సినిమాలు వీకెండ్ కు చూడదగిన సినిమాలు అనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ మమ్ముట్టి యాక్షన్ ఎంటర్టైనర్ ‘టర్బో ‘ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.

Mammutty Action Thriller OTT

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సినిమా ‘టర్బో’ .. మే 23వ తేదీన థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఊహించని విధంగా థియేటర్స్ లో హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాకు వైశాక్ దర్శకత్వం వహించారు. మిధున్ మాన్యుయెల్ థామస్ కథ.. స్వయంగా మమ్ముటినే ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు.. రాజ్ బీ శెట్టి , అంజన జయప్రకాశ్, షబరీష్ వర్మ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్, నిరంజన అనూప్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. మళయాళంతో పాటు తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషల్లో ఈ సినిమా.. ఆగష్టు 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ కు రానుంది.

Mammutty Action Thriller OTT ఇక టర్బో సినిమా కథ విషయానికొస్తే.. మమ్ముట్టి ఈ సినిమాలో ఓ జీప్ డ్రైవర్ జోష్ పాత్రను పోషించాడు. ఇక జోష్ అనే అతను తన సొంత ఊరిలో క్రిస్టమస్ పండుగ సెలెబ్రేట్ చేసుకునేందుకు వస్తాడు. ఆ సమయంలో తన ఫ్రెండ్ జెర్రీ పై ఎవరో దాడి చేయగా జోష్ అతనిని కాపాడతాడు. ఇక జెర్రీ ఇందులేక అనే అమ్మాయితో అప్పటికే ప్రేమలో ఉంటాడు. కాబట్టి అందుకోసమే అతనిపై ఎవరో దాడి చేసి ఉంటారని గుర్తిస్తారు. దీనితో జోష్ వారిద్దరిని ఎలాగైనా కలపాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే ఇందులేఖని ఇంటి నుంచి తీసుకుని వచ్చేస్తాడు. తీరా తీసుకుని వచ్చాక ఆమె ఎవరో తెలియదంటాడు జెర్రీ. ఆ తర్వాత ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.