Home Blog Page 66

Ransomware Attack : రాన్సమ్‌వేర్ సైబర్ ఎటాక్.. 300 భారతీయ బ్యాంకులపై ప్రభావం!

0
  • చిన్న బ్యాంకుల టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ సీ- ఎడ్జ్ టెక్నాలజీస్‌పై సైబర్ దాడి
  • 300 చిన్న బ్యాంకుల డిజిటల్ చెల్లింపులు తాత్కాలికంగా షట్ డౌన్
  • సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌ని తాత్కాలికంగా ఐసోలేట్ చేసినట్టు ఎన్‌పీసీఐ ప్రకటన

Ransomware Attack భారత్‌లోని పలు చిన్న బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై రాన్సమ్ వేర్ దాడి జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫలితంగా దాదాపు 300 చిన్న బ్యాంకుల్లో చెల్లింపుల వ్యవస్థలను తాత్కాలికంగా షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని సమాచారం. ఈ విషయమై సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆర్‌బీఐ కూడా ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

Ransomware Attack

భారత్‌లో చెల్లింపుల వ్యవస్థలను నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం కీలక ప్రకటన చేసింది. సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌కున్న రిటైల్ చెల్లింపుల వ్యవస్థ యాక్సెస్‌ను తొలగించినట్టు వెల్లడించింది. సీ-ఎడ్జ్ కస్టమర్లు ప్రస్తుతానికి సంస్థ చెల్లింపుల వ్యవస్థలను వినియోగించుకోలేరని ఆర్బీఐ పేర్కొంది. సమస్య మరింత ముదరకుండా 300 చిన్న బ్యాంకులకు భారత్ రిటైల్ పేమెంట్ వ్యవస్థలను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేసినట్టు పేర్కొంది. భారత డిజిటల్ చెల్లింపుల్లో ఈ బ్యాంకుల వాటా కేవలం 0.5 శాతమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Ransomware Attack భారత్‌లో ప్రస్తుతం 1,500 కోఆపరేటివ్, ప్రాంతీయ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో కొన్నింటిపై సైబర్ దాడి ప్రభావం పడినట్టు తెలుస్తోంది. సమస్య మరింత విస్తరించకుండా పరిస్థితిని ఎన్‌పీసీఐ సమీక్షిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంకులపై సైబర్ దాడి జరిగే అవకాశం ఉన్నట్టు రిజర్వ్ బ్యాంకు, భారత సైబర్ భద్రతా విభాగాలు కొన్ని వారాల క్రితమే వివిధ బ్యాంకులను హెచ్చరించినట్టు కూడా తెలిసింది.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Farmer Friendly Snakes : ఈ పాము రైతు నేస్తం..ఎందుకో తెలుసా..

Farmer Friendly Snakes పాము పేరు వింటే చాలామంది భయపడతారు. కనిపిస్తే చంపడానికి ప్రయత్నిస్తారు. కొన్ని విషపూరిత పాముల వల్ల మనుషులకు హానికలిగే అవకాశం ఉంది. కానీ పాముల వల్ల మన పర్యావరణానికి అనేక రకాలుగా మేలు జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే జనావాసాల్లోకి పాము వచ్చిందంటే వెంటనే చంపేస్తుంటారు. పాముల వల్ల రైతులకు మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మేలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Farmer Friendly Snakes

మనం చాలా రకాల పాములు చూసే ఉంటాం. అందులో కొన్ని విషపూరితమైనవైతే.. మరికొన్నింటిలో విషయ ఉండదు. ఆ జాబితాలో ఒకటి ధమన్ పేరుగల పాము. ఈ పాము రైతు నేస్తమని చెప్పాలి. ఎందుకంటే ఈ ధమన్‌ పామును ఎలుక పాము అంటారు, ఇది తన జీవితకాలంలో 25 వేల ఎలుకలను తింటుందంట. నిపుణుడు డాక్టర్ డిఎస్ శ్రీవాస్తవ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పాము గురించి చాలా అపోహలు వ్యాపించాయన్నారు. వాటిలో ఒకటి ధమన్ పాములు. ఇవి ఆవు పాలను ఫిల్టర్ చేసి తాగుతాయి. ఇది పాములకు పాలను జీర్ణం చేయడానికి అవసరమైన రసాయనాలు ఉండవు అనేది అపోహ మాత్రమే.

Farmer Friendly Snakes రైతులకు వరం. దమ్మన్ పాము తన జీవితకాలంలో సుమారు 25 వేల ఎలుకలను తింటుంది. దీని కారణంగా పంటలు నష్టం నుంచి రక్షించబడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ధమన్ పామును చంపితే 25 వేల ఎలుకల ప్రాణాలు కాపాడినట్లే. ఇది రైతులకు చాలా నష్టం కలిగిస్తుంది. 25 వేల ఎలుకలను విడుదల చేయడం. వాటి సంఖ్య పెరగడం వల్ల భారీ పంట నష్టం జరుగుతుంది. కాబట్టి ధమన్ ఎప్పుడూ పామును చంపకూడదు. పాములను వాటంతట వాటిని వదిలేయడం మేలు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Ashwin Bating వన్‌డౌన్‌లో వచ్చి.. ఉతికారేసిన అశ్విన్‌! 35 బంతుల్లోనే..

0

Ashwin Bating పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకున్నావా? ఫైరు.. అనే సినిమా డైలాగ్‌లా రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటే చాలా మంది స్పిన్నర్‌ మాత్రమే అనుకుంటారు.. కానీ, అతనో నిఖార్సయిన ఆల్‌రౌండర్‌. టీమిండియాకు ఆడే సమయంలో బ్యాటింగ్‌లో అశ్విన్‌కు సరైన అవకాశాలు రాలేదు కానీ, వచ్చిన తక్కువ సమయాల్లో కూడా తన బ్యాటింగ్‌ స్కిల్స్‌ను ప్రదర్శించాడు అశ్విన్‌. తాజాగా తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024లో అయితే అరివీర భయంకరమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా కూడా ఆడిన అశ్విన్‌.. బుధవారం చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లో 57 పరుగులు చేసి తన టీమ్‌ దిండిగల్‌ డ్రాగన్స్‌ను క్వాలిఫైయర్‌-2కు తీసుకెళ్లాడు.

Ashwin Bating

159 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేసే క్రమంలో ఓపెనర్‌ విమల్ ఖుమార్‌ కేవలం 3 పరుగులకే చేసి అవుట​ అవ్వడంతో డ్రాగన్స్‌ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. శివమ్‌ సింగ్‌తో కలిసి, వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సంచలన బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసి.. అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్‌ శివమ్‌ సింగ్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 112 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి.. ఆల్‌మోస్ట్‌ విజయాన్ని ఖాయం చేశాడు. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ రెండో బంతికి ప్రేమ్‌ కుమార్‌ బౌలింగ్‌లో జగదీషన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. క్వాలిఫైయర్‌-2లో దిండిగల్‌ డ్రాగన్స్‌ తిరుప్పూర్ తమిజన్స్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది.

ashwin bating

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్‌ అపరాజిత్‌ 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 72 పరుగులు చేసింది. ఇతర బ్యాటర్లలో జగదీషన్‌ 25, అభిషేక్‌ తన్వర్‌ 22 పరుగులు చేశాడు. ఇక 159 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన దిండిగల్‌ డ్రాగన్స్‌ 19.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ శివమ్‌ సింగ్‌ 64, కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 57 పరుగులు చేసి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Dream Nude Women : కలలో స్త్రీ నగ్నంగా కనిపిస్తే.. ఏమవుతుందో తెలుసా.?

Dream Nude Women  రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే మన ప్రమేయం లేకుడా మనకు వచ్చే కలలు మన జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుంటారు. స్వప్నశాస్త్రంలో కూడా దీనికి సంబంధించి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అలాగే మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

Dream Nude Women

అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు వచ్చే కలలు మన నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు. అప్రయత్నంగా వచ్చే కలలో ఎంతో అర్థం ఉంటుందని అంటున్నారు. మరి రాత్రి పడుకున్న తర్వాత కలలో ఒకవేళ నగ్నంగా ఉన్న యవతి కనిపిస్తే దేనికి సంకేతం.? జీవితంలో ఏం జరగబోతోందని అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఒకవేళ కలలో మీకు స్త్రీ దుస్తులు లేకుండా కనిపిస్తే మీకు నచ్చిన వ్యక్తితో ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. మీకు నచ్చిన వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం.

* ఇక స్త్రీ తనను తాను నగ్నంగా చూసుకున్నట్లయితే.. తన గురించి ఏదో రహస్యాన్ని దాచిపెడుతోందని అర్థం. ఎవరికీ తెలియని ఏదో రహస్యం తనలో ఉంచుకుంటోందని అర్థం చేసుకోవాలి.

* పురుషులు తనకు నచ్చిన స్త్రీని నగ్నంలో కగలో చూస్తే.. ఆ స్త్రీ పట్ల ఎంతో ఆకర్షితులవుతున్నాడని అర్థం చేసుకోవాలి. మీరు మానసికంగా ఆమెకు ఎంతగానో దగ్గరయ్యారని భావం.

* నగ్నంగా ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నట్లు కల వస్తే మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఉంటుందని అర్థం. అలాగే కొంత కాల నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభించనుందని అర్థం చేసుకోవాలి.

* ఒకవేళ మీకు కలలో అపరచిత వ్యక్తి నగ్నంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తే.. మీరు త్వరలోనే ప్రేమలో లేదా వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి. పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయని అర్థం చేసుకోవాలి.

* అయితే ఎవరైనా స్త్రీ నగ్నంగా ఉన్న సమయంలో దుస్తులతో కవర్‌ చేసుకుంటున్నట్లు కనిపిస్తే.. అది మహిళలపై మీకున్న అభిప్రాయానికి చిహ్నంగా భావించాలి. మీరు మహిళల విషయంలో ఎంతో హుందాగా ఉంటారని అర్థం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


AP High Court : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ ఏఏజీ పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు

  • పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా, మీడియా సమావేశాలను నిర్వహించారంటూ ఆరోపణలు
  • ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ హైకోర్టులో పిల్
  • పిల్‌‌ను పరిశీలించిన హైకోర్టు సీజే ధర్మాసనం

AP High Court ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ .. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుండగానే తెలంగాణ రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీలో స్కిల్ కేసుకు సంబంధించి సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశాలను నిర్వహించారు.

AP High Court

ఈ చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఓ పక్క న్యాయస్థానాల్లో బెయిల్ పిటిషన్‌పై విచారణలు జరుగుతుండగా, వీరు మీడియా సమావేశాలను నిర్వహించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిల్ ను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం .. సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం .. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


IND vs SL : రేపే శ్రీలంకతో తొలి వన్డే! కోహ్లీ, రోహిత్‌ రీఎంట్రీ.. భారత ప్లేయింగ్‌ 11 ఇదే!

0

IND vs SL టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రెడీ అయింది టీమిండియా. ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా శుక్రవారం తొలి మ్యాచ్‌ జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన జోష్‌లో టీమిండియా ఉంటే.. టీ20 సిరీస్‌లో ఎదురైన ఓటమికి వన్డే సిరీస్‌లో బదులు తీర్చుకోవాలని శ్రీలంక భావిస్తోంది. సొంత గడ్డపై వన్డే సిరీస్‌లో శ్రీలంక టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి లంకతో తొలి వన్డలో భారత జట్టు ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..

IND vs SL

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వత.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు.. వన్డే, టెస్టుల్లో మాత్రమే భారత జెర్సీల్లో కనిపించనున్నారు. టీ20 ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత.. తొలిసారి కోహ్లీ, రోహిత్‌ గ్రౌండ్‌లోకి దిగబోతుండటంతో భారత క్రికెట్‌ అభిమానులు కూడా ఈ సిరీస్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిద్దరు రావడంతో భారత వన్డే జట్టు సూపర్‌ స్ట్రాంగ్‌గా మారింది. వీరితో పాటు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా టీమ్‌లోకి రావడంతో బ్యాటింగ్‌లో డెప్త్‌ పెరిగింది.

IND vs SL మొహమ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌తో బౌలింగ్‌ యూనిట్‌ కూడా సూపర్‌ స్ట్రాంగ్‌గా ఉంది. ఇక ఆల్‌రౌండర్లలో అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర ఉండటం అదనపు బలం. మొత్తంగా.. ఒక బెస్ట్‌ టీమ్‌తో భారత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే మరో వైపు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సొంత గడ్డపై వాళ్లు కూడా చెలరేగే అవకాశం ఉంది. టీ20 సిరీస్‌లో ఓడిపోయినంత మాత్రానా.. వన్డే సిరీస్‌లోనూ లంకను లైట్‌ తీసుకుంటే.. ఎదురుదెబ్బ తగిలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌(అంచనా)
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, అర్షదీప్ సింగ్‌, కుల్దీప్‌, ఖలీల్‌ అహ్మద్‌.


Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Nanditha Jennifer నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

Nanditha Jennifer ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మొదటిసారి దర్శకుడిగా మారి చేసిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. 2005 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో అందమైన ప్రేమ కథతో పాటు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా నటుడు శ్రీహరి అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమా అత్యధిక భాషల్లో రీమేక్ అయ్యి రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. తొమ్మిది భాషల్లోకి నువ్వొస్తానంటే నేనొద్దంటానా

రీమేక్ అయ్యింది. ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సునీల్ కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాలో వీరితో పాటు చాలా మంది నటించి ఆకట్టుకున్నారు.

Nanditha Jennifer

ఇక ఈ సినిమాలో సిద్దార్థ్ ను ఇష్టపడే అమ్మాయిగా అతని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నించే అమ్మాయిగా కనిపించిన నటి ఎవరో తెలుసా.? ఆమె పేరు నందిత జెన్నిఫర్. తెలుగులో ఒక ఒక్క సినిమా చేసింది. కానీ తమిళ్ లో చాలా సినిమాల్లో నటించింది. అలాగే పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసింది  ఈ అమ్మడు. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది ఈ బ్యూటీ. అలాగే పలు టీవీ షోల్లోనూ నటించింది ఈ అమ్మడు. పవిత్ర, వేర్ ఇస్ విద్యాబాలన్, నా రూట్ సెపరేట్ అనే సినిమాల్లో సాంగ్స్ లో గెస్ట్ గా కనిపించింది.

Nanditha Jennifer పెళ్లైన తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు 2007లో కాశీవిశ్వనాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక సోషల్ మీడియాలో నందిత జెన్నిఫర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో నటిస్తుంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో గ్లామర్ గా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నెట్టింట చీరకట్టులో అదరగొడుతోంది.

నందిత జెన్నిఫర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


AP DSP Transfers : ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ .. వారికి షాక్

0

  • ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీల బదిలీ
  • 57 మంది డీఎస్పీలకు నో పోస్టింగ్
  • సీఐడీ, విజిలెన్స్ అధికారుల బదిలీ

AP DSP Transfers పీలో కూటమి సర్కార్ భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటకాగారన్న అభియోగాలు ఉన్న డీఎస్పీలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. వారికి ఎక్కడా పోస్టింగ్ లు ఇవ్వలేదు. బదిలీ అయిన 96 మంది డీఎస్పీల్లో దాదాపు 57 మందిని డీజీపీ (హెడ్ క్వార్టర్స్) కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివాద రహితంగా వ్యవహరించిన వారిని డీఎస్పీలుగా, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన వారిలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, సీఐడీతో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.

AP DSP Transfers

వైసీపీ హయాంలో లూప్ లైన్ లో, అప్రాధాన్యత విభాగాల్లో కొనసాగుతూ వచ్చిన డీఎస్పీలకు ఈ సర్కార్ లో కీలక పోస్టింగ్ లు, సబ్ డివిజన్ లను కేటాయించవచ్చని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో .. టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Israel hamas coflict పాలస్తీనా అగ్రనేతలను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం వెనకున్న ప్లాన్ ఏంటి.. అసలేం జరుగుతోంది?

0

Israel hamas coflict ఇజ్రాయెల్‌తో పాలస్తీనా మిలిటెంట్ వార్.. మరోసారి అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలకు కారణమవనుందా? హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్యతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముంటున్నాయా? ఇంతకీ ఎవరీ హమాస్ చీఫ్ హనియే. ఎందుకు ఇజ్రాయెల్ అతడిని వెంటాడి.. వేటాడి మట్టుబెట్టింది? దీనిపై ఇరాన్ ఎలా స్పందించనుంది..? ఇజ్రాయెల్‌పై ప్రతీకారానికి ఇరాన్ పథకరచన చేస్తోందా? దాన్ని తిప్పికొట్టేందుకే ఇజ్రాయెల్ ఇలా అగ్రనేతలను టార్గెట్ చేస్తోందా? అసలేం జరుగుతోంది?

శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఇజ్రాయెల్ Israel hamas coflict

గాజాలో మిలిటెంట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది ఇజ్రాయెల్. వరుస ప్రతీకార దాడులతో రెచ్చిపోతోంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు ఇరాన్‌లోనే హమాస్ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హనియెను మట్టుబెట్టింది. దీంతో గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌తో పోరాటం చేస్తున్న హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యిది. హమాస్ సంస్థ చీఫ్.. 62 ఏళ్ల ఇస్మాయిల్ హనియె ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. హమాస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనిని ఇజ్రాయెల్ దాడిగా అభివర్ణించింది. టెహ్రాన్‌లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియె, ఆయన బాడీగార్డ్ ఇద్దరూ మృతి చెందారు. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికి వచ్చిన సమయంలోనే ఇజ్రాయెల్ ఇలా దాడులకు దిగి హమాస్ చీఫ్‌ను హతమార్చడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

హమాస్‌లో కీలక పాత్ర
Israel hamas coflict ఇస్మాయిల్ హనియె 1963లో గాజా సిటీకి సమీపంలోని ఓ శరణార్థి శిబిరంలో పుట్టాడు. 1980ల చివర్లో తొలి ఇంతిఫాదా సమయంలో హమాస్‌లో చేరాడు హనియె. 1989లో పాలస్తీనా మొదటి తిరుగుబాటు అణచివేత సమయంలో హనియెను ఇజ్రాయెల్ మూడేళ్లపాటు జైల్లో పెట్టింది. 1990లో తొలిసారిగా హనియె పేరు వెలుగులోకి వచ్చింది. 1992లో మరికొంతమంది హమాస్ నాయకులతో పాటు బహిష్కరణకు గురైన హనియె.. ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఉండాల్సి వచ్చింది. ఏడాది బహిష్కరణ తర్వాత గాజాకి తిరిగి వచ్చారు. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు హనియె అత్యంత సన్నిహితుడు. రాజకీయపరమైన సలహాలిస్తూ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సంస్థలో అనేక హోదాల్లో పనిచేశాడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హతమయ్యాడు. ఆ తర్వాత.. హమాస్‌లో కీలక పాత్ర పోషించాడు హనియె.

హమాస్ శిబిరంలో కలవరం
జాతీయ ఎన్నికల్లో హమాస్ అత్యధిక సీట్లు గెలుచుకున్న తర్వాత, అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ 2006లో హనియెను పాలస్తీనా ప్రధాన మంత్రిగా నియమించారు. పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్‌ను పాలించాడు. వారం రోజుల హింసాకాండ కారణంగా ఏడాదికే ఆయన తన పదవిని కోల్పోయారు. 2007 జూన్లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అతడిని పదవి నుంచి తొలగించారు. తన పదవి నుంచి తొలగించడం ”రాజ్యాంగ విరుద్ధం” అంటూ తిరస్కరించారు. పాలస్తీనా ప్రజలపై తమ బాధ్యతలను, తమ ప్రభుత్వం విస్మరించదంటూ గాజాలో పాలన కొనసాగించారు. అప్పట్నుంచి గాజాలో ఫతా-హమాస్ యుద్ధం జరుగుతోంది. దీంతో అబ్బాస్ ఆదేశాలను పక్కనపెట్టి గాజాలో ప్రధాని బాధ్యతల్లో కొనసాగాడు హనియె.

Israel hamas coflict 2017 మే 6న హమాస్ పొలిటికల్ బ్యూరోకి అధినేతగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అమెరికా అతడిని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో గాజా స్ట్రిప్‌ను వీడి అప్పటి నుంచి ఖతర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియె ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు, మనవరాళ్లు మరణించినట్లు అప్పట్లో హమాస్ ప్రకటించింది. కుటుంబసభ్యులను కోల్పోయినా ఇజ్రాయెల్‌పై పోరాటం ఆగద్దొని అప్పట్లో హనియె అన్నాడు. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాల్లో ఇతడు కీలకంగా వ్యవహరించిన హనియెను ఇప్పుడు ఇజ్రాయెల్ లేపేసింది. దీంతో హమాస్ శిబిరంలో కలవరం మొదలైంది.

మరోపక్క ఈ హత్యతో అంతర్జాతీయంగా మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. తమదేశంలో అతిథిగా ఉన్న అగ్రనేతను చంపేయటాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించే వీలుంది. అదే జరిగితే ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలే ఎక్కువ. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ తెలిపింది.

లెబనాన్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్
Israel hamas coflict హనియె హత్యతో ఇజ్రాయెల్ లెబనాన్‌కు కూడా గట్టి హెచ్చరికలే పంపింది. ఈమధ్యే ఇజ్రాయెల్ లోని గోలన్ హైట్స్ మజ్దాల్ షమ్స్ ఫుట్బాల్ మైదానంపై లెబనాన్ రాకెట్ దాడులకు దిగింది. ఈ ఘటనలో 12 మంది పిల్లలు చనిపోయారు. దీనికి కూడా తగిన బుద్ధి చెబుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్‌లో హెజ్బొల్లాకు ఇరాన్ నుంచి సైనిక శిక్షణ, ఆయుధాల సరఫరా పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు సిరియా పాలకుల నుంచి సాయం అందుతోంది. దీన్ని కూడా ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఇప్పుడు హమాస్ చీఫ్ హత్యతో వీరికి కూడా డెత్ వార్నింగ్ ఇస్తోంది ఇజ్రాయెల్.

ప్రతీకారం తీర్చుకుంటామన్న హమస్
Israel hamas coflict హనియె మరణంపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ముసా అబు మర్జుక్ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇది కుట్రపూరిత చర్య అని.. దీనికి బదులు తప్పదు అంటూ ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే దిశగా హెచ్చరికలు చేసింది హమాస్. ఇజ్రాయెల్ వైమానిక దాడిలోనే తమ చీఫ్ ఇస్మాయిల్ హనియె మృతి చెందాడని హమాస్ స్పష్టం చేసింది. అటు ఈ హత్య ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ కూడా తీవ్రంగా ఖండించారు. హనియె మృతి కథనాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ తెలుసుకుంది. అయితే, వాటిపై స్పందించేందుకు మాత్రం శ్వేతసౌధం నిరాకరించింది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Madhura Judgement Today : శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదం..నేడు హైకోర్టు తీర్పు

0

Madhura Judgement Today మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. షాహి ఈద్గా మసీదు భూమి హిందువులదేనని, అక్కడ పూజలు చేసుకునే హక్కు కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొంది. అదే సమయంలో, ముస్లిం పక్షం ప్రార్థనా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాలను ఉదహరించి, హిందూ పక్షం పిటిషన్లను కొట్టివేయాలని ముస్లిం పక్షం వాదించింది.

Madhura Judgement Today

Madhura Judgement Today మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో దాఖలైన 18 పిటిషన్లను కలిపి విచారించాలా వద్దా అనేది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు నిర్ణయించనుంది. హైకోర్టులోని న్యాయమూర్తి జస్టిస్‌ మయాంక్‌ కుమార్‌ జైన్‌తో కూడిన సింగిల్‌ బెంచ్‌ తీర్పును వెలువరించనుంది. అంతకుముందు.. జూన్ 6న విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. హిందూ పక్షం నుంచి 18 పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో, ముస్లిం పక్షం ఆర్డర్.. 7, రూల్ 11 ప్రకారం ఈ పిటిషన్ల నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తింది. వాటిని కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. హిందూ, ముస్లిం వర్గాలకు ఈరోజు కీలకం కానుంది.

హిందూ పార్టీల వాదనలు…
రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈద్గా మొత్తం శ్రీకృష్ణుడి పవిత్ర క్షేత్రం.
షాహీ ఈద్గా మసీదు కమిటీ వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి రికార్డు లేదు.
షాహి ఈద్గా మసీదు శ్రీ కృష్ణ ఆలయాన్ని కూల్చివేసి నిర్మించబడింది.
యాజమాన్య హక్కులు లేకుండా, ఎలాంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండా వక్ఫ్ బోర్డు ఈ భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది.

ముస్లిం పార్టీల వాదనలు
1968లో ఈ భూమిపై ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరిందని ముస్లిం పార్టీలు వాదిస్తున్నాయి.
60 ఏళ్ల తర్వాత ఒప్పందాన్ని తప్పు అనడం సరికాదు. అందువల్ల కేసు నిర్వహణ సాధ్యం కాదు.
ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం కూడా కేసు నిర్వహించబడదు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.