Home Blog Page 65

Gold and Silver Prices Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. మీ నగరంలో ఎంతంటే?

0

Gold and Silver Prices Today: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

Gold and Silver Prices Today

Gold and silver prices | పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు.. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.

బంగారం గురించి..

  • బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24 carat Gold ) చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కాయిన్స్‌ (Gold Coins), బార్స్‌, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది.
  • నగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది
  • బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది.
  • కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది.
  • కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్‌టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Potato Benefits : బంగాళదుంప తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. మిస్ చేయకండి..

0

Potato Benefits బంగాళదుంపతో కర్రీలు, స్నాక్స్, వేపుళ్లు ఇలా చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఫంక్షన్స్‌లో, హోటల్స్‌లో స్టార్టర్స్‌గా బంగాళదుంపతోనే ఎక్కువగా స్నాక్స్ చేస్తూ ఉంటారు, ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మందికి నచ్చుతాయి. అయితే చాలా మంది బంగాళదుంప తింటే వాతవ చేస్తుందని తినడం మానేస్తారు. కానీ బంగాళదుంపలో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. బంగాళదుంప తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయట పడొచ్చు. బంగాళదుంప తనడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆలూ తింటే ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Potato Benefits

కార్బోహైడ్రేట్లు ఎక్కువ:

బంగాళదుంపలో కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువగా లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల శరీరానికి సత్వరమే శక్తి లభిస్తుంది. అలసట, నీరసం దూరం అవుతాయి. కార్బోహైడ్రేట్లు కావాలి అనుకునేవారు బంగాళదుంపలను తీసుకోవచ్చు.

ఫైబర్ అధికం:

బంగాళదుంపలో పీచు పదార్థం అనేది మెండుగా లభిస్తుంది. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. తరచుగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు బంగాళదుంపలను తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మల బద్ధకం సమస్య తగ్గుతుంది.

వెయిట్ లాస్ అవుతారు:

బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తిన్నా పొట్ట నిండుతుంది. అంతే కాదు బంగాళ దుంపతో తయారు చేసిన స్నాక్స్ తిన్నా పెద్దగా ఆకలి వేయదు. చిరు తిళ్లు అనేవి తగ్గుతాయి. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

బంగాళదుంప తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆలూని తినడం వల్ల శరీరంలోని ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. దీంతో వైరల్ ఇన్ ఫెక్షన్స్, సీజనల్ వ్యాధులు ఎటాక్ చేయకుండా ఉంటాయి.

చర్మానికి ఎంతో మంచిది:

Potato Benefits బంగాళదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మాన్ని మృదువుగా, మెరిచేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ముడతలు, నల్లటి మచ్చలు తగ్గించి.. వృద్ధాప్యం నుంచి కాపాడుతుంది. ఆలూని తినడం వల్లనే కాకుండా రాసుకోవడం కూడా చర్మ సమస్యలు తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Man Kills Wife : అక్రమ సంబంధం అనుమానం.. 19 ఏళ్ల భార్య సజీవ దహనం..

0

Man Kills Wife : పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను సజీవ దహనం చేశాడు. ఈ ఘటన ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన 19 మహిళను ఆమె భర్త పరువు పేరుతో కాల్చి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాధితురాలు సబా ఇక్బాల్‌ని భర్త అలీ రజా అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో జూలై 28న లాహోర్‌కి 400 కి.మీ దూరంలోని బహవల్ నగర్ ‌లో హత్య చేశాడు.

Man Kills Wife

సబా రజా, అలీ రజా ఇద్దరూ 8 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజులకే తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అలీ రజా అనుమానించడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో సబా గొడవలతో విసిగిపోయి పుట్టింటికి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందన రజా తనకు జూలై 28న ఫోన్ చేసి చెప్పినట్లు యువతి తండ్రి మహ్మద్ ఇక్బాల్ తెలిపారు.

Man Kills Wife పుట్టింటికి వెళ్లిందని చెప్పినప్పటికీ అక్కడి చేరుకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రజా ఇంటికి వెళ్లారు. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం సబా కాలిపోయిన పరిస్థితుల్లో మృతదేహంగా కనిపించింది. నిందితుడు అలీ రజా నేరం అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సజీవ దహనానికి ముందు సబాను దారుణంగా హింసించినట్లు పోలసీులు వెల్లడించారు. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉండనే కారణంతోనే హత్య చేసినట్లు నిందితుడి రజా తెలిపాడు. రజాతో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరువు కోసం పాకిస్తాన్‌లో ప్రతీ ఏడాది 1000 మందికి పై మహిళల హత్యలు జరుగుతున్నాయని అంచనా.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Quality Geyser క్వాలిటీ గీజర్.. 4 వేల గీజర్ 2 వేలకే.. ఇప్పుడే కొనుక్కోండి

Quality Geyser వర్షాకాలం ప్రారంభమవడంతో వానలు కురుస్తూనే ఉన్నాయి. వాతావరణం అంతా కూల్ అయిపోయింది. చల్లటి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లటి నీటితో స్నానం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉదయాన్నే స్కూల్ పిల్లలు, ఉద్యోగులు చన్నీటితో స్నానం చేయాలంటే వణికిపోతుంటారు. వేడి నీరు ఉంటే బాగుండు అని భావిస్తుంటారు. హాట్ వాటర్ కోసం హీటర్లు, గీజర్లు అందుబాటులో ఉన్నాయి. హీటర్ల కంటే గీజర్ల వాడకం ఈజీగా ఉంటుంది. మరి మీరు కూడా కొత్త గీజర్ ను కొనాలనుకుంటున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే బ్రాండెడ్ ఇన్ స్టంట్ గీజర్ అందుబాటులో ఉంది.

Quality Geyser

వర్షాకాలం మొదలుకొని మళ్లీ సమ్మర్ ప్రారంభమయ్యే దాక వాతావరణం చల్లగానే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చల్లని నీటితో స్నానం చేయడానికి ఇబ్బందిపడుతుంటారు. మరి ఇలాంటి టైమ్ లో ఇంట్లో ఓ గీజర్ ను ఏర్పాటు చేసుకుంటే తక్షణమే వేడి నీటిని పొందొచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో క్రాంప్టన్ బ్రాండ్ కు చెందిన క్రాంప్టన్ ఇన్ స్టా బ్లిస్ ఇన్ స్టంట్ వాటర్ హీటర్(గీజర్)పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ గీజర్ పై 38 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 4400గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 2748కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 2 వేలకే దక్కించుకోవచ్చు.

క్రాంప్టన్ ఇన్ స్టా బ్లిస్ గీజర్ మూడు లీటర్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. 3 వేల వాట్స్ తో వస్తుంది. రస్ట్ ప్రూఫ్ తో వస్తుంది. రస్ట్ ఫ్రీ బాడితో వస్తుంది. ఫాస్ట్ హీటింగ్ ఫంక్షన్ తో ఇన్ స్టంట్ గా హాట్ వాటర్ పొందొచ్చు. 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. 4 లెవల్ సేఫ్టీతో వస్తుంది. గత నెలలో వెయ్యికి పైగా కస్టమర్లు కొనుగోలు చేశారు. మరి మీరు కూడా క్రాంప్టన్ బ్రాండ్ కు చెందిన క్రాంప్టన్ ఇన్ స్టా బ్లిస్ ఇన్ స్టంట్ వాటర్ హీటర్(గీజర్) కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Viral Video : ఆఫీస్ మీటింగ్ కి మొదటిసారి హాజరైన యువతి.. సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్..

0

Viral Video ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకునేవి డ్యాన్స్ , సాంగ్స్ వీడియోలు. వీటికి బాషతో పని లేదు.. కంటెంట్ ఉంటె చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోలు ప్రసిద్ది చెందుతున్నాయి. ఇందుకు సంబంధించిన లెక్కలేనన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆఫీస్ మీటింగ్‌లో ఓ యువతి భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని ఓ రంగ్రేజ్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

Viral Video

ఈ వీడియోను అంజలి పట్వాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పట్వాల్ ఆఫీస్ మీటింగ్ రూమ్‌గా కనిపిస్తుంది. ఆ గదిలో చాలా మంది నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. మీటింగ్ కోసం సహోద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరు వర్చువల్‌గా కనెక్ట్ అయ్యారు. అప్పుడు ఓ యువతి “ఓ రంగ్రేజ్” పాటకు మనోహరంగా డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేయడం ముసిగినప్పుడు ఆ యువతి చుట్టూ ఉన్న వారి చప్పట్లు కొట్టి అభినందించారు. వీడియోపై ఉన్న టెక్స్ట్ లో మీరు మీ రెజ్యూమ్‌లో ‘డ్యాన్స్’ చేయడం మీ అభిరుచి అని రాస్తే.. అప్పుడు మీ మొదటి టీమ్ మీటింగ్ ఇలా సాగుతుంది అని ఉంది.”

వీడియో చూడండి:

Viral Video పోస్ట్ చేసినప్పటి నుంచి వీడియో ఎనిమిది మిలియన్లకు అంటే 80 లక్షలకు పైగా వ్యూస్ ను అనేక లైక్‌లు సొంతం చేసుకుంది. అంతేకాదు వీడియోకు రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి మీటింగ్స్ లో మాకు మరింత సృజనాత్మకత అవసరం అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు “ఇంక్రిమెంట్ కోసం వాడే టెక్నిక్… అయితే తాను బారాత్ సమయంలో మాత్రమే డ్యాన్స్ చేస్తానని అది కూడా నాగినీ సంగీతం ప్లే చేస్తేనే అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. గతంలో తాను పని చేసిన సంస్థలో ఇలాంటివి జరిగినప్పుడల్లా.. తాను తన కుర్చీలో అతుక్కుని పోయి కూర్చునే వాడిని అని చెప్పారు. అసలు ఆఫీసు లో మీటింగ్ లో ఉద్యోగులు, ఆఫీసర్స్ ముందు ఇలా డ్యాన్స్ చేయాలంటే దైర్యం ఉండాలని కామెంట్ చేసారు మరొకరు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Paris Olympics Dhoni Inspiration : ధోనీ స్ఫూర్తి .. ఒలింపిక్స్‌ ఫైనల్స్‌లో ‘టికెట్ కలెక్టర్’!

0

Paris Olympics Dhoni Inspiration పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు రెండు పతకాలు సాధించింది. ఆ రెండూ షూటింగ్‌లో వచ్చినవే. ఇప్పుడు షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. 50 మీటర్ల 3 పొజిషన్‌ ఈవెంట్‌లో స్వప్నిల్ కుశాలె (Swapnil Kusale) ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో స్వప్నిల్  ఏడో స్థానంలో నిలిచి ముందంజ వేశాడు. ఒలింపిక్స్‌లో ఈ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత షూటర్‌గా రికార్డు సృష్టించాడు. గురువారం మధ్యాహ్నం 1గంటకు ఫైనల్‌ జరగనుంది. భారత్‌కు పతక ఆశలు రేపుతున్న స్వప్నిల్ కుశాలె గురించి తెలుసుకుందాం.

Paris Olympics Dhoni Inspiration

29 ఏళ్ల స్వప్నిల్‌ మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి, సోదరుడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తల్లి గ్రామ సర్పంచ్. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ ఈవెంట్‌లలో పోటీపడుతున్నాడు. అయితే, కెరీర్ ఆరంభించిన 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ షూటర్‌ 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే భారత తరఫున వివిధ ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నాడు.

ధోనీని చూసి ప్రేరణ పొంది

క్రికెట్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని చూసి ప్రేరణ పొందానని స్వప్నిల్ చెప్పాడు. ధోనీ కూడా క్రికెటర్‌ కాకముందు రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేశాడు. తర్వాత టీమ్‌ఇండియాలోకి అడుగుపెట్టి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ధోనీ బయోపిక్‌ను చాలాసార్లు చూశానని, అతడిలా గొప్ప విజయాలు సాధించాలనుకుంటున్నట్లు స్వప్నిల్  చెప్పాడు.

Paris Olympics Dhoni Inspiration ‘‘షూటింగ్‌లో  ప్రత్యేకంగా ఎవరినీ అనుసరించను. ఈ క్రీడాంశానికి సంబంధం లేని  ధోనీని ఆరాధిస్తాను. అతని జీవితానికి నా జీవితానికి దగ్గర సంబంధం ఉంది. నేను అతనిలాగే టికెట్‌ కలెక్టర్‌ని. అతను మైదానంలో ప్రశాంతంగా, ఓపికగా ఉంటాడు. షూటర్‌గా రాణించాలంటే ధోనీలా కూల్‌గా ఉండటం అవసరం. ప్రతి షాట్‌ను  జాగ్రత్తగా పేల్చాలి. నేను ఓపికగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. మ్యాచ్ మొత్తం ఇదే విధంగా ఉండేలా చూసుకుంటున్నా. మనస్సులో స్కోర్‌ల గురించి ఆలోచిస్తూ కాకుండా ఓపికగా, ప్రశాంతంగా ఉంటూ షూట్‌ చేయాలి. ఒలింపిక్స్‌లో ఇక్కడి వరకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. మను బాకర్‌ పతకం సాధించడం మా కాన్ఫిడెన్స్‌ని పెంచింది. మేం కూడా విజయం సాధిస్తామనే నమ్మకముంది’’ అని వెల్లడించాడు.

Source: Eenadu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Donald Trump on Kamala Harris : కమలా హ్యారీస్ భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా?.. డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్

0
  • కొన్నేళ్ల దాకా ఆమె నల్లజాతీయురాలని తెలియదన్న ట్రంప్
  • రాజకీయ ప్రయోజనం కోసం మారిపోయారంటూ విమర్శలు
  • భారతీయ వారసత్వాన్ని ప్రచారం చేసుకునేవారని వ్యాఖ్య

Donald Trump on Kamala Harris అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ కమలా హ్యారీస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారీస్ నిజంగా నల్లజాతీయురాలా?.. లేక 2024 అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అలా చెప్పుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

Donald Trump on Kamala Harris

‘‘కమలా హ్యారీస్ ఎప్పుడూ భారతీయ వారసత్వం కలిగిన వ్యక్తిగానే ఉండేవారు. భారతీయ వారసత్వాన్ని మాత్రమే ఆమె ప్రచారం చేసుకున్నారు. నల్లజాతిగా మారిన కొన్నేళ్ల కిందటి వరకు ఆమె నల్లజాతీయురాలని నాకు తెలియదు’’ అని ట్రంప్ అన్నారు. ఈ మేరకు షికాగోలో ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్‌’లోని జర్నలిస్టుల ప్యానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతానికైతే తనను నల్లజాతీయురాలిగానే పిలవాలని కమలా హ్యారీస్ కోరుకుంటున్నారని, కాబట్టి ఆమె భారతీయురాలా? లేక నల్లజాతీయురాలా? అనేది తనకు తెలియదని ట్రంప్ విమర్శించారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నల్లజాతి మహిళ, దక్షిణాసియా వారసత్వం కలిగిన వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడడంపై ప్రశ్నించగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆమె ఎవరో ఒకరిగా ఉంటేనే తాను గౌరవిస్తానని, కానీ ఆమె స్పష్టంగా అలా ఉండడం లేదని ట్రంప్ విమర్శించారు. కమలా హ్యారీస్ భారతీయురాలిగా ఉండేవారని, అకస్మాత్తుగా ఆమె నల్లజాతి వ్యక్తి అయిందని ఆరోపించారు.

స్పందించిన వైట్‌హౌస్..

డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కమలా హ్యారీస్‌పై వ్యక్తిగత దాడి చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైట్‌హౌస్ కార్యాలయం తక్షణమే స్పందించింది. ట్రంప్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ మండిపడింది. ‘‘వాళ్లు అది.. వీళ్లు ఇది.. అని చెప్పే హక్కు ఎవరికీ లేదు’’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వ్యాఖ్యానించారు.

Source: AP7AM


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Fastag August Rules : ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయ్.. మీ ఫాస్ట్‌ట్యాగ్‌ ఐదేళ్లదైతే ఇలా చేయండి

Fastag August Rules : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం.. టోల్ చెల్లింపులను సులభతరం చేయడం, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంకోసం వీలుంటుంది.

Fastag August Rules

  • ఎన్పీసీఐ మార్గదర్శకాల ప్రకారం..
  • మీ ఫాస్ట్‌ట్యాగ్ మూడు నుండి ఐదు సంవత్సరాల క్రితం జారీ చేయబడినది అయితే వారు కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి.
  • మీ ఫాస్ట్‌ట్యాగ్ ఐదు సంవత్సరాల క్రితం జారీచేయబడినది అయితే వారు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవాలి.
  • కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు 90 రోజుల్లో వాహన నెంబర్ ను పాస్ట్ ట్యాగ్ డేటాబేస్ లో నమోదు చేయించుకోవాలి.
  • వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్‌లు ఫాస్ట్‌ట్యాగ్‌తో అనుసంధానించబడి ఉన్నాయాలేదా అని నిర్ధారించుకోవాలి.
  • వాహనం ముందు భాగం స్పష్టంగా కనిపించేలా ఫొటో అప్లోడ్ చేయాలి.
  • ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ తో కనెక్ట్ చేసుకోవాలి.
  • ప్రతి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కు కనెక్ట్ చేసి ఉండాలి.
  • కొత్తరూల్స్ కు రవాణా శాఖ అక్టోబర్ 31 వరకు సమయం ఇచ్చింది.
  • ఒకవేళ ఎవరైనా తమ వాహనాన్ని రిజిస్టర్ చేయించుకోకపోతే టోల్ గేట్ వద్ద వాహనదారులు పలు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


IND vs SL : భార‌త్‌లో వ‌న్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జ‌ట్టుకు భారీ షాక్‌.. ఏకంగా ఇద్ద‌రు..

0

IND vs SL : టీమ్ఇండియాతో జ‌రిగిన టీ20 సిరీస్‌తోను 3-0 తేడాతో ఓడిపోయిన శ్రీలంక, క‌నీసం వ‌న్డే సిరీస్‌లోనైనా స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. అయితే.. భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు శ్రీలంక జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్లు దిల్షాన్ మ‌ధుశంక‌, మ‌తీషా ప‌తిర‌ణ గాయాల‌తో వ‌న్డే సిరీస్‌కు దూరం అయిన‌ట్లుగా స్థానిక మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌ట్టు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసే స‌మ‌యంలో మ‌ధుశంక ఎడమ కాలికి గాయమైంది.

IND vs SL

మ‌రో వైపు భార‌త్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో బంతిని ఆపే క్ర‌మంలో ప‌తిరాన భుజానికి గాయ‌మైంది. వైద్యులు అత‌డికి రెండు వారాల విశ్రాంతి అవ‌స‌రం అని సూచించారు. దీంతో భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌కు వీరిద్ద‌రు దూరం అయిన‌ట్లుగా లంక క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రి స్థానాల్లో ఎషాన్ మ‌లింగ‌, మ‌హ్మ‌ద్ షిరాజ్‌ల‌కు తీసుకున్న‌ట్లుగా తెలిపింది. స్టాండ్ బైలుగా కుశాల్ జ‌నిత్‌, జెఫ్రీ వాండ‌ర్సే, ప్ర‌మోద్ మ‌ధుష‌న్‌ల‌ను జ‌ట్టులోకి తీసుకుంది.

IND vs SL టీమ్ఇండియాతో లంక జ‌ట్టు మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. ఆగ‌స్టు 2 నుంచి వ‌న్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆగ‌స్టు 2, 4, 7 తేదీల్లో మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మూడు వ‌న్డేలు కొలంబో వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి.

భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు : చరిత్ అసలంక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, షిరాజ్‌, అసిత ఫెర్నాండో.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


Kohli Stylish Shot : కోహ్లీ కొట్టిన షాట్‌ చూసి.. షాకైన గంభీర్‌! ఆ రియాక్షన్‌ చూడండి

0

Kohli Stylish Shot శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం భారత క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆధ్వర్యంలో, సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా.. ఇటీవలె శ్రీలంకను మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో లంకను వాళ్లగడ్డపైనే క్లీన్‌ స్వీప్‌ చేసి.. కెప్టెన్‌గా సూర్య, హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ సూపర్‌ స్టార్ట్‌ అందుకున్నారు. ఇక రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని భాతర జట్టు ఆటగాళ్లు గట్టి పట్టదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నెట్స్‌లో ముమ్మరంగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు.

Kohli Stylish Shot

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీ తర్వాత.. రోకో జోడి తొలిసారి గ్రౌండ్‌లోకి దిగనుంది. అందుకే భారత క్రికెట్‌ అభిమానులు ఈ సిరీస్‌పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత.. ఇద్దరి ఆటను చూసేందుకు ఎగ్జైట్‌గా ఉన్నారు. అయితే.. విరాట్‌ కోహ్లీ టీ20 వరల్డ్‌ కప్‌లో అంత మంచి ప్రదర్శన చేయని విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడిన కోహ్లీ.. తన స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ఒక్క ఫైనల్‌లో మాత్రమే అదరగొట్టాడు.

Kohli Stylish Shot ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్‌తో తన ఫామ్‌ను తిరిగి అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో చాలా సేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పర్యవేక్షణలో నెట్స్‌లో కోహ్లీ భారీ భారీ షాట్లు ఆడాడు. కోహ్లీ కొడుతున్న షాట్లు చూసి.. గౌతమ్‌ గంభీర్‌ ఆశ్చర్యపోయాడు. కోహ్లీ కొట్ట బాల్‌ అలా గాల్లోకి వెళ్తుంటే.. గంభీర్‌ ఆ బాల్‌ను అలాగే చూస్తుండి పోయాడు. ప్రస్తుతం కోహ్లీ షాట్‌కు గంభీర్‌ ఇచ్చిన షాకింగ్‌ రియాక్షన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.