AstrologyHoroscope Today : శనిపై శుక్రుడి దృష్టి.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Horoscope Today : శనిపై శుక్రుడి దృష్టి.. ఆ రాశుల వారికి ధన, రాజయోగాలు పక్కా..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Horoscope Today ఈ నెల 2వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ శుక్రుడి మీద కుంభ రాశి నుంచి శని దృష్టి పడుతుంది. ఈ రెండు మిత్ర గ్రహాల పరస్పర దృష్టి వల్ల కొన్ని రాశులకు రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఊహించని స్థాయిలో ధన యోగాలు పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకస్మిక శుభ పరిణామాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.

Horoscope Today

  1. మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడి మీద లాభస్థానంలో ఉన్న శని దృష్టి పడినందువల్ల ఉద్యో గాలపరంగా ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృష్టాలు పడతాయి. రాజయోగాలు అను భవించడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. సంతానపరంగా శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అంద డం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం, ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడి దృష్టి ఆ శుక్రుడి మీద పడడం వల్ల వీరు ఉద్యోగాలపరంగా రాజయోగాలను అనుభవించడం జరుగు తుంది. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు, ఆశించిన బదిలీలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి పూర్తిగా బయటపడడంతో పాటు, వీటికి బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు వృద్ధి చెందుతాయి.
  3. సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి మీద సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడి దృష్టి పడినందు వల్ల ఉద్యోగంలో ఈ రాశివారి ప్రాభవం, ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతాయి. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఉన్నత పద వులు లభిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. వృత్తి, వ్యాపా రాలు బాగా కలిసి వస్తాయి. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయడమే ఒక రాజయోగం కాగా, ఈ రాశికి అత్యంత శుభుడైన శని దృష్టి ఆ శుక్రుడి మీద పడడం విపరీత రాజయోగానికి దారి తీస్తుంది. దీనివల్ల సమాజంలోని అత్యంత ప్రముఖులైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు హోదాలు, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభాలు గడిస్తాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి దృష్టి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడి మీద పడడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగా ర్థులకు ప్రభుత్వ లేదా బ్యాంక్ ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వినే అవకాశముంది.
  6. కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శనీశ్వరుడి దృష్టి సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడి మీద పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు సైతం అందే సూచనలున్నాయి. ధన ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this