SportsCricketTeam India: హీరోయిన్లతో అఫైర్లు, ఒళ్లంతా టాటూలు...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Team India: హీరోయిన్లతో అఫైర్లు, ఒళ్లంతా టాటూలు ఉంటేనే టీమిండియాలో చోటు: భారత క్రికెటర్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ నెల 27 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం జట్ల ప్రకటన తర్వాత బీసీసీఐ, సెలెక్షన్‌ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ భారత క్రికెటర్‌ మాట్లాడుతూ.. టీమిండియాలో చోటు దక్కలంటే.. బాలీవుడ్‌ హీరోయిన్లతో అఫైర్లలు పెట్టుకోవాలమో అంటూ ఘాటుగా స్పందించాడు. ఇటీవల శ్రీలంక పర్యటనకు కోసం ప్రకటించిన టీ20, వన్డే టీమ్స్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌కు చోటు దక్కకపోవడంపై భారత క్రికెటర్‌ బద్రినాథ్‌ విమర్శలు గుప్పించాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా.. రుతురాజ్‌ను పక్కనపెట్టడంపై చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేశారు.

హర్భజన్‌ సింగ్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌ లాంటి మాజీ క్రికెటర్లు కూడా శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ కోసం రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టారు. అలాగే సంజు శాంసన్‌ను వన్డే సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదో తమకు అర్థం కాలేదని అన్నారు. అయితే.. తాజాగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడిన తమిళనాడు ఆటగాడు ఎస్‌.బద్రీనాథ్‌ కాస్త ఘాటుగానే టీమిండియా సెలక్షన్‌పై స్పందిస్తూ.. ‘బాలీవుడ్‌ హీరోయిన్లతో అఫైర్‌, ఒళ్లంతా టాటూలు, మంచి మీడియా మేనేజర్‌ ఉంటేనే టీమిండియాలో చోటు దక్కుతుందేమో’ అని వ్యాఖ్యానించాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌కు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై క్రికెట్‌ అభిమానుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లోనూ గైక్వాడ్‌ అద్భుతంగా రాణించాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్‌కు.. మూడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. తొలి మ్యాచ్‌లో 7 పరుగులు మాత్రమే చేసినా.. తర్వాతి మ్యాచ్లో 77, మూడో మ్యాచ్‌లో 49 పరుగులు చేసి రాణించాడు. నాలుగో మ్యాచ్‌లో గైక్వాడ్‌కు బ్యాటింగ్‌ రాలేదు. అయినా కూడా ఐదో మ్యాచ్‌లో అతన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు ఏకంగా టీమ్‌ నుంచే తీసేశారు. అందుకే రుతురాజ్‌కే సర్వత్రా మద్దతు లభిస్తుంది. మరి రుతురాజ్‌కు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై బద్రీనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this