Friday, June 20, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
SportsCricketPandya Team India పాండ్యా కెప్టెన్‌ కాకపోవడానికి...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

Pandya Team India పాండ్యా కెప్టెన్‌ కాకపోవడానికి గంభీర్‌ కారణం కాదు! అసలు విలన్‌ ఎవరో తెలిసిపోయింది!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Pandya Team India ఒక్క శ్రీలంక టూర్‌ కోసం ప్రకటించిన జట్లతో బీసీసీఐ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పేసింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో టీ20 కెప్టెన్‌ పోస్ట్‌ ఖాళీ అయింది. అలా టీ20 క్రికెట్‌లో టీమిండియా నడిపించే క్రికెటర్‌ ఎవరు? వన్డేలకు రోహిత్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? రోహిత్‌ తర్వాత టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌ ఎవరు? ఇలా అన్ని ప్రశ్నలకు జవాబు వచ్చేసింది. టీ20 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది బీసీసీఐ. అలాగే టీ20, వన్డేలకు యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. దీంతో.. టీమిండియా ఫ్యూచర్‌ కెప్టెన్‌ గిల్‌ అనే విషయంపై క్లారిటీ వచ్చింది.

ఇదంతా బాగానే ఉన్నా.. హార్ధిక్‌ పాండ్యాకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అద్భుతమైన ప్రదర్శన చేసినా.. పాండ్యాకు బీసీసీఐ దారుణంగా అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రోహిత్‌ శర్మ తర్వాత.. హార్ధిక్‌ పాండ్యానే టీ20 జట్టుకు పర్మినెంట్‌ కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. కానీ, బీసీసీఐ అతనికి షాకిస్తూ.. సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌ను చేసింది. పైగా అతనికున్న వైస్‌ కెప్టెన్సీని కూడా లాగేసుకొని శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్ చేసింది. అయితే.. ఇదంతా కొత్త హెడ్‌ కోచ్‌ గంభీర్‌ చేసిన పనే అని ప్రచారం జరిగింది. కానీ, కొత్తగా మరో పేరు వెలుగులోకి వచ్చింది.

Pandya Team India

హార్ధిక్‌ పాండ్యాను టీ20 జట్టుకు కెప్టెన్‌ చేయకుండా అడ్డుపడింది గౌతమ్‌ గంభీర్‌ కాదని, టీమిండియా మాజీ క్రికెటర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌.. పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చేందుకు అస్సలు ఒప్పుకోలేదని బీసీసీఐ0 అధికారులు అనాధికారికంగా వెల్లడిస్తున్నారు. టీ20 జట్టుకు ఎవర్ని కెప్టెన్‌ను చేయాలని మీటింగ్‌లో పాండ్యాను అజిత్‌ అగార్కర్ పూర్తిగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఒకసారి ఛాంపియన్‌, ఒక సారి రన్నరప్‌గా నిలిపిన పాండ్యా.. ముంబై ఇండియన్స్‌ విషయంలో మాత్రం తేలిపోయాడు. అయితే.. గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో హెడ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా కారణంగా ఆ జట్టు సక్సెస్‌ అయిందని, పాండ్యా కెప్టెన్సీ వల్ల కాదన అగార్కర్‌ గట్టిగా వాదించడంతోనే పాండ్యాకు టీ20 కెప్టెన్సీ దక్కలేదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో.. పాండ్యా కెరీర్‌లో అసలు విలన్‌ అజిత్‌ అగార్కర్‌ అంటూ కొంత మంది క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this