Tuesday, September 9, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EntertainmentCinemaHero Sudeep vs Phone pe ఫోన్‌...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025: జిల్లా వారీగా, పోస్ట్ వారీగా రిజెక్షన్ల వివరణ (DSC 2025 Rejections Analysis in Telugu)

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ (DSC) 2025 లో విద్యాఉద్యోగాలకు దరఖాస్తు చేసిన...

Hero Sudeep vs Phone pe ఫోన్‌ పేతో వివాదం.. సంచలన నిర్ణయం తీసుకున్న సుదీప్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కన్నడ స్టార్ హీరో, కిచ్చా సుదీప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచమయ్యాడు. అలానే కన్నడలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సుదీప్ సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే..కర్నాటకలో ప్రముఖ సంస్థ ఫోన్ పే ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరి.. ఆ నిర్ణయం ఏమిటి, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం కర్నాటకలో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్నిఅక్కడి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసింది. అయితే ఈ నిర్ణయాన్ని ఫోన్ పే సంస్థ వ్యతిరేకించింది. పోన్‌ పే సీఈవో సమీర్ నిగమ్ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇలా ప్రైవేటు సంస్థలో రిజర్వేషన్లు సైరనది కాదంటూ..ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయంపై వ్యతిరేతను వ్యక్తం చేసింది. దీంతో కన్నడలో ఫోన్ పే సంస్థ బహిష్కరణ అంటూ ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫోన్ పేపై కన్నడిగులు పోరాటం చేస్తున్నారు. వారి పోరాటానికి హీరో సుదీప్ మద్దతు తెలిపారు. ఫోన్ పేతో చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని సుదీప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

నటుడు సుదీప్ కర్ణాటకలో ఫోన్ పే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కస్టమర్లకు డబ్బును పంపుతున్న సమయంలో ఫోన్ పేలో ‘థ్యాంక్యూ బాస్‌’ అంటూ సుదీప్‌ వాయిస్‌ వినిపిస్తుంది. అయితే, కన్నడిగుల పట్ల ఫోన్‌ పే వ్యవహరించిన తీరుతో ఆ సంస్థ మీద అక్కడి జనాలు ఫైరవుతున్నారు. ఈ నేప‌థ్యంలో కిచ్చ సుదీప్‌ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు రెడీ అవుతున్నారని టాక్. తనను ఆదరించిన కన్నడ ప్రజల పక్షాన నిలబడేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కన్నడ ప్రజలకు ఫోన్ పే క్షమాపణలు చెప్పకుంటే.. ఆ సంస్థతో తాను చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై సుదీప్ సోమవారం అధికారికంగా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

ఇప్పటికే కన్నడిగులు ఫోన్లలో ఫోన్ పే యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కన్నడిగులకు మద్దతుగా సుదీప్ ముందుకు వచ్చినట్లు ఆయన టీమ్ నుంచి సమాచారం వస్తుంది. అయితే, కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్లను ఫోన్ పేతో పాటు చాలా మంది బిజినేస్ మెన్లు వ్యతిరేకించారు. దీంతో ఆయా పారిశ్రామికవేత్తలపై నిరసన కూడా వ్యక్తమవుతుంది. ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ అందరి కంటే ముందు వ్యతిరేకించారు. అందుకే, కన్నడిగుల అతనికి గుణపాఠం చెప్పాలని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఫోన్ పే విషయంలో కిచ్చా సుదీప్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this