Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు! ఇప్పుడు మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన దశ Web Options ద్వారా స్కూల్ ఎంపిక. సరైన స్కూల్ ఎంచుకోవడం మీ భవిష్యత్ కెరీర్‌కు చాలా ప్రధానమైనది. ఈ పోస్ట్ లో, మీరు స్కూల్ ఎంపికకు అవసరమైన గ్రౌండ్ లెవెల్ డేటా ఎలా సేకరించాలో మేము వివరిస్తాము.

Head Master Contact నంబర్ ఎలా పొందాలి?
మేము మీ కోసం ఒక స్పెషల్ టూల్ తయారు చేసాము. దీని ద్వారా మీరు స్కూల్ DISE Code ఉపయోగించి నేరుగా స్కూల్ హెడ్ మాస్టర్ కాంటాక్ట్ నంబర్ పొందవచ్చు. (కొన్ని స్కూల్స్ యొక్క నంబర్స్ తప్పు ఉండవచ్చు/అందుబాటు లో లేకపోవచ్చు .)
ఎలా Use చేయాలి:
- కింద ఉన్న బాక్స్ లో 11 అంకెల School DISE Code ని ఎంటర్ చేయండి.
- Get Contact బటన్ పై క్లిక్ చేయండి.
తర్వాత, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ యొక్క కాంటాక్ట్ వివరాలు మీ ముందు కనిపిస్తాయి. - మీరు ఆ నంబర్ ను .vcf ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసి, మీ మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకోవచ్చు.
[ఈ క్రింది లింక్ లో DISE Code ను ఎంటర్ చేసి, హెడ్ మాస్టర్ కాంటాక్ట్ ను పొందండి]
https://app.duniya360.com/contact/hmmobile.php
ఈ విధంగా మీరు సులభంగా HM నంబర్ పొంది, స్కూల్ గురించి అన్ని వివరాలు తెలుసుకుని, Smart గా మీ Web Options ని ఫిల్ చేసుకోవచ్చు.
To get MEO Office staff contact details Click Here to Know
To get School Report Card Click Here
Head Master Contact – స్కూల్ ఎంపికకు ముందు ఈ వివరాలు తప్పనిసరిగా తెలుసుకోండి
Web Options ఫిల్ చేసే ముందు, మీరు ఎంచుకునే స్కూల్ గురించి సమగ్ర సమాచారం కలిగి ఉండటం చాలా అవసరం. ఈ కింది వివరాలు స్కూల్ హెడ్ మాస్టర్ నుండే సేకరించండి:
- స్కూల్ లో Vacant పోస్ట్‌ల సంఖ్య (Roll)
- స్కూల్ కి ఎలా చేరుకోవాలి (How to Reach the School)
- స్కూల్ యొక్క Infrastructure మరియు పరిస్థితులు (Conditions of School)
- గ్రామస్తులు, పేరెంట్స్ లేదా అధికారులతో ఏవైనా Issues ఉన్నాయా?
- టీచింగ్ వాతావరణం
ఈ సమాచారం మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
Q1: DISE Code ఎక్కడ నుండి పొందవచ్చు?
A: స్కూల్ DISE Code సాధారణంగా స్కూల్ ప్రవేశ ద్వారం వద్ద ఉంటుంది. లేదా జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీస్ వెబ్‌సైట్ లేదా అధికారిక పట్టికల్లో దొరకవచ్చు.
Q2: హెడ్ మాస్టర్ ను కాల్ చేసి ఏం అడగాలి?
A: పైన Mention చేసిన వివరాలు – పోస్ట్‌ల సంఖ్య, స్కూల్ సౌకర్యాలు, రోడ్ మార్గం, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని మర్యాదగా అడగండి.
Q3: Web Options ఎప్పుడు Fill చేయాలి?
A: DSC 2025 Official Notification లో Mention చేసిన తేదీల్లోనే Web Options ఫిల్ చేయాలి. తేదీలు గమనిస్తూ ఉండండి.
Q4: ఒకవేళ DISE Code సరైనది కాకపోతే ఏమవుతుంది?
A: 11 అంకెల సరైన DISE Code ని మాత్రమే ఎంటర్ చేయండి. తప్పు Code ఎంటర్ చేస్తే Contact Details రావు.
Q5: Contact Details లేనట్లయితే ఏమి చేయాలి?
A: అలాంటప్పుడు మీరు ఆ స్కూల్ యొక్క Mandal Educational Officer ని (MEO) సంప్రదించవచ్చు.
Note: HM ల వద్ద మీరు తీసుకునే సమాచారం సరిగా ఉంటుంది అని భావించలేము. వారు ఆ పాఠశాల గురించి వివిధ కారాణాల రీత్యా తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు. కావున మీరు సేకరించుకునే సమాచారపు సాంపిల్స్ ను ఎక్కువగా తీసుకోండి. దీనిని బట్టి ఒక నిర్ణయానికి రావడానికి ఉపయోగపడుతుంది.