SportsParis Olympics 2024: వీరిపైనే పతకాల ఆశ.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Paris Olympics 2024: వీరిపైనే పతకాల ఆశ.. ఈ క్రీడాకారుల శిక్షణకై ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆసియా క్రీడలు 2022లో ప్రభుత్వం ‘ఈసారి 100 పార్’ (‘ఈసారి 100 పతకాలు) అనే నినాదాన్ని ఇచ్చింది. ఇపుడు 2024 పారిస్ ఒలింపిక్స్ వంతు వచ్చింది. వేసవి ఒలింపిక్స్ కోసం ‘ఈసారి, 10 పార్’ (10 పతకాలు) అని నినాదంతో పాల్గొంటుంది. ఆసియా క్రీడలతో పోలిస్తే ఈ 10 పతకాల సంఖ్య చిన్నదే అయినా అది ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలతో రికార్డు సృష్టించిన తర్వాత.. ఇప్పుడు భారత అథ్లెటిక్స్ లక్ష్యం 10 పతకాలు. ఆసియా క్రీడల్లాగే ఇందులోనూ భారత ఆటగాళ్లు విజయం సాధించగలరా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం గత 3 ఏళ్లలో దాదాపు ప్రతి అథ్లెట్‌పై భారత ప్రభుత్వం లక్షలు, కోట్లు ఖర్చు చేసింది. దీంతో క్రీడాకారులపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అగ్రస్థానంలో ఉన్నాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంగ్రామం జూలై 26 నుంచి పారిస్‌లో ప్రారంభం కానుంది. దీనికి కొద్ది రోజుల ముందు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. దీనిలో టోక్యో ఒలింపిక్స్ తర్వాత పారిస్ సైకిల్ తయారీకి వివిధ క్రీడలు, ఆటగాళ్ల కోసం ఎంత ఖర్చు చేశారో వెల్లడించింది. దీని ప్రకారం అథ్లెటిక్స్‌ కోసం అత్యధికంగా రూ.96 కోట్లు ఖర్చు చేయగా, బ్యాడ్మింటన్‌కు రూ.72 కోట్లు, హాకీకి రూ.41.81 కోట్లు ఖర్చు చేశారు. ఈ నేపధ్యంలో పారిస్ ఒలింపిక్స్ కి రెడీ అవుతున్న ఐదుగురు అథ్లెట్ల శిక్షనపై ప్రత్యెక శ్రద్ధ పెట్టింది. వీరికి సన్నాహాలకు ప్రభుత్వం ఎక్కువ సహాయం అందించింది.

నీరజ్ చోప్రా:

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై మరోసారి భారీ అంచనాలు ఉన్నాయి. ఒలంపిక్స్ తర్వాత జరిగిన అనేక పెద్ద ఈవెంట్లలో పతకాలు గెలుచుకున్నాడు. అందుకే ఈ బల్లెం వీరుడిపై మరోసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి పతక పోటీదారుగా నిలిచాడు. అటువంటి పరిస్థితిలో గత 3 సంవత్సరాలలో నీరజ్ చోప్రా శిక్షణ కోసం ప్రభుత్వం చాలా ఖర్చు చేసింది. నీరజ్‌కి విదేశాల్లో శిక్షణ, విదేశీ కోచ్, ఇతర అవసరాల కోసం రూ.5.72 కోట్లను సాయి వెచ్చించింది.

సాత్విక్-చిరాగ్:

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు అతిపెద్ద ఆశాకిరణంగా నిలిచిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించింది. తాజాగా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 జోడీగా నిలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్.. విదేశాల్లో శిక్షణ, టోర్నీల్లో పాల్గొనడమే కాకుండా విదేశీ కోచ్‌ల కోసం వెచ్చించిన మొత్తం రూ.5.62 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించింది.

పీవీ సింధు:

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రజతం, కాంస్య పతకాలు సాధించి అద్భుతాలు చేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా అవతరించాలని భావిస్తున్న సింధు.. జర్మనీలో శిక్షణ సౌకర్యాలతో పాటు విదేశీ కోచ్, సహాయక సిబ్బందిని కూడా నియమించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3.13 కోట్లను అందించింది.

మీరాబాయి చాను:

గత ఒలింపిక్స్‌లో రజత పతకంతో దేశం ఒలిపిక్స్ లో పతకాల పట్టికలో ఖాతా తెరిచిన వెటరన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై ఈ సారి కూడా భారీ అంచనాలున్నాయి. మీరాబాయి మళ్లీ పతకం తెస్తుంది అనే ఆశలు చిగురించాయి. అందుకే మీరాబాయికి అమెరికాలో శిక్షణతోపాటు బయోమెకానికల్ పరికరాల వంటి ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.2.74 కోట్ల సాయం అందించింది.

అనీష్ భన్వాలా:

21 ఏళ్ల షూటర్ అనీష్ భన్వాలా కూడా గత రెండు వరుస ఒలింపిక్స్‌లో షూటింగ్ జట్టు వైఫల్యానికి ముగింపు పలకాలని భావిస్తున్నారు. ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయనున్న అనీష్‌కు వ్యక్తిగత కోచ్‌తో జర్మనీలో శిక్షణతో పాటు మందుగుండు సామగ్రి కొనుగోలులో సహాయంగా ప్రభుత్వం నుండి రూ.2.41 కోట్ల సహాయం అందించింది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this