Tuesday, April 29, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Andhra PradeshJagan Vs Anitha వైఎస్ జగన్‌కి సవాలు...

ఇంట్లోనే Agarbatti making business: రూ.15,000 పెట్టుబడితో నెలకు రూ.35,000 లాభం

ఈ కాలంలో చిన్న పెట్టుబడితో ఇంట్లోనే ప్రారంభించగల వ్యాపార అవకాశాలు చాలా...

ఆంధ్రా స్పెషల్ పాల పూరీలు: ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి | Milk Puri Recipe

ఆంధ్ర ప్రదేశ్ యొక్క సాంప్రదాయక వంటకాలలో పాల పూరీలకు ప్రత్యేక స్థానం...

Bajaj Chetak 3503: 1.10 లక్షలకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ – ఫీచర్స్ & ఫుల్ రివ్యూ

బజాజ్ ఆటో తన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ అయిన చేతక్...

మేక మాంసం Vs గొర్రె మాంసం: ఏది ఆరోగ్యానికి మంచిది? – GOAT MEAT VS LAMB MEAT

GOAT MEAT VS LAMB MEAT తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతులలో...

Jagan Vs Anitha వైఎస్ జగన్‌కి సవాలు విసిరిన హోం మంత్రి వంగలపూడి అనిత

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Jagan Vs Anitha ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్తే తానూ కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇవాళ అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానంద హత్యతో పాటు వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తమ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో చర్చించేందుకు తానే వస్తానని సవాలు విసిరారు.

అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని జగన్ మరో మార్గంలో వెళ్తున్నారని అనిత విమర్శించారు. అసెంబ్లీలో ఈ నెల 24న శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపట్టనుందని తెలిపారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చని చెప్పారు.

జగన్ చేస్తున్న శవ రాజకీయాలకు ఆయనకు సిగ్గనిపించకపోయినా ఏపీ ప్రజలు ఆయన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారని అనిత అన్నారు. జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం వారేనని తెలిపారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this