Saturday, August 23, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
SportsCricketENG vs WI: ఇంగ్లండ్​ను వణికించిన వెస్టిండీస్.....

AP DSC Merit List 2025 Released – Check District, Zone Wise Selection List at apdsc.apcfss.in Latest Press Note

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా DSC-2025 లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన AP...

Mega DSC-2025 Final Merit List Release Today: Check Official Links

విజయవాడ: Mega DSC-2025 పరీక్షల ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆగస్ట్ 22న...

అండర్ రూ. 3,500: Best Soundbar (బెస్ట్ సౌండ్ బార్) – మీ స్మార్ట్ టీవీకి పర్ఫెక్ట్ పార్ట్నర్!

మీ స్మార్ట్ టీవీ ధ్వనిని మరింత శక్తివంతమైన మరియు స్పష్టమైనదిగా మార్చాలనుకుంటున్నారా?...

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ హ్యాండ్ బుక్: క్లాస్ & సబ్జెక్ట్ వారీగా Model filled diary | AP Teachers Handbook

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా AP Teachers handbook మరియు model...

ENG vs WI: ఇంగ్లండ్​ను వణికించిన వెస్టిండీస్.. అండర్సన్, బ్రాడ్ లేకపోతే ఇక అంతేనా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇంగ్లండ్.. వరల్డ్ క్రికెట్​లో టాప్ టీమ్స్​లో ఒకటి. ఆ టీమ్ బరిలోకి దిగుతోందంటేనే మిగతా జట్లన్నీ భయపడతాయి. ద్వైపాక్షిక సిరీస్​ కానివ్వండి.. ఐసీసీ టోర్నమెంట్ కానివ్వండి ఇంగ్లీష్ టీమ్ ఒకేలా ఆడుతుంది. దూకుడే మంత్రంగా దూసుకెళ్లుంది. ముఖ్యంగా టెస్టుల్లో ఆ టీమ్ అటాకింగ్ అప్రోచ్​తోనే టాప్ రేంజ్​కు చేరుకుంది. బజ్​బాల్ మంత్రంతో ఆస్ట్రేలియా సహా అన్ని జట్లను వణికించింది. అయితే ఈ మధ్య కాలంలో బజ్​బాల్ మ్యాజిక్ పని చేయడం లేదు. భారత పర్యటనలో ఇదే సూత్రాన్ని వాడి బొక్క బోర్లా పడింది స్టోక్స్ సేన. ఇప్పుడు వెస్టిండీస్ కూడా ఆ టీమ్​ బెండు తీస్తోంది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కరీబియన్ వీరులు అదరగొట్టారు.

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆతిథ్య జట్టు 416 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన విండీస్ ఏకంగా 457 పరుగులు చేసింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన కరీబియన్ టీమ్ ఇంగ్లీష్ జట్టు సాధించిన స్కోరును అధిగమించడం హైలైట్ అనే చెప్పాలి. కావెమ్ హాడ్జ్ (120), జోషువా డసిల్వా (82) ఇంగ్లండ్ బౌలింగ్​ను తుత్తునియలు చేశారు. వచ్చిన బౌలర్​ను వచ్చినట్లు బాది పారేశారు. ఇద్దరూ కలసి 29 బౌండరీలు కొట్టారు. దీంతో క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ సహా మిగిలిన బౌలర్లు గుడ్లు తేలేశారు. కెప్టెన్స్ స్టోక్స్ స్వయంగా బౌలింగ్​కు దిగినా ఆ ఇద్దర్నీ ఆపలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ పనైపోయిందని నెటిజన్స్ అంటున్నారు. అండర్సన్, బ్రాడ్ రిటైర్మెంట్​తో ఇక ఆ జట్టు కథ ముగిసిందని చెబుతున్నారు. మరి.. ఇంగ్లండ్​ను విండీస్​ కోలుకోలేని దెబ్బ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this