Saturday, December 13, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EntertainmentCinemaHrithik Roshan: ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

One-year B.Ed, : ఇక 2-సంవత్సరాల B.Ed కాదు.. ప్రభుత్వం 1-సంవత్సరం ఫాస్ట్-ట్రాక్ కోర్స్ ప్రకటించింది!

One-year B.Ed భారతదేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో పెద్ద మలుపు తిరిగింది....

Hrithik Roshan: ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు వీరివే.. తన మాజీ భార్యకు హృతిక్ రోషన్ ఎన్ని కోట్ల భరణం ఇచ్చాడంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గత కొన్నాళ్లుగా తన సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తన మాజీ భార్య సుస్సానే ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత హృతిక్ బాలీవుడ్ సింగర్ సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి బాలీవుడ్ ఈవెంట్స్, పార్టీలలో కలిసి పాల్గొన్నారు. మరోవైపు సుస్సానే ఖాన్ కూడా జీవితంలో ముందుకు సాగింది. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది.. కానీ గతంలో వీరిద్దరు విడాకులు ప్రకటించడం అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. హృతిక్ రోషన్ మల్టీ మిలియనీర్. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ తమ విడాకుల గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. హృతిక్ రోషన్, సుస్సానే దంపతులకు ఇద్దరు పిల్లలు. విడాకుల తర్వాత వీరిద్దరు స్నేహితులుగా కొనసాగుతున్నారు.

హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్ విడాకులు అత్యంత ఖరీదైన విడాకులు అని అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రచారం నడిచింది. విడాకుల తర్వాత తన మాజీ భార్య సుస్సానే ఖాన్ కు రూ.400 కోట్లు చెల్లించినట్లు వార్తలు వినిపించాయి. దీంతో ఆ సమయంలో సుస్సానే ఖాన్‌పై కూడా ప్రజలు విమర్శలు గుప్పించారు. సుస్సానే ఖాన్ హృతిక్ రోషన్ నుండి భరణంగా 400 కోట్లు డిమాండ్ చేసిందని.. దీంతో ఆ మొత్తాన్ని సుస్సానేకి ఇచ్చాడని కొన్ని నివేదికలు వెల్లడించారు. ఇంత భారీ భరణం అందుకున్నందుకు సుస్సానే పై అడియన్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే తనపై వచ్చిన నెగిటివిటీ పై సుస్సానే స్పందించలేదు. అయితే ఈ విషయాన్ని హృతిక్ రోషన్ వెల్లడించాడు.

400 కోట్ల భరణం తర్వాత హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఇందులో సుస్సానేకి భరణంగా 400 కోట్లు చెల్లించారనే టాక్ తప్పని హృతిక్ రోషన్ క్లియర్ గా వెల్లడించాడు. ఈ విషయాలు తప్పు. కారణం లేకుండా ఇది ఒక రకమైన వేధింపు అని హృతిక్ రోషన్ చెప్పాడు. సుస్సానే ఖాన్ తన నుండి భరణంగా ఎటువంటి మొత్తాన్ని తీసుకోలేదని వెల్లడించాడు. అయితే, బాలీవుడ్‌లో సుస్సానే ఖాన్, హృతిక్ రోషన్‌ల విడాకులు అత్యంత ఖరీదైనవి అనే టాక్ ఇప్పటికీ ఉంది. ఇటీవలే భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this