Andhra PradeshAP Polycet 2025 Notification : ఏపీ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Polycet 2025 Notification : ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్ రాత పరీక్ష ఎప్పుడుంటంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP Polycet 2025 Notification ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఏప్రిల్‌ 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..

ap polycet 2025 notification
ap polycet 2025 notification

AP Polycet 2025 Notification

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఏప్రిల్‌ 15 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుతో పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. NIOS/ APOSS/ ఇతర పరీక్షలకు చెందిన అభ్యర్థులు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సహా అన్ని సబ్జెక్టులలో ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. SSC లేదా తత్సమాన పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

దరఖాస్తు సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 30న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచానా వేస్తున్నారు. ఫలితాలు మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ప్రాథమిక కీ విడుదల.. రేపటితో ముగుస్తున్న అభ్యంతరాల స్వీకరణకు గడువు

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2024 పరీక్షల ప్రాథమిక కీ తాజాగా వెలువడింది. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 164 సెంటర్లలో 2,38,451 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మార్చి14వ తేదీలోపు రూ.200 చెల్లించి ప్రాథమిక కీ పై అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా తెలుపవచ్చు.

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this