Andhra PradeshPFMS School Composite Grants Withdrawal Process

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

PFMS School Composite Grants Withdrawal Process

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Please read all points carefully before calling

Purpose: PFMS ఖాతా నుండి మీ ఖాతాకు స్కూల్ గ్రాంట్స్ ను విత్ డ్రా చేయుటకు…

ముందుగా కావాల్సిన వివరాలు:

PM Shri యాప్ లో మీ పాఠశాలకు 100% ఎస్టిమేషన్ వేసి ఉండాలి.

మీ స్కూల్ కి సంబంధించి https://pfms.nic.in/ పోర్టల్ నందు అడ్మిన్ లాగిన్, అప్రూవర్ లాగిన్, ఆపరేటర్ లాగిన్ మీ వద్ద ఉండాలి.

ఈ లాగిన్ లలో అడ్మిన్ లాగిన్ ను మీ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం మీకు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చినది. మీ అడ్మిన్ లాగిన్ నుండి మీ స్కూల్ అప్రూవర్ లాగిన్, ఆపరేటర్ లాగిన్ లను మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నారు. ఈ వివరాలు అనగా ఈ లాగిన్ల యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ లు మీ వద్ద ఉండాలి. Duniya360.com

గుర్తుంచుకొండి.

మీరు కొత్తగా 2023 బదిలీలలో వచ్చిన వారు అయితే, ఈ వివరాలను మీ పూర్వపు ప్రధానోపాధ్యాయుడి నుండి పొందండి.

అసలు ఏ విధంగా కూడా మీకు లాగిన్లు పొందే విధానం లేనప్పుడు, https://pfms.nic.in/SitePages/SearchAgency.aspx ఈ లింక్ లో ఏజెన్సీ నేమ్ వద్ద మీ పాఠశాల డైస్ కోడ్ ఇచ్చి సెర్చ్ చేయండి. వచ్చే రిజల్ట్ లో Unique Code XXXXXXX1324 అని ఉంటుంది. ముందు హైడ్ చేయబడిన లెటర్స్ ను మీ మండల ఆపరేటర్ ను లేదా మీ ప్రక్క పాఠశాల వారిని అడిగి తెలుసుకొండి. Duniya360.com

దీని ద్వారా అడ్మిన్ లాగిన్ పాస్వర్ రీసెట్ చేయవచ్చు. పాస్వర్డ్ రీసెట్ చేయడానికి, గత ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన మొబైల్ లేదా ఈ మెయిల్ కి OTP వెలుతుంది. దీని ద్వారా పాస్వర్డ్ రీసెట్ చేయవచ్కు.

అడ్మిన్ లాగిన్ రీసెట్ అయితే, అప్రూవర్ లాగిన్, ఆపరేటర్ లాగిన్ లను మనం తిరిగి పొందవచ్చు.

సమగ్ర శిక్ష వారు రిలీజ్ చేసిన అమౌంట్ మీ స్కూల్ PFMS Bank అకౌంట్ నందు రిఫ్లెక్ట్ అవ్వదు. కేవలం PFMS లాగిన్ నందు మాత్రమే చూపిస్తుంది. మీరు PPA బ్యాంక్ కు ఇచ్చాక్ మాత్రమే, మీ వ్యక్తిగత ఖాతాకు జమ అయ్యేటప్పుడు PFMS అకౌంట్ జమ అయినట్టు చూపించి, వెంటనే మీ వ్యక్తిగత ఖాతాకు (ఇవ్వబడిన వెండర్) కు జమ అవుతాయి.

ప్రాసెస్

మీ స్కూల్ కి సంబంధించి https://pfms.nic.in/ పోర్టల్ నందు అడ్మిన్ లాగిన్ పొందిన తర్వాత, మీ మొబైల్ నంబర్ అప్దేట్ చేయాలి. దీనికి గాను మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఈ అప్డేట్ ఎడిట్ రిక్వస్ట్ మీ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి వెళుతుంది. వారు 24 గంటలలో అప్రూవ్ చేస్తారు. అలా చేయకపోతే, వారిని సంప్రదించి మీరు అప్రూవ్ చేయించుకోవాలి. దీని కొరకు మీ మండల ఆపరేటర్ సహాయం తీసుకొండి.

ఇలా అడ్మిన్ లాగిన్ పొందిన అప్రూవ్ అయిన తర్వాత, మీ అడ్మిన్ లాగిన్ ద్వారా మీ పాఠశాల అప్రూవర్ లాగిన్, ఆపరేటర్ లాగిన్ లను తిరిగి పొందవచ్చు.

ఈ వివరాలు అన్నీ సిధ్దంగా ఉన్నవారు మాత్రమే, మీ పాఠశాల గ్రాంట్స్ మీ వ్యక్తిగత ఖాతా లేదా, మీరు ఎవరికి జమ చేయాలనుకుంటున్నారో వారి ఖాతాకు జమ చేసే ప్రక్రియ ప్రారంభించవచ్చు.

ఉదాహరణకు ప్రధానోపాధ్యాయుని వ్యక్తిగత ఖాతాకే జమ చేసుకోవాలనుకుంటే, మీరు కొత్తగా 2023 బదిలీలలో వచ్చిన వారు అయితే మీ వెండర్ కోడ్ ను మీ బ్యాంక్ అకౌంట్ తో సహా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొత్తగా యాడ్ చేస్తే, మీ బ్యాంక్ అకౌంట్ వాలిడేషన్ కి 24 గంటలు సమయం పడుతుంది. ఒకవేళ మీ అకౌంట్ ఇది వరకే అక్కడ వెండర్ గా యాడ్ అయ్యి ఉంటే కొత్తగా యాడ్ చేయాల్సిన పని లేదు.

అన్నీ సిద్ధం అయిన తర్వాత, ఆపరేటర్ లాగిన్ నుండి ఖర్చు అయినట్టుగా సబ్మిట్ చేసి, జమ చేయాల్సిన బ్యాంక్ అకౌంట్ (వెండర్) ఇచ్చి సబ్మిట్ చేస్తాం. తదుపరి అప్రూవర్ లాగిన్ నుండి అప్రూవ్ చేసిన తర్వాత 3 పేజీల PDF PPA జనరేట్ అవుతుంది.

ఇలా జనరేట్ అయిన 3 పేజీల PDF PPA ని 2 సెట్ల జిరాక్స్ తీసుకుని, ప్రతి పేజీ మీద ప్రధానోపాధ్యాయుడు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సంతకాలు చేసి, మీ పాఠశాల PFMS అకౌంట్ ఉన్న యూనియన్ బ్యాంక్ లో ఇచ్చినట్లయితే వారు ఒక సెట్ ను రిసీవ్డ్ కాపీ గా సంతకం చేసి మీకు వెనుకకు ఇచ్చి, ఒక కాపీ వారి వద్ద ఉంచుకుంటారు. ఇలా మీరు బ్యాంక్ కి PPA ఇచ్చిన 24-48 గంటలలో మీరు సూచించిన ఖాతాకు సొమ్ము జమ అవుతుంది.

ముఖ్య గమనిక:

ఈ ప్రాసెస్ ఏ పాఠశాలకు వారు చేసుకోవాలి, లేదా మీకు తెలిసి యాక్టివ్ గా ఉండే టీచర్స్ చేస్తారు, లేదా కొన్ని చోట్ల ఎంతో కొంత సొమ్ము తీసుకుని చేసే వారు ఉంటారు. వారి చేత చేయించుకొండి.

ఈ ప్రాసెస్ నేను చేయడానికి రూ.500/- తీసుకుంటాను. కావున పై సమాచారం అంతా చదివి, కావాల్సిన వారు మాత్రమే నా నంబర్ 9493308090 కి కాల్ చేయండి. లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. పై సమాచారం చదవకుండా కాల్ చేసి నా సమయం వ్రుధా చేయకండి. మీ సమయం వ్రుధా చేసుకోకండి.

ఇది అధికారిక మైన వారి తరపున కాదు, ప్రాసెస్ తెలియని వారి రూ.500 తీసుకుని పని చేసిపెట్టే పద్ధతి. గమనించగలరు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this