Home Blog Page 405

అక్టోబర్ 6 నుండి జనవరి 3 వరకు ఉపాధ్యాయులకు నిషితా ట్రైనింగ్ NISHITHA TRAINING TO TEACHERS

    0

    RC.NO : ESE02-22/46/2020 – SCERT , Dt : 02.10.2020 ప్రకారం

    తేదీ. 06.10.2020 నుండి 03.01.2021 వరకు 1 నుండి 8 తరగతుల వరకు బోధించే అందరూ టీచర్లకు దీక్షా యాప్ ద్వారా నిషిత ట్రైనింగ్ అందరూ టీచర్లు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు, ఎస్.ఆర్.జీ  లిస్టు, డైలీ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోండి.

    4 నుంచి ఆన్‌లైన్‌లో అంతరిక్ష వారోత్సవాలు WORLD SPACE WEEK 2020

    0

    Dear sir /madam, 
    Please find enclosed the brochure for World Space Week Celebrations -2020 by Satish Dhawan Space Centre SHAR, SRIHARIKOTA – ISRO from 04th – 10th October 2020 in online mode. Request you  to kindly share the message among your student community and ensure maximum participation for the event.
    For registration pls visit our website :
    https://wsw.shar.gov.in 
    Regards,
    Publicity & Outreach team
    WSW-2020, SDSC SHAR SRIHARIKOTA

    ❇️భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ వేదికగా ఈనెల నాలుగో తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహించనున్నట్లు షార్‌ యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వివిధ పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

    ❇️తొలి రోజు ప్రారంభ కార్యక్రమం

    ❇️5న ఉదయం శాస్త్రవేత్తల ఉపన్యాసాలు, మధ్యాహ్నం 3-8వ తరగతి విద్యార్థులకు పెయింటింగ్‌ పోటీలు

     ❇️6న ఉదయం ఉపన్యాసాలు, మధ్యాహ్నం 5-12వ తరగతి విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

     ❇️7న ఉదయం ఉపన్యాసాలు, మధ్యాహ్నం 8-12వ తరగతి విద్యార్థులకు ఉపన్యాస పోటీలు

    ❇️ 8న ఉదయం శాస్త్రవేత్తల ఉపన్యాసాలు, మధ్యాహ్నం 8- 12వ తరగతి విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. 

    ❇️9న ఉదయం శాస్త్రవేత్తల ఉపన్యాసాలు ఉంటాయి. 

    ❇️10న ముగింపు కార్యక్రమం ఉంటుందని ప్రకటనలో తెలిపింది. 

    ❇️వివరాలకు https://wsw.shar.gov.in/ లో సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

    ఈ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఏకంగా 14 రోజులు బంద్! BANK HOLIDAYS IN OCTOBER 2020

    0

    బ్యాంక్ సెలవులు, అక్టోబర్‌లో మొత్తం రెండు, వారాలు బంద్, తెలుగు రాష్ట్రాల్లో కూడా సెలవులు

    మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్‌లకు సెలవులు ఉంటాయి. రెండు, నాలుగు శనివారాలు కాకుండా ఆది వారం రోజు బయాంకులు పనిచేయవు. ఇవేకాకుండా బ్యాంకు ఉద్యోగులకు మరి కొన్ని సెలవులు కూడా ఉంటాయి. అందువల్ల బ్యాంకులో పని ఉండే వారు బ్యాంక్‌కు ఎప్పుడు సెలవులు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది.
    ఆర్‌బీఐ బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవో ముందుగానే తెలియజేసింది. అక్టోబర్ నెలలో కూడా బ్యాంకులకు కొన్ని సెలవులు ఉన్నాయి. అందువల్ల మీరు మీ బ్యాంక్‌కు ఎప్పుడు సెలవులు ఉన్నాయో ముందే తెలుసుకొని వాటికి అనుగుణంగా మీ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎప్పుడు పనిచేయవో ఇప్పుడు తెలుసుకుందాం.
    [post_ads]

    • అక్టోబర్ 2 శుక్రవారం గాంధీ జయంతి

    • అక్టోబర్ 4 ఆదివారం

    • అక్టోబర్ 8 గురువారం చెల్లమ్ రీజినల్ హాలిడే

    • అక్టోబర్ 10 రెండో శనివారం

    • అక్టోబర్ 11 ఆదివారం

    • అక్టోబర్ 17 శనివారం కత్తి బిహు (అస్సాం)

    • అక్టోబర్ 18 ఆదివారం

    • అక్టోబర్ 23 శుక్రవారం మహా సప్తమి

    • అక్టోబర్ 24 శనివారం మహా సప్తమి

    • అక్టోబర్ 25 ఆదివారం

    • అక్టోబర్ 26 సోమవారం విజయ దశమి

    • అక్టోబర్ 29 గురువారం మిలద్ ఇ షరిఫ్

    • అక్టోబర్ 30 శుక్రవారం ఈద్ ఇ మిలద్

    • అక్టోబర్ 31 శనివారం మహర్షి వాల్మికి, సర్దార్ పటేల్ జయంతి

    అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 26 దసరా, అక్టోబర్ 30న ఈద్ ఇ మిలాద్ సందర్భంగా బ్యాంకులు పని చేయవు. తెలంగాణాలో కూడా ఇవే సెలవులు వర్తిస్తాయి. అయితే అక్టోబర్ 27న శనివారం బతుకమ్మ తొలి రోజు సందర్భంగా బ్యాంకులు పని చేయవు.
    అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. ఏదేమైనా ఎప్పుడైనా బ్యాంక్ సెల‌వు ఉంటే.. అప్పుడు ఆయా రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.

    మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కమీషనర్ వారి సందేశం C&DSE MESSAGE ON GANDHI JAYANTHI

    0

     మహాత్ముడు పుట్టి నూటయాభయ్యేళ్ళయ్యింది. ఆయన తన జీవితకాలంలో వివిధ రంగాల్లో చేపట్టిన కృషి గురించీ, ఆయన నిర్యాణం తరువాత కూడా ప్రపంచం మీద చూపిస్తో వస్తున్న ప్రభావం గురించీ , నానాటికీ పెరుగుతున్న ఆయన ప్రాసంగికత గురించీ ఎంతయినా స్మరించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు.

    కాని నా దృష్టిలో గాంధీజీ ప్రధానంగా కవి. ఆయనలోని సత్యాన్వేషకుడు, సత్యసాధకుడు కూడా ఆయన వాక్యాల్లోని సరళ సౌందర్యం వల్లా, అపారమైన నిజాయితీ వల్లా, అచంచల ఆత్మవిశ్వాసంవల్లా మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంటారు. గాంధీగారి లాగా ఒక వాక్యం రాయాలని నా చిన్నప్పుడు నాకు చాలా కోరికగా ఉండేది. కాని, గాంధీగారి లాగా జీవిస్తే తప్ప గాంధీగారిలాగా రాయడం సాధ్యం కాదని నెమ్మది మీద అర్థమయింది.

    ప్రాతఃస్మరణీయులైన భారతీయ భక్తి కవుల కోవలో గాంధీజి ఇరవయ్యవ శతాబ్దపు భక్తి కవి.

    ఒకప్పుడు ఆయన 1930 లో యరవాడ జైల్లో నిర్బంధంలో ఉన్నప్పుడు, భారతీయ భక్తి కవిత్వం నుంచి కొన్ని శ్లోకాల్నీ, గీతాల్నీ ఎంపిక చేసి మీరబెన్ కోసం ఇంగ్లీషులోకి అనువదించారు. వాటిని జాన్ ఎస్ హోలాండ్ అనే ఆయన Songs from Prison అనే పేరిట ప్రచురించారు. 1934 లో మాక్మిలన్ కంపెనీ ప్రచురించిన ఆ పుస్తకం కోసం ఎన్నాళ్ళుగానో వెతుకుతూ ఉన్నాను. ఇప్పుడది ఆర్కైవ్ లో దొరికింది.

    https://archive.org/details/songsfromprison00mkga

    [post_ads]

    ఆ పుస్తకంలో హోలాండ్ చేసిందల్లా రవీంద్రుడి గీతాంజలి ఇంగ్లీషు అనువాదంలోలాగా భగవంతుడి నామవాచకాల్ని సర్వనామాలుగా మార్చడం, చలం వచనాన్ని వజీర్ రహ్మాన్ కవిత్వంగా అమర్చినట్టు, కవిత్వపంక్తులుగా అమర్చి పెట్టడం. కాని, ఆ ఇంగ్లీషూ, ఆ క్లుప్తతా, ఆ సాంద్రతా, ఆ సూటిదనం, ఆ నైర్మల్యం పూర్తిగా గాంధీజీవి.

    నాలుగైదు కవితలు ఇక్కడ మీకోసం, తెలుగులో కాదు, గాంధీగారి ఇంగ్లీషులోనే.

    1.Know him who only knows what Love is;
    Know him, and love him, with heart of hearts
    Him worship, him adore:
    So only, foolish one,
    Shalt thou be worthy of thy mother’s sacrifice
    In buying life for thee with agony.

    -Tulasidas

    2.Friend, know this,
    That love brings arduous watching, hardship and sorrow;
    Yet, if thou hast tasted love,
    All things are thine:
    This, only this, remember,
    Love may not be hoarded up,
    Love thou must hand on.

    -Kabir

    3. Here is the burden of all my song:
    He has utterly lived in vain
    On whose lips lives not
    God’s name.

    -Kabir

    4. My Lord is a little child:
    All that I had in life
    I have given for him:
    Some say I have paid too dearly,
    Some say he is cheaply so gained,
    But I- I have weighed the price, and the gain
    And I know-ah I know.
    Some say he is far to seek,
    Some say he is close in thy home,
    But I – I have found him,
    And a little child is he, in the cradle of love.

    -Mirabai

    5. God’s truest saint is he,
    Who holds other’s woe to be his own:
    No pride has he,
    He speaks ill of none,
    He holds all alike in honour:
    He rules well his speech,
    His passions, his thoughts:
    Always he speaks truth,
    He lays not his hands on other men’s possessions:
    Pure is he, and chaste,
    No self-delusion bandages his eyes,
    His mind is drawn away from earthly things,
    No lusts, no ill desires sear his soul:
    He loves well the name of God,
    He knows well that God’s most sacred shrine
    Is man’s own body:
    Generous he is , and free from cunning,
    He yields not to anger:
    One such man
    Brings by his presence purity Toall around.

    -Narsi Mehata

    – Collected from FB wall of Sri V.China Veerabhadrudu, IAS C&DSE 

    తెలుగు రాష్ట్రాలకు మరో వాన గండం పొంచి ఉంది CYCLONE ALERT TO TELUGU STATES

      0

       తెలుగు రాష్ట్రాలకు మరో వాన గండం పొంచి ఉంది. బంగాళఖాతంలో మరో అల్పపీడనం
      ఏర్పడింది

      దీని ప్రభావంతో రాగల రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని
      హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌,
      దక్షిణ ఒడిసా తీరం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
      ప్రభావంతో గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి
      అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ
      కేంద్రం ప్రకటించింది.

       దీని ప్రభావంతో రాగల రెండు రోజులు శుక్ర,
      శనివారాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి
      వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు,
      లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

      నాడు-నేడు పాఠశాలలకు రంగులు వేసే ప్రక్రియకు సంబంధించి జారీచేసిన మార్గదర్శకాలు NADU NEDU PAINTING INSTRUCTIONS

        0

         ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ మరియు అడ్వైజర్ ఇన్ఫ్రా వారు మనబడి నాడు-నేడు పాఠశాలలకు రంగులు వేసే ప్రక్రియకు సంబంధించి, 30-09-2020 న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జారీచేసిన మార్గదర్శకాలు

        1)ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలల్లోని గోడలకు ప్లాస్టరింగ్ అయిన 21 రోజులకు సదరు గోడలకు రంగులు వేయుటకు HM APP లో ఖచ్చితంగా సంసిద్ధతను తెలపాలి.

        బాధ్యులు: ప్రధానోపాధ్యాయులు 

        2)  పాఠశాల ప్రధానోపాధ్యాయునికి బెర్జర్ కంపెనీ ప్రతినిధి ఫోన్ చేయగానే వారి సంసిద్ధత సమాచారాన్ని తెలియజేయాలి.

        బాధ్యులు: ప్రధానోపాధ్యాయులు

        3) పైంటింగ్ సామగ్రి, రసీదు మరియు డెలివరీ చలానాను బెర్జర్ కంపెనీవారు ప్రధానోపాధ్యాయునికి అందజేసిన వెంటనే వచ్చిన సామగ్రి ని క్షుణ్ణంగా పరిశీలించుకొని స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేసి తక్షణమే సదరు చలనా మరియు రసీదులను HM APP లో నమోదు చేయాలి.

        బాధ్యులు: ప్రధానోపాధ్యాయులు

        4) బెర్జర్ కంపెనీవారు పాఠశాలకు వచ్చి కొలతలు తీసుకునే సమయంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పిసి సభ్యులలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండి తీరాలి.

        ఏ రోజు వచ్చారు, ఎంత మంది వచ్చారు.. ఎంత సేపు కొలతలు తీశారు మొదలగు విషయాలు సంబంధిత ఫొటోలు అన్నీ ఫైల్ చేయాలి.

        బాధ్యులు:  ప్రధానోపాధ్యాయులు మరియు పిసి సభ్యులలో ఒకరు

        5) బెర్జర్ కంపెనీ నుంచి వచ్చిన పైంటింగ్ మెటీరియల్ను పాఠశాలలో సురక్షితమైన గదిలో తాళాలు వేసి జాగ్రత్తగా భద్రపరచాలి.

        బాధ్యులు: ప్రధానోపాధ్యాయులు

        6)  అవసరమైతే ఒక మండలం మొత్తం నాడు-నేడు పాఠశాలల పైంటింగ్ మెటీరియల్ను మండల కేంద్రంలోని ఒక పెద్ద పాఠశాలలో సురక్షితమైన గదుల్లో తాళాలు వేసి జాగ్రత్తగా భద్రపరచాలి.

        బాధ్యులు : మండల విద్యాశాఖాధికారి

        7) ఉపరితలాల పరిశుభ్రం…… 

        లోపల  ఉపరితలాలను చేతితో పెట్టుకునే విద్యుత్ మరియు  వ్యాక్యుమైజడ్ మిషన్ తో నునుపు చేయాలి.

        వెలుపల ఉపరితలాలను జెట్ వాషింగ్ మిషన్/ హ్యాండ్ స్కేరేపింగ్/ వైర్ బ్రష్ లతో ఎక్కడ ఏ పరికరం అవసరం అయితే దానితో నునుపు చేయాలి. 

        గోడల మీద ఐదు మిల్లీమీటర్ల మందం ఉన్న ప్రతీ బీటను బెర్జర్ పుట్టీ పేస్ట్ తో పూరించాలి. 

        పాఠశాలలోని  గోడలకు వెలుపల మరియు బయట వేసే రంగులన్నీ ఆటో రోలర్ కమ్ స్ప్రేయింగ్ మిషన్ తోను మరియు హ్యాండ్ రోలర్ మరియు బ్రష్ లతోనూ వేయాలి. 

         బాధ్యులు: బెర్జర్ కంపెనీ ప్రతినిధులు 

        8) రంగులు వేసే ప్రక్రియ పూర్తి అయ్యాక అన్నీ జాగ్రత్తగా పరిశీలించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వర్క్ కంప్లీషన్ షీట్ మీద సంతకం చేసి అదే కాపీని HM APP లో నమోదు చేయాలి.

        బాధ్యులు: ప్రధానోపాధ్యాయులు.

        9) బెర్జర్ కంపెనీవారు మెజర్మెంట్ షీట్ తో ఇన్వాయిస్ సమర్పిస్తారు. వారికి  ప్రారంభంలో ఉన్న తలుపులు మరియు కిటీకీల మినహాయింపులకు స్పెసిఫీకేషన్స్ అందజేయబడతాయి.

        10) ప్రధానోపాధ్యాయులు బెర్జర్ పైంటింగ్స్ ఇన్వాయిస్ షీట్ న APP లో నమోదుచేసి, ఆ మెజర్మెంట్ షీట్ ను ఫీల్డ్ ఇంజినీర్ కు సమర్పించాలి. 

        సదరు ఫీల్డ్ ఇంజినీర్ తదుపరి అనుమతి కొరకు వారం రోజులలోపు తన పోర్టల్లో అప్లోడ్ చేయాలి.

        11) నాడు-నేడు పోర్టల్లో నమోదైన క్వాంటిటీతో సంబంధంలేకుండా అనగా ఇండెంట్ డబ్బులు అవేవాటితో సంబంధం లేకుండా మొత్తం పాఠశాలకు అంతా రంగులు వేయాలి.

        బాధ్యులు : బెర్జర్ కంపెనీవారు

        12) రంగులు వేసే సమయంలో తరగతి గదులన్నీ, ప్రాథమిక పాఠశాలలకైతే  ఏడు రోజుల వరకు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకైతే పదిహేను రోజులు ఖాళీ చేసి ఉంచాలి

        బాధ్యులు : ప్రధానోపాధ్యాయులు 

        13) ప్రధానోపాధ్యాయులు బెర్జర్ పైంటింగ్స్ ఇన్వాయిస్ షీట్ ను ఆప్ లో నమోదుచేసి, ఆ మెజర్మెంట్ షీట్ ను ఫీల్డ్ ఇంజినీర్ కు సమర్పించాలి. సదరు ఫీల్డ్ ఇంజినీర్ తదుపరి అనుమతి కొరకు వారం రోజులలోపు తన పోర్టల్లో అప్లోడ్ చేయాలి.

        బాధ్యులు: ఫీల్డ్ ఇంజినీర్

        14) నాడు-నేడు పోర్టల్లో నమోదైన క్వాంటిటీతో సంబంధంలేకుండా అనగా ఇండెంట్ డబ్బులు అవేవాటితో సంబంధం లేకుండా మొత్తం పాఠశాలకు అంతా రంగులు వేయాలి.

        15)  రంగులు వేసే సమయంలో తరగతి గదులన్నీ, ప్రాథమిక పాఠశాలలకైతే  ఏడు రోజుల వరకు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకైతే పదిహేను రోజులు ఖాళీ చేసి ఉంచాలి

        బాధ్యులు : పాఠశాల ప్రధానోపాధ్యాయులు

        16) చిత్రాలు వేయడానికి కొలతలు తీసుకునే విధానం…. 

         ముగ్గులకు 100 శాతం ప్రదేశాన్ని (పొడవు × వెడల్పు /ఎత్తు) లెక్కించాలి.

         బయటవేసే చిత్రాలు అరవై శాతం జాగాలోను…

         లోపల వేసే చిత్రాలు నలభై శాతం జాగాలోను వేయాలి.

        కొన్ని చోట్ల వేసే ముఖ్యమైన పైంటింగ్స్ కు 100%  జాగాను లెక్కించాలి. 

        17) బయటవైపు ప్రహరీ గోడలపై  స్టెన్సిల్స్ తో వేసే రంగులన్నీ  రహదారి పై నుంచి మరియు భవనాల పై నుంచి కనబడే విధంగాను ప్రహారీగోడల లోపల వేసే రంగులన్నీ గేటు వద్ద నుంచి కనబడేలా వేయాలి.

         బాధ్యులు : బెర్జర్ పైంటింగ్స్ ప్రతినిధులు

        18) మనబడి నాడు-నేడు పాఠశాలల్లో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్లు ఎవరైనా చిత్రాలను వేయదలచుకుంటే వారికి బెర్జర్ కంపెనీవారు పైంటింగ్ మెటీరియల్ ఇస్తారు మరియు ఆర్ట్ వేసిన ప్రదేశాన్ని లెక్కగట్టి సదరు ఇన్వాయిస్ ను అప్లోడ్ చేస్తారు.

        19)పైంటింగ్ పని పూర్తి అయ్యాక ఖాళీ  పైంట్ డబ్బాలను పాఠశాలలోనే పొందుపరచాలి… అదనంగా ఉంటే కేవలం పదిశాతం సామగ్రిని మాత్రమే కంపెనీ వారు వారితో తీసుకు వెళ్ళాలి.

        ఎస్.బి.ఐ సాలరీ అకౌంట్ కలిగి ఉండే సదుపాయాలు SBI SGSP ACCOUNT BENEFITS REVISED

        0

         ఎస్.బి.ఐ లో మనం ఎస్.జీ.ఎస్.పి (స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్) అకౌంట్ కలిగి ఉంటే

        బ్యాంక్ వారు అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇటీవల ఈ ప్రయోజనాలు మరింత మెరుగు పరిచి అదనపు ప్రయోజనాలు ఈ ప్యాకేజీ క్రిందకు చేర్చారు. ఈ క్రింది ఫైల్ ను డౌన్లోడ్ చేసుకుని మొత్తం ప్రయోజనాలు తెలుసుకోండి.

        డౌన్లోడ్

        [post_ads]

        జగననన్న విద్యా కానుక లో భాగంగా విద్యార్ధు లకు ఇవ్వవలసిన వస్తువులు పంపిణీ చేసే విధానం JVK KIT DISTRIBUTION PROCESS

        0

         జగనన్న విద్యా కానుక లో భాగంగా విద్యార్ధు లకు ఇవ్వవలసిన  వస్తువులు

        1. స్కూల్ బ్యాగ్

        2. యూనిఫాం

        3. బూట్లు , సాక్సులు

        4. బెల్ట్

        5. నోట్ బుక్స్

        6. టెక్స్ట్ బుక్స్

        7. మాస్క్స్

        పై వస్తువులు ఎలా పంపిణీ చేయాలి అనే పూర్తి వివరణ ఐటమ్ వారీగా ఈ క్రింది పి.డి.ఎఫ్ ఫైల్ నందు కలదు. ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

        డౌన్లోడ్

        [post_ads]

        స్కూళ్ల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్ CLARITY ON SCHOOLS RE OPEN

        0

        ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్ల ప్రారంభంపై మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు. అక్టోబర్‌ 15 నుంచి 9పైబడిన తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. నవంబర్‌ 2 నుంచి అన్ని తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే అక్టోబర్‌ 5వ తేదీనే జగనన్న విద్యాకానుక ఇవ్వనున్నట్లు తెలిపారు.

        వాహనదారులకు అలెర్ట్, అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ ALERT TO VEHICLE HOLDERS NEW RULES FROM OCTOBER 1ST

        0

         అక్టోబర్ 1 నుంచి వాహనాలకు సంబంధించిన నిబంధనలల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి పలు మార్పులను చేసింది. 

         అక్టోబర్ 1 నుంచి వాహనాలకు సంబంధించిన నిబంధనలల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి పలు మార్పులను చేసింది. ఈ నేపథ్యంలో మీరు డ్రైవింగ్ లైసెన్సులను  అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ వాహనానికి  ఆర్సీ బుక్ ఉన్నప్పటికీ, అలాగే  డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్స్ లో ఉన్నప్పటికీ అప్డేట్ చేస్తూ ఉండాలి.అక్టోబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా యూనిఫాం వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయబడతాయి. కొత్తగా జారీ చేయబడి డ్రైవింగ్ లైసెన్సులు మైక్రోచిప్ కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ విధంగా సెంట్రలైజ్ చేసిన డేటా పదేళ్ల వరకు గవర్నమెంట్ వద్ద ఉంటుంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తులకు ఫైన్లు వేయడం, రికార్డులను నిర్వహించడం ప్రభుత్వానికి ఈజీ అవుతుంది. ఇక ఆర్సీల విషయానికొస్తే.. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రక్రియను పేపర్ ఉపయోగించకుండా చేయాలని నిర్ణయించుకుంది. కొత్త ఆర్సీకి  ఓనర్ పేరు ముందు భాగంలో ఉంటుంది. వెనుకభాగంలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉంటాయి.అంతేగాక, అక్టోబర్ 1 నుంచి పెట్రోల్ పంపుల వద్ద క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా లభించే డిస్కౌంట్లు ఇక ఉండవు.  డిజిటల్ పేమెంట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు చమురురంగ కంపెనీలు క్రెడిట్/డెబిట్ కార్డ్స్, ఈ-వ్యాలెట్స్ పైన ఇప్పటివరకు డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి నో డిస్కౌంట్స్.