Home Blog Page 404

మళ్లీ నమోదు చేసుకుంటేనే..ఓటు REGISTER FOR MLC VOTE

0

 తాజా ఓటరు జాబితాతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

గతంలో ఓటరుగా నమోదైన వారి ఓట్లన్నీ రద్దు

ఆన్‌లైన్లో ఫారం-19 ద్వారా ఓటరుగా నమోదు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటర్ జాబితానే ఎన్నికల సంఘం వినియోగించనుంది. 

గతంలో ఓటుహక్కు పొంది ఉన్నా సరే వారు మళ్లీ కొత్తగా ఓటరు జాబితాలో పేరు చేర్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. లేకుంటే వారికి ఓటు హక్కు ఉండదు.

అర్హులైన ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం ఫారం-19లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఈవో ఆంధ్ర.ఎన్ ఐసీ.ఇన్ వెబ్ సైట్లో ఇప్పటికే ఓటరు నమోదు కోసం ఉపాధ్యాయులకు అవకాశం కల్పించారు. 

 ఆన్లైన్ లో రిజిస్టర్ అయ్యేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

[post_ads]

ఈ నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

2015లో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు రెండు జిల్లాల నుంచి మొత్తం 18,931 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. 

అయితే ఆ ఎన్నికల్లో మూడువేల మంది వరకు ఓటుహక్కుని వినియోగించుకోలేకపొయారు. ఈ దఫా కూడా ఇంచుమించుగా అంతే సంఖ్యలో ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఉపాధ్యాయ స్కూల్ అసింట్ అంతకంటే ఎక్కువ ర్యాంకు కలిగిన వారికే ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉన్నది.

జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు అర్హత ఉంటుంది.

ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ సీనియారిటీ కలిగిన ఉపాధ్యాయులకు కూడా ఓటుహక్కు పొందవచ్చు. అయితే దీనిపై తగిన అవగాహన లేకపోవడంతో గత ఎన్నికల్లో చాలామంది ఓటుహక్కు పొందలేకపోయారు.

ఓటరుగా నమోదు చేసుకొనేందుకు నెలరోజుల గడువు ఉన్నందున ప్రభుత్వ విద్యాసంస్థలు, గవర్నమెంట్ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో కంటే గుర్తింపు పొందిన వాటిల్లో ఎక్కువమంది ఉన్నారు. అయితే వారు అందుకు తగిన ఆధారాలను నివేదించాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఓటుహక్కు పొందలేకపోతున్నస్కూల్ అసిస్టెంట్ కంటే తక్కువ ర్యాంకు ఉపాధ్యాయులు తమకు కూడా ఈ దఫా ఓటుహక్కు కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వారు విజ్ఞప్తులు పంపుతున్నారు.

అన్లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన ఏ.పి ప్రభుత్వం UNLOCK 5.0 GUIDLINES RELEASED BY GOVT OF AP

    0

    HM&FW Department

    Containment, Control and Prevention of COVID – 19 – The Epidemic Disease Act, 1897- Disaster Management Act, 2005 –“Unlock 5.0” Guidelines for Phased Reopening in the State of Andhra Pradesh – Orders-Issued.

    Download Orders

    [post_ads]

    అక్టోబర్ 8న “జగనన్న విద్యాకానుక” JAGANANNA VIDYAA KANUKA ON OCTOBER 8TH

    0

    సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి

    ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్న విద్యాకానుక” కార్యక్రమాన్ని అక్టోబర్ 8న (గురువారం) ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో సెక్రెటరీ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

    ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థినీ, విద్యార్ధులకు  దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లు పంపిణి చేస్తారని వెల్లడించారు.

     ప్రభుత్వ యాజమాన్యం లోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యారినీ, విద్యార్థులందరికీ స్టూడెంట్  కిట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. 

    ప్రతి స్టూడెంట్ కిట్ లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్ బ్యాగ్ ఉంటాయని తెలిపారు. 

    బడిబయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, తద్వారా పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెంచడంతో పాటు అభ్యసనా కార్యక్రమంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే 

    ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో సెక్రెటరీ శ్రీ విజయకుమార్ రెడ్డి తెలిపారు.

    జారీ చేసినవారు: సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, విజయవాడ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    నిశితా శిక్షణ అవగాహన UNDERSTAND NISHITHA TRAINING

      0

      నిశితా శిక్షణ అవగాహన కొరకు

      • 06.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే  ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి
      • దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష app డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్  (platform) కలిగి ఉండాలి
      • యూజర్నేమ్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకొండి. వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి
      • ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది
      • మొత్తం 18*5=90 రోజుల కార్యక్రమం ఉంటుంది
      • ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 10 వరకు
      • రెండవది 11 నుండి 15 వరకు
      • ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది
      • ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo  జరుగుతుంది.

      ఈ 5 రోజులలో

      • మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం
      • రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది. మీ సందేహాలను విషయ నిపుణుల ను అడగవచ్చు
      • మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం
      • నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.
      • ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.

      దీక్షా యాప్ నందు ఎప్పటికప్పుడు  మాడ్యూల్ నందు మీ యొక్క ప్రోగ్రెస్ శాతం ను గమనించుకోవచ్చు

      ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.

      ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.

      వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.

      శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.

      ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO’S,  డైట్ అధ్యాపకులు,  యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.

      ఏపీ స్కూల్ రెగ్యులేటరీ మిషన్ తనిఖీలు APSERMS VISITS TO SCHOOLS TO VERIFY UDISE DATA

        0

        ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ & మానిటరింగ్ కమిషన్ APSERMC  ఛైర్ పర్సన్ జస్టిస్ శ్రీ ఆర్. కాంతారావు గారి ఉత్తర్వుల సారాంశం

        [post_ads]

        👉 రాష్ట్రంలో మొత్తం 62413 పాఠశాలలుండగా , అందులో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య  44778 , ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 15044 , ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య  2591.

        👉 UDISE డేటా మూల్యాంకనం చేయుటకు రాష్ట్రంలో  పాఠశాల విద్యా శాఖ తరపున 4 గురు RJD SE లు  , 13 మంది DEO లు , 66 మంది DyEO లు , 666 మంది MEO లు కలరు. పై గణాంకాల ప్రకారం ప్రతి అధికారి సాలీనా/సగటున 83 పాఠశాలలు సందర్శన/తనిఖీ చేయవలసి ఉంటుంది.

        👉 APSERMC కి సంక్రమించిన అధికారాల మేరకు  మరియు DSE AP వారితో చర్చల అనంతరం, UDISE లో పొందుపరచబడిన ఉపాధ్యాయ సిబ్బంది యొక్క లభ్యత , మౌలిక సదుపాయాలు , ఇతర వివరాల నమోదును సరిచూడాలని/తనిఖీ చేయాలని  నిర్ణయించబడినది.

        👉 ది.05.10.2020 నుండి ది.17.10.2020 వరకు రెండు దశలలో 2591 ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలను, 15044 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలను  తనిఖీ చేయాలి  మరియు ది.17.10.2020 నుండి ది.31.10.2020 వరకు మూడవ దశలో భాగంగా 44778 ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేయవలసి ఉన్నది.

        👉 తనిఖీ  చేయు బృందాలు

        హైస్కూల్ : గ్రేడ్ 2 HM (1), SGT(1) , గ్రామ/వార్డ్ సంక్షేమ సహాయకులు(1) , గ్రామ/వార్డ్ ఇంజనీరింగ్ సహాయకులు(1)

        ప్రైమరీ స్కూల్ : గ్రేడ్ 2 HM లేదా SA (1) , గ్రామ/వార్డ్ సంక్షేమ సహాయకులు(1) , గ్రామ/వార్డ్ ఇంజనీరింగ్ సహాయకులు(1)

        👉 ఈ బృందాలకు తాము పనిచేయు మండలాలలో తనిఖీ  బాధ్యతలు కేటాయించరాదు.

        👉 డా శ్రీమతి ఏ. విజయ శారదా రెడ్డి , వైస్ ఛైర్ పర్సన్ , APSERMC మరియు ఇతర APSERMC సభ్యులు సదరు తనిఖీని పర్యవేక్షణ చేస్తారు.

        👉 కావున తనిఖీ చేయు క్షేత్రస్థాయి అధికారులకు/సిబ్బందికి  పై సూచనలు పాటించేలా తగు మార్గదర్శనం చేయవలసిందిగా అందరు RJD SE లను , DEO లను , APC SS లను కోరుతూ APSERMC ఛైర్ పర్సన్ జస్టిస్ శ్రీ ఆర్. కాంతారావు  ఉత్తర్వులు జారీచేశారు.

        జగనన్న విద్యా కానుక పంపిణీ వాయిదా. మరి ఎప్పుడు ఉండొచ్చు ? JVK KIT DISTRIBUTION POSTPONED

        0

        Dear all RJDs/DEOs,

        Please make note that the scheduled launch of JAGANANNA VIDYA KANUKA on 5/10/2020 is post poned.Please inform the same to all Dy.E.Os/M.EOs/and HMs.

        Further date will be informed very soon.

        Regards – IT CELL

        రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాలవల్ల 5వ తేదీ నుండి  పోస్ట్ పోన్ చేయబడినది.
        తరువాత  రెండు మూడు రోజుల్లో  నిర్వహించబడును.
        కాబట్టి మండల విద్యాశాఖ అధికారులు స్టాక్  పాయింట్ నందు ఉన్న జగనన్న కానుకలను ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయవలెను.
        అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేసుకొనవలెను.
         మరియు బయోమెట్రిక్ డివైస్, ఐరిష్ డివైజ్ లను చార్జింగ్ చేసి జగనన్న విద్యా కానుక app డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండవలెను అని జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనంతపురము వారు తెలియజేస్తున్నారు
        ఇట్లు
        సీఎం ఓ విభాగము 
        ఏపీ సమగ్ర శిక్ష

        జగనన్న విద్యా కానుక ఆప్ యూజర్ మాన్యువల్, ఆప్ లింక్ మరియు ముఖ్యాంశాలు JVK USER MANUAL APP AND KEY POINTS

          0

          జగనన్న విద్యా కానుక యూజర్ మాన్యువల్

          డౌన్లోడ్

          [post_ads]

          డౌన్లోడ్ ఆప్ ప్లే స్టోర్ లింక్

          ఈ రోజు 02.10.2020  JVK పై జరిగిన webex meeting వివరాలు.

          1. ఒక పాఠశాలకు సంబంధించి ఒకరోజులో 50 కిట్లు మాత్రమే ఇవ్వాలి. అంతకు మించి ఇవ్వడానికి JVK app accept చేయదు. కాబట్టి Headmaster ఎలా పంపిణీ చేయాలో plan చేసుకోవాలి.

          2. JVK kit విద్యార్థి తల్లికిమాత్రమే /అమ్మఒడి data లో విద్యార్థి తల్లి ఉంటే తల్లి కి లేదా guardian enter అయి ఉంటే guardian authenticate చేయాలి. biometric finger print or iris authentication వేసిన తర్వాతనే ఇవ్వాలి. Biometric authenticate చేయకుండా kits పంపిణీ చేయరాదు .

          3. Student కు ఎవరు mother / father / guardian  link అయి  ఉన్నారో app లోని reports లో చూడవచ్చు. వారి adhar number చివరి 4 digits చూడవచ్చు.

          4. App ను play store నుండి download చేసుకోవచ్చు.

          5. App లో ID అనగా School Child Info ID 

          Password child info password గా ఉంటుంది . 

          6. జిల్లా లోని ఏ పాఠశాల finger print device/ iris device నుఏ పాఠశాలకైనా వాడవచ్చు. ఏ పాఠశాల కొరకు వాడదలిచారో ఆ పాఠశాల యొక్క  child info ID & password enter చేయవలసి ఉంటుంది. 

          7. పాఠశాలను ఖచ్చితంగా సానిటైజ్ చేయాలి. 

          7. Parents ఖచ్చితంగా mask ధరించాలి  & సామాజిక దూరం పాటించాలి. 

          8. సాధ్యమైనంతవరకు Iris device Biometric authentication కొరకు వాడాలి. Finger print device వాడవలసి వస్తే ప్రతి parent authentication వేసిన తరువాత device ను sanitiser తో tissue paper సహాయంతో clean చేసిన తరువాతే ఇంకొక parent తో authenticate చేయించాలి. కోవిడ్ నిభందనలన్నీ తప్పనిసరి గా పాటించాలి.

          9. Devices లేని APREIS , Aided school ల principals పక్క స్కూల్ govt / mpp/ zp/ Munciple/ kgbv / Apms  school ల devices ను ఉపయోగించుకోవాలి.

          [post_ads]

          జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు:

          1.ఈ యాప్ ఈ రోజు (02.10.2020) రాత్రి 12 గంటల నుంచి ప్లే స్టోర్లో అందుబాటులో ఉండ బడును.

          2. ఈ యాప్ ఐరిస్ డివైస్ మరియు ఫింగర్ ప్రింట్  డివైస్ వేరువేరుగా ఇవ్వబడును.

          3. యూజర్ మాన్యువల్ చెప్పిన విధంగా పాఠశాల యు యుడేస్ ఆధారముగా లాగిన్ అవ్వ వలయును

          4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు.

          5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను

          6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను. 

          7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే  ఉపయోగించ వలెను.రమణ   ఇన్ఫో.

          8. ఈరోజు రాత్రికి అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును

          9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ  వచ్చును

          కావున పాఠశాల లోని పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము 

          10. ముఖ్యముగా 5వ తేదీ నాడు ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని లేదా అధికారులతో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఆ పాఠశాలలో ముందుగా డివైజ్ చేసుకోవలెను.రమణ   ఇన్ఫో.

          11. ఎక్కడైనా ఏ పాఠశాల నేనా కేవలం రోజుకి 50 మందికి మాత్రమే పంపిణీ చేయవలయును అంతకుమించి చేసిన తీసుకోకూడదు.

          పాఠశాలల పునఃప్రారంభం పై మార్గదర్శకాలు INSTRUCTIONS ON SCHOOLS REOPENING

            0

             పాఠశాలల పునః ప్రారంభం కి సంబంధించిన మార్గ దర్శకాలను డైరెక్టర్ శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు విడుదల చేశారు. ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి

            డౌన్లోడ్

            [post_ads]

            పై ఉత్తర్వులలోని ముఖ్యాంశాలు

            (Rc No.151/A&I/2020, Dt.02.10.2020)

            ” మనోదర్పణ్ ” కార్యక్రమం క్రింద ది.04.10.2020 నుండి ది.10.10.2020 వరకు విద్యార్థుల మానసిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ప్రతిరోజూ  క్రింది కార్యక్రమాలు నిర్వహించాలి

            👉 విద్యార్థులకు సంబంధించిన పలు  దైనందిన సంఘటనలను/పరిస్థితులను ఆధారంగా చేసుకొని కథల రూపంలో మానసిక ఆరోగ్యం పెంపొందించే అంశాలను హైలైట్ చేసి విద్యార్థులలో మానసిక స్థైర్యం పట్ల చైతన్యం కలిగించాలి
            👉 మనం విద్యార్థులకు చెప్పే కథలు, అడిగే ప్రశ్నలు రెండూ మిళితం చేసి వాటిని  ప్రచారం/వ్యాప్తి చేయాలి
            👉 మానసిక ఆరోగ్యం పెంపొందించే అంశాలపై పోస్టర్ లు & స్లోగన్ లు తయారుచేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలి
            👉 పైవన్నీ ఉపాధ్యాయులు whatsapp/phone calls/online/offline ల ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం చేయాలి
            👉 ప్రతి వారాంతపు రిపోర్ట్ ఉపాధ్యాయులు  యధావిధిగానే అప్ లోడ్ చేయాలి

            పాయింట్ వారీ గా తాజా ఉత్తర్వుల సారాంశం

            ★ భారత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో దశలవారీగా తెరవడానికి “అన్లాక్ 5.0” మార్గదర్శకాలను జారీ చేసిoది.
            ★ పాఠశాలలు మరియు కోచింగ్ సంస్థలను తిరిగి ప్రారంభించే ప్రక్రియ, 2020 అక్టోబర్ 15 తర్వాత గ్రేడెడ్ పద్ధతిలో నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు  సౌలభ్యం ఇవ్వబడింది.
            ★ ఇంతకుముందు జారీ చేసిన మార్గదర్శకాలు మరియు సూచనల ప్రకారం  ఆన్‌లైన్ అభ్యాసం మరియు బోధన కొనసాగించబడుతుంది మరియు ప్రోత్సహించబడుతుంది.
            ★ మొదటి తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు పిల్లలు ఇంటి నుండి మాత్రమే నేర్చుకోవడం కొనసాగుతుంది మరియు విద్యా వరది మరియు విద్యామృతం కార్యక్రమాలు కొనసాగించబడతాయి (20 రోజుల కాలానికి షెడ్యూల్, అంటే 1/10/2020 నుండి 31/10/2020  మరియు మొదటి తరగతి నుండి VIII వరకు సిద్ధం చేసిన షీట్లను ఉంచారు.
            ★ ABHYASA యాప్ లో ఉపాధ్యాయులు షీట్లను డౌన్‌లోడ్ చేసి, తదనుగుణంగా విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వాలి.
            ★ ఇంకా, 9 నుండి 12 వ తరగతుల విద్యార్థులు తమ తల్లిదండ్రుల / సంరక్షకుల వ్రాతపూర్వక అనుమతితో మాత్రమే వారి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కోసం స్వచ్ఛంద ప్రాతిపదికన కంటైనేషన్ జోన్ల వెలుపల ఉన్న వారి పాఠశాలలను సందర్శించడానికి అనుమతించబడతారు మరియు ఇది తప్పనిసరి. 
            ★ 2020 అక్టోబర్ 1 నుండి 15 వరకు 1 వ తరగతి నుండి XII వరకు పిల్లలకు రోజు వారీగా చేసే కార్యాచరణ ఈ క్రింది విధంగా ఉంటుంది.
            ★ విద్యార్థులకు కౌన్సెలింగ్, అభ్యాస ఫలితాల ఆధారంగా వారికి అసెస్‌మెంట్ పేపర్లు ఇవ్వాలి.షెడ్యూల్ ప్రకారం వారు  ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావాలి. 
            అన్ని పాఠశాలలు విద్యార్థులతో ఆన్‌లైన్ మోడ్ లో  కార్యకలాపాలలో పాల్గొనవచ్చు.
            ★ ఉపాధ్యాయులను ఎప్పటిలాగే వాట్సాప్ / ఫోన్ కాల్స్ / ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ ద్వారా  మార్గదర్శకత్వం కొనసాగించవచ్చు  మరియు వీక్లీ రిపోర్ట్‌ను ఎప్పటిలాగే డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేయండి.
            ★ పైన పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని పాఠశాల విద్య / జిల్లా విద్యాశాఖాధికారులందరూ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు షెడ్యూల్ను సంబంధిత అధికార పరిధిలో సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలని మరియు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.  సంబంధిత జిల్లాల్లోని విద్యార్థులందరికీ పాఠాలు ఆన్లైన్ మోడ్ లో  చేరుతాయి.
            ★ ఈ విషయంలో ఏదైనా స్పష్టత కోసం, డైరెక్టర్, SCERT మరియు డైరెక్టర్ SIEMAT ని సంప్రదించవచ్చు.
            -వాడ్రేవు చినవీరభద్రుడు, డైరెక్టరు  ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్

            Teacher Transfers 2020 – Complete Information బదిలీలు పూర్తి సమాచారం

            0

            Useful Software

            Consultations

            School Education Department higher officials conducted meetings with
            connected officials and teachers unions to conduct transfers in smooth
            manner.

            Schedule

             

             Event Name
             Remarks
             Transfers Official Website https://cse.ap.gov.in
             Transfers Guidelines 3rd week of July – 2020
             Transfers Schedule Same day of Transfers Instructions

            Important Dates will release soon

             Rationalization Instructions 3rd week of July – 2020
             Rationalization ScheduleSame day of Rationalization Guidelines.

            Important Dates will release soon

            Cut of Date
            Transfers 30.06.2020

            Rationalization 29.02.2020

            Transfers Pre Work and Working Online Software

            Every teacher wants to opt a best school. They need to do some pre work before submitting Transfers application.

            • Rationalization 2020 Complete Information – Available here
            • Know all schools enrollment in a mandal using mandal code – Available here
            • Know a school enrollment and working staff (designations) – Available here

            జగనన్న విద్యా కానుక తాజా మార్గదర్శకాలు 30.09.2020 JVK KIT LATEST GUIDELINES

              0

               అక్టోబర్ 5 న జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ చేయాలని, దానికి సంబంధించి పాటించాల్సిన విధి విధానాలను కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన వీర భద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

              డౌన్లోడ్

              [post_ads]

              ❖ కార్యకమ ప్రారంభోత్సవానికి తల్లిదండ్రుల కమిటీ సభ్యులను ఆహ్వానించాలి.
              ❖ రోజుకు 50 మంది తల్లిదండ్రులకు కిట్లు పంపిణీ చేయాలి.
              ❖ పంపిణీలో తలిదండ్రుల బయోమెట్రిక్ అథెంటిఫికేషన్(మొబైల్ అప్లికేషన్ ఆధారిత) వేయడం ద్వారా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి.
              ❖ తగిన జాగ్రత్తలను పాటించాలి. సౌకర్యాలను కల్పించాలి. కార్యక్రమానికి ఆహ్వానించబడ్జ తల్లిదండ్రులు (విద్యార్థులను కూడా) శానిటైజ్ చేయించుకొనేలా చూడాలి. ఇందుకు అగు ఖర్చును  పాఠశాల వార్షిక ( కాంపోజిట్ గ్రాంటు) గ్రాంటు నుండి వినియోగించాలి.
              ❖ కేంద్ర ప్రభుత్వ  కోవిడ్-19 ప్రోటోకాల్ మార్గదర్శకాలను తప్పక అనుసరించాలి.
              ❖ కార్యక్రమానికి హాజరగు వారు  తప్పక మాస్క్ ను ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి.