Home Blog Page 400

మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీలు

    0

    మచిలీపట్నం : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈవో రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం బదిలీల అంశపై జిల్లాలోని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బదిలీలపై ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీలు ప్రకటించాలని పలువురు నాయకులు కోరగా ఖాళీల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి అందుబాటులో ఉంటాయని అన్నారు. ఛైల్డ్‌ఇన్‌ఫోలో విద్యార్థుల వివరాలను నమోదు చేసే సమయంలో ఇంగ్లీషు మాధ్యమం అని నమోదు చేస్తే వేరే మాధ్యమాలుగా తీసుకుంటున్నట్లు డీఈవో దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం ఖాళీలను ప్రదర్శించాలని కొన్ని సంఘాల నాయకులు కోరారు. హేతుబద్ధీకరణ, బదిలీల జీవోలో ఉన్న కొన్ని అంశాలను తొలగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇలా వివిధ అంశాలపై సమీక్షించారు. వివిధ సంఘాల నాయకులు లెనిన్‌బాబు, మనోహర్‌, నాగరాజు, కొమ్ముప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

    బదిలీలకు ప్రస్తుత సర్వీసు మాత్రమే పరిగణన లోకి తీసుకొనుట వీలు కాదు

      0
      • బదిలీలకు ప్రస్తుత సర్వీసు మాత్రమే తీసుకోవాలని కోరిన డైరెక్ట్ ఎస్.ఏ లు
      • అది సాధ్యం కాదని ఉత్తర్వులు ఇచ్చిన విద్యాశాఖ డైరెక్టర్

      అమరావతి : ప్రస్తుత ఉపాధ్యాయ బదిలీలలో ప్రస్తుత సర్వీసు ను మాత్రమే పరిగణన లోకి తీసుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కొంత మంది డైరెక్ట్ ఎస్.ఏ లు కోర్టు ద్వారా విద్యా శాఖ ను కోరారు. అయితే వారి అభ్యర్ధన ను విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ చిన వీరభద్రుడు తిరస్కరించారు. ఈ మేరకు కోర్టు ను ఆశ్రయించిన ఉపాధ్యాయులకు డైరెక్టర్ వారు ఉత్తర్వుల ద్వారా సమాధానం పంపారు. మొత్తం సర్వీసు ను పరిగణన లోకి తీసుకుంటూ సంవత్సరానికి 0.5 పాయింట్లు చొప్పున ఇవ్వనున్నట్టు మరియు కేవలం ప్రస్తుత సర్వీసు మాత్రమే లెక్క లోకి తీసుకోవడం సాధ్య పడదని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

      ఈ హాజరు టాబ్ నిర్వహణ పై సూచనలు

        0

        ఈ హాజరు కు సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది విషయాలు గమనించగలరు.

        ఐరిష్ టాబ్ నందు వాట్సాప్ మరియు యూ ట్యూబ్ లను వెంటనే అన్ ఇన్ స్టాల్ లేదా డిసేబుల్ చేయాలి
        మై ఫైల్స్ నందు డివైజ్ స్టోరేజ్ లో SIMS మొదలగు తాత్కాలిక ఫైల్స్, విడియో ఫైల్స్, ఫొటో లను డిలీట్ చేయండి
        ఉపయోగంలో / వినియోగంలో లేని పాత అప్లికేషన్లు అన్ ఇన్ స్టాల్ చేయగలరు
        హోమ్ స్క్రీన్ ఎపుడూ టచ్ విజ్ హోమ్ ను ఎంపిక చేసుకోవాలి
        ఒక వేళ లాంచర్ ఏక్టివేట్ అయినట్లయితే ఈ క్రింది పాస్ కొడ్ లలో ఏదో ఒక దాని ని ఉపయోగించి అన్ లాక్ చేయ గలరు.
        4545 లేదా 1212 లేదా 2525 లేదా 0852
        టైం ఫార్మాట్ ను 24 గంటలకు తగిన విధంగా సెట్టింగ్స్ లో సరిచేసుకోవాలి

        టీచర్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ క్యాలిక్యులేటర్

          0

          టీచర్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ క్యాలిక్యులేటర్ ద్వారా మీకు ప్రస్తుతం జరగబోయే బదిలీ లలో ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.

          http://s2.newstone.in/transfers/calculate.php

          లేదా

          http://s1.newstone.in/transfers/calculate.php

          లేదా

          http://s3.newstone.in/transfers/calculate.php

          ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం – ముఖ్యాంశాలు

            0

            1) ప్రాథమిక పాఠశాలలు – 1:20 -34 వేల పాఠశాలలకు ఉన్న 76 వేల పోస్టులను సర్దుబాటు చేయాలని, ఒక వేళ పోస్టులు మిగిలితే సర్దుబాటు చేస్తామని, విషయాన్ని సి.యం. దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలియజేశారు.
            2) మేన్యువల్ కౌన్సిలింగ్ – పరిశీలన చేస్తాము. యస్.జి.టి. వరకు అయినా మెన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ. అంగీకరించే అవకాశం
            3) ఖాళీలు – బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం
            4) అడ్ హాక్ పదోన్నతులు – సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం
            5) సర్వీస్ పాయింట్లు – 0.5 నుండి 1కి పెంపుదలకు అనంగీకారం
            6) అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే – ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతానని కమిషనర్ తెలియజేశారు.
            7) రిటైర్మెంట్ 3 సం. లోపు వారికి తప్పని సరి బదిలీ నుండి మినహాయింపు – ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిశీలన చేస్తాము
            8) యం. ఎ (తెలుగు) కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి. 3rd మెథడాలజీకి అంగీకారం
            చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో సవరణ ఉత్తర్వులు వచ్చే వరకు నిరాహార దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో నిర్ణయం. పరిస్థితిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు నిర్ణయం

            ఈ రోజు FAPTO CSE, AP వారితో చర్చించబోయే అంశాలు

              0

              ఫ్యాప్టో రేషనలైజేషన్ పై కింది అంశాలను ప్రతిపాదించింది..

              1 ) ప్రాథమిక పాఠశాలలకు 1:20 అమలు చేయాలి . 41 రోలు వద్ద 3 , 61 రోలు వద్ద 4 , 80 పై బడిన మోడల్ పాఠశాలలను 2 + 1 LFL , తో కొనసాగించాలి .

               2 ) ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టు మంజూరు చేయాలి . 

              3 ) ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రత్యేక ఆంగ్ల ఉపాధ్యాయుల పోస్టు మంజూరు చేయాలి . 

              4 ) అవసరమైన నూతన పోస్టుల మంజూరు కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి . 

              5 ) ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే సందర్భంలోనూ 1:20 అమలు చేయాలి .. ! 

              6 ) ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్నత తరగతుకు 1:35 గా ఉండాలి .

              7 ) ఉన్నత పాఠశాలలకు రోలు వారి కాకుండా మీడియం వారీగా పోస్టులు మంజూరు చేయాలి .

              8 ) ఉన్నత పాఠశాలలకు సెకప్ 1:35 గా ఉండాలి . 

              9 ) ఆప్ గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుని పోస్టుతో పాటు ఇతర అవసరమైన పోస్టులను మంజూరు చేయాలి .

              10 ) కటాఫ్ తేదీ అక్టోబర్ 1 గా ఉండాలి .

              బదిలీలు అంశాలలో సవరించ వలసినవి :

               1 . 2019 జూస్ నుండి భర్తీ చేసిన పదోన్నతులు , అప్ గ్రేడేషన్ పాఠశాలలను ఖాళీలు గా చూపాలి . పదోన్నతులు పొంది 2 సర్వీసు ఉన్న వారిని మినహాయించాలి . 2018 DSC నియామకాల పోస్టులను ఖాళీలుగా చూపాలి . 

              2 ) పోస్టలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాలీలను బదిలీలకు చూపాలి . 

              3 ) ప్రభుత్వ , జిల్లా పరిషత్ పాఠశాలల మధ్య బదిలీలకు అవకాశం ఇవ్వాలి .

               4 ) ఏజన్సీ నుండి ప్లేస్ ఏరియాకు అవకాశం కల్పించాలి . 

              5 ) ఆగస్టు 31 కటాఫ్ గా ఉపాధ్యాయులకు 8 , ప్రధానోపాధ్యాయులకు 5 పూర్తి సంవత్సరాలుగా ఉండాలి . 

              6 ) సర్వీసు పాయింట్లు ఏడాదికి 1 చొప్పున ఉండాలి . 

              7 ) కేటగిరి , సర్వీసుకు గరిష్ట పాయింట్ల పరిమితిని తీసివేయాలి . 

              8 ) పదవీ విరమణ కు 3 సంవత్సరాల లోపు ఉన్న వారిని తప్పని సరి బదిలీ నుండి మినహాయించాలి . 

              9 ) స్పాట్ విషయంలో రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నా అనుమతించాలి . 

              కౌన్సెలింగ్ గురించి….

              1 ) ప్రధానోపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్ పెట్టవచ్చు . 

              2 ) స్కూల్ అసిస్టెంట్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలి . 

              3 ) తప్పని సరిగా SGT లకు మాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలి . సుమారు 2000 ఖాళీలను ఎంపిక చేసుకోడం వల్ల తీవ్రనష్టం జరుగుతుంది .

               4 ) ప్రస్తుతం అన్ లాక్ 5.0 లో అన్నింటిపై నియంత్రణ ఎత్తివేస్తున్నందున మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి . 

              5 ) జూలై 1 వ తేదీన జరిపిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో అంగీకరించిన అంశాలనూ పొందు పర్చలేదు . పై అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

              బదిలీలు క్రమబద్దీకరణ పై గుంటూరు డిఈవో వారి ప్రకటన

                0

                  పత్రికా ప్రకటన

                శ్రీయుత సంచాలకులు, పాఠశాల విద్య, అమరావతి వారు బదిలీలు, పోస్ట్‌ల సర్దుబాటు మరియు పదోన్నతుల షెడ్యూలు మరియు సూచనలు ప్రకటించినారు. ఈ సందర్భముగా జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు వారు శ్రీమతి ఆర్‌.ఎస్‌.గంగా భవాని గారు జిల్లాలొని అందరూ ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు షెడ్యూలు మరియు సూచనలుప్రకారము నిర్జీత ప్రొఫార్మాలలో అన్నీ రకాల ఖాళీలను మరియు తప్పనిసరిగా బదిలీ అగు ఉపాధ్యాయ వివరములను సేకరించవలెనని కోరినారు. ఇందుకోసం వారు విషయ పరిజ్ఞానము ఉన్న వారితో కమిటీలను ఏర్పరచుకొని సమాచారమును పరిశీలించి మరియు ధృవీకరించి ఈ కార్యాలయమునకు సమర్చించవలసినదిగా కోరినారు.

                పోస్టుల సర్ధుబాటుకు ది.29-2-2020నాటి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా తీసుకొనడమైనది. ఈ విషయంలో ది.]4-10-2020 నాటికి విద్యార్ధుల సంఖ్యలో ఏమైనా పెరుగదల ఉన్నచో సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారి తనిఖీ అధికారులద్వారా వివరములు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు ది.19-10-2020 లోపు సమర్ప్చించవలెనని తెల్పినారు.

                పేరెంట్‌ మేనేజ్‌ మెంట్‌ లోకి బదిలీలు కోరుకొనే ఉపాద్యాయులు కూడా సంబంధిత తనిఖీ అధికారులద్వారా వివరములను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్ప్చించవలెనని తెల్పినారు.

                గమనిక: ఈ ప్రకటనను అని రూరల్‌ ఎడిషన్లనందు ప్రచురించవలసినదిగా కోరడమైనది.

                నిష్ఠ ట్రైనింగ్ వివరాలు మరియు ముఖ్య పదాలు వాటి అబ్రివేషన్లు

                  0

                  ఉపాధ్యాయులకు అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానున్న NISHTHA ఆన్లైన్ ట్రైనింగ్  కార్యక్రమం లో అందరూ ఉపాధ్యాయులు అనగా

                  1) ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులు భోధించు అందరూ టీచర్స్.

                  2) ఉన్నత పాఠశాలలో 6 నుండి 8 వ తరగతి భోధించు సైన్స్ (PHYSICAL SCIENCE/ BIOLOGICAL SCIENCE) భోధించు టీచర్స్ అందరూ విధిగా NISHTHA ఆన్లైన్  ట్రైనింగ్ అవ్వవలెను.

                  దీనికి సంబంధించిన టీచర్స్ అందరూ DIKSHA లో రిజిస్ట్రేషన్ అయ్యేవిధముగా
                  మరియు ట్రైనింగ్ లో పాల్గొనే విధంగా సంబంధిత SRGs అందరూ చర్యలు
                  తీసుకోవలసినదిగా కోరడమైనది.

                  NISHTHA -ABBREVIATIONS

                  CLCPLO&IE :

                  Curriculum, Learner centered Pedagogy, Learning Outcomes and Inclusive Education

                  DS-PQCS&HSE :

                  Developing Social – Personal Qualities and Creating Safe and Healthy School Environment

                  AIL :

                  Art Integrated Learning

                  SBA :

                  School Based Assessment

                  HWS :

                  Health and Well-being in Schools

                  IITL&A :

                  Integration of ICT in Teaching Learning and Assessment

                  ISE :

                  Initiatives in School Education

                  PES :

                  Pedagogy of Environmental Studies (Primary Stage)

                  PM :

                  Pedagogy of Mathematics

                  PL :

                  Pedagogy of Languages

                  PS :

                  Pedagogy of Science (Upper Primary Stage)

                  PSS :

                  Pedagogy of Social Sciences (Upper Primary Stage)

                  SL :

                  School Leadership 

                  Pre-SE :

                  Pre-School Education

                  Pre-VE :

                  Pre-Vocational Education

                  RGDT&LP :

                  Relevance of Gender Dimensions in Teaching and Learning Process

                  ISE :

                  Initiatives in School Education

                  బదిలీల పై ఉపాధ్యాయ సంఘాల తో చర్చలు

                    0

                     అన్నీ ఉపాధ్యాయ సంఘాలను ఉపాధ్యాయ బదిలీ వ్యవహారాల పై చర్చించుట కొరకు డి.ఎస్.ఈ వారు ఒప్పుకొని చర్చలకు పిలిచారు. ఈ సమావేశం ది.16.10.2020 విజయవాడ మీటింగ్ హాల్ లో జరుగును. ఈ క్రింది లింక్ పై లేఖను డౌన్లోడ్ చేసుకోండి

                    డౌన్లోడ్

                    [post_ads]

                    నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు బడులు

                    0

                    సగం పాఠాలే !
                    నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు బడులు
                    టీచర్ల సెలవులపైనా పరిమితి

                    ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలను నవంబరు 2 నుంచి తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ కేలండర్‌ను సిద్ధం చేస్తోంది. సాధారణ పరిస్థితుల్లో 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఇప్పటివరకు తరగతులే ప్రారంభం కాలేదు. దీంతో పనిదినాల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యాంశాలు (సిలబస్‌) తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సగం పాఠ్యాంశాలు తగ్గించే యోచనలో ఉన్నందున ఇదే విధానాన్ని పాటించాలని భావిస్తోంది. పండుగల సెలవులనూ తగ్గించనున్నారు. తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఉపాధ్యాయులపైనా పరిమితి విధిస్తూ సంచాలకులు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.

                    * నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు పనిచేస్తాయి.

                    * పండుగల సెలవులు కుదింపు. వారానికి ఆరు పనిదినాలు.

                    * సంక్రాంతికి మూడురోజులే సెలవులు.

                    * ఉపాధ్యాయులు నెలకు రెండున్నర చొప్పున నవంబరు, డిసెంబరుల్లో ఐదు రోజులే సాధారణ సెలవులు (సీఎల్‌) వినియోగించుకోవాలి.

                    ఏప్రిల్‌లో పదోతరగతి పరీక్షల నిర్వహణ

                    హాజరుపట్టీలో కులమతాలు వద్దు

                    పాఠశాల హాజరుపట్టీలో విద్యార్థుల కులం, మతం వివరాలు రాయొద్దని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. బాలికల పేర్లను ఎర్రసిరాతో రాయకూడదని, అందరిపేర్లూ ఒకేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాల్లో ఇప్పటివరకు ఉన్న విధానాలను నిలిపివేయాలని ఆదేశించారు.