Home Blog Page 401

ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం – ముఖ్యాంశాలు

    0

    1) ప్రాథమిక పాఠశాలలు – 1:20 -34 వేల పాఠశాలలకు ఉన్న 76 వేల పోస్టులను సర్దుబాటు చేయాలని, ఒక వేళ పోస్టులు మిగిలితే సర్దుబాటు చేస్తామని, విషయాన్ని సి.యం. దృష్టికి తీసుకువెళతానని కమిషనర్ తెలియజేశారు.
    2) మేన్యువల్ కౌన్సిలింగ్ – పరిశీలన చేస్తాము. యస్.జి.టి. వరకు అయినా మెన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరగా ప్రయత్నం చేస్తానని కమిషనర్ హామీ. అంగీకరించే అవకాశం
    3) ఖాళీలు – బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం
    4) అడ్ హాక్ పదోన్నతులు – సైకిల్ సిస్టం ద్వారా జరపాలని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి అంగీకారం
    5) సర్వీస్ పాయింట్లు – 0.5 నుండి 1కి పెంపుదలకు అనంగీకారం
    6) అప్ గ్రేడ్ ఖాళీలు డిస్ ప్లే – ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతానని కమిషనర్ తెలియజేశారు.
    7) రిటైర్మెంట్ 3 సం. లోపు వారికి తప్పని సరి బదిలీ నుండి మినహాయింపు – ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిశీలన చేస్తాము
    8) యం. ఎ (తెలుగు) కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి. 3rd మెథడాలజీకి అంగీకారం
    చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో సవరణ ఉత్తర్వులు వచ్చే వరకు నిరాహార దీక్షలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో నిర్ణయం. పరిస్థితిని బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు నిర్ణయం

    ఈ రోజు FAPTO CSE, AP వారితో చర్చించబోయే అంశాలు

      0

      ఫ్యాప్టో రేషనలైజేషన్ పై కింది అంశాలను ప్రతిపాదించింది..

      1 ) ప్రాథమిక పాఠశాలలకు 1:20 అమలు చేయాలి . 41 రోలు వద్ద 3 , 61 రోలు వద్ద 4 , 80 పై బడిన మోడల్ పాఠశాలలను 2 + 1 LFL , తో కొనసాగించాలి .

       2 ) ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టు మంజూరు చేయాలి . 

      3 ) ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రత్యేక ఆంగ్ల ఉపాధ్యాయుల పోస్టు మంజూరు చేయాలి . 

      4 ) అవసరమైన నూతన పోస్టుల మంజూరు కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి . 

      5 ) ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే సందర్భంలోనూ 1:20 అమలు చేయాలి .. ! 

      6 ) ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్నత తరగతుకు 1:35 గా ఉండాలి .

      7 ) ఉన్నత పాఠశాలలకు రోలు వారి కాకుండా మీడియం వారీగా పోస్టులు మంజూరు చేయాలి .

      8 ) ఉన్నత పాఠశాలలకు సెకప్ 1:35 గా ఉండాలి . 

      9 ) ఆప్ గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుని పోస్టుతో పాటు ఇతర అవసరమైన పోస్టులను మంజూరు చేయాలి .

      10 ) కటాఫ్ తేదీ అక్టోబర్ 1 గా ఉండాలి .

      బదిలీలు అంశాలలో సవరించ వలసినవి :

       1 . 2019 జూస్ నుండి భర్తీ చేసిన పదోన్నతులు , అప్ గ్రేడేషన్ పాఠశాలలను ఖాళీలు గా చూపాలి . పదోన్నతులు పొంది 2 సర్వీసు ఉన్న వారిని మినహాయించాలి . 2018 DSC నియామకాల పోస్టులను ఖాళీలుగా చూపాలి . 

      2 ) పోస్టలను బ్లాక్ చేయకుండా అన్ని ఖాలీలను బదిలీలకు చూపాలి . 

      3 ) ప్రభుత్వ , జిల్లా పరిషత్ పాఠశాలల మధ్య బదిలీలకు అవకాశం ఇవ్వాలి .

       4 ) ఏజన్సీ నుండి ప్లేస్ ఏరియాకు అవకాశం కల్పించాలి . 

      5 ) ఆగస్టు 31 కటాఫ్ గా ఉపాధ్యాయులకు 8 , ప్రధానోపాధ్యాయులకు 5 పూర్తి సంవత్సరాలుగా ఉండాలి . 

      6 ) సర్వీసు పాయింట్లు ఏడాదికి 1 చొప్పున ఉండాలి . 

      7 ) కేటగిరి , సర్వీసుకు గరిష్ట పాయింట్ల పరిమితిని తీసివేయాలి . 

      8 ) పదవీ విరమణ కు 3 సంవత్సరాల లోపు ఉన్న వారిని తప్పని సరి బదిలీ నుండి మినహాయించాలి . 

      9 ) స్పాట్ విషయంలో రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నా అనుమతించాలి . 

      కౌన్సెలింగ్ గురించి….

      1 ) ప్రధానోపాధ్యాయులకు వెబ్ కౌన్సెలింగ్ పెట్టవచ్చు . 

      2 ) స్కూల్ అసిస్టెంట్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలి . 

      3 ) తప్పని సరిగా SGT లకు మాన్యువల్ కౌన్సెలింగ్ పెట్టాలి . సుమారు 2000 ఖాళీలను ఎంపిక చేసుకోడం వల్ల తీవ్రనష్టం జరుగుతుంది .

       4 ) ప్రస్తుతం అన్ లాక్ 5.0 లో అన్నింటిపై నియంత్రణ ఎత్తివేస్తున్నందున మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి . 

      5 ) జూలై 1 వ తేదీన జరిపిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో అంగీకరించిన అంశాలనూ పొందు పర్చలేదు . పై అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

      బదిలీలు క్రమబద్దీకరణ పై గుంటూరు డిఈవో వారి ప్రకటన

        0

          పత్రికా ప్రకటన

        శ్రీయుత సంచాలకులు, పాఠశాల విద్య, అమరావతి వారు బదిలీలు, పోస్ట్‌ల సర్దుబాటు మరియు పదోన్నతుల షెడ్యూలు మరియు సూచనలు ప్రకటించినారు. ఈ సందర్భముగా జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు వారు శ్రీమతి ఆర్‌.ఎస్‌.గంగా భవాని గారు జిల్లాలొని అందరూ ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు షెడ్యూలు మరియు సూచనలుప్రకారము నిర్జీత ప్రొఫార్మాలలో అన్నీ రకాల ఖాళీలను మరియు తప్పనిసరిగా బదిలీ అగు ఉపాధ్యాయ వివరములను సేకరించవలెనని కోరినారు. ఇందుకోసం వారు విషయ పరిజ్ఞానము ఉన్న వారితో కమిటీలను ఏర్పరచుకొని సమాచారమును పరిశీలించి మరియు ధృవీకరించి ఈ కార్యాలయమునకు సమర్చించవలసినదిగా కోరినారు.

        పోస్టుల సర్ధుబాటుకు ది.29-2-2020నాటి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా తీసుకొనడమైనది. ఈ విషయంలో ది.]4-10-2020 నాటికి విద్యార్ధుల సంఖ్యలో ఏమైనా పెరుగదల ఉన్నచో సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారి తనిఖీ అధికారులద్వారా వివరములు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు ది.19-10-2020 లోపు సమర్ప్చించవలెనని తెల్పినారు.

        పేరెంట్‌ మేనేజ్‌ మెంట్‌ లోకి బదిలీలు కోరుకొనే ఉపాద్యాయులు కూడా సంబంధిత తనిఖీ అధికారులద్వారా వివరములను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్ప్చించవలెనని తెల్పినారు.

        గమనిక: ఈ ప్రకటనను అని రూరల్‌ ఎడిషన్లనందు ప్రచురించవలసినదిగా కోరడమైనది.

        �

        నిష్ఠ ట్రైనింగ్ వివరాలు మరియు ముఖ్య పదాలు వాటి అబ్రివేషన్లు

          0

          ఉపాధ్యాయులకు అక్టోబర్ 16 నుండి ప్రారంభం కానున్న NISHTHA ఆన్లైన్ ట్రైనింగ్  కార్యక్రమం లో అందరూ ఉపాధ్యాయులు అనగా

          1) ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 8 తరగతులు భోధించు అందరూ టీచర్స్.

          2) ఉన్నత పాఠశాలలో 6 నుండి 8 వ తరగతి భోధించు సైన్స్ (PHYSICAL SCIENCE/ BIOLOGICAL SCIENCE) భోధించు టీచర్స్ అందరూ విధిగా NISHTHA ఆన్లైన్  ట్రైనింగ్ అవ్వవలెను.

          దీనికి సంబంధించిన టీచర్స్ అందరూ DIKSHA లో రిజిస్ట్రేషన్ అయ్యేవిధముగా
          మరియు ట్రైనింగ్ లో పాల్గొనే విధంగా సంబంధిత SRGs అందరూ చర్యలు
          తీసుకోవలసినదిగా కోరడమైనది.

          NISHTHA -ABBREVIATIONS

          CLCPLO&IE :

          Curriculum, Learner centered Pedagogy, Learning Outcomes and Inclusive Education

          DS-PQCS&HSE :

          Developing Social – Personal Qualities and Creating Safe and Healthy School Environment

          AIL :

          Art Integrated Learning

          SBA :

          School Based Assessment

          HWS :

          Health and Well-being in Schools

          IITL&A :

          Integration of ICT in Teaching Learning and Assessment

          ISE :

          Initiatives in School Education

          PES :

          Pedagogy of Environmental Studies (Primary Stage)

          PM :

          Pedagogy of Mathematics

          PL :

          Pedagogy of Languages

          PS :

          Pedagogy of Science (Upper Primary Stage)

          PSS :

          Pedagogy of Social Sciences (Upper Primary Stage)

          SL :

          School Leadership 

          Pre-SE :

          Pre-School Education

          Pre-VE :

          Pre-Vocational Education

          RGDT&LP :

          Relevance of Gender Dimensions in Teaching and Learning Process

          ISE :

          Initiatives in School Education

          బదిలీల పై ఉపాధ్యాయ సంఘాల తో చర్చలు

            0

             అన్నీ ఉపాధ్యాయ సంఘాలను ఉపాధ్యాయ బదిలీ వ్యవహారాల పై చర్చించుట కొరకు డి.ఎస్.ఈ వారు ఒప్పుకొని చర్చలకు పిలిచారు. ఈ సమావేశం ది.16.10.2020 విజయవాడ మీటింగ్ హాల్ లో జరుగును. ఈ క్రింది లింక్ పై లేఖను డౌన్లోడ్ చేసుకోండి

            డౌన్లోడ్

            [post_ads]

            నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు బడులు

            0

            సగం పాఠాలే !
            నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు బడులు
            టీచర్ల సెలవులపైనా పరిమితి

            ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలను నవంబరు 2 నుంచి తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ కేలండర్‌ను సిద్ధం చేస్తోంది. సాధారణ పరిస్థితుల్లో 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఇప్పటివరకు తరగతులే ప్రారంభం కాలేదు. దీంతో పనిదినాల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యాంశాలు (సిలబస్‌) తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సగం పాఠ్యాంశాలు తగ్గించే యోచనలో ఉన్నందున ఇదే విధానాన్ని పాటించాలని భావిస్తోంది. పండుగల సెలవులనూ తగ్గించనున్నారు. తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఉపాధ్యాయులపైనా పరిమితి విధిస్తూ సంచాలకులు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.

            * నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు పనిచేస్తాయి.

            * పండుగల సెలవులు కుదింపు. వారానికి ఆరు పనిదినాలు.

            * సంక్రాంతికి మూడురోజులే సెలవులు.

            * ఉపాధ్యాయులు నెలకు రెండున్నర చొప్పున నవంబరు, డిసెంబరుల్లో ఐదు రోజులే సాధారణ సెలవులు (సీఎల్‌) వినియోగించుకోవాలి.

            ఏప్రిల్‌లో పదోతరగతి పరీక్షల నిర్వహణ

            హాజరుపట్టీలో కులమతాలు వద్దు

            పాఠశాల హాజరుపట్టీలో విద్యార్థుల కులం, మతం వివరాలు రాయొద్దని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. బాలికల పేర్లను ఎర్రసిరాతో రాయకూడదని, అందరిపేర్లూ ఒకేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాల్లో ఇప్పటివరకు ఉన్న విధానాలను నిలిపివేయాలని ఆదేశించారు.

            ఉపాధ్యాయ బదిలీలు, క్రమ బద్దీకరణ షెడ్యూల్

              0

              ఉపాధ్యాయ బదిలీలు, క్రమ బద్దీకరణ షెడ్యూల్

               Download Transfers & Rationalization Guidelines and Schedule – Click Here

              Download Promotion Guidelines – Click Here

              బదిలీల షెడ్యూలు:

              ** అడహక్ పదోన్నతులు కౌన్సిలింగ్:  19-20 అక్టోబర్

              ** రేషనలైజేషన్ ప్రక్రియ:  21-26 అక్టోబర్

              ** ఆన్ లైన్ బదిలీల దరఖాస్తులు: 29 అక్టోబర్ –  2 నవంబర్.

              ** ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్:  5 – 9 నవంబర్

              ** Objections: 10 – 12 నవంబర్

              ** ఫైనల్ సీనియారిటీ లిస్ట్: 16 – 18 నవంబర్

              ** వెబ్ ఆప్షన్స్:  19 – 21 నవంబర్

              ** బదిలీ స్థానాలు కేటాయింపు:  22 – 27 నవంబర్

              ** బదిలీల ఉత్తర్వుల విడుదల:  30 నవంబర్.

               

              బదిలీల రేషనలైజేషన్ ముఖ్యాంశాలు:

              * రేషనలైజేషన్ కటాఫ్ తేదీ 29-2-2020.

              ఒకవేళ 2020-21 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగితే సంబంధిత  ప్రధానోపాధ్యాయులు జిల్లాస్థాయి కమిటీకి డిక్లరేషన్ సమర్పించినట్లు అయితే 14-10-2020 నాటికి గల విద్యార్థుల సంఖ్య పరిగణలోకి తీసుకుంటారు.

              * ఉపాధ్యాయులకు గరిష్ట సర్వీసు 8 అకడమిక్ సంవత్సరాలు. ప్రధానోపాధ్యాయులకు 5 అకడమిక్ సంవత్సరాలు.

              * 1- 10 నాటికి రెండు సంవత్సరాల లోపు పదవీవిరమణ చేయబోవు ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి కాదు.

              * విద్యార్థుల సంఖ్య *0* గా గల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పోస్టులను అవసరమైనచోటుకు షిఫ్ట్ చేస్తారు.

              * ప్రాథమికోన్నత పాఠశాల లోని PSHM పోస్టులను షిఫ్ట్ చేస్తారు.

              * Visually challenged ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు కలదు.

              * వృత్తి విద్య, క్రాఫ్ట్, డ్రాయింగ్ వీవింగ్, మ్యూజిక్ తదితర ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ సంబంధిత ట్రేడ్లలో నిర్వహించబడుతుంది.

              * అప్ గ్రెడేషన్ లో మిగిలిపోయిన గ్రేడ్-2 పండితులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది.

              * పదోన్నతి అర్హతలేని PET లను అదే స్థానంలో కొనసాగిస్తారు.

              * బదిలీల అనంతరము మిగిలిన పోస్టులను 1, 2 , 3 కేటగిరీలకు సమానంగా బ్లాక్ చేస్తారు.

              *  ఒక పాఠశాల, వేరొక పాఠశాలలో మెర్జ్ అయినప్పుడు కొత్త పాఠశాలలో చేరిన తేదీ నుండి సీనియారిటీ లెక్కించబడుతుంది.

              * ప్రాథమికోన్నత పాఠశాలలో PS, NS పోస్టులను సైన్స్ పోస్టు లుగా పరిగణించబడును.

              * ఒక ఉన్నత పాఠశాలలో ఒక్కొక్క మీడియంలో 50 లోపు విద్యార్థులు ఉంటే రెండు మీడియంలోని విద్యార్థుల సంఖ్యను కలిపి |||-A table ఆధారంగా పోస్టులు మంజూరు చేయబడును.

              * ఈ బదిలీల లో ఏ ఒక్క ఉపాధ్యాయుని డి ఈ ఓ పూల్ లోనికి పంపించడం జరగదు.

              [post_ads]

              క్రమబద్దీకరణ జీవొ విడుదల

                0

                ఉపాధ్యాయులు ఎన్నో రోజులు గా ఎదురు చూస్తున్న బదిలీల జీవో నెం. 54 తేదీ 12/10/2020 తో పాటుగా క్రమబద్దీకరణ జీవో నెం. 53 తేదీ
                12/10/2020
                ను ఈ రోజు విద్యా శాఖ కార్యదర్శి శ్రీ బుడితి రాజ శేఖర్ విడుదల
                చేశారు.

                ఈ క్రింది లింక్ నుండి జీవో ను డౌన్లోడ్ చేయండి.

                డౌన్లోడ్

                [post_ads]

                క్రమబద్దీకరణ లో సర్ ప్లస్ ను నిర్ణయించు క్రమం

                a). 8 విద్యా సంవత్సరాలు పూర్తి అయిన ఉపాధ్యాయుడి పోస్టు.
                సదరు ఉపాధ్యాయులకు క్రమబద్దీకరణకు పాయింట్లు ఇవ్వబడవు.
                b). పాఠశాలలో 8 విద్యా సంవత్సరాలు పూర్తయిన వారు లేకుంటే సమ్మతం తెలుపు పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయుడి పోస్ట్.
                c). పై రెండు విధాలుగా నిర్ణయించ వీలుకాకపొతే కేడర్లో సర్వీసు పరంగా జూనియర్ పోస్ట్ క్రమబద్దీకరణ చేయబడును.
                Note: పాఠశాలలో చేరిన తేది ఆధారంగా జూనియర్ కాదు*.
                కేడర్ లో జూనియర్ పోస్ట్.

                క్రమబద్దీకరణకు గురయ్యే వారికి 5 పాయింట్స్ లభిస్తాయి

                బదిలీల జీవొ విడుదల

                  0

                  ఉపాధ్యాయులు ఎన్నో రోజులు గా ఎదురు చూస్తున్న బదిలీల జీవో నెం. 54 తేదీ 12/10/2020 ను ఈ రోజు విద్యా శాఖ కార్యదర్శి శ్రీ బుడితి రాజ శేఖర్ విడుదల చేశారు. క్రమ బద్దీకరణ నిబంధనలు వేరే జీవో లో ఉంటాయి.

                  ఈ క్రింది లింక్ నుండి జీవో ను డౌన్లోడ్ చేయండి.

                  డౌన్లోడ్

                  [post_ads]

                  ఉపాధ్యాయుల సాధారణ బదిలీల నియమ నిబంధనలు – తెలుగు లో

                  ప్రభుత్వ, పంచాయితీ రాజ్‌ పాఠశాలలలోని ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు సంబధించి ఈరోజు (12/10/2020) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు 54 విడుదల చేశారు.

                  ఈ ఉత్తర్వులకు సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు అవసరమైన వివరణలు ఇవ్వడానికి, సరి అయిన రీతిలో అమలు చేయడానికి అధీకృత అధికారి. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌ మెంట్‌ కూడా ఆయా యాజమాన్యాలలో పనిచేసే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వవచ్చు. డైట్‌ ల యందు, సమగ్ర శిక్షాభియాన్‌ నందు కూడా బదిలీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

                  మార్గదర్శకాలు : – ఈ బదిలీ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయి. ఇవి గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ తత్సమాన మరియ యస్‌.జి.టి. తత్సమాన కేడర్లకు వర్తిస్తాయి.

                  2019-2020 విద్యా సం. ఆఖరి పని దినం నాటికి టీచర్లు 8 అకడమిక్‌ సం.లు, జిహెచ్‌.యం.లు ఐదు అకడమిక్‌ సం.లు పూర్తి చేసుకుంటే గరిష్ట సర్వీసుగా భావించి తప్పనిసరి బదిలీ చేస్తారు.

                  సగం కంటే ఎక్కువగా గల అకడమిక్‌ సంవత్సరాన్ని కూడా పూర్తి అకడమిక్‌ సం.గా పరిగణిస్తారు.

                  టీచర్లు 18/11/2012, జిహెచ్‌.యం.లు 18/11/2015 కంటే ముందు కనుక పాఠశాలలో చేరితే వారికి గరిష్ట సర్వీసు అయినట్లు.

                  2 సం.ల లోపు సర్వీస్‌ 01 అక్టోబర్‌ నాటికి ఉన్నట్లయితే వారిని 8/5 సం.లు పూర్తి అయినా తప్పని సరి బదిలీ చేయరు. రిక్వెస్ట్‌ బదిలీ కోరవచ్చు.

                  బాలికోన్నత పాఠశాలలలో 01 అక్టోబర్‌ నాటికి 50 సం.లు లోపు ఉన్న పురుష ఉపాధ్యాయులను తప్పనిసరి బదిలీ చేస్తారు.

                  బాలికోన్నత పాఠశాలలలో పనిచేయడానికి మహిళా ఉపాధ్యాయులు అందుబాటులో లేనట్లయితే 50సం.లు పైబడిన పురుష ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు బదిలీ కోరుకోవడానికి అనుమతిస్తారు.

                  01 అక్టోబర్‌ నాటికి పాఠశాలలో 2 సం.లు సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు రిక్వెస్ట్‌ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చును.

                  ఒక పాఠశాలలో ఒక పోస్ట్‌ సర్‌ ప్లస్‌ అయితే అక్కడ 8సం. లాంగ్‌ స్టాండింగ్‌ అయిన ఉపాధ్యాయుని ఎఫెక్ట్‌ చేయాలి.

                  సర్‌ ప్లస్‌ అయిన పాఠశాలలో 8 సం. లాంగ్‌ స్టాండింగ్‌ లేకపోతే జూనియర్‌ మోస్ట్‌ టీచర్‌ ఎఫెక్ట్‌ అవుతారు. సీనియర్‌ విల్లింగ్‌ ఇస్తే వారిని ఎఫెక్ట్‌ చేస్తారు.

                  ఎన్.సీ.సి/స్కౌట్స్ స్కూల్స్ లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గరిష్ట సర్వీస్‌ పూర్తి అయిన సందర్భంలో ఆ యూనిట్‌ ఉన్న చోటనే బదిలీ కోరుకోవాలి. ఒక వేళ ఖాళీ లేనట్లయితే పూర్వపు పాఠశాలలో కొనసాగవచ్చు.

                  ఉర్చూ, తమిళ్‌, కన్నడ, ఒరియా, భాషలను చదివిన జిహెచ్‌.యం.లు ఉన్నట్లయితే వారికి ఆయా పాఠశాలలను కోరుకొనడానికి ప్రాధాన్యత ఇస్తారు.

                  8/5 అకడమిక్‌ సం.లు గరిష్ట సర్వీస్‌ గుర్తించడానికి పాఠశాలను క్రైటీరియాగా తీసుకుంటారు.

                  విజువల్ చాలెంజ్  రిక్వెస్ట్‌ బదిలీ కోరుకొనకపోతే బదిలీలు వర్తించవు.

                  బదిలీ ఉపాధ్యాయుడు ప్రస్తుతం పనిచేస్తున్న యాజమాన్యం పరిధిలోనే జరుగుతుంది.

                  స్వంత యాజమాన్య పాఠశాలకు బదిలీ కోరుకుంటే అక్కడ ఖాళీ ఉన్నట్లయితే సీనియారిటీ ప్రాతిపదికన బదిలీ చేస్తారు.

                  ఏజన్సీలో పనిచేస్తున్న లోకల్‌ ట్రైబ్‌ టీచర్లను ప్లెయిన్‌ ఏరియాకు బదిలీ చేయరు. నాన్‌ ట్రైబ్‌ టీచర్లు ప్లెయిన్‌ నుండి ఏజన్సీకి, ఏజన్సీ నుండి ప్లెయిన్‌ కి బదిలీ కోరవచ్చు.

                  అయితే ఏజన్సీలో పనిచేస్తున్న నాన్‌ ట్రైబ్‌ టీచర్లు ప్లెయిన్‌ ఏరియాకు బదిలీ జరిగితే ప్రత్యామ్నాయ టీచర్‌ వారి స్థానంలో వస్తేనే రిలీవ్ ‌చేస్తారు.

                  ఏజన్సీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయరు. ప్లెయిన్‌ ఏరియాలో సర్‌ ప్లస్‌ జూనియర్‌ టీచర్లను డిప్యుటేషన్‌ వేస్తారు.

                  బదిలీల షెడ్యూల్‌ పాఠశాల విద్యా సంచాలకులు వారు విడుదల చేస్తారు.

                  బదిలీల ప్రక్రియ ఆన్‌ లైన్‌ ద్వారా జరుగుతుంది.

                  నియామకాధికారి వారు బదిలీ ఉత్తర్వులను ఇవ్వడానికి అధీకృత అధికారి.

                  సర్వీస్‌ పాయింట్లు : –

                  క్యాటగిరీ IV లో పనిచేసిన ప్రతి సం. కాలానికి 5, క్యాటగిరీ III లో పనిచేసిన ప్రతి సం. కాలానికి 3, క్యాటగిరీ ॥ లో పనిచేసిన ప్రతి సం.కాలానికి 2, క్యాటగిరీ | లో పనిచేసిన ప్రతి సం. కాలానికి 1 పాయింట్‌ చొప్పున మంజూరు చేస్తారు. అయితే ఈ పాయింట్లు గరిష్టంగా 40 దాటి ఇవ్వరు.

                  క్యాటగిరీ I – 20% ఇంటి అద్దె పొందే ప్రాంతాలు ; క్యాటగిరీ ॥| – 14.5% ఇంటి అద్దె పొందే ప్రాంతాలు ; క్యాటగిరీ III – 12% ఇంటి

                  అద్దె పొందే ప్రాంతాలు ; క్యాటగిరీ / – 12% ఇంటి అద్దె పొందే ప్రాంతాలలో పంచాయితీ రాజ్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌ మెంట్‌ వారి ప్రకారం అన్ని వాతావరణాలలోను రోడ్డు సదుపాయం లేనివి.

                  ఉపాధ్యాయుల పనిచేసే పాఠశాల బదిలీ పీరియడ్‌ నందు వేర్వేరు క్యాటగిరీలు ఉన్నచో పాయింట్లు తదనుగుణంగా మంజూరు చేస్తారు.

                  జిల్లా స్థాయి కమిటీ క్యాటగిరీ / జాబితా గతానిది, ఇప్పటిది అనుసరించి పాయింట్లు ఇవ్వాలి. తాజా క్యాటగిరీ |1/ జాబితాను పాయింట్ లెక్కించడానికి అధీకృతం చేయాలి. ఈ విషయంలో కమిటీ నిర్ణయమే ఫైనల్‌.

                  అక్టోబర్‌ 01 వ తేదీ నాటికి పూర్తి చేసిన సర్వీసులో ప్రతి సం.నికి 0.5 చొప్పున పాయింట్లు కేటాయిస్తారు. గరిష్టంగా 15 పాయింట్   మాత్రమే.

                  మొత్తం ఎన్‌ టైటిల్‌ పాయింట్లు 55 మించకూడదు.

                  స్పెషల్‌ పాయింట్లు :–

                  అవివాహిత అయిన టీచర్‌ / జిహెచ్‌.యం. కి – 5 పాయింట్లు ; స్పాస్‌ పాయింట్లు – 5 ; విభిన్న ప్రతిభావంతులకు (40 10 55%) -5 పాయింట్లు ; విభిన్న ప్రతిభావంతులకు (56 10 69%) – 10 పాయింట్లు ; గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా/రాష్ట

                  అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు — 5 పాయింట్లు ; మొత్తం స్పెషల్‌ పాయింట్లు – 25 ;

                  రేషనలైజేషన్‌ నందు ఎఫెక్ట్‌ అయిన టీచర్లకు – 5 పాయింట్లు; 8/5 గరిష్ట సర్వీస్‌ పూర్తి చేసిన వారికి వర్తించదు. బదిలీకి దరఖాస్తు చేసుకొనని రేషనలైజేషన్‌ ఎఫెక్టెడ్‌ టీచర్లకు క్యాటగిరీ ॥, / పాఠశాలలను కేటాయింపు జరుగుతుంది.

                  ఒక వేళ పాయింట్లు సమానమైతే క్యాడర్‌ నందు సీనియారిటీని తొలుత పరిగణనలోనికి తీసుకుంటారు. అపుడు కూడా సమానమైన వేళ పుట్టిన తేదీ ఆధారంగా సీనియర్‌ ను గుర్తిస్తారు. చివరిగా మహిళకు ప్రాధాన్యతను ఇస్తారు.

                  70% పైబడిన విభిన్న ప్రతిభావంతులు , విడో , విడాకులు పొందిన మహిళలు, క్యాన్సర్‌, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, బోన్‌ టిబి, కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌, డయాలసిస్‌, స్పెనల్‌ సర్జరీ చేయించుకున్న ఉపాధ్యాయులు, మెంటల్లీ రిటార్టెడ్‌ అయిన తల్లి, తండ్రి, పిల్లలు, స్వౌస్‌ ఉన్న ఉపాధ్యాయులు, గుండెలో హోల్‌, జువైనల్‌ డయాబిటీస్‌, తలసేమియా, హెమోఫోలియా, మస్కులర్‌ డిస్త్రఫీ జబ్బులతో బాధపడే పిల్లలు ఉన్న ఉపాధ్యాయులు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, బియస్‌.ఎఫ్‌. సి.ఆర్‌.పి.ఎఫ్‌, సి.ఐ.యస్‌.ఎఫ్‌.లకు సంబంధించి సర్వీస్ ‌పర్సన్‌ లేక ఎక్స్‌ సర్వీస్‌ పర్సన్‌ స్పౌస్‌ అయిన ఉపాధ్యాయులు

                  సేవా పుస్తకంలో ఎంట్రీ ఉండి పిహెచ్‌ కోటాలో ఎంపికైన విభిన్న ప్రతిభావంతులు ఎటువంటి ధృవపత్రాలు సమర్పించనక్కరలేదు.

                  పిల్లలు జబ్బులతో బాధపడుతూ ప్రిఫరెన్నియల్‌ క్యాటగిరీ నందు దరఖాస్తు చేసే ఉపాధ్యాయులు సంబంధిత మెడికల్‌ రిపోర్టుల జాయింట్‌ కలెక్టర్‌ వారికి సబ్మిట్‌ చేయాలి.

                  ప్రిఫరెన్నియల్‌ క్యాటగిరీ లేక స్పెషల్‌ పాయింట్లు 8/5లకు ఒకసారి మాత్రమే వర్తిస్తాయి. రేషనలైజేషన్‌ నందు ఎఫెక్ట్‌ అయిన టీచర్ల కు మాత్రం 8/5 సం.ల నిబంధన వర్తించదు. వారికి రేషనలైజేషన్‌ పాయింట్లు కూడా ఇస్తారు

                  ఖాళీలు :-

                  క్లియర్‌ వేకెన్సీస్‌ , తప్పని సరి బదిలీ వల్ల ఏర్పడిన ఖాళీలు , ఎరైజింగ్‌ వేకెన్సీస్‌ , ఒక సం. దాటి అనధికార గైర్హాజరు అయిన

                  ఉపాధ్యాయుల ఖాళీలు ; నాలుగు వారాలు దాటిన మెడికల్‌ లీవ్‌, ప్రసూతి శలవు లో ఏర్పడిన ఖాళీలలో వర్క్‌ ఎడ్డస్ట్‌ మెంట్‌ చేయాలి కాని ఖాళీలుగా నోటిఫై చేయకూడదు. ప్రతి క్యాడర్‌ నందు మంజూరైన పోస్టులు, ఏర్పడిన ఖాళీలను లెక్కించాలి. తేడా ఉన్న ఖాళీలు ఎన్ని ఉన్నాయో అదే సంఖ్యలో బ్లాక్‌ చేయాలి. 01-10-2020 నాటి యు-డైస్‌ లెక్కలు ఆధారంగా ఖాళీలను లెక్కిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలలో స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం, భౌతిక శాస్త్రం ఖాళీలను స్పెసిఫై చేయాలి.

                  ఖాళీలు – సీనియారిటీ లిస్ట్‌ – ఆర్‌.జె.డి. డి.ఇ.బ. వెబ్‌ సైట్ల యందు క్యాటగిరీ వారీగా పాఠశాలల జాబితాలు, పాఠశాలల వారీగా ఖాళీల జాబితా, తప్పని సరి బదిలీ అయిన టీచర్ల జాబితా, రేషనలైజేషన్‌ ఎఫెక్ట్‌ అయిన టీచర్ల జాబితా, దరఖాస్తు తేదీ ముగిసిన తరువాత క్యాడర్‌ వారీ ఎన్‌ టైటిల్‌ పాయింట్లతో కూడిన సీనియారిటీ లిస్ట్‌ ఉంచాలి.

                  ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు : – https://cse.ap.gov.in నందు ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్‌ లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తుల ను స్వీకరిస్తారు. ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసిన తరువాత ప్రింట్‌ జెట్‌ తీసి సంబంధిత అధికారులకు వెరిఫికేషన్‌ నిమిత్తం సబ్మిట్‌ చేయాలి.

                  ‘ప్రిఫరెన్నియల్‌ క్యాటగిరీ మరియు స్పాస్‌ క్యాటగిరీ వారు ఆన్‌ లైన్‌ దరఖాస్తుతో సంబంధిత ధృవపత్రాన్ని కూడా ఎన్‌ క్లోజ్‌ చేయాలి. ఆన్‌ లైన్ నందు ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేయాలి. ప్రొవిజనల్‌ సీనియారిటీ లిస్ట్‌ డిస్‌ ప్లే చేయాలి. ఫిర్యాదులు స్వీకరించాలి. తప్పని సరి బదిలీ అయినవారు అన్ని ఆప్పన్లు ఇవ్వాలి. తప్పని సరి బదిలీ అయిన వారు దరఖాస్తు చేయకపోయినా, ఆప్పన్లు పెట్టక పోయినా చర్యలు సంబంధిన్చి, ఉపాధ్యాయుల మీదా, అలాగే సంబంధిత అధికారుల మీదా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి క్యాటగిరీ III & IV లో ఉన్న ఖాళీలలో పోస్టింగ్‌ ఇస్తారు.

                  విద్యా సంచాలకులు ఫిర్యాదులను ఆన్‌ లైన్‌ / మేన్యువల్‌ గా పరిష్కరించి వెబ్‌ సైట్‌ నందు సీనియారిటీ లిస్ట్‌ ఉంచాలి.

                  కౌన్సిలింగ్‌ :- ఆన్‌ లైన్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌ జరుగుతుంది.

                  బదిలీ ఉత్తర్వులు :- సంబంధిత అధికారులు బదిలీ ఉత్తర్వులు ఇస్తారు.

                  బదిలీ అయిన ఉపాధ్యాయుల రిలీవింగ్‌ :– ఉత్తర్వులు అందిన తరువాతి రోజు నుండి 7 రోజుల లోపు విధులలో చేరాలి. ఒక పాఠశాలలో బదిలీ అయిన ఉపాధ్యాయులలో 50% ఉపాధ్యాయులను మాత్రమే ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్‌ చేస్తారు. బక పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నచో ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్‌ చేయరు. ఇరువురు ఉపాధ్యాయులకు బదిలీ జరిగినట్లయితే ఒకరిని అందులో సీనియర్‌ ని రిలీవ్‌ చేస్తారు.

                  ముగ్గురు ఉపాధ్యాయులకు బదిలీ జరిగినట్లయితే ఒకరిని అందులో సీనియర్‌ ని రిలీవ్‌ చేస్తారు.

                  అప్పీల్‌ :- టీచర్ల బదిలీ ఉత్తర్వులపై గ్రీవియన్స్‌ ఉన్నట్లయితే ఆర్‌.జె.డి. వారికి, జిహెచ్‌.యం.లకు గ్రీవియన్స్‌ ఉన్నట్లయితే కమీషనర్‌ వారికి ఉత్తర్వులు అందిన 10రోజుల లోపు ఫిర్యాదు చేసుకోవాలి. వారు సదరు అప్పీల్స్‌ ను 15 రోజుల లోపు క్లియర్‌ చేయాలి.

                  రివిజన్‌ :- పాఠశాల విద్యా సంచాలకులు నాలుగు వారాల లోపు ఏ ఉత్తర్వులనైనను సంబంధిత రికార్డులను పరిశీలించి నిలుపుదల కాని మార్పు చేయవచ్చును.

                  క్రమశిక్షణా చర్యలు :– తప్పుడు సమాచారం కాని, ధృవపత్రాలు కాని సమర్పించినట్లయితే సంబంధిత ఉపాధ్యాయులపైనా, సంబంధి, అధికారులపైనా సిసిఎ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకొనబడును. నియమ నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర్వులు ఇచ్చినట్లయితే కమిటీలో ఉన్న మెంబర్‌ సెక్రటరీ కూడా శిక్షార్పుడే. బదిలీ ఉత్తర్వులు విడుదలై, ఫిర్యాదులు గడువు కూడా ముగిసిన పిదప నూతన స్థానంలో చేరనట్లయితే సదరు ఉపాధ్యాయులకు నో వర్క్‌ నో పే వర్తింపు చేస్తారు.

                  పి.సి మీటింగ్స్ నిర్వహణ కి నిధులు విడుదల

                    0

                     రాష్ట్రం లోని అన్ని పాఠశాలల్లో త్రై మాసికానికి ఒక సారి

                    తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడానికి గాను ఎలిమెంటరీ పాఠశాలలకు, సెకండరీ పాఠశాలలకు రూ.3000/- చొప్పున నిధులు విడుదల చేస్తూ సమగ్ర శిక్ష డైరెక్టర్ వెట్రి సెల్వి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

                    ఎలిమెంటరీ స్కూల్ బడ్జెట్

                    [post_ads]

                    సెకండరీ స్కూల్ బడ్జెట్