Home Blog Page 397

బదిలీలకు మోక్షం

    0
    • ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా
    • ఆర్నెళ్ల నుంచి ఊరిస్తున్న ప్రక్రియ
    • వితంతు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక రుగ్మత, రెండేళ్ల సర్వీస్‌ ఉన్న వారికి మినహాయింపు
    • వచ్చే నెల 24 కల్లా కొత్త స్థానాల్లోకి టీచర్లు

    కాకినాడ, న్యూస్ టోన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. ఆర్నెళ్ల నుంచి టీచర్లను ఊరిస్తున్న ప్రక్రియకు మోక్షం లభించింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం జీవో నెం.59 జారీ చేసింది. నిబంధనల మేరకు వితంతు, విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు, రెండేళ్ల సర్వీస్‌ ఉన్న వారికి బదిలీల్లో మినహాయింపు లభించింది. బదిలీలన్నీ అమరావతినుంచి పాఠశాల విద్య కమిషనరేట్‌ కార్యాలయంనుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. వచ్చేనెల 24కల్లా బదిలీ అయిన వారు కొత్త స్థానాల్లో చేరనున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇదే సమయంలో కొవిడ్‌ ఉధృతమవ్వడంతో రెండు దఫాలు బదిలీలు వాయిదా వేశారు. గతంలో ఆన్‌లైన్‌ ద్వారా బదిలీకి దరఖాస్తు చేసిన ఉపాధ్యాయుల జాబితా ప్రాథమిక  విద్యశాఖ కమిషనరేట్‌ నుంచి జిల్లా విద్యాశాఖకు వచ్చింది. దాని ఆధారంగా డీఈవో కార్యాలయ సిబ్బంది దరఖాస్తులను  పునఃపరిశీలించి తుది పరిశీలన చేసి ఇటీవల సదరు జాబితా అమరావతికి పంపారు. జిల్లాలో అన్ని కేటగిరీల్లో 14,300 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకేచోట ఎనిమిదేళ్లు పనిచేసిన ఉపాధ్యాయులందరూ బదిలీకి అర్హులయ్యారు. ఇప్పుడు జరుగుతున్న బదిలీల్లో 7,425మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,127మంది తప్పనిసరి బదిలీ జాబితాలో ఉన్నారు. మిగిలిన వారికి రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌లకు అవకాశమిచ్చారు.

    ఏజెన్సీలో పనిచేయాల్సిందే..

    ఇప్పటివరకు జిల్లాలో పలు విడతల్లో జరిగిన టీచర్ల బదిలీల్లో అధికశాతం మంది ప్లెయిన్‌ ఏరియాల్లోనే బదిలీ అయ్యేవారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా 2017లో జరిగిన బదిలీల్లో చాలామంది ఏజెన్సీకి బదిలీపై వెళ్లలేదు. దీంతో సబ్‌ప్లెయిన్‌, రిమోట్‌ ప్రాంతాల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తోంది. ఈ సారి వారు చేసిన సర్వీస్‌ సీనియార్టీ ప్రకారం ఆన్‌లైన్‌లో బేరీజు వేసి, అటువంటి వారిని ఏజెన్సీకి బదిలీ చేయాలని ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. దీంతో ఏజెన్సీ ముఖం చూడని వారు తప్పని పరిస్థితిలో అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. 

    ఇదీ షెడ్యూల్‌

    అమరావతి నుంచి వచ్చిన బదిలీ జాబితా దరఖాస్తులను ఈ నెల 28, 29 తేదీల్లో డీఈవో కార్యాలయంలో పరిశీలిస్తారు. ఉపాధ్యాయులకు వచ్చిన సర్వీస్‌ పాయింట్‌ల ఆధారంగా ప్రొవిజనల్‌ సీనియార్టీ జాబితాను ఈనెల 30 నుంచి డిసెంబరు 2 వరకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. సదరు జాబితాపై అభ్యంతరాలుంటే డిసెంబరు 3, 4 తేదీల్లో డీఈవో కార్యాలయంలో లిఖితపూర్వకంగా, సంబంధిత డాక్యుమెంట్‌లతో పరిష్కరించుకోవడానికి గడువు ఇచ్చారు. అనంతరం సిద్ధం చేసిన జాబితాను జేసీకి నివేదిస్తారు. దీనిపై జేసీ 5, 6, 7 తేదీల్లో పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పాయింట్ల ఆధారంగా డిసెంబరు 8, 9, 10 తేదీల్లో సీనియార్టీ జాబితా ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 11 నుంచి 15 వరకు బదిలీకి దరఖాస్తు చేసిన వారు వెబ్‌ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారు. 16 నుంచి 21 వరకు బదిలీ ఉత్తర్వులు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. 22, 23 తేదీల్లో బదిలీ ఉత్తర్వుల్లో సాంకేతిక అవరోధాలుంటే వాటిని పరిష్కరిస్తారు. డిసెంబరు 24న బదిలీ ఉత్తర్వులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

    కరోనా థర్డ్ వేవ్ తస్మా త్ జాగ్రత్త

      0
      • కోవిడ్ విజృంభణపై నిపుణుల హెచ్చరికలు
      • 40వేలకు పైగానే రోజువారి కొత్త కేసులు

      న్యూస్ టోన్, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో కోవిడ్ విజృంభణపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. థర్వేవ్ నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కొద్దివారాల పాటు వైరస్ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఐదు వారాల కిందట ఢిల్లీలో పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, ప్రస్తుతం తీవ్రత తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ ముప్పు తొలగిపోయినట్లు భావించడానికి వీల్లేదని వైద్యలు వెల్లడిస్తున్నారు అక్టోబర్ లో రెండోదశ ముగిసింది. నవంబర్ మధ్యలో మూడో దశ మొదలైందని నోయిడాలోని ఫార్టీస్ హెల్త్ కేర్ ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ అగర్వాల్ చెప్పారు. మూడోదశలో శ్వాసకోశ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఊపిరి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, కోవిడ్ తర్వాత మరిన్ని సంక్లిష్టతలు కలుగుతున్నాయని చెప్పారు. బుధవారం సాయంత్రం నాటికి ఢిల్లీలో మొత్తంగా 5,45,787 పాజిటివ్ లు, 8,720 మరణాలు నమోద య్యాయి.

      తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న నివర్ తుపాను

        0
        • రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఆ తదుపరి అల్పపీడనంగా బలహీన పడనుంది 
        • తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కీమీ దూరంలో , చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో నివర్
        • చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు
        • శుక్రవారానికి తగ్గునున్న నివర్ ప్రభావం

        రాగల రెండు రోజుల వాతావరణ వివరాలు: 

        శుక్రవారం (27/11/2020) 

        శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి , కృష్ణా , గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు.

        శనివారం (28/11/2020)

        కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి ,రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు.

        • వర్షాల నేపధ్యంలో వాగులు, వంకలు పొంగిపోర్లే అవకాశం
        • లోతట్టు  ప్రాంత  ప్రజలు  అప్రమత్తంగా ఉండాలి 
        • రైతులు పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

        అని  విపత్తుల శాఖ  కమిషనర్ కె.కన్నబాబు తెలియ చేశారు.

        అక్టోబర్ లో జరిగిన ప్రమోషన్లకు రీ కౌన్సెలింగ్‌

          0
          • తెలుగు, హిందీ పండిట్ల ఉద్యోగోన్నతులకు రీకౌన్సెలింగ్‌ చేయండి
          • ప్రకాశం జిల్లా డి.ఈ.ఓ కి కమీషనర్ ఆదేశం

          ఒంగోలు విద్య, న్యూస్ టోన్: జిల్లాలో తెలుగు, హిందీ స్కూలు అసి స్టెంటు పోస్టులకు నిర్వహించిన ఉద్యోగోన్నతల కౌన్సెలింగ్‌ను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని రాష్ట్రపాఠశాల విద్య డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూలుఅసిస్టెంటు తెలుగు, హిందీ పో స్టులు భర్తీకి అక్టోబరు 21న డీఈవో ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. కేవలం గ్రేడ్‌-2 భాషోపాధ్యాయులను మాత్రమే పరిగణలోకి తీసుకో కుండా సెకండరీగ్రేడ్‌ టీచర్లకు అన్యాయం చేశారని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సింగిల్‌ సబ్జెక్టు, థర్డ్‌ మెధడాలజీ ఉన్నవారికి కూడా ఉద్యోగోన్నతులు ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నా పరిగణలోకి తీసుకోలేదనే విషయాన్ని డైరెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన డైరెక్టర్‌ ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలను సవరించి పారదర్శకంగా తుదిజాబితాను ప్రకటించాలని ఆదేశించారు. పాఠశాల విద్య ఆర్జేడీ పర్య వేక్షణలో తాజాగా ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పేర్కొన్నారు.

          గిరిజన విద్యార్థులకు రెండు ప్రత్యేక కేంద్రాలు

            0

            • ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

            న్యూస్ టోన్, అమరావతి: గిరిజన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నీట్ ఐఐటీలో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో రెండు ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి (బీవోజీ) సమావేశం గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ..గురుకులాల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలోని పెందుర్తిలో బాలికలకు, మారికవలసలో బాలురకు ప్రత్యేకంగా రెండు నీట్, ఐఐటీ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి.. రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఫలితాలు సరిగా రాని ‘ఎక్స్టెన్స్ విద్యాసంస్థల’ను సాధారణ విద్యాసంస్థలుగా మార్చేస్తామని చెప్పారు. అవసరమైన చోట సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. పనులు సకాలంలో చేయని సంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఐటీ వింగ్ ఏర్పాటు చేసి, ఐఐటీ, ఎన్ఐటీలలో నలుగురు కన్సల్టెంట్లను నియమించి ఉన్నత విద్యను అందిస్తామని పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.

            ఉద్యోగులందరకీ త్వరలో స్మార్ట్ హెల్త్ కార్డులు

              0

              న్యూస్ టోన్, అమరావతి: త్వరలో ఉద్యోగులందరికి  స్మార్ట్ హెల్త్ కార్డులు ప్రింట్ చేసి ఇవ్వనున్నామని ఆరోగ్య శ్రీ ట్రస్టు సిఈవో తెలిపారు. దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి హెల్త్ కార్డ్ వివరాలను ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. ఉద్యోగి పేరు, జెండర్, మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, హోదా, లేటెస్ట్ ఫోటో వంటి వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది అని అన్నారు.

              ఎడిట్ చేయు విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

              ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం

                0

                న్యూస్ టోన్, విద్య : ట్రిపుల్ ఐటి లలో ప్రవేశానికి పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడమైనది అని కన్వీనర్ శ్రీ హరి నారాయణ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్ష 28-11-2020 వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ఈ పరీక్షకు మొత్తం 88,972 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో 48,422 మంది బాలురు మరియు 40,550 మంది బాలికలు హాజరవుతున్నారు. ఇందులో 86,617 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ నుండి మరియు 2,355 మంది విద్యార్ధులు తెలంగాణ నుంచి హాజరవుతున్నారు. మొత్తం 638 పరీక్ష కేంద్రాలకు గానూ 630 పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌ లోనూ మరియు 8 పరీక్ష కేంద్రాలు తెలంగాణాలోనూ ఏర్పాటు చేయడమైనది. ఈ పరీక్ష ద్వారా నాలుగు IIIT లలో ఉన్న 4000 సీట్లను మరియు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం మరియు డా.వై.ఎస్‌.ఆర్‌. హార్టీకల్చ్బరల్‌ విశ్వవిద్యాలయాలలో గల 6,000 సీట్లను డిప్లొమా కోర్సుల కొరకు ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్షలకు 53 మంది అంధ విద్యార్థులు కూడా హాజరవుతున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, OMR షీట్లు మరియు పరీక్ష కేంద్రానికి సంబంధించిన మెటీరియల్‌ అంతా కూడా జిల్లాలకు రవాణా చేయడమైనది. అలాగే జిల్లా కేంద్రాల నుండి పరీక్ష కేంద్రాలకు సమీపంలోనున్న పోలీస్‌ స్టేషన్లలో వీటిని భద్రపరచడం అయినది. ఈ పరీక్షలకు సంబంధించిన చీఫ్‌ సూపరింటెండెంట్‌ లు, డిపార్మ్మెంటల్‌ ఆఫీసర్‌ లు, రూట్ ‌ఆఫీసర్‌ లు, ఇన్విజిలేటర్‌ లు మరియు మిగిలిన బోధనేతర సిబ్బంది నియామకాలు పూర్తి అయినవి అని కన్వీనర్ శ్రీ హరి నారాయణ తెలిపారు.

                డ్రై రేషన్ పంపిణీ సరిగా చేయని వారిపై చర్యలు

                  0

                  న్యూస్ టోన్, అమరావతి: విద్యార్థులకు పంపిణీ చేసే డ్రై రేషన్ పంపిణీ పారదర్శకంగా , ఎట్టి విచలనాలకు తావు లేకుండా , మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేయాలనీ, మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రై రేషన్ ను పంపిణీ చేయని క్షేత్రస్థాయి అధికారులపై క్రమశిక్షణా చర్యలు గైకొనాలని అందరు జిల్లా విద్యా శాఖాధికారుల ను కోరుతూ మధ్యాహ్న భోజన పథకం & పాఠశాల శానిటేషన్ రాష్ట్ర సంచాలకులు ఆదేశాలు జారీ చేసారు

                  ఆంధ్రప్రదేశ్ పాఠశాలలపై తుఫాను ప్రభావం

                  0

                  • 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు. 
                  • అయినప్పటికీ 30 శాతం విద్యార్థుల హాజరు.
                  • కోవిడ్ జాగ్రత్తలతో పాఠశాలలు 
                  • విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్ వెల్లడి. 

                  న్యూస్ టోన్, అమరావతి : తుఫాన్ ప్రభావం పాఠశాలలపై పడింది. 5 జిల్లాల్లో పాఠశాలలకు తుఫాను కారణంగా సెలవులు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రతిరోజూ 50శాతం తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతుండగా 5 జిల్లాల్లో సెలవులు కారణంగా దాదాపు 30 శాతం హాజరు నమోదైంది. గురువారం విద్యార్థుల హాజరుకు సంభందించిన వివరాలను  విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

                  గురువారం 10వ తరగతి విద్యార్థులు 23.31 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 31.36 శాతం విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు 28.13 శాతం హాజరయ్యారు. వర్షాల కారణంగా 

                  కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో

                  పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ సెలవు సమాచారం వచ్చేలోగానే ఉదయం ఈ 5 జిల్లాల్లో 2 నుంచి 8 శాతం విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం అన్నారు.

                  కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో, కళాశాలల్లో  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు.  ప్రతిరోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపారు.

                  ఉయ్ లవ్ రీడింగ్ కార్యక్రమం

                    0

                    ★ 3 వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థులలో ఫౌండేషన్ రీడింగ్ అక్షరాస్యత నైపుణ్యాలను ప్రోత్సహించడానికి “వుయ్  లవ్ రీడింగ్” (చదవడం మాకిష్టం) అనే ప్రత్యేక ప్రచారాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

                     ★ ఈ మిషన్ మోడ్ ప్రచారంలో పిల్లలందరికీ పాఠశాల, ఇల్లు మరియు గ్రామంలో ఆనందకరమైన వాతావరణంలో చదవడానికి వివిధ మార్గాలు అందించబడతాయి.

                    ★ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత, రిటైర్డ్ వ్యక్తులు, విద్యావేత్తలు, ఎన్జీఓఎస్ తదితరులు ఈ ప్రచారాన్ని నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది.

                    ★ ఉయ్ లవ్ రీడింగ్” ప్రచారం నాలుగు దశల్లో అమలు చేయబడుతుంది.

                    ★ 1. ప్రిపరేటరీ స్టేజ్ నవంబర్ 2020, డిసెంబర్ 2020, జనవరి 2021.

                    ★ 2. ఫౌండేషన్ స్టేజ్ – ఫిబ్రవరి 2021, మార్చి 2021, ఏప్రిల్ 2021.

                    ★ 3. అధునాతన దశ – మే 2021, జూన్ 2021, జూలై 2021.

                    ★ 4. వాలెడిక్టరీ స్టేజ్ ఆగస్టు 2021, సెప్టెంబర్ 2021, అక్టోబర్ 2021, నవంబర్ 2021.

                     1. ప్రిపరేటరీ దశ:

                    ★ సమాజంలోని అన్ని స్థాయిలకు చదవడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం.  విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు నిర్వాహకులు.  విద్యార్థుల పఠన సామర్థ్యం ఆధారంగా 4 స్థాయిలుగా బేస్‌లైన్ అసెస్‌మెంట్ మరియు విభజన నిర్వహించడం. 

                    ★  పాఠశాల లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలతో అన్ని తరగతి గదుల్లో తరగతి గది లైబ్రరీ / రీడింగ్ కార్నర్ ఏర్పాటు.  బుక్ బ్యాంక్ కోసం పుస్తకాల సేకరణ కోసం ర్యాలీలు నిర్వహించడం మరియు పఠనంపై అవగాహన తీసుకురావడం. 

                    ★ కమ్యూనిటీ రీడింగ్ సెంటర్లు మరియు కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్లను సెలవుదినాల్లో మరియు పాఠశాల సమయము తరువాత ప్రచారం చేయటానికి గుర్తించడం.  లైబ్రరీ పుస్తక పఠనం కోసం ప్రతిరోజూ ఒక వ్యవధిని ప్రత్యేకంగా నిర్వహించండి. 

                    ★ నెలవారీ అంచనా, నెల నిర్దిష్ట కార్యక్రమాలు (రీడింగ్ మేళా, రీడింగ్ ఫెస్ట్స్, రీడింగ్ బజ్) జనవరి 2021 చివరి వారంలో నిర్వహించబడతాయి. అన్ని సన్నాహక కార్యకలాపాలు నవంబర్ 2020 నుండి జనవరి 2021 వరకు పూర్తి కావాలి.

                    2. ఫౌండేషన్ స్టేజ్:

                    ★ ఇది  విద్యార్థులలో పఠన అలవాటు, పఠన సామర్థ్యాన్ని ప్రోత్సహించడంలో కీలకమైన దశ.  లైబ్రరీ బుక్ రీడింగ్ కోసం ప్రత్యేకమైన పఠన కాలాలను కేటాయించాలి.  కాబట్టి లైబ్రరీ పుస్తక పఠనం కోసం ప్రత్యేకంగా ఒక కాలాన్ని కొనసాగించాలి. 

                    ★ విద్యార్థులు ప్రత్యామ్నాయ రోజుల్లో తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలి.  పాఠశాల / కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ / గ్రామంలో మాస్ రీడింగ్, క్లాస్‌రూమ్ రీడింగ్, పబ్లిక్ రీడింగ్ కార్యకలాపాలు నిర్వహించబడతాయి, తరువాత వారి పనితీరును అంచనా వేయడానికి విద్యార్థులకు పఠన పోటీలు ఉంటాయి.  

                    ★ కమ్యూనిటీ రీడింగ్ సెంటర్ సజావుగా పనిచేయడానికి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్‌ను కనుగొని ట్యాగ్ చేయాలి.  నెలవారీ అంచనా, నెల నిర్దిష్ట కార్యక్రమాలు (రీడింగ్ మేళా, రీడింగ్ ఫెస్ట్స్, రీడింగ్ బజ్) ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2021 చివరి వారంలో నిర్వహించబడతాయి. 

                    ★ పాఠశాలలు పూర్తి రోజు 2 కాలానికి పనిచేస్తే లైబ్రరీ పుస్తక పఠనం కోసం కేటాయించాలి  GO RT No. 220 లో పేర్కొనబడింది. అన్ని పునాది దశ కార్యకలాపాలు ఫిబ్రవరి 2021 నుండి 2021 ఏప్రిల్ వరకు పూర్తి కావాలి. పునాది దశ చివరిలో విద్యార్థులు సొంతంగా కథ పుస్తకాలను చదవగలగాలి.

                    3. అధునాతన దశ:

                    ★ ఈ దశ ఒకే సమయంలో చదవడం మరియు గ్రహించడంపై దృష్టి పెడుతుంది.  తెలియని పదాల అర్థాన్ని అర్థం చేసుకోవడానికి నిఘంటువును ఉపయోగించడం.  ఈ దశ చివరిలో, విద్యార్థులు సరళంగా చదవగలరు మరియు దాని అర్ధాన్ని అర్థం చేసుకోవాలి.  కమ్యూనిటీ రీడింగ్ వాలంటీర్లు ఈ దశలో కీలక పాత్ర పోషిస్తారు.

                    4. వాలెడిక్టరీ స్టేజ్:

                    ★ డైలీ పుస్తక పఠన కాలాలను ఈ దశలో కొనసాగించాలి.  నవంబర్ 2021 నెలలో ఎండ్ లైన్ అసెస్‌మెంట్ యొక్క ప్రవర్తన. విద్యార్థులందరూ సరైన అవగాహనతో సొంతంగా చదవగలుగుతున్నారని చూడటానికి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బాధ్యత వహిస్తారు.  

                    ★ అప్ గ్రేడర్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలి, విద్యార్థుల పనితీరును 3 వ పార్టీ అంచనా వేస్తుంది.  డేటా అనలిటిక్స్ ఆధారంగా ప్రచారం యొక్క స్థిరమైన మోడ్‌లో రూపకల్పన చేయబడుతుంది.