Home Blog Page 396

హెల్త్ కార్డు సవరణలకు ఏడు రోజులే గడువు

    0

    అమరావతి, న్యూస్ టోన్: డా. వై.యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు QR కోడ్ తో కూడిన EHS స్మార్ట్ హెల్త్ కార్డ్ ని జారీ చేయడం జరుగుతున్నది. QR కోడ్ కలిగిన EHS స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీ కొరకు మీ వివరాలను EHS పోర్టల్ లాగిన్ ద్వారా సరి చూసుకుని మార్పులు ఉన్నయెడల ఏడు రోజులలో అప్డేట్ చెయ్యండి. ఇందు కొరకు మీరు EHS పోర్టల్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లతో లాగిన్ అయ్యాక, డౌన్లోడ్ హెల్త్ కార్డ్స్ మీద క్లిక్ చేసిన యెడల మీకు ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మీ వివరాలను అప్డేట్ చేయగలరు. ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఈ విషయాన్ని గమనించి మీ లాగిన్ సరిచూసుకొని అందులో మీ పేరు, జెండర్, చిరునామా, ఫోటో, ఆధార్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ సరిగా ఉన్నాయో లేదో గమనించి అక్కడ ఏదైనా తప్పులు ఉన్నచో సరి దిద్దుకోనుటకు ఏడు రోజులు గడువు ఇవ్వబడినది. మీరు అప్డేట్  చెయ్యని యెడల ఉద్యోగస్తుల మరియు పెన్షనర్ల దరఖాస్తులో ఉన్న వివరాలు సరైనవే అని భావించి స్మార్ట్ హెల్త్ కార్డులో ఆ వివరాలు ప్రింట్ చెయ్యడం జరుగుతుంది. ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఈ అవకాశాన్ని గమనించి మీ లాగిన్ ని సరిచేసుకొని డా.వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కి సహకరించగలరు అని డా.ఏ.మల్లికార్జున, IAS, ముఖ్య కార్య నిర్వహణ అధికారి, డా.వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్  వారు కోరడమైనది. ఏదైనా సందేహాల కొరకు టోల్ ఫ్రీ నెంబర్  104 కి మరియు 8333817469, 8333817406, 8333817414 లకు ఫోన్ చెయ్యగలరు, అలాగే ap_ehf@ysraarogyasri.ap.gov.in, ap_c439@ysraarogyasri.ap.gov.in కి మెయిల్ చెయ్యగలరుు.

    బదిలీలకు స్టేషన్ పాయింట్లు పెంచుతూ సాఫ్ట్వేర్ మార్పు

      0
      • స్టేషన్ పాయింట్లు పని చేసిన మొత్తం కాలానికి పెంపు
      • సర్వీస్ పాయింట్లు గరిష్ఠంగా 16.5 కి పెంపు

      న్యూస్ టోన్, అమరావతి: బదిలీల సాఫ్ట్వేర్ లో తాజా సవరణల ప్రకారం మార్పులు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో కమీషనర్ చర్చల్లో భాగంగా స్టేషన్, సర్వీస్ పాయింట్లు పెంచడానికి ఒప్పుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు, సవరణ షెడ్యూల్ కూడా విడుదల అయ్యాయి. దీనితో బదిలీల సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు. ఈ మార్పులు కేవలం డిఈఓ, ఎం.ఈ.ఓ లాగిన్ లలో అప్లైడ్ టీచర్స్ లిస్ట్ లో మాత్రమే కనబడుతున్నాయి. (ఉపాధ్యాయులు తమ అప్ప్లికేషన్ ను డౌన్లోడ్ చేసి సరి చూసుకోగలరు – ఇంకా అప్ప్లికేషన్ లో అప్ డేట్ అవ్వలేదు). షెడ్యూల్ లో భాగంగా 28,29 తేదీలలో డిఈఓ కార్యాలయం ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తులను ఆన్లైన్ లో వెరిఫై చేయాల్సి ఉంది.

      ఈ క్రింది లింక్ ల ద్వారా మీ దరఖాస్తులను దరఖాస్తు ఐడి నంబరు ఇచ్చి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

      సర్వర్ 2 – ఇక్కడ క్లిక్ చేయండి

      సర్వర్ 3  – ఇక్కడ క్లిక్ చేయండి

      పెండింగ్ జీతాలు, పెండింగ్ డిఏ లకు మంత్రి మండలి ఆమోదం

        0
        • మొదటి రెండు డిఏ లు 3.144 గా నిర్ణయం
        • మూడవ డిఏ 5.24 గా నిర్ణయం
        • పెండింగ్ జీతాలు డిసెంబర్‌, జనవరి నెలల్లో చెల్లింపులు

        న్యూస్ టోన్, అమరావతి: ఉద్యోగులకు 2019 జులై నుంచి పెండింగులో ఉన్న కరవు భత్యం 5.24శాతం మేర చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగులో ఉన్న మూడు డీఏలలో తొలి రెండు 3.144శాతంగాను, మూడో డీఏ 5.24శాతంగా రాష్ట్ర మంత్రి మండలి శుక్రవారం ఆమోదించింది. మంత్రి మండలి నిర్ణయాలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు చెప్పారు. తొలి డీఏ అరియర్స్ 30 నెలలవి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. 2018 జులై నుంచి ఇవ్వాల్సిన డీఏ అరియర్స్ భారం రూ.3017 కోట్లుగా పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి జీతాలు, పెన్షన్లతో పాటు నగదు రూపంలో చెల్లిస్తామన్నారు. ఈ డీఏ వల్ల ఏడాదికి ప్రభుత్వంపై భారం రూ.1,206.96 కోట్లు పడుతుందని చెప్పారు.2019 జవనరి నుంచి పెండింగులో ఉన్న డీఏ అమలు వల్ల కూడా ఇదే మొత్తాలు ఖర్చవుతాయని పేర్కొన్నారు. 2019 జులై నుంచి అమలు చేయాల్సిన డీఏ 5.24శాతం చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంటూ అరియర్స్ భారం రూ.5,028.90 కోట్లు పడుతుందన్నారు. మూడో డీఏ వల్ల ఏడాదికి ప్రభుత్వానికి రూ.2,011.56 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. మొత్తం మూడు డీఏల అరియర్స్ భారం రూ.11 వేల కోట్ల పై మాటే అని కన్నబాబు చెప్పారు.

        కరోనా కారణంగా ఉద్యోగులకు కోత పెట్టిన వేతనాలను డిసెంబర్‌, జనవరి నెలల్లో చెల్లింపులు చేయనున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు.కోత విధించిన వేతనాలకు రూ.2,324 కోట్లు, పింఛనుదారులకు రూ.482 కోట్ల చెల్లింపులు చేస్తామన్నారు.

        2009 నుండి ప్రమోషన్ వివరాలు కోరిన కమీషనర్

          0
          •  పీ.డీ, ఎస్.ఏ ల ప్రమోషన్ వివరాలు ఇవ్వండి

          న్యూస్ టోన్, ఇబ్రహీం పట్నం: అందరు డిఈఓ లు 2009 నుండి 2018 వరకు ప్రమోషన్ వివరాలను పంపాలని కమీషనర్ వారు ఆదేశించారు. ట్రాన్స్ఫర్లు లో అప్గ్రేడెడ్ పి.ఈ.టి మరియు ఎస్.ఏ (భాషా)  ఖాళీలు చూపించమని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అడిగిన దరిమిలా ఎంతమంది ప్రమోట్ అయ్యారు , మరియు డిఈఓ పూల్ లో ఉన్న వారి వివరాలు పంపాలని కమీషనర్ వారు ఆదేశాలు జారీ చేశారు.

          నిష్ఠ శిక్షణ 10 వ మాడ్యూల్ రిజిస్ట్రేషన్

          0

          • డిసెంబర్ 01 నుండి మొదలు
          • డిసెంబర్ 15 లోగా పూర్తి చేయాలి

          న్యూస్ టోన్, అమరావతి: నిష్ఠ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం లో భాగంగా 10 వ మాడ్యూల్ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ను దీక్షా ఆప్ లో ఎనేబుల్ చేశారు. ఈ మాడ్యూల్ కు రిజిస్టేషన్ లు డిసెంబర్ 1 నుండి మొదలు అవుతాయి. ఈ మాడ్యూల్ ను డిసెంబర్ 15 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అటు దీక్షా ఆప్ లో నిష్ఠ కోర్సు కు అసలు రిజిస్టర్ అవ్వని ఉపాధ్యాయులు షో కాజ్ నోటీస్ లు అందుకుంటున్నారు.

          10 వ మాడ్యూల్ లో రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

          ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్ష వాయిదా

            0
            • సైక్లోన్ ప్రభావంతో వాయిదా నిర్ణయం
            • డిశంబర్ 5 కు పరీక్ష వాయిదా

            న్యూస్ టోన్, అమరావతి: నివర్ తుఫాను ప్రభావం తో రేపు జరగాల్సిన ట్రిపుల్ ఐటి ప్రవేశ పరీక్ష ను వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ శ్రీ డి.హరి నారాయణ పత్రికా ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్షను డిశంబర్ 5వ తేదీన శనివారంనిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్ధులు అందరూ ఈ మార్పు ను గమనించాలని ఆయన కోరారు. అదే విధంగా డిశంబర్ 5వ తేదీన నిర్వహించు ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందనీ, సెంటర్ లలో కానీ, హాల్ టికెట్ లలో కానీ ఏ విధమైన మార్పులు ఉండవని తెలిపారు. ఆ రోజున విద్యార్ధులు పరీక్షా సమయం కంటే 2 గంటల ముందు ఎక్జామ్ హాల్ కు చేరుకోవాలని ఆయన సూచించారు.

            టెన్త్‌ విద్యార్థినులకు సీపీ బ్రౌన్‌-ఎస్పీబీ తెలుగు పోటీ

              0

              న్యూస్ టోన్, అమరావతి: తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కోసం దాసుభాషితం, తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో పదో తరగతి బాలికలకు సీపీబ్రౌన్‌-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు పోటీ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడు తెలిపారు. విద్యార్థుల్లో మాతృభాష మీద ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు డిసెంబరు 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 13న పోటీ ఉంటుందని, 20న విజేతలను ప్రకటిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

              125 డీఈడీ కళాశాలల మూసివేత

                0

                న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ప్రైవేటు డీఈడీ (డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌) కళాశాలలు భారీగా మూతపడ్డాయి. డీఈసెట్‌ ప్రవేశాలకు దరఖాస్తు చేస్తున్నవారు కన్వీనర్‌ కోటా సీట్లలో 30 శాతం కూడా లేరు. యాజమాన్య కోటా, స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పొందేవారు తప్పనిసరిగా డీఈసెట్‌లో అర్హత సాధించాలన్న నిబంధనతో ప్రైవేటు కళాశాలలకు విద్యార్థులు దొరక్క మూసివేత తప్పలేదు.

                రాష్ట్రవ్యాప్తంగా 2019- 2020లో 537 ప్రైవేటు డీఈడీ కళాశాలలుండగా.. ఈ ఏడాది 125 విద్యా సంస్థలు మూతపడ్డాయి. పాఠశాల విద్యాశాఖ 423 కళాశాలలకు అనుమతులు ఇవ్వగా వీటిలో 11 యాజమాన్యాలు తమకు విద్యార్థులను కేటాయించవద్దంటూ స్వచ్ఛందంగా మూసివేశాయి.  

                2020-21 సంవత్సరానికి డీఈసెట్‌కు 10,810 మంది దరఖాస్తు చేయగా.. 9,014 మంది అర్హత సాధించారు. 412 ప్రైవేటు కళాశాలల్లో 35,080, 14 ప్రభుత్వ కళాశాలల్లో 1,650 సీట్లు ఉన్నాయి. అర్హత సాధించిన వారంతా డీఈడీలో చేరినా మొత్తం సీట్లలో 25శాతం మాత్రమే భర్తీ కానున్నాయి. ఎక్కువ మంది అభ్యర్థులు ప్రభుత్వ డైట్‌ కళాశాలలను ఎంచుకుంటున్నందున ప్రైవేటులో సుమారు 80 శాతం సీట్లు మిగిలిపోనున్నాయి.

                ఆర్జీయూకేటీ సెట్‌కు నిమిషం ఆలస్యం నిబంధన

                  0
                  • రేపు ప్రవేశ పరీక్ష

                  న్యూస్ టోన్, అమరావతి: ఏపీ, తెలంగాణలో శనివారం జరగనున్న రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని కన్వీనరు హరినారాయణ స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు 88,972 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరిలో ఏపీకి చెందినవారు 86,617 మంది ఉన్నారని తెలిపారు. 53 మంది అంధ విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఏపీలో 630, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో 4వేల సీట్లు, ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ, వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో డిప్లామా కోర్సులకు 6 వేల సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

                  సంపూర్ణ విజ్ఞానం కోసమే ‘చదవటం మాకిష్టం’

                    0
                    • గుంటూరులో కార్యక్రమం ప్రారంభ సభలో విద్యాశాఖ మంత్రి సురేష్

                    న్యూస్ టోన్, అమరావతి బ్యూరో: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడం, చదువులోని ఆనందాన్ని పరిచయం చేయడానికే ‘చదవటం మాకిష్టం’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. పాఠ్యపుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలు చదివితేనే సంపూర్ణ విజ్ఞానం లభిస్తుందన్నారు. గురువారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏర్పాటుచేసిన చదవటం మాకిష్టం (వుయ్ లవ్ రీడింగ్) కార్యక్రమాన్ని హోంమంత్రి మేకతోటి సుచరితతో కలసి సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘చదవటం మాకిష్టం’ లోగో, కరపత్రాలు, గీతాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఏడాది పాటు ఉద్యమంలా తీసుకెళ్తామని సురేష్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో టీచర్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు వీటన్నింటిని అనుసంధానిస్తూ రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ యూనివర్సిటీని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసి టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీగా నామకరణం చేస్తామని తెలిపారు హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చట్టాలు చేసిందన్నారు. వాటిని ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్నారు. కాగా, ఇదే వేదికపై రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ విద్యాశాఖ డైరెక్టర్ చిన వీరభద్రుడు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.