Home Blog Page 398

ఐదు వర్సిటీలకు వీసీల నియామకం

    0

    • కోర్టు తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టీకరణ

    ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు షరతులతో ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

    ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, శ్రీవేంకటేశ్వర వర్సిటీకి రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి, రాయలసీమ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్‌ ఎ.ఆనందరావు, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి ప్రొఫెసర్‌ ఎం.రామకృష్ణారెడ్డి, ద్రవిడ వర్సిటీకి ప్రొఫెసర్‌ తుమ్మల రామకృష్ణలను ఉపకులపతులుగా నియమించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకానికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. విశ్వవిద్యాలయాల చట్ట సవరణపై న్యాయస్థానంలో పిల్‌ ఉన్నందున గవర్నర్‌ కార్యాలయం వీసీల నియామక దస్త్రాన్ని పక్కన పెట్టింది. దీనిపై, ఉన్నత విద్యా శాఖ తరఫున అధికారులు వివరణ ఇచ్చారు. కోర్టు తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని నోటిఫికేషన్‌లోనూ పేర్కొన్నారు.

    వాళ్ళకు ప్రోత్సాహకాలు.. టీచర్లకు ఛీత్కారాలా

      0

      • నిర్మాణ సామగ్రిని మోయడానికే హెచ్‌ఎంలు, టీచర్లు పరిమితమా?
      • విద్యాధికారుల  ద్వంద్వ వైఖరి తగదు: యూటీఎఫ్‌

      ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 25: టీచర్ల పట్ల విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. జయకర్‌, బీ గోపిమూర్తి  బుధవారం  ఒక ప్రకటనలో ఆరోపించారు. జిల్లాలో తొలి విడత నాడు – నేడు కార్యక్రమం నిర్మాణ పనుల్లో   హెచ్‌ఎంలకు అప్పగించిన పర్యవేక్షణ బాధ్యతలకు బదులుగా భవన నిర్మాణ సామగ్రిని మోయడానికి, వాటిని కాపలా కాయడానికి పరిమితమయ్యారని ఆరోపించారు. దీనికితోడు  ఎంఈవో  మొదలు కుని విద్యాశాఖ ఉన్నతాధికారులతో తిట్టించుకోవాల్సి రావడం దారుణమన్నారు. సిమెంట్‌, ఇసుక, సామగ్రి పాఠశాలలకు సరఫరా కాకపోయినా, కార్మికులు సహకరించకపోయినా ప్రధానోపాధ్యాయులు తమ కుటుంబ బాధ్యతలను పక్కన బెట్టి పనిచేసిన వాస్తవాలు విద్యాధికారులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. సామగ్రి పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాలను పరిష్కరించకుండా హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం, దుర్భాషలాడడం  దుర్మార్గమన్నారు. నాడు – నేడు ఇంజనీరింగ్‌ సిబ్బందికి, సీఆర్పీలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్న ప్రభు త్వం టీచర్లకు మొండిచేయి చూపడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. వేసవిలో నాడు – నేడు పనులకు హాజరైన టీచర్లకు  ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని, ప్రాణాలు పోగొట్టుకున్న ఉపాధ్యాయుల కుటుంబాలకు పరిహారం  ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా అధికారుల బెదిరింపులు మానుకుని టీచర్లకు సహకరించేలా సిబ్బందిని ఆదేశించాలని యుటీఎఫ్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు. 

      హెచ్‌ఎంలు, టీచర్లంటే ఎంతో గౌరవం : డీఈవో రేణుక

      జిల్లాలో ఉపాధ్యాయులను ఇబ్బందిపెట్టే చర్యలకు కాని, వారిని కించపర్చాలన్న ఉద్దేశ్యం కాని తనకు లేవని డీఈవో సీవీ రేణుక స్పష్టం చేశారు. టీచర్ల పట్ల తాను అభ్యంతరకర వ్యాఖ్యలను చేసినట్టు యూటీఎఫ్‌ జిల్లా నాయకుల ఆరోపణలపై డీఈవో బుధవారం వివరణ ఇచ్చారు. నాడు–నేడు పనులను ప్రధానోపాధ్యాయులు, టీచర్లు అంకిత భావంతో పర్యవేక్షిస్తున్నారని వివరించారు. రాష్ట్ర స్థాయిలో నాడు – నేడు నిర్మాణ పనుల ప్రగతిలో జిల్లా అగ్రస్థానంలో ఉండడానికి ఉపాధ్యాయులు, హెచ్‌ఎంల సహకారమే కారణమన్నారు.  హెచ్‌ఎంలు, టీచర్ల పట్ల తనకు ఎనలేని గౌరవభావం  ఉందని డీఈవో తెలిపారు.

      టీచర్ల బదిలీల షెడ్యూల్ ఇదీ..

        0

        • డెమో సంగతి మరిచారు
        • సర్వీసు పాయింట్ల పెంపు

        న్యూస్ టోన్, మచిలీపట్నం : టీచర్ల బదిలీల షెడ్యూలును డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసింది గతంలో విడుదల చేసిన జీవో నెంబరు 50, 54, 59ల ఆధారంగా ఈ షెడ్యూలును ఖరారు చేశారు టీచర్ల బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం ఇది మూడోసారి. బదిలీ కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 16న ముగిసింది. 2017వ సంవత్సరం నుంచి టీచర్ల బదిలీలు జరగలేదు అయినప్పటికీ ఎనిమిది సంవత్సరాల కంటే అధికంగా ఒకే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే పరిమితం చేశారు. సర్వీసు పాయింట్లు 30 సంవత్సరాలకు పరిమితం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఎనిమిది సంవత్సరాల కంటేఅధికంగా ఒకే పాఠశాలలో పనిచేసిన టీచర్లకు పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే పరిమితం చేశారు. సర్వీసు పాయింట్లు 30 సంవత్సరాలకు పరిమితం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఎనిమిది సంవత్సరాల కంటే అధికంగా ఎన్ని సంవత్సరాలు పని చేస్తే అన్ని సంవత్సరాలకు పాయింట్లు కేటాయించేందుకు అంగీకరించి అందుకనుగుణంగా మార్పులు చేసి, తాజా ఉత్తర్వులు జారీ చేశారు వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో జరిగే ఈ బదిలీ షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి

        28నుంచి ప్రక్రియ ప్రారంభం

        టీచర్ల ఆన్లైన్ దరఖాస్తులను 28, 29 తేదీల్లో పరిశీలిస్తారు. 30 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు పాయింట్ల ఆధారంగా సీనియారిటీ జాబితాలను తయారు చేస్తారు. డిసెంబరు 3, 4 తేదీల్లో అభ్యంతరాలను వెబ్ సైట్ లో తెలియజేసేందుకు అవకాశం ఇచ్చారు. అభ్యంతరాలుంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలను డీఈవోకు సమర్పించాలి. డిసెంబరు 5-7 మధ్య అభ్యంతరాలను పరిశీలించి, డీఈవో, జాయింట్ కలెక్టర్ (డెవలప్మెంట్) సమాధానాలు ఇస్తారు. 10వ తేదీలోగా తుది సీనియారిటీ జాబితాలను పాయింట్ల ఆధారంగా ప్రకటిస్తారు. 11 నుంచి 15వ తేదీ వరకు టీచర్లు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు. 16 నుంచి 21 వరకు కేటాయించిన పాఠశాలల జాబితాలను ప్రకటిస్తారు. 22, 23 తేదీల్లో ఈ జాబితాలను పరిశీలించి, లోపాలుంటే సరిదిద్దుతారు. డిసెంబరు 24న బదిలీ అయిన టీచర్లు ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

        డెమో సంగతి మరిచారు

        ఇటీవల విద్యాశాఖ మంత్రి, అధికారులతో జరిగిన చర్చలో మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రతిపాదన చేశారు. వెబ్ కౌన్సెలింగ్ పై డెమో ఇస్తామని, అందులో లోపాలుంటే మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేస్తామని నాడు ఉన్నతాధికారులు చెప్పారని, అయితే తాజా షెడ్యూలులో డెమో అంశాన్ని ప్రస్తావించలేదని తెలిపారు.

        పది విద్యార్థులకు నేరుగా తుదిపరీక్షలు

          0

          • ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి

          న్యూస్ టోన్, ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: పది విద్యార్థులకు నేరుగా తుది పరీక్షలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని బీవీఆర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన గుంటూరు డీఈవో గంగాభవానితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు మధ్యలో ఎలాంటి పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రంలోని పాఠశాలల్లో బుధవారం విద్యార్థుల హాజరు 70 శాతం వరకు నమోదైందన్నారు. నెల్లూరు జిల్లాలో తుపాను నేపథ్యంలో మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూడు రకాల అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందించామని వివరించారు. తరగతి గదిలో మాత్రమే బోధించేవి, ఇంటి దగ్గర నేర్చుకునేవి, స్వతహాగా ఐచ్ఛికంగా నేర్చుకునే అంశాలున్నాయని తెలిపారు. ఐచ్ఛికంగా నేర్చుకునే 35 శాతం అంశాలను పరీక్షల్లో ఇవ్వబోమని, భవిష్యత్తులో వారు రాసే పోటీ పరీక్షలకు ఈ సిలబస్‌ ఉపయోగపడుతుందని వివరించారు.

          టీచర్ల బదిలీలకు తాజా షెడ్యూలు విడుదల చేసిన విద్యాశాఖ

            0

            • వచ్చేనెల 24నాటికి ప్రక్రియ పూర్తి
            • ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

            న్యూస్ టోన్, ఒంగోలు విద్య, నవంబరు 25 : ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది.  పాయింట్ల కేటాయింపులో మార్పులు చేసిన నేపథ్యంలో షెడ్యూల్‌ను పది రోజులు పొడిగించింది. మొదట ప్రకటించిన ప్రకారం డిసెంబరు 14తేదీకి బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉండగా తాజా షెడ్యూల్‌ ప్రకారం 10రోజులు ఆలస్యంగా డిసెంబరు 24నాటికి పూర్తికానుంది. బదిలీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా పాయింట్ల కేటాయింపులో మార్పులు చేసినందున దరఖాస్తులను పునఃపరిశీలన చేయనున్నారు. 

            తాజా షెడ్యూలు ఇదీ.

            ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన తాజా షెడ్యూల్‌ ఈనెల 28 నుంచి అమల్లోకి వస్తుంది. 

            🔹ఈనెల 28, 29 తేదీలలో ప్రత్యేక బృందాలు బదిలీ దరఖాస్తులను పునఃపరిశీలిస్తాయి. 

            🔹ఈనెల 30 నుంచి డిసెంబరు 2వరకూ ఉపాధ్యాయులకు లభించిన పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. 

            🔹డిసెంబరు 3, 4 తేదీల్లో  ప్రాథమిక, సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 

            🔹డిసెంబరు 5, 6, 7 తేదీల్లో టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించి పరిష్కరిస్తారు. 

            🔹డిసెంబరు 8, 9, 10 తేదీల్లో ఉపాధ్యాయులకు లభించిన పాయింట్ల ఆధారంగా తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. 

            🔹డిసెంబరు 11 నుంచి 15వ తేదీ వరకు ఉపాధ్యాయులు తాము ఎంపిక చేసుకున్న పాఠశాలలను ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇస్తారు. 

            🔹డిసెంబరు 16 నుంచి 21 వరకు కేటాయించిన స్థానాలతో వెబ్‌సైట్‌లో టీచర్ల బదిలీల ఉత్తర్వులు ఉంచుతారు. 

            🔹డిసెంబరు 22, 23 తేదీల్లో బదిలీల ఉత్తర్వులో ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే వాటిని పరిష్కరిస్తారు. 

            🔹డిసెంబరు 24న ఉపాధ్యాయులు వెబ్‌సైట్‌ నుంచి బదిలీ ఉత్తర్వులు డౌన్‌లోడ్‌ చేసుకొని సంబంధిత అధికారుల అనుమతితో కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.

            టీచర్ల బదిలీల రివైజెడ్ షెడ్యూల్ 25.11.2020

              0

              అమరావతి, న్యూస్ టోన్: బదిలీల సవరణ జీవో 59 ను అనుసరించి బదిలీల సవరణ షెడ్యూల్ ను కమీషనర్ శ్రీ చిన వీరభద్రుడు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ లోని ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

              ★ బదిలీ దరఖాస్తుల పరిశీలన: నవంబర్ 28 -29
              ★ పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 – డిశంబర్ 2
              ★ అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: డిశంబర్ 3 – 4
              ★ జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: డిశంబర్ 5 – 7
              ★ పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: డిశంబర్ 8 – 10
              ★ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు: డిశంబర్ 11 – 15
              ★ బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: డిశంబర్ 16 – 21
              ★ బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: డిశంబర్ 22 – 23
              ★ బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిశంబర్ 24

              తేలని బదిలీల పంచాయతీ!

                0
                • తాత్కాలిక ఖాళీల జాబితాలో 3781..
                • జీఓ 54కు సవరణలు..
                • స్కూల్‌  స్టేషన్‌సర్వీసు పాయింట్లపై 8 ఏళ్ల సీలింగ్‌ తొలగింపు..
                • తాజాగా 59 జీఓ విడుదల..
                • మారనున్న ఖాళీల జాబితా..

                అనంతపురం విద్య, నవంబరు 24: ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక ఖాళీల జాబితాలో 3781 చూపి బ్లాగ్‌లో పెట్టారు. బదిలీల జీఓ 54కు విద్యాశాఖ సవరణలు చేయటంతో మళ్లీ ఖాళీల జాబితా తయారీ మొదటికొచ్చింది. తాత్కాలిక జాబితాలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలకు జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై 10 రోజులకుపైగా జిల్లా విద్యాశాఖాధికారులు జిల్లా సైన్స్‌ సెంటర్‌లో కుస్తీ పడుతున్నారు. ఈనెల 23న తాత్కాలిక ఖాళీల జాబితా తయారు చేశారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 1,279, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2502 ఖాళీలు చూ పారు. మొత్తం 3781 ఖాళీలుగా తేల్చి, డీఈఓ బ్లాగులో పెట్టారు. స్టేషన్‌సర్వీసు పాయింట్లపై కొన్నిరోజులు సందిగ్ధత నేపథ్యంలో ఇటీవల పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గతనెల 12న విడుదల చేసిన బదిలీల జీఓ 54కు కొన్ని సవరణలు చేస్తూ మంగళవారం జీఓ 59 విడుదల చేశారు. స్కూల్‌ స్టేషన్‌ సర్వీసు పాయింట్లపై ఉన్న 8 ఏళ్ల సీలింగ్‌ తొలగించారు. ప్రధానోపాధ్యాయుల విషయంలో ఐదు విద్యా సంవత్సరాలు పూర్తి కావాలన్న నిబంధనను తొలగించి, ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారు తప్పనిసరిగా బదిలీ చేసేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీఓ 54కు సవరణల నేపథ్యంలో బదిలీ ఖాళీల జాబితాలో మా ర్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయుల ఖాళీల్లో మార్పులుంటాయి. దీంతో తుది ఖాళీల జాబితా తేలాలంటే మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.

                టీచర్లు పనిలేకుండా జీతాలు తీసుకుంటున్నారా.. ?

                  0

                  • డీఈవో సహా ఉన్నతాధికారుల వ్యాఖ్యలపై యూటీఎఫ్‌ ఆగ్రహం

                  ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 24: ఈ ఏడాది మార్చి నుంచి టీచర్లు పని లేకుండా ఉంటున్నారని, ఇంట్లోనే కూర్చొని జీతాలు తీసుకుంటున్నారంటూ విద్యాశాఖ డైరెక్టర్‌ వ్యాఖ్యలు చేసినట్టు డీఈవో సీవీ రేణుక వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని యూటీ ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, బి.గోపీ మూర్తి తెలిపారు. డీఈవో మంగళవారం నిర్వహించిన ఎంఈవోల టెలీకాన్ఫరెన్సులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నారు. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల అన్ని ప్రభుత్వ కార్యాల యాలు మూతపడ్డాయని విషయం విద్యాధి కారులకు తెలియదా అని ప్రశ్నించారు.నాడు–నేడు నిర్మాణ పనులు, విద్యాకానుక కిట్ల పంపిణీని అమలు చేశారన్నారు. టీచర్లు ఏపని చేయలేదో డీఈ వోతో సహా ఉన్నతాధికారులు చెబితే బాగుంటుందని, అభ్యం తరకర వ్యాఖ్యలను తక్షణమే ఉపసహరించుకోవాలన్నారు.

                  ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షకు వేళాయే

                    0

                    • 6 వేలకు పైగా దరఖాస్తులు రాక
                    • 45 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు

                    న్యూస్ టోన్, గుంటూరు: కరోనా వైరస్‌ నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరంలో ‘పది’ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కేటాయింపునకు ఈసారి ప్రవేశ పరీక్ష పెడుతున్నారు. ఆ పరీక్ష రాయడానికి జిల్లాకు చెరదిన 6864 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకు ముందు పదిలో పదికి పది గ్రేడు పాయింట్లు వచ్చినవారికి, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు దక్కేవి. ప్రస్తుత ప్రవేశపరీక్షకు ఆర్జీయూకేటీ సెట్‌-2020 నిర్వాహకుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఈనెల 28న జరిగే ఈ పరీక్షకు పరిశీలకులను నియమించారు. పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఎవరికైనా హాల్‌టిక్కెట్లు అందకపోయినా, దానిపై ధ్రువీకరణ అధికారి సంతకం లేకపోయినా విద్యార్థులు ఏ పాఠశాలలో అయితే చదివారో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలపై అటెస్ట్‌ చేయించుకుని రావాల్సి ఉంటుంది.

                    ప్రతి విద్యా ర్థికి జగనన్న విద్యా కానుక కిట్లు

                      0

                      • రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రీ సెల్వి

                      న్యూస్ టోన్, దావాజిగూడెం(గన్నవరం): విద్యా పథకాల అమ లులో క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్య ధోరణిపై సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ కె.వె ట్రీసెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎంపీపీ ఆదర్శ పాఠశాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. జగనన్న విద్యాకానుక కిట్లు, వాటి నాణ్యత, యూనిఫాం కుట్టుకూలీ డబ్బులు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమపై ఆరా తీశారు. కొంత మంది విద్యార్థులు యూనిఫాం, బూట్లు, స్కూల్ బ్యాగ్ లు తీసుకురాక పోవడంతో అందరికీ విద్యాకానుక కిట్లు అందజే యాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు రం ఎంపీపీ ఆదర్శ పాఠశాలను పరిశీలించిన వెట్రీ సెల్వి విద్యాకానుక కిట్లు పంపిణీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఇళ్ల వద్ద పంపిణీ చేస్తున్న బియ్యం, చిక్కీలు పంపిణీ రికా ర్థులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. ఆమె వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎంవీ రాజ్యలక్ష్మి అసిస్టెంట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రవీంద్రబాబు, ఎంఈఓ అదూరి వెంకటరత్నం, హెచ్ఎంలు ఎం విజయరామారావు, డి.నవభారతి పాల్గొన్నారు.