AstrologyHoroscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Horoscope Today దిన ఫలాలు (జూలై 22, 2024): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుకుంటారు. వృషభ రాశి వారు ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిథున రాశి వారు ధన వ్యవహారాల్లో బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కొందరు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. వస్త్రాభరణాలు, వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుకుంటారు. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇతరులకు వీలైనంత సహాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. కుటుంబ సభ్యుల సమస్యల్ని పరిష్కరిస్తారు. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు, అపార్థాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. పెండింగ్ పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీల వల్ల కొద్దిగా నష్టపోతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా పడే సూచనలున్నాయి. ధన వ్యవహారాల్లో బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగి, ఉత్సాహం కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

సొంత వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. అవసరమైనప్పుడు మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ధనపరంగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆస్తిపాస్తులకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బును వసూలు చేసుకుం టారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కుటుంబ సభ్యుల తోడ్పాటుతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. పిల్లల చదువులకు సంబంధించి శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. ఇంటా బయటా గౌరవాభిమానాలు పెరుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సహో ద్యోగుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల మీద ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

మిత్రుల మీద ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్య మైన వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఊహించని ఫలితాలనిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగాల్లో అధికారుల నమ్మకం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సా హంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. రాదనుకున్న డబ్బు, మొండి బాకీలు చేతికి అందుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయంతో కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆర్థిక సంబంధమైన కష్టనష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. ఇంటికి బంధుమిత్రులు రావడం ఆనందం కలిగిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు, నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఆహార, విహా రాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. తల్లితండ్రుల సహాయ సహకారాలతో వ్యక్తిగత సమస్యల నుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి శుభ సమాచారం అందుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుం టారు. అనుకోకుండా బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం సంపాదించే అవకాశముంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ప్రయత్నాలు, పనులు, వ్యవహారాలన్నీ నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. అనవసర పరిచ యాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల భారం తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this