NationalNipah Virus: కేరళలో నిపా కలకలం.. 14...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Nipah Virus: కేరళలో నిపా కలకలం.. 14 ఏళ్ల బాలుడికి పాజిటివ్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Nipah Virus: కేరళలో మరోసారి ‘నిపా’ కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా వైరస్ సోకినట్లు ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ శనివారం వెల్లడించారు. ప్రస్తుతం కేరళలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి నిపా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు పూణేలోని ఎన్ఐవి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) నిర్ధారించింది. ‘‘ అతడిని కోజికోడ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలిస్తాము. అతనితో కాంటాక్ట్ అయిన వ్యక్తుల ట్రేసింగ్ ప్రారంభించాము. హై-రిస్క్ కాంటాక్ట్‌లు ఇప్పటికే వేరుచేసి, వారి శాంపిళ్లను పరీక్షకు పంపాము’’అని వీణా జార్జ్ తెలిపారు.

బాలుడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు ఆమె వెల్లడించారు. బాలుడు నివసించే ప్రాంత సమీపంలోని ప్రజలు మాస్కులు ధరించాలని, ఆస్పత్రుల్లోని రోగులను కలవకుండా ఉండాలని ఆమె కోరారు. గతంలో నాలుగు సార్లు రాష్ట్రాన్ని వణికించిన నిపా వ్యాధి నివారణకు ప్రత్యేక కార్యాచరణ క్యాలెండర్ రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 201, 2021, 2023లో కోజికోడ్ జిల్లాలో, 2019లో ఎర్నాకులం జిల్లాలో నిపా వ్యాప్తి నమోదైంది. కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకులం జిల్లాల్లోని గబ్బిలాలలో నిపా వైరస్ యాంటీబాడీల ఉనికిని గుర్తించారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this