InternationalUP CM Yogi: యోగిని ఇరకాటంలో పెట్టాలని...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

UP CM Yogi: యోగిని ఇరకాటంలో పెట్టాలని బీజేపీ అగ్రనేతల వ్యూహం?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు చెక్‌ పడేలా బీజేపీలో అడుగులు పడుతున్నాయా? పార్టీలో… యూపీ ప్రభుత్వంలో యోగికి కంట్లో నలుసులా తయారైన డిప్యూటీ సీఎం కేపీ మౌర్యకు బీజేపీ అధ్యక్షుడిని చేయడం ద్వారా… యోగి హవాకు బ్రేక్‌ వేయాలని పార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తోందా? పార్లమెంట్‌ ఎన్నికల్లో సగం సీట్లు కోల్పోవడం… యోగి ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది. యోగి హవాకు బ్రేక్‌ వేయడానికి ఇదే తగిన సమయంగా భావిస్తున్న ఆయన ప్రత్యర్థులు చురుగ్గా పావులు కదుపుతున్నారట.

బీజేపీ జాతీయ రాజకీయాలు హీట్‌పుట్టిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. పార్టీ భావి నేతగా భావిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు చెక్‌ చెప్పడానికే మౌర్యను తెరపైకి తెస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఐతే మౌర్య యూపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే 2017లో ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న కారణం చూపి… మౌర్యను జాతీయ అధ్యక్షుడిగా చేయాలని ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు.

బీసీలను ఆకర్షించేలా?
వెనుకబడిన వర్గాలకు చెందిన మౌర్యను జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చేస్తే.. బీసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడైన మౌర్యను 2017లోనే యూపీ ముఖ్యమంత్రిగా నియమించాలనుకున్నప్పటికీ.. యోగీ ఆదిత్యనాథ్‌ రంగంలోకి దిగడంతో అది సాధ్యం కాలేదు. మౌర్యకూ యోగికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు విభేదాలున్నాయని, యోగి ప్రతి కదలికనూ ఆయన ఢిల్లీకి చేరవేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉత్తరప్రదేశ్‌లో గత లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ పలు సీట్లు కోల్పోవడంపై యోగిని జవాబుదారీ చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. అయితే, ఈ ఓటమితో తనకు సంబంధం లేదని, తనను సంప్రదించకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని యోగి అన్నట్లు సమాచారం. త్వరలో యూపీలో పది అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు యోగి భవిష్యత్తును నిర్ణయించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలకు ముందే బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను నియమిస్తారా..? లేదా..? అన్నదానిపై స్పష్టత లేదు.

బీజేపీ పెద్దలను కలిసిన మౌర్య
యోగి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మౌర్యనే జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా యోగిని ఇరకాటంలో పెట్టాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల బీజేపీ పెద్దలను కలిసిన మౌర్య… పార్టీ కంటే ఎవరూ గొప్పవారు కాదన్న వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. యూపీ సీఎం యోగిని దృష్టిలో పెట్టుకునే ఆయనీ వ్యాఖ్యలు చేశారంటున్నారు. మొత్తానికి యోగి ఆధిపత్యానికి చెక్‌ చెప్పేలా అడుగులు పడుతున్నాయంటున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this