NewsTelangana: ఫిరాయింపులపై గవర్నర్‎కు కేటీఆర్ ఫిర్యాదు.. కాకరేపుతున్న...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Telangana: ఫిరాయింపులపై గవర్నర్‎కు కేటీఆర్ ఫిర్యాదు.. కాకరేపుతున్న రాజకీయం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఫిరాయింపులు ఔర్‌ ఫిర్యాదులతో తెలంగాణ రాజకీయం కాక రేపుతోంది. మాంచి వర్షాకాలంలో కూడా వేడి పుట్టిస్తోంది. ఇది పార్టీని కాపాడుకునే టైమ్‌.. కంప్లయింట్‌ టైమ్‌ అంటోంది బీఆర్‌ఎస్‌. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులకు గులాబీ పార్టీ దండు కట్టింది. చలో రాజ్‌భవన్‌ అంటూ కేటీఆర్‌ నేతృత్వంలో గవర్నర్‌ని కలిశారు నేతలు. గులాబీ గూటి నుంచి కాంగ్రెస్‌లోకి జారిపోతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు రాజ్‌భవన్‌కు దండు కట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ రాధాకృష్ణన్‌తో బీఆర్‌ఎస్‌ నేతలు భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ గవర్నర్‌కు గులాబీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కూడా కంప్లయింట్‌ చేశారు. పార్టీ ఫిరాయింపులపై గతంలోనే స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు పర్వం ముగిశాక కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపైనే దాడులు చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కేటీఆర్‌కు పరిగి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ నేతలు గవర్నర్‎ను కలిసి వినతి పత్రాలు ఇచ్చి రాజకీయం చేస్తున్నారని రామ్మోహన్‌ విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిన గులాబీ పార్టీ, ఇప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. గవర్నర్‌కి వినతి పత్రాలు ఇచ్చి హడావుడి చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఫిరాయింపులు, ఫిర్యాదులు, కౌంటర్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this