Saturday, August 23, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EntertainmentCinemaDevara: రిలీజ్​కు ముందే బాలీవుడ్​ను వణికిస్తున్న ‘దేవర’.....

Mega DSC Certificate Verification FAQs: Qualifications, Local Status, TET, and More

DSC Certificate Verification ఓరియెంటేషన్ ప్రోగ్రామ్లో జిల్లా టీమ్స్కు Certificates ధృవీకరణపై...

AP DSC Merit List 2025 Released – Check District, Zone Wise Selection List at apdsc.apcfss.in Latest Press Note

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా DSC-2025 లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన AP...

Mega DSC-2025 Final Merit List Release Today: Check Official Links

విజయవాడ: Mega DSC-2025 పరీక్షల ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆగస్ట్ 22న...

అండర్ రూ. 3,500: Best Soundbar (బెస్ట్ సౌండ్ బార్) – మీ స్మార్ట్ టీవీకి పర్ఫెక్ట్ పార్ట్నర్!

మీ స్మార్ట్ టీవీ ధ్వనిని మరింత శక్తివంతమైన మరియు స్పష్టమైనదిగా మార్చాలనుకుంటున్నారా?...

Devara: రిలీజ్​కు ముందే బాలీవుడ్​ను వణికిస్తున్న ‘దేవర’.. ఈ క్రెడిట్ ఆయనకే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

‘దేవర’.. ఈ పేరు చెబితేనే ఇప్పుడు బాలీవుడ్ వణికిపోతోంది. తారక్ మూవీని చూసి హిందీ స్టార్స్ షేక్ అయిపోతున్నారు. ఈ సినిమా సృష్టించే వసూళ్ల సునామీ ముందు తమ చిత్రాలు కొట్టుకుపోయతాయని భయపడుతున్నారు నార్త్ మేకర్స్. అసలే అక్కడ స్ట్రయిట్ సినిమాలకు పెద్దగా బజ్ ఉండటం లేదు. ఆడియెన్స్​లో కాస్తంత ఎక్స్​పెక్టేషన్స్ ఉన్న ఫిల్మ్స్​కు సౌత్ మూవీస్ నుంచి గట్టి పోటీ నెలకొంటోంది. వాటి ధాటిని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టంగా మారుతోంది. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ వస్తే తమ మార్కెట్​ను మరింత షేక్ చేయడం ఖాయమని భయపడుతున్నారు. ఆయన సినిమా రావడానికి ముందు, వచ్చాక కొన్ని వారాల పాటు రిలీజ్ చేయాలంటే జడుసుకుంటున్నారు.

ఎన్టీఆర్​కు నార్త్​లో ఎప్పటి నుంచో బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయి రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బ్లాక్​బస్టర్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’తో ఉత్తరాది వారికి ఆయన మరింత చేరువయ్యారు. ఆ ఫిల్మ్​లో కొమురం భీమ్ పాత్రలో తారక్ పలికించిన హావభావాలు, అమాయకమైన నటన, అదే సమయంలో రౌద్ర రసం.. అన్నీ అక్కడి వారికి తెగ నచ్చేశాయి. దీంతో ఎన్టీఆర్ తదుపరి చిత్రమైన ‘దేవర’ కోసం అక్కడ వెయిటింగ్ మరింత పెరిగింది. తారక్​కు పెరిగిన క్రేజ్, ఆయన మార్కెట్​ను దృష్టిలో ఉంచుకొని బాలీవుడ్​లో ఏకంగా 2500 స్క్రీన్స్​లో ‘దేవర’ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహర్ ‘దేవర’ కోసం రంగంలోకి దిగుతున్నారని తెలిసింది. ఆయనకు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ తారక్ సినిమాను నార్త్ ఇండియాలో భారీగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్​తో పాటు బాలీవుడ్​కు చెందిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్, ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా యాక్ట్ చేస్తుండటంతో ‘దేవర’పై హిందీలో హ్యూజ్ హైప్ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనన్ని ఎక్కువ స్క్రీన్స్​లో మూవీని రిలీజ్ చేయాలని కరణ్​ జోహర్ భావిస్తున్నారట. అందుకోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైందని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగు నాటే కాదు.. నార్త్ బెల్ట్​లోనూ ‘దేవర’కు ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి ఎక్కువ క్రెడిట్ కరణ్ జోహర్​కే ఇవ్వాలని చెబుతున్నాయి. ఆయన కృషి వల్లే బాలీవుడ్ బిగ్ హీరోస్​ ఫిల్మ్స్ రేంజ్​లో ‘దేవర’ రిలీజ్ ఉండబోతోందని సమాచారం. కాగా, ఈ చిత్ర హిందీ హక్కుల్ని రూ.60 కోట్ల ధరకు ధర్మ ప్రొడక్షన్స్ దక్కించుకుందని వినికిడి. మరి.. ‘దేవర’ విడుదల కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this