Politicsసీఎం రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్యాప్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

సీఎం రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్యాప్ మొదలైందా? ఆ అధికారి విషయం చిచ్చు పెట్టిందా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gossip Garage : నువ్వు లేక నేను లేను అన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో కలిసి మెలిసి తిరుగుతున్న ఇద్దరు ముఖ్య నేతల మధ్య గ్యాప్‌ మొదలైందా? భాయీ.. భాయీ అన్నట్లు ఇన్నాళ్లు కలిసి సాగిన ప్రయాణంలో ఓ అధికారి విషయం చిచ్చు పెట్టిందా? తెలంగాణ సెక్రటేరియట్‌లో హాట్‌ హాట్‌గా మారిన గాసిప్‌లో నిజమెంత? సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మనస్పర్థలకు కారణమని భావిస్తున్న హాట్‌ టాపిక్‌ ఏంటి?

రామకృష్ణారావును మాత్రం కదపని సీఎం రేవంత్..
తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేసిన రామకృష్ణారావు… ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌లోనూ అదే హోదాలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో పనిచేసిన అధికారులను ప్రాధాన్యం లేని ఇతర శాఖలకు బదిలీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. పదేళ్లుగా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన చేసిన అరుదైన రికార్డు ఉన్న రామకృష్ణారావును మాత్రం కదపలేదు. అయితే ఇదే విషయంపై సచివాలయ వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉండేది.

రామకృష్ణారావు అధికారాలకు కత్తెర..!
అయితే రామకృష్ణారావును బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావించినా, డిప్యూటీ సీఎం కమ్ ఫైనాన్స్‌ మినిస్టర్‌ భట్టి విక్రమార్క వద్దని చెప్పారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ఇతర ఆర్ధిక అంశాలపై రామకృష్ణారావుకు అవగాహన ఉందని, అవన్నీ క్లియరయ్యే వరకు ఆయననే ఆర్ధిక శాఖ సెక్రెటరీగా కొనసాగించాలని భట్టి కోరినట్లు సమాచారం. దీంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రామకృష్ణారావు అధికారాలకు కత్తెర వేసినట్లు చెబుతున్నారు. ఆర్థిక శాఖ పరిధిలోని 9 విభాగాలను ఒక సీనియర్ అధికారికి, మరో 13 విభాగాలను మరో సీనియర్ అధికారికి కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రామకృష్ణారావు అధికారాల్లో కోతతో భట్టి సీరియస్..
రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో పెను మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించినట్లు తెలుస్తోంది. అయితే పని భారం పెరిగిపోవడం వల్లే రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించినట్లు చెబుతోంది ప్రభుత్వం. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొంత సీరియస్ అయ్యారని అంటున్నారు. తను బదిలీ చేయొద్దన్న అధికారి రామకృష్ణారావు అధికారాల్లో కోత పెట్టడమేంటని డిప్యూటీ సీఎం భట్టి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐతే ఇందుకు సంబంధించిన కారణాలను సీఎం రేవంత్ రెడ్డి తరపున సీఎస్ శాంతికుమారి వివరించారని అంటున్నారు.

గత కొంత కాలంగా ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే రామకృష్ణారావుకు గుండె ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలోనే పని ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కొన్ని విభాగాలను సీనియర్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానీయా, కృష్ణ భాస్కర్‌కు అప్పగించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారట సీఎస్ శాంతి కుమారి. అయినప్పటికీ రామకృష్ణారావు వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భట్టి కొంత సీరియస్‌గా ఉన్నారని సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this