Career and JobsTG DSC 2024 exams: నేటి నుంచే...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

TG DSC 2024 exams: నేటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్ధుల్లో వీడని ఉత్కంఠ!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

హైదరాబాద్‌, జులై 18: తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు ఈ రోజు (జులై 18) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు దాదాపు 13 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి 2,79,966 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మొత్తం 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచగా.. జులై 16న సాయంత్రానికి 2,40,727 మంది అభ్యర్ధులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. రోజుకు రెండు విడతల చొప్పున ఈ పరీక్షలు జరుగుతాయి.

మొదటి విడత ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో విడుత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పీఈటీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. దివ్యాంగ అభ్యర్థులకు దనపు సమయం కేటాయిస్తారు. ప్రతి రోజు 26 వేల మందికి చొప్పున పరీక్షలు జరుగుతాయి. హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయని కొందరు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయానికి వస్తున్నారని విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వారందరిక హాల్‌ టికెట్లలో తప్పులను సరిదిద్ది అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఇక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు కనీసం 2 గంటల ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు.

నిర్ణీత సమయానికి గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అలాగే పరీక్ష సమయానికంటే 10 నిమిషాల ముందుగానే గేట్లు మూసివేస్తామని తెలిపారు. ఇక ఈ రోజు డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానుండగా.. మరోవైపు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్ధులు నిరసనలు ఉద్రిక్తం చేస్తున్నారు. దీంతో అసలు పరీక్షలు జరుగుతాయో లేదోనన్న సందిగ్ధం అభ్యర్ధుల్లో నెలకొంది. డీఎస్సీ వాయిదా కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పిటీషన్‌ను కూడా కోర్టు ఈ రోజే విచారించనుంది. ఈ నేపధ్యంలో పలువురు అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this