NewsTirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఆర్జిత సేవా...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఆర్జిత సేవా టికెట్లకు ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18 నుంచి విడుదల చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.  ఉదయం 10 గంటల నుంచి 20 వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్‌ ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించనుంది టీటీడీ.

22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, వాటి దర్శన స్లాట్లు తితిదే విడుదల చేయనుంది. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు , మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగులు దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేస్తామని టీటీడీ పేర్కొంది.

ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా జనరల్‌ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ కోటాను విడుదల చెయ్యనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని దేవస్థానం కోరింది. ఇదిలా ఉండగా.. అక్టోబర్‌ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this