FoodCranberries: క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఇలాంటి సమస్యలున్న...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Cranberries: క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఇలాంటి సమస్యలున్న వారికి దివ్యౌషధం..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

క్రాన్‌బెర్రీస్ చిన్నవిగా, గుండ్రంగా ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటాయి. రుచిలో కాస్త వగరుగా, పులుపుగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. క్రాన్‌బెర్రీస్ హీథర్ కుటుంబానికి చెందినవి.. బ్లూబెర్రీస్, లింగన్‌బెర్రీలకు సంబంధించినవి.ఫైటో-న్యూట్రీయంట్‌లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆల్‌రౌండ్ వెల్‌నెస్‌కు ఎంతో అవసరం అంటున్నారు ఆరోగ్ నిపుణులు. క్రాన్‌బెర్రీలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ అనేది చర్మానికి నిర్మాణం, స్థితిస్థాపకతను అందించడంలో సహాయపడే ప్రోటీన్. దృఢమైన, మృదువుగా ఉండే చర్మాన్ని నిర్వహించడానికి తగినంత కొల్లాజెన్ ఉత్పత్తి అవసరం.

క్రాన్ బెర్రీ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా మంచిది. ఎరుపు రంగు క్రాన్బెర్రీ జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. క్రాన్‌బెర్రీ మొటిమలను నివారించడంలో, మెరిసే చర్మాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. క్రాన్‌బెర్రీస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మం మంటను తగ్గించడంలో సహాయపడతాయి. క్రాన్‌బెర్రీలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ అనేది చర్మానికి నిర్మాణం, స్థితిస్థాపకతను అందించడంలో సహాయపడే ప్రోటీన్. దృఢమైన, మృదువుగా ఉండే చర్మాన్ని నిర్వహించడానికి తగినంత కొల్లాజెన్ ఉత్పత్తి అవసరం. కొల్లాజెన్ ఏర్పడటాన్ని పెంచడం ద్వారా, క్రాన్బెర్రీస్ చర్మం స్థితిస్థాపకత, మృదువైన ఛాయకు దోహదం చేస్తాయి.

క్రాన్బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి. ఇవి దంతాల కావిటీస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్, ఇన్ఫ్లమేటరీ వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి. ఎండిన క్రాన్బెర్రీస్ చాలా విటమిన్లను కలిగి ఉంటాయి. అవి కాల్షియం, పొటాషియం వంటి ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. క్రాన్‌బెర్రీలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు పలువురు ఆరోగ్య నిపుణులు.

క్రాన్‌బెర్రీస్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. హైడ్రేటెడ్ చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. క్రాన్బెర్రీస్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మొటిమలు, విరేచనాలను నిరోధించడంలో సహాయపడతాయి. చర్మం ఉపరితలంపై ఉండే బాక్టీరియా చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. దీంతో మొటిమలకు దారి తీస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు ఈ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే క్రాన్ బెర్రీ సీడ్ ఆయిల్ ను నేరుగా చర్మానికి అప్లై చేయవచ్చు. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి, ఫైన్ లైన్లను తగ్గించడానికి, సహజమైన మెరుపును ఇవ్వడానికి సహాయపడుతుంది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this