Sleeping on time benefits రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ ఎనిమిది గంటల నిద్ర కూడా… రోజూ ఒక పద్ధతి ప్రకారం ఉండాలనీ, లేకపోతే 172 రకాల వ్యాధులకు కారణమవుతుందనీ చైనాలోని పెకింగ్, అమెరికాలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. మనలో చాలామంది ‘ఏ సమయంలో పడుకుంటేనేం, తగినంత నిద్రపోవడమేగా ముఖ్యం’ అనుకుని రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోయి, పగలు లేటుగా నిద్రలేస్తారు. ఒక సమయం అంటూ పాటించకుండా ఇష్టమొచ్చినట్టుగా నిద్రపోవడంవల్లనే ఎక్కువగా అనారోగ్యాల పాలవుతారని ఈ పరిశోధన తేల్చింది. వేళకు నిద్ర (Sleeping on time) ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం.

89 వేలమందిపైన, ఏడేళ్లపాటు సాగిన ఈ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. తరచూ రాత్రి పన్నెండు దాటిన తర్వాత నిద్రపోయేవాళ్లలో లివర్‌సిరోసిస్ సమస్యలు రావడానికి రెండు రెట్లు ఎక్కువ ఆస్కారం ఉందని తేలింది. అలాగే టైప్2 డయాబెటిస్, పార్కిన్‌సన్స్, గాంగ్రీన్, కిడ్నీ సమస్యలు సహా 172 రకాల జబ్బులు రావడానికి ఒక పద్ధతి అంటూ లేకుండా సాగే నిద్ర అలవాట్లే కారణమని పరిశోధకులు తేల్చారు. దీనిని బట్టి ఎంత నిద్రపోయాం అన్నది కాదు, ఎప్పుడు ఏ సమయంలో నిద్రపోతున్నాం అన్నది కూడా ముఖ్యమేనన్నమాట. కాబట్టి, **వేళకు నిద్ర (Sleeping on time)**కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం.
Sleeping on time benefits, Sleep patterns and health, Irregular sleep diseases, Importance of regular sleep, Health risks of irregular sleep, circadian rhythm, sleep hygiene, chronic diseases and sleep, sleep deprivation effects